air hostesses
-
కెనడాలో పాక్ ఎయిర్ హోస్టెస్ అదృశ్యం? 2018 నుంచి ఎందుకిలా?
పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ పీఐఏ ప్రస్తుతం విచిత్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాక్ ఎయిర్ హోస్టెస్‌లు ఫ్లైట్ డ్యూటీ చేస్తూ కెనడా వెళుతున్నారు. కానీ తిరిగి రావడం లేదు. కొద్ది రోజుల క్రితం పిఐఎ విమానంలో టొరంటో చేరుకున్న విమాన సహాయకురాలు మరియం రజా తిరిగి రాలేదు. హోటల్లో ఆమె గదిని వెతకగా ఆమె పీఐఏ యూనిఫాంతో పాటు ‘ధన్యవాదాలు పీఐఏ’ అని రాసివున్న చీటీ లభ్యమయ్యింది. కెనడాలో దిగిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) సిబ్బంది కనిపించకుండా పోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి వ్యవహారం కొనసాగుతోంది. పలువురు పీఐఏ ఎయిర్ హోస్టెస్‌లు కెనడాకు వెళ్లి అక్కడ స్థిరపడుతున్నారు. ఇందుకోసం వారు పీఐఏ ఆమోదం తీసుకోవడం లేదు. అలాగే ముందుగా ఎటువంటి వీసా కోసం కూడా దరఖాస్తు చేయడం లేదు. 2024, జనవరిలో కెనడాలో పీఐఏ ఫ్లైట్ అటెండెంట్ ఫైజా ముఖ్తార్ అదృశ్యమైన నెల రోజల తర్వాత మరియం అదృశ్యమైంది. పీఐఏ సిబ్బంది 2018 నుండి కెనడాలో ఆశ్రయం పొందుతున్నారు. పీఐఏకి ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. పాక్‌కు చెందిన పలువురు నిపుణులు తమ భవిష్యత్ కలలను నెరవేర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళుతున్నారు. ఏవియేషన్ న్యూస్ వెబ్సైట్ సింప్లీ ఫ్లయింగ్ తెలిపిన వివరాల ప్రకారం కెనడాకు వెళ్లిన పాకిస్తాన్ వైమానిక సిబ్బంది అదృశ్యమవడం అనేది 2019లో ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో ఇది మరింతగా పెరిగింది. 2023లో కెనడాలో దిగిన ఏడుగురు పీఐఏ ఫ్లైట్ అటెండెంట్లు అదృశ్యమయ్యారు. పీఐఏ ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ నుండి టొరంటోకు వచ్చిన ఇద్దరు పీఐఏ క్యాబిన్ సిబ్బంది డిసెంబర్ 2023లో తమ డ్యూటీని రిపోర్ట్ చేయలేదు. దీంతో సిబ్బంది లేకుండా ఆ పీఐఏ విమానం ఇస్లామాబాద్‌కు తిరిగి వచ్చిందని తెలిపారు. -
ఎయిర్ హోస్టెస్‌లతో అనుచిత ప్రవర్తన, అరెస్ట్
నాగపూర్ : మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు (23) ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అరెస్ట్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ముంబై నుంచి నాగపూర్ వస్తున్న జెట్ ఎయిర్ వేస్‌లో శనివారం చోటుచేసుకుంది. హార్ట్‌వేర్ వ్యాపారి ఆకాశ్ గుప్తా ముంబై నుంచి నాగపూర్ ప్రయాణం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి భోజనం సర్వ్ చేసేందుకు వచ్చిన ఎయిర్ హోస్టెస్‌ల చేతులు పట్టుకుని లాగి, అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో వారు ఈ విషయాన్ని క్రూ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వారితో కూడా ఆకాశ్ గుప్తా వాగ్వివాదానికి దిగటంతో కెప్టెన్ ఈ విషయాన్ని బాలఘట్ (మధ్యప్రదేశ్) సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని, అనంతరం సోనేగావ్ పోలీసులకు అప్పగించారు. ఆకాశ్ గుప్తాపై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. కాగా విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తే వారిని అదుపు చేసేందుకు ప్లాస్టిక్ హ్యాండ్ కప్స్ (సంకెళ్లు) వేసేందుకు విమానయాన సంస్థలకు 2016 జనవరి నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే. -
ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా వీడియో తీస్తూ..
ముంబయి: ముంబయి ఎయిర్ పోర్ట్ లో నలుగురు ప్రయాణీకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఎయిర్ హోస్టెస్‌తో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా వారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వీడియో తీసే ప్రయత్నం చేశారు. దీంతో వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి తప్పించుకున్నాడు. కోల్ కతా నుంచి ముంబయి మధ్య ప్రయాణించే ఇండిగో విమానానికి చెందిన ఎయిర్ హోస్టేస్ తో వారు ఇలా ప్రవర్తించారు.