ajmeer darga
-
అజ్మీర్ దర్గాలో ప్రసాదం రెడీ
-
అల్లా.. జగన్ సీఎం కావాలి
సాక్షి, ఆదోని టౌన్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న ఖాజా గరీబ్ నవాజ్ దర్గాను గురువారం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నాయకు లు, సన్నిహితులు దర్శించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని ఖాజా గరీబ్ నవాజ్ దర్గాలో ఫాతెహాలు చేశారు. అదేవిధంగా పుష్కర్‌లోని బ్రహ్మస్వామి దేవాలయాన్ని సాయి ప్రసాద్‌రెడ్డి బృందం దర్శించుకుంది. స్వామివారికి పూజలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురువాలని, పాడిపంటలతో అన్నదాతలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని స్వామివారిని కోరినట్లు సాయి ప్రసాద్‌రెడ్డి ఫోన్లో తెలిపారు. వారం రోజుల్లో వెలుబడే ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఈ సందర్భంగా సాయి ధీమా వ్యక్తం చేశారు. 120 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు. సీఎం చంద్రబాబు శకం వచ్చే గురువారంతో ముగి యనుందని చెప్పారు. నీరజ్ డాంగిని కలిసిన సాయి రాజస్థాన్ రాష్ట్రం మాజీ హోంమంత్రి దినేష్ డాంగి తనయుడు, ప్రస్తుత రాజస్థాన్ పీసీసీ ప్రధాన కార్యదర్శి నీరజ్ డాంగిని జైపూర్‌లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డితోపాటు సన్నిహితులు మురళీమోహన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రవికుమార్ రెడ్డి, సాయినాథ్‌రెడ్డి, మైనార్టీ నాయకులు మజార్ అహ్మద్, ఈషాబాషా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి నీరజ్‌డాంగికి శాలువా కప్పి పూలమాల వేసి సన్మానించారు. -
డిటో పేలుళ్లు!
మే 18న... రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గాలో అదే ఏడాది అక్టోబర్ 11న జరిగిన బాంబు పేలుళ్లను ఒకే మాడ్యుల్ చేసిందన్నది దర్యాప్తు సంస్థల మాట. నిందితులు సైతం దాదాపు ఒకరే. ఈ రెండు పేలుళ్ల మధ్యా అనేక సారూప్యతలు ఉన్నాయి. మక్కా మసీదులో సెల్‌ఫోన్ అలారంతో పేల్చిన షేప్డ్ బాంబు పేలుడు ధాటికి తొమ్మిది మంది మరణించారు. ఇదిజరిగిన దాదాపు అయిదు నెలలకు రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాలో పేలుడు జరిగింది. అక్కడ వినియోగించిన బాంబులు, ‘మక్కా’లో వాడిన బాంబుల మధ్య సారూప్యత ఉంది. మక్కా పేలుళ్లపై సోమవారం కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ‘డిటో పేలుళ్ల’ అంశం చర్చనీయాంశమైంది. ఇక మక్కా కేసులో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. అజ్మీర్ దర్గా కేసులో మాత్రం పలువురు నిందితులకు అక్కడి కోర్టు శిక్ష విధించింది. కొందర్ని నిర్దోషులుగా ప్రకటించింది. సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలో ఉన్న మక్కా మసీదులో 2007 మే 18న... రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గాలో అదే ఏడాది అక్టోబర్ 11న జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి చాలా విషయాల్లో పోలికలున్నాయి. కాకపోతే మక్కా కేసు సోమవారం ఎన్ఐఏ కోర్టులో వీగిపోగా...అజ్మీర్ దర్గా కేసులో మాత్రం నిందితులు కొందరికి శిక్ష పడింది. 2017, మార్చి 22న అజ్మీర్ దర్గాలో పేలుళ్ల కేసుకు సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దేవేందర్‌గుప్తా (మక్కా మసీదు కేసులో కూడా ఉన్నాడు), భూపేష్‌కుమార్, తీర్పు నాటికే హత్యకు గురైన సుశీల్ జోషి (మక్కా కేసులోనూ నిందితుడు)లను దోషులుగా తేల్చింది. సుశీల్ కాకుండా మిగతా ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. అసిమానందతో పాటు మరికొందర్ని నిర్దోషులుగా అక్కడి కోర్టు పేర్కొంది. ఎన్నో పోలికలు... కాగా ఈ రెండు పేలుళ్లకు పాల్పడింది ఒకరే అన్న అనుమానాలను బలపరిచేందుకు చాలా పోలికలు ఉన్నాయి. రెండు చోట్లా బాంబు సర్క్యూట్ పూర్తి కావడానికి ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్‌లోని సిమ్ కార్డులను ఒకే ప్రాంతంలో కొనుగోలు చేశారు. ఈ ఘాతుకాలకు పాల్పడిన ఉగ్రవాదులు నోయిడాలోని కాలేజ్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పని చేసే తారఖ్ నాథ్ ప్రమాణిక్ ఫొటోను వినియోగించి బాబూలాల్ యాదవ్ పేరుతో జార్ఖండ్ నుంచి నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డులు పొందారు. వీటి సాయంతో రాంచీలో సిమ్‌కార్డులు, ఫరీదాబాద్‌లో నోకియా 6030 సెల్ఫోన్లు కొనుగోలు చేశారు. వీటినే ఇటు ‘మక్కా’, అటు ‘అజ్మీర్’ పేలుళ్లలో వినియోగించారు. ఈ రెండు చోట్లా ఉగ్రవాదులు వినియోగించిన బాంబులను సాంకేతికంగా షేప్డ్ బాంబ్స్ అని పిలుస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన అచ్చుల్లో ఆర్డీఎక్స్, టీఎన్టీ మిశ్రమం నింపి సెల్‌ఫోన్ అలారం ద్వారా సర్క్యూట్ ఏర్పాటు చేశారు. వీటిని ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుప పెట్టెల్లో పెట్టారు. వీటిపై సీరియల్ నెంబర్లు సైతం వేశారు. మక్కా మసీదులో దొరికిన పేలని బాంబు పెట్టెపై 2, అజ్మీర్ దర్గాలో దొరికిన పేలని బాంబు ఉన్న పెట్టెపై 3 అంకెలు ఉన్నాయి. వీటిని పరిశీలించిన అధికారులు ఈ రెండు ఉదంతాలకూ పాల్పడింది ఒకే సంస్థకు చెందిన వారని, వారు తయారు చేసిన బాంబుల్లో 1,4 నెంబర్లున్నవి పేలగా... 2,3 నెంబర్లవి దొరికాయని నిర్థారించారు. -
బన్నీకి వైజాగ్, మరి మహేష్‌కు?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్‌ను ఫాలో అయితే సినిమా మంచి విజయం సాధిస్తుందని వారి నమ్మకం. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకూ ఇందుకు అతీతులు కాదు. ఇందుకు కొన్ని ఉదాహరణలు తీసుకుంటే అల్లు అర్జున్‌కు 'వైజాగ్' సెంటిమెంట్ ఉంది. తన ప్రతి చిత్రంలో ఏదో ఒక సన్నివేశాన్ని అయినా విశాఖ బీచ్‌లో తీస్తే మంచి హిట్ వస్తుందని నమ్ముతాడు. వైజాగ్ సెంటిమెంట్ కూడా బన్నీకి వర్క్ అవుట్ అయ్యింది. ఇక మహేష్ తన ప్రతి చిత్రం విడుదలకు ముందు అజ్మీర్ దర్గాను సందర్శించుకోవటం ఆనవాయితీ. ఇటీవల విడుదలైన 'ఆగడు' కు ముందు కూడా మహేష్ ఈ దర్గాను సందర్శించుకున్నాడు. అలాగే తన చిత్రాలకు మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్‌ను కూడా ఈ మిల్కీబాయ్ విశ్వసిస్తాడు. మంచు విష్ణు కూడా సినిమా టైటిల్ 'డి'తో మొదలయ్యేలా చూసుకుంటాడు. మెగాస్టార్ చిరంజీవికి కూడా వైట్ ప్యాంట్ సెంటిమెంట్ ఉంది. ఆయన తన చిత్రంలో కనీసం ఒక పాటలో అయినా వైట్ ప్యాంట్‌తో కనిపిస్తే ఆ సినిమా హిట్ అయినట్లే. ఇక నిర్మాతలు, దర్శకుల విషయానికి వస్తే సినిమా అయ్యేవరకూ ఒకరు గడ్డం తీయకపోతే, మరొకరు సినిమా విడుదలకు ముందు వెంకన్నకు తలనీలాలు అర్పించటం ఆనవాయితీ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తాను దర్శకత్వం వహించే సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు తన గడ్డం, మీసాన్ని కూడా ట్రిమ్ చేయరట. షూటింగ్ అయ్యాక తిరుమల వెంకన్న దర్శనం చేసుకుని గడ్డం తీస్తారట. పూరీ జగన్నాథ్ కూడా సెంట్మెంట్ను ఫాలో అవుతాడు. తన సినిమా స్టోరీలు రాసుకునేందుకు అతడు ఏకంగా బ్యాంకాక్ వెళ్లటం విశేషం. వినటానికి విడ్డూరంగా ఉన్నా అక్కడైతే మంచి ఆలోచనలు వస్తాయని అందుకే బ్యాంకాక్ వెళతానని పూరీ చెప్పటం విశేషం. దర్శకుడు శ్రీను వైట్లకు కూడా సింహాచలం అప్పన్న సెంటిమెంట్ ఉంది. తన ప్రతిసినిమా విడుదలకు ముందు సింహాచలం దర్శించుకోవటం ఆనవాయితీ అని శ్రీను వైట్ల తెలిపాడు. దర్శకుడు వీఎన్ ఆదిత్య తన సినిమా పూర్తయ్యాక పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల ఆలయాన్ని దర్శించుకుని గుండు చేయించుకోవటం తెలిసిందే. నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఫేవరెట్ పుణ్యక్షేత్రం తిరుమల. తన ప్రతి సినిమా ఆడియో విడుదలకు ముందు తప్పనిసరిగా వెంకన్నను దర్శించుకుంటాడు. తన తొలి సినిమా నుంచి ఇదే అనుసరించే అతడు సినిమా విడుదలైన తర్వాత రోజు స్వామివారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకుంటాడు. ఇక అగ్ర నిర్మాత రామానాయుడుకి తన సినిమా తొలి కాపీని వెంకటేశ్వరుని పాదాల చెంత ఉంచటం ఆనవాయితీ. దిల్ సినిమాతో దిల్‌ను ఇంటిపేరుగా మార్చుకున్న నిర్మాత దిల్ రాజు కూడా సినిమా విడుదలయ్యే ముందురోజు వెంకన్నను దర్శించుకుని గుండు చేయించుకుంటాడు. అలాగే బెల్లంకొండ సురేష్ కూడా జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.