Air Force flight
-
రైల్లో విమానం లాంటి కోచ్‌లు
న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రైల్లోనూ విమానంలో ఉండే ప్రెషరైజ్డ్ కోచ్‌లను చూడొచ్చు. చైనా సరిహద్దుల్లో నిర్మిస్తున్న బిలాస్పూర్–మనాలి–లేహ్ మార్గంలో ప్రయాణించే రైళ్లలో ఇలాంటి బోగీలను ఏర్పాటుచేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే మార్గం ఇదే. కాబట్టి సముద్ర మట్టానికి సుమారు 5 వేల మీటర్ల ఎత్తులో వెళ్లే సమయంలో ప్రయాణికులు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతోంది. ఇందుకోసం విమానాల్లో ఉండే ప్రెషరైజ్డ్ కోచ్‌ల లాంటివి అయితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తోంది. ఎక్కువ ఎత్తులో ప్రయాణికులు శ్వాస తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు విమానాల్లో ప్రెషరైజ్డ్ కోచ్‌లను ఏర్పాటుచేస్తారు. ప్రస్తుతం చైనాలోని క్వింగే–టిబెట్ రైల్వే లైనులోనే ఈ తరహా కోచ్‌లను వినియోగిస్తున్నారు. ఆక్సీజన్ పాళ్లు తక్కువగా ఉన్న వాతావరణంలో ప్రయాణికుల్ని తీసుకెళ్లేలా ఈ కోచ్‌లను డిజైన్ చేశారు. -
కీసరలో కూలిన శిక్షణ విమానం
సాక్షి, కీసర : మేడ్చల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన జిల్లాలోని కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. కిరణ్ శ్రేణికి చెందిన శిక్షణ విమానం హకీంపేట్ శిక్షణ కేంద్రం నుంచి విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం శకలాలు కిందపడ్డ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఏం జరగుతుందో అర్థంకాక కాసేపు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో శిక్షణ ఇస్తున్న పైలట్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. అంకిరెడ్డిపల్లి శివారులో ఎస్ఎల్ఎస్ ఫ్యాక్టరీ సమీపంలో విమానం కూలింది. అయితే ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపల విమానం పూర్తిగా దగ్ధమైంది. -
కీసరలో కూలిన శిక్షణ విమానం
-
ఆ విమానంలో ఏఎల్టీ కూడా లేదు!
ముందుకు సాగని ఏఎన్-32 గాలింపు సాక్షి ప్రతినిధి, చెన్నై: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం ఇటీవల గల్లంతవడం, అందులోని పలు లోపాలు బయటపడటం తెలిసిందే. అయితే విమానాన్ని గుర్తించడానికి ఉపయోగించే పరికరం(ఏఎల్టీ) కూడా లేదన్న విషయం మంగళవారం బయటపడింది. సముద్రంపై ప్రయాణించే, సైనిక విమానాలకు ఏఎల్టీని అమరుస్తారు. నీటి అడుగుభాగంలో విమానం ఉన్నట్లయితే ఈ పరికరం నుంచి సిగ్నల్స్ వెలువడి విమానాన్ని గుర్తించవచ్చు. వీటిని ప్రస్తుతానికి సీ130జే, సీ17 విమానాల్లోనే వినియోగిస్తున్నారు. కానీ వీటిని అన్ని రకాల విమానాలకు ఉపయోగించడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో కేంద్ర రక్షణ శాఖ కొని ఉంచింది. ఏఎన్ 32 రకం విమానాల్లో దేనికీ ఈ పరికరాన్ని అమర్చలేదని తెలుస్తోంది. ఈ పరికరమే ఉన్నట్లయితే ఈ పాటికి విమానాన్ని గుర్తించి ఉండే వారిమని గాలింపు చర్యల్లో పాల్గొంటున్న ఓ అధికారి తెలిపారు. గల్లంతయిన విమానం చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్‌కు 29 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ విమానానికి ఏడేళ్ల క్రితమే కాలం చెల్లింది. అలాగే గల్లంతవడానికి వారం రోజుల ముందే 3 సార్లు మరమ్మతులకు గురైంది.