airport employees
-
ఎయిర్‌పోర్టుల్లో కొత్త రూల్స్.. ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సిందే!
భారత విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కొత్త నిబంధనలు విధించింది. జూన్ 1 నుంచి ఎయిర్ పోర్టు సిబ్బందిలో కనీసం 25 శాతం మంది ర్యాండమ్‌గా రోజూ ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. ప్రస్తుతం ప్రతిరోజూ 10 శాతం మంది సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. డీజీసీఏ ప్రకారం.. ఏవియేషన్ సిబ్బందిలోని ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సాంకేతికంగా శిక్షణ పొందిన ఉద్యోగులు, ఇంధనం, క్యాటరింగ్ వాహనాలను నడిపే డ్రైవర్లు, పరికరాల ఆపరేటర్లు, ఏరోబ్రిడ్జ్ ఆపరేటర్లు, మార్షలర్లు, ఆప్రాన్ నియంత్రణ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సిబ్బంది అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఈ ఆల్కహాల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో మొదటిసారి ఆల్కహాల్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వారిని విధులకు దూరంగా ఉంచడంతోపాటు వారి లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తారు. ఆల్కహాల్ పరీక్షలో పాల్గొనడానికి నిరాకరించినా లేదా విమానాశ్రయం ప్రాంగణం నుండి బయటకు వెళ్లడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఇదే శిక్షను అమలు చేస్తారు. నిబంధనలను రెండవసారి ఉల్లంఘిస్తే, సంబంధిత సిబ్బందికి డీజీసీఏ జారీ చేసిన లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ అవుతుందని నిబంధనలు పేర్కొన్నాయి. ఇక పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ప్రీ-ఫ్లైట్ ఆల్కహాల్ పరీక్షలు డీజీసీఏ నియమాల మరొక సెట్ ప్రకారం సంబంధిత విమానయాన సంస్థలు నిర్వహిస్తాయి. -
విమాన సిబ్బందికి డ్రగ్ పరీక్షలు!
న్యూఢిల్లీ: విమానాలు నడిపే పైలట్లకు, ఇతర సిబ్బందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రతిపాదించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. నియమ నిబంధలన్నీ అమల్లోకి వస్తే విమానంలో పనిచేసే సిబ్బందితోపాటు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకూ ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు చెప్పారు. తొలిదశలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ఈ పరీక్షలను చేపడతారు. రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలో ఒకటి విమానాశ్రయం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాంప్లెక్స్‌లలో జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌ను వీడియోలో రికార్డు చేస్తారు. గంజాయి, ఓపియం తదితర మత్తుమందులు తీసుకున్నట్లు స్క్రీనింగ్ టెస్ట్‌లో బయటపడితే, మళ్లీ నిర్ధారణకు ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. డీజీసీఏ అధికారుల నేతృత్వంలో ఏటా ఒక్కో సంస్థ సిబ్బందిలో పదిశాతం మందికి ఈ పరీక్షలు చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో మత్తుమందులు తీసుకున్నట్లు తెలిస్తే ఆ ఉద్యోగిని భద్రత వంటి కొన్నిరకాల విధుల నుంచి తప్పిస్తారు. తదుపరి పరీక్షల్లోనూ మత్తుమందులు తీసుకున్నట్లు రూఢి అయితే తగిన రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపుతారు. -
ఎయిర్‌పోర్టులో ఉద్యోగుల చేతివాటం
-
ఎయిర్‌పోర్టులో ఉద్యోగుల చేతివాటం
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. పార్లమెంట్లో పని చేసే ఓ ఉద్యోగిని శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది సెక్యూరిటీ తనిఖీల పేరుతో ఆమె బ్యాగులోని 12 తులాల బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదును కాజేశారు. అది గుర్తించిన బాధిత మహిళ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.