సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో కుదురుకున్నారు. దీంతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఆట మూడో రోజు ముగిసేసరికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 2 వికెట్లకు 233 పరుగులు చేసింది. ఓపెనర్ అక్షత్ రెడ్డి (235 బంతుల్లో 107; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగడంతో 23 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 194/8తో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 74.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఢిల్లీ జట్టుకు 210 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ సాకేత్ సాయిరామ్ (25 నాటౌట్) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో కుల్వంత్, వికాస్ మిశ్రా చెరో 4 వికెట్లతో చెలరేగారు.
అనంతరం ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (76 బంతుల్లో 42; 4 ఫోర్లు), అక్షత్ రెడ్డి శుభారంభమిచ్చారు. తన్మయ్, అక్షత్ రెడ్డి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వికాస్ బౌలింగ్‌లో తన్మయ్ వెనుదిరిగాడు. తర్వాత వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ కె. రోహిత్ రాయుడు (140 బంతుల్లో 61 బ్యాటింగ్; 6 ఫోర్లు) అక్షత్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును నడిపించారు. క్రీజులో నిలదొక్కుకున్న ఈ జంటను లలిత్ యాదవ్ విడదీశాడు. దీంతో రెండో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ప్రస్తుతం రోహిత్ రాయుడుతో పాటు బి. సందీప్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. నేడు ఆటకు చివరిరోజు.
స్కోరు వివరాలు
ఢిల్లీ తొలి ఇన్నింగ్స్: 415 ఆలౌట్; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ ఎల్బీ (బి) వికాస్ మిశ్రా 63; అక్షత్ రెడ్డి (సి) ఉన్ముక్త్ చంద్ (బి) కుల్వంత్ 20; కె. రోహిత్ రాయుడు ఎల్బీ (బి) కుల్వంత్ 6; బి. సందీప్ ఎల్బీ (బి) కుల్వంత్ 26; సుమంత్ (సి) ఆకాశ్ (బి) వికాస్ టోకాస్ 15; టి. రవితేజ (సి) కునాల్ (బి) వికాస్ మిశ్రా 4; ఆకాశ్ భండారి ఎల్బీ (బి) వికాస్ మిశ్రా 5; మెహదీ హసన్ (సి) వికాస్ మిశ్రా (బి) ఆకాశ్ 14; సాకేత్ నాటౌట్ 25; ప్రజ్ఞాన్ ఓజా (సి) మనన్ శర్మ (బి) కుల్వంత్ 9; రవికిరణ్ (సి) వికాస్ టోకాస్ (బి) వికాస్ మిశ్రా 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (74.2 ఓవర్లలో ఆలౌట్) 205.
వికెట్ల పతనం: 1–37, 2–47, 3–107, 4–135, 5–146, 6– 147, 7–160, 8–170, 9–199, 10–205.
బౌలింగ్: వికాస్ టోకాస్ 17–4–41–1, ఆకాశ్ 12–2–31–1, కుల్వంత్ 17–1–48–4, లలిత్ యాదవ్ 8–0–27–0, మనన్ శర్మ 10–5–11–0, వికాస్ మిశ్రా 10.2–2–36–4.
హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) ఉన్ముక్త్ చంద్ (బి) వికాస్ మిశ్రా 42; అక్షత్ రెడ్డి (సి) ధ్రువ్ (బి) లలిత్ యాదవ్ 107; కె. రోహిత్ రాయుడు బ్యాటింగ్ 61; బి. సందీప్ బ్యాటింగ్ 8; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (83 ఓవర్లలో 2 వికెట్లకు) 233.
వికెట్ల పతనం: 1–98, 2–213.
బౌలింగ్: వికాస్ టోకాస్ 13–6–13–0, ఆకాశ్ 11–3–29–0, కుల్వంత్ 9–2–20–0, మనన్ శర్మ 18–2–60–0, లలిత్ యాదవ్ 11–3–22–1, వికాస్ మిశ్రా 15–3–54–1, ధ్రువ్ 6–0–21–0.
Comments
Please login to add a commentAdd a comment