akshat reddy
-
హైదరాబాద్ కథ ముగిసె
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2018–19 సీజన్లో హైదరాబాద్ ప్రస్థానం ముగిసింది. తొమ్మిది జట్లున్న ఎలైట్ గ్రూప్ ‘బి’లో నిర్ణీత 8 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 17 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఓ మ్యాచ్‌లో గెలిచి, ఓ మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్ మిగతా ఆరు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. విజయనగరం వేదికగా ఆంధ్రతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను హైదరాబాద్ ‘డ్రా’గా ముగించింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఆంధ్రకు 3 పాయింట్లు దక్కగా... హైదరాబాద్‌కు 1 పాయింట్ లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన ఆంధ్ర బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆంధ్ర 11 పాయింట్లతో చివరిదైన తొమ్మిదో స్థానంలో ఉంది. ఈనెల 7 నుంచి ఇండోర్‌లో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర ఆడుతుంది. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక టాప్–8లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మెరిసిన అక్షత్, హిమాలయ్... ఓవర్‌నైట్ స్కోరు 33/0తో బుధవారం చివరి రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ చివరకు 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి (98 బంతుల్లో 65; 10 ఫోర్లు, సిక్స్), హిమాలయ్ అగర్వాల్ (93 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా... సందీప్ (45; 5 ఫోర్లు), ఠాకూర్ తిలక్ వర్మ (34; 6 ఫోర్లు) రాణించారు. 64 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో అక్షత్ రెడ్డి, సందీప్ మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హిమాలయ్ అగర్వాల్ దూకుడుగా ఆడాడు. ఎడాపెడా బౌండరీలతో స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో నిర్ణీత సమయం కంటే ముందే ఆటను నిలిపివేశారు. ఆంధ్ర బౌలర్లలో షోయబ్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 271; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 502/7 డిక్లేర్డ్; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ (బి) అయ్యప్ప 18; తిలక్ వర్మ (బి) షోయబ్ ఖాన్ 34; అక్షత్ రెడ్డి (సి) రికీ భుయ్ (బి) షోయబ్ ఖాన్ 65; సందీప్ (సి అండ్ బి) గిరినాథ్ రెడ్డి 45; హిమాలయ్ అగర్వాల్ (నాటౌట్) 60; రవితేజ (సి) భరత్ (బి) పృథ్వీరాజ్ 8; చైతన్య (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (85 ఓవర్లలో 5 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–43, 2–64, 3–148, 4–183, 5–210. బౌలింగ్: బండారు అయ్యప్ప 18–5–37–1, శశికాంత్ 18–4–47–0, పృథ్వీరాజ్ 15–6–31–1, షోయబ్ ఖాన్ 18–1–70–2, గిరినాథ్ రెడ్డి 15–2–56–1, ప్రశాంత్ కుమార్ 1–0–5–0. ,,, -
ఆదుకున్న అక్షత్, హిమాలయ్
సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఆంధ్రతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి రోజు ఓ మోస్తరు స్కోరు చేసింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా విజయనగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 81.4 ఓవర్లలో 7 వికెట్లకు 226 పరుగులు చేసింది. హిమాలయ్ అగర్వాల్ (103 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ అక్షత్ రెడ్డి (136 బంతుల్లో 57; 9 ఫోర్లు) అర్ధశతకాలు సాధించగా... తన్మయ్ అగర్వాల్ (53 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్), సందీప్ (33) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ 3, పృథ్వీ రాజ్, గిరినాథ్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు. తిలక్ వర్మ అరంగేట్రం... కూచ్ బెహార్ ట్రోఫీలో వరుస సెంచరీలతో విజృంభించిన ఠాకూర్ తిలక్ వర్మ ఈ మ్యాచ్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన తిలక్ వర్మ (5) ఆకట్టుకోలేకపోయాడు. జట్టు స్కోరు 12 పరుగుల వద్ద శశికాంత్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. మరో ఓపెనర్ తన్మయ్‌తో కలిసి కెప్టెన్ అక్షత్ రెడ్డి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించాక తన్మయ్ వెనుదిరిగాడు. అనంతరం సందీప్‌తో కలిసి మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించాడు. ఈ దశలో ఆంధ్ర బౌలర్లు చెలరేగి 2 పరుగుల తేడాలో మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో 145/2తో పటిష్టంగా ఉన్న హైదరాబాద్ 146/5తో కష్టాలు కొనితెచ్చుకుంది. రవితేజ (1), చైతన్య (6) విఫలమయ్యారు. చివర్లో హిమాలయ్ ఔటయ్యాడు. ప్రస్తుతం సాయిరామ్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అజయ్ దేవ్ గౌడ్ కూడా అరంగేట్రం చేశాడు. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ (బి) పృథ్వీరాజ్ 44; తిలక్ వర్మ (బి) శశికాంత్ 5; అక్షత్ రెడ్డి (సి) భరత్ (బి) శశికాంత్ 57; సందీప్ (బి) గిరినాథ్ రెడ్డి 33; హిమాలయ్ (సి) అయ్యప్ప (బి) శశికాంత్ 59; రవితేజ (సి) అశ్విన్ హెబర్ (బి) పృథ్వీరాజ్ 1; చైతన్య (బి) గిరినాథ్ 6; సాయిరామ్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (81.4 ఓవర్లలో 7 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–12, 2–73, 3–145, 4–145, 5–146, 6–182, 7–226. బౌలింగ్: అయ్యప్ప 17–2–56–0, శశికాంత్ 19.4–5–49–3, పృథ్వీరాజ్ 22–9–54–2, గిరినాథ్ రెడ్డి 6–2–7–2, షోయబ్ ఖాన్ 16–1–52–0, సాయికృష్ణ 1–0–8–0. -
విజయ్ హజారే టోర్నీకి హైదరాబాద్ జట్టు
సాక్షి, హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ క్రికెట్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులుగల హైదరాబాద్ జట్టుకు అక్షత్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ టోర్నీ ఈనెల 5 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో జరుగుతుంది. హైదరాబాద్ జట్టు: అక్షత్ రెడ్డి (కెప్టెన్), సందీప్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, కె. సుమంత్, పీఎస్ చైతన్య రెడ్డి, అంబటి రాయుడు, టి. రవితేజ, మెహదీ హసన్, ఆకాశ్ భండారి, మొహమ్మద్ సిరాజ్, ఎం. రవికిరణ్, మొహమ్మద్ ముదస్సిర్, సాకేత్ సాయిరామ్, మీర్ జావీద్ అలీ, జె. అరుణ్ కుమార్ (కోచ్), శైలేశ్ కుమార్ (మేనేజర్). -
అక్షత్ సూపర్ సెంచరీ
132 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 మెరిసిన సుమంత్, మిలింద్ సౌరాష్ట్రపై హైదరాబాద్ భారీ విజయం విజయ్ హజారే క్రికెట్ టోర్నీ కోల్‌కతా: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బెంగాల్ క్రికెట్ అకాడమీ మైదానంలో సౌరాష్ట్ర జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 113 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న అక్షత్ రెడ్డి (132 బంతుల్లో 154; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అక్షత్ వన్డేల్లో హైదరాబాద్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ (161; గోవాపై 1994లో) పేరిట ఈ రికార్డు ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 312 పరుగుల భారీస్కోరు చేసింది. కె. సుమంత్ (106 బంతుల్లో 91 రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కొద్దిలో సెంచరీని కోల్పోయాడు. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (7) త్వరగానే ఔటైనా... అక్షత్, సుమంత్‌లు కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీస్కోరును అందించారు. వీరిద్దరూ వేగంగా ఆడుతూ 191 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో అక్షత్ లిస్ట్ ఏ క్రికెట్లో 3వ సెంచరీని సాధించాడు. అనంతరం సుమంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో కెప్టెన్ బద్రీనాథ్ (18 బంతుల్లో 22; 2 ఫోర్లు) క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 58 పరుగుల్ని జోడించాక శౌర్య బౌలింగ్‌లో అర్పిత్ వసవదకు క్యాచ్ ఇచ్చి బద్రీనాథ్ పెవిలియన్‌కు చేరాడు. తర్వాత కొద్దిసేపటికే అక్షత్ కూడా రనౌటవ్వగా... మెహదీ హసన్ (12), ఆకాశ్ భండారి (2), బావనాక సందీప్ (0), హిమాలయ్ అగర్వాల్ (3) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ప్రత్యర్థి బౌలర్లలో కుషంగ్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 313 పరుగుల భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర జట్టు 38.5 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ప్రేరక్ మన్కడ్ (88 బంతుల్లో 104; 14 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ చేశాడు. జయదేవ్ షా (34) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ 4 వికెట్లతో చెలరేగగా... ఎం. రవికిరణ్, మెహదీ హసన్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. సిరాజ్, ఆకాశ్ భండారీలకు తలా వికెట్ దక్కింది. బుధవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్ ఆడుతుంది. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) దేశాయ్ (బి) ఉనాద్కట్ 7, అక్షత్ రెడ్డి రనౌట్ 154, కె. సుమంత్ రిటైర్డ్ హర్ట్ 91, ఎస్. బద్రీనాథ్ (సి) వసవద (బి) శౌర్య 22, మెహదీ హసన్ (సి) వసవద (బి) పటేల్ 12, ఆకాశ్ భండారీ రనౌట్ (ఉనాద్కట్) 2, బావనాక సందీప్ హిట్ వికెట్ (బి) పటేల్ 0, హిమాలయ్ అగర్వాల్ (సి) దేశాయ్ (బి) పటేల్ 3, సీవీ మిలింద్ నాటౌట్ 6, సిరాజ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 312. వికెట్ల పతనం: 1–17, 2–266, 3–297, 4–297, 5– 298, 6–300, 7–311. బౌలింగ్: జయదేవ్ ఉనాద్కట్ 10–1–44–1, శౌర్య 9–0–72–1, కుషంగ్ పటేల్ 10–0–54–3, ప్రేరక్ మన్కడ్ 3–0–20–0, డీఏ జడేజా 10–0–56–0, చిరాగ్ 7–0–51–0, అర్పిత్ వసవద 1–0–5–0. సౌరాష్ట్ర ఇన్నింగ్స్: షెల్డన్ జాక్సన్ ఎల్బీడబ్ల్యూ (బి) రవికిరణ్ 5, అబ్రార్ షేక్ (సి) రవికిరణ్ (బి) మిలింద్ 4, హార్విక్ దేశాయ్ (సి) హసన్ (బి) భండారి 16, జయదేవ్ షా (సి) సందీప్ (బి) మిలింద్ 34, ప్రేరక్ మన్కడ్ (సి) సుమంత్ (బి) రవికిరణ్ 104, అర్పిత్ వసవద (సి) తన్మయ్ (బి) మిలింద్ 1, చిరాగ్ జాని (సి) సిరాజ్ 6, జయదేవ్ ఉనాద్కట్ (బి) హసన్ 0, శౌర్య ఎల్బీడబ్ల్యూ (బి) హసన్ 9, డీఏ జడేజా (సి) తన్మయ్ (బి) మిలింద్ 14, కుషంగ్ పటేల్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (38.5 ఓవర్లలో ఆలౌట్) 199. వికెట్ల పతనం: 1–9, 2–11, 3–57, 4–67, 5–71, 6–95, 7–96, 8–132, 9–178, 10–199. బౌలింగ్: ఎం. రవికిరణ్ 605–0–46–2, సీవీ మిలింద్ 9–1–30–4, సిరాజ్ 9–0–45–1, ఆకాశ్ భండారి 7–0–32–1, హసన్ 7–0–44–2. -
అక్షత్ అజేయ శతకం
నాగ్‌పూర్: కెప్టెన్‌ను బద్రీనాథ్‌ను మినహాయిస్తే హైదరాబాద్ రంజీ జట్టులో అందరికంటే ఎక్కువ అనుభవం ఉన్న అక్షత్ రెడ్డి... ఈ సీజన్ రంజీల్లో తొలి మ్యాచ్‌లోనే తన అనుభవాన్ని రంగరించి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అక్షత్ రెడ్డి (177 బంతుల్లో 105 బ్యాటింగ్; 17 ఫోర్లు) అద్భుత సెంచరీ సాధించడంతో... గోవాతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స ఆధిక్యం లభించింది. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్సలో 63 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. బద్రీనాథ్ (95 బంతుల్లో 41; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అక్షత్‌తో పాటు సందీప్ (48 బంతుల్లో 18 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. గోవా బౌలర్లలో రితురాజ్ సింగ్ 2 వికెట్లు తీశాడు. గోవా తొలి ఇన్నింగ్సలో 164 పరుగులకు ఆలౌటయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌కు 24 పరుగుల ఆధిక్యం ఉంది. ఆదుకున్న భాగస్వామ్యం ఓవర్‌నైట్ స్కోరు 28/1తో ఇన్నింగ్స ప్రారంభించిన హైదరాబాద్... పది ఓవర్ల వ్యవధిలో విశాల్ శర్మ (4), అనిరుధ్ (5) వికెట్లు కోల్పోరుుంది. ఈ దశలో అక్షత్, బద్రీనాథ్ కలసి ఇన్నింగ్‌సను నిర్మించారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. బద్రీనాథ్ అవుటయ్యాక వచ్చిన సందీప్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. అక్షత్, సందీప్ కలసి ఐదో వికెట్‌కు అజేయంగా 49 పరుగులు జోడించారు. -
తిరుమలశెట్టి సుమన్ , అక్షత్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఎలెవన్ ఆటగాళ్లు అక్షత్ రెడ్డి (167 బంతుల్లో 141; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిరుమలశెట్టి సుమన్ (134 బంతుల్లో 103; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. ఉప్పల్ స్టేడియంలో కేరళతో ఈ మ్యాచ్ జరుగుతోంది. అక్షత్, సుమన్‌ల దూకుడుతో మ్యాచ్ రెండో రోజు మంగళవారం హైదరాబాద్ ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 88.4 ఓవర్లలో 359 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా హైదరాబాద్‌కు 47 పరుగుల ఆధిక్యం లభించింది. కేరళ బౌలర్లలో అక్షయ్ చంద్రన్ 125 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా...అభిషేక్ మోహన్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆధిక్యం కోల్పోయిన ప్రెసిడెంట్స్ ఎలెవన్... మరో వైపు హైదరాబాద్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం కోల్పోయింది. ఈసీఐఎల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 343 పరుగులకు ఆలౌటైంది. కేవీ అవినాశ్ (142 బంతుల్లో 96; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ అవకాశం కోల్పోయాడు. మయాంక్ అగర్వాల్ (114 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, శ్రేయస్ గోపాల్ (42), అబ్రార్ కాజీ (36) ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్ 57 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ భండారికి 3, కనిష్క్‌కు 2 వికెట్లు దక్కాయి. తమిళనాడు ఘన విజయం... ఏఓసీ సెంటర్లో రెండో రోజే ముగిసిన మ్యాచ్‌లో తమిళనాడు 8 వికెట్ల తేడాతో సర్వీసెస్‌ను చిత్తు చేసింది. మొహమ్మద్ (3/23), రోహిత్ (2/14), కౌశిక్ (2/17), సురేశ్ కుమార్ (2/21) రాణించడంతో సర్వీసెస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నిర్ణీత 40 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. సుమీత్ సింగ్ (65 బంతుల్లో 71; 11 ఫోర్లు, 1 సిక్స్), నకుల్ వర్మ (82 బంతుల్లో 51; 5 ఫోర్లు), అన్షుల్ గుప్తా (42) రాణించారు. రాహిల్ షాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం తమిళనాడు 19 పరుగుల విజయలక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఢిల్లీకి భారీ ఆధిక్యం... ఎన్ఎఫ్సీ మైదానంలో గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీకి తొలి ఇన్నింగ్స్‌లో 129 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్ రెండో రోజు ఢిల్లీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 8 వికెట్లకు 373 పరుగులు చేసింది. మోహిత్ శర్మ (223 బంతుల్లో 126; 19 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. ఆనంద్ (94 బంతుల్లో 63; 13 ఫోర్లు), సుమీత్ నర్వాల్ (53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, మిలింద్ కుమార్ (47), మనన్ శర్మ (35 నాటౌట్) ఓ మోస్తరుగా ఆడారు. గోవా బౌలర్లలో అమిత్ యాదవ్ 89 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.