నాగ్‌పూర్: కెప్టెన్‌ను బద్రీనాథ్‌ను మినహాయిస్తే హైదరాబాద్ రంజీ జట్టులో అందరికంటే ఎక్కువ అనుభవం ఉన్న అక్షత్ రెడ్డి... ఈ సీజన్ రంజీల్లో తొలి మ్యాచ్‌లోనే తన అనుభవాన్ని రంగరించి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అక్షత్ రెడ్డి (177 బంతుల్లో 105 బ్యాటింగ్; 17 ఫోర్లు) అద్భుత సెంచరీ సాధించడంతో... గోవాతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్‌స ఆధిక్యం లభించింది.
రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌సలో 63 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. బద్రీనాథ్ (95 బంతుల్లో 41; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అక్షత్‌తో పాటు సందీప్ (48 బంతుల్లో 18 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. గోవా బౌలర్లలో రితురాజ్ సింగ్ 2 వికెట్లు తీశాడు. గోవా తొలి ఇన్నింగ్‌సలో 164 పరుగులకు ఆలౌటయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌కు 24 పరుగుల ఆధిక్యం ఉంది.
ఆదుకున్న భాగస్వామ్యం
ఓవర్‌నైట్ స్కోరు 28/1తో ఇన్నింగ్‌స ప్రారంభించిన హైదరాబాద్... పది ఓవర్ల వ్యవధిలో విశాల్ శర్మ (4), అనిరుధ్ (5) వికెట్లు కోల్పోరుుంది. ఈ దశలో అక్షత్, బద్రీనాథ్ కలసి ఇన్నింగ్‌సను నిర్మించారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. బద్రీనాథ్ అవుటయ్యాక వచ్చిన సందీప్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. అక్షత్, సందీప్ కలసి ఐదో వికెట్‌కు అజేయంగా 49 పరుగులు జోడించారు.