Alapati Raja
-
ఆలపాటి రాజీడ్రామా
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మాజీ మంత్రి ఆలపాటి రాజా మరోసారి రాజీనామా డ్రామా ఆడారు. తనకు సీటు లేదని తేలిపోవడంతో మరోసారి హైడ్రామాకు తెరలేపారు. తొలుత తన ఇంట్లో ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారంటూ లీకులు ఇచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు తెనాలిలో ఆత్మీయ సమావేశం అన్నారు. మళ్లీ దాన్ని రాత్రి ఏడు గంటలకు మార్చారు. ఈలోగా చంద్రబాబునాయుడి నుంచి కబురు వచ్చింది. రాజా తాడేపల్లి వెళ్లి చంద్రబాబునాయుడిని కలిశారు. ఆయన టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారో వివరించారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పడంతో తెనాలి వచ్చిన ఆలపాటి రాజా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల సర్దుకుపోవాలంటూ కార్యకర్తలకు హితవు పలికారు. మూడో జాబితాపై మండిపాటు శుక్రవారం చంద్రబాబునాయుడు విడుదల చేసిన మూడో జాబితాపై పలువురు తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. సీటు ఇస్తామని చెప్పి చివరి నిముషంలో చంద్రబాబు మోసం చేయడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా మరోసారి హైడ్రామా నడిపారు. ఇంతకుముందు నాదెండ్ల మనోహర్‌కు టికెట్ ప్రకటించినప్పుడు కూడా ఇదే ధోరణి ప్రదర్శించారు. అనంతరం గుంటూరు పశ్చిమ, పెనమలూరు సీట్ల కోసం ప్రయత్నించారు. గుంటూరు పశ్చిమ గళ్లా మాధవికి కేటాయించారు. దింపుడు కళ్లం ఆశగా పెనమలూరు ప్రయత్నించారు. దీనికి నాదెండ్ల మనోహర్ కూడా సహకారం అందించారు. దీంతో పెనమలూరు సీటు దాదాపుగా తనకే ఖరారు అయ్యిందన్న ప్రచారం సాగింది. చివరి నిముషంలో బోడె ప్రసాద్‌కే ఈ సీటును చంద్రబాబు ఖరారు చేయడంతో ఆలపాటి రాజా వర్గం తెనాలిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో మరోసారి అధిష్టానాన్ని కలుస్తానని, అందరూ అండగా ఉంటానంటే ఒక నిర్ణయం తీసుకుందామంటూ చెప్పి వారిని పంపించేశారు. ఉండవల్లికి నిరాశే.. బాపట్ల పార్లమెంట్ టికెట్ వస్తుందని ఆశగా ఎదురు చూసిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆ సీటును మాజీ ఐపీఎస్ తెన్నేటి కృష్ణప్రసాద్‌కు కేటాయించడంతో నిరాశ చెందారు. రాజకీయాలు ఎలా ఉంటాయో ఈ రోజే తెలిసిందంటూ ట్వీట్ చేసింది. బాపట్లను ట్యాగ్ చేస్తూ పక్కన వెన్నుపోటును సూచించేలా కత్తితో సింబల్ పెట్టి ట్వీట్ చేశారు. తెలుగుదేశంలో చేరిన సమయంలో తాడికొండ సీటు కుదరకపోతే తిరువూరు అసెంబ్లీ, బాపట్ల ఎంపీ స్థానాలకు తన పేరు పరిశీలించాలని కోరిన శ్రీదేవి. అయితే ఈ సీట్లన్నింటిలో వేరే వారిని ప్రకటించడంతో ఖంగుతిన్న శ్రీదేవి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. -
సై అంటే సై.. టీడీపీ, జనసేనల పొత్తు కుంపట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవడంలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడంలేదు. పైగా.. కలిసి పనిచేస్తున్నట్లు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఎప్పుడో ప్రకటించినా ఇప్పటివరకు ఒక్కడుగు కూడా వారిరువురూ ఆ దిశగా ముందుకు వేయలేదు. సీట్ల సర్దుబాటు నుంచి ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభల వరకు అన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. కలిసి పనిచేయడానికి ఇద్దరు నేతలు ఆరాటపడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. అలాగే, సీట్ల సర్దుబాటుపై కొన్నినెలలుగా చర్చలు జరగడమే తప్ప ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. తమకు 50కి పైగా సీట్లు కేటాయించాలని జనసేన కోరుతుండగా, 15 సీట్లు ఇవ్వడానికి కూడా బాబు సిద్ధంగాలేరు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని రెండునెలల క్రితం ప్రకటించినా ఇంతవరకూ ఆ ఊసేలేదు. అంతేకాక.. ఇద్దరు అధినేతలు కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహిస్తారని ప్రకటించినా అదీ జరగలేదు. బాబు ‘రా కదలిరా’ సభలకు పవన్ వెళ్తారని ప్రచారం చేసినా ఆయన వెళ్లలేదు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడంవల్లే ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. జిల్లాలో నువ్వా నేనా? ఇదిలా ఉంటే.. నియోజకవర్గాల్లో మాత్రం రెండు పార్టీల నేతలు సీటు తమదంటే తమదంటూ పోటీపడుతూ గొడవలకు దిగడంతో జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారింది. పలు నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీల నేతలు బలప్రదర్శనకు దిగుతూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఉదా.. అనకాపల్లి ఎంపీ సీటు కోసం టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ ప్రయత్నిస్తుండగా దాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో వాతావరణం వేడెక్కింది. తన కొడుక్కి ఎంపీ సీటు నిరాకరిస్తుండడంతో అయ్యన్న కస్సుమంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజమండ్రి రూరల్‌లో రాజుకున్న విభేదాలు.. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సీటు టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు రాజేసింది. అక్కడి నుంచి మళ్లీ తానే పోటీచేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతుండగా సీటు తనదేనని జనసేన నేత కందుల దుర్గేష్ తొడకొడుతున్నారు. ఇలా రెండు పార్టీల నేతలు ఇప్పటికే బహిరంగంగా గొడవలు పడే పరిస్థితి నెలకొంది. తాజాగా.. బుచ్చయ్య చౌదరి స్థానికంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో తన సీటును ఆపడానికి దుర్గేష్ ఎవరని ప్రశ్నించారు. దీనిపై దుర్గేష్ వర్గం మండిపడుతూ ప్రతి విమర్శలు చేసింది. ఇలా.. నిత్యం రెండు పార్టీల నేతలు సీటు కోసం రెచ్చగొట్టే ప్రకటనలు చేసుకుంటూనే ఉన్నారు. పిఠాపురంలో పోటాపోటీ.. ► కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్‌ఛార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. ఇటీవల జరిగిన రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ సీటు తనదేనని చెబుతూ ఒకసారి ఓడిపోయిన వారికి సీటు ఎలా ఇస్తారని వర్మను ఉద్దేశించి మాట్లాడారు. దీనికి ప్రతిగా పార్టీ అధినేతలే ఓడిపోయిన పరిస్థితి ఉందంటూ పవన్ విషయాన్ని వర్మ గుర్తుచేశారు. దీంతో గొడవ జరిగి ఇరు వర్గాలు కుర్చీలు విసురుకునే పరిస్థితి ఏర్పడింది. ► అలాగే, కాకినాడ రూరల్ సీటును జనసేన నేత పంతం నానాజీకి ఇస్తారనే ప్రచారంతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కారాలు నూరుతున్నారు. సీటు తనకు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ► అమలాపురం నియోజకవర్గంలో ఇరు పార్టీల నేతలు సీటు తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. ► రాజోలు సీటును పవన్ తమదేనని ప్రకటించినా అక్కడి టీడీపీ నేతలు మాత్రం ఇంకా ఆశలు పెట్టుకుని హడావుడి చేస్తున్నారు. ► ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పోలవరం సీటు జనసేనకు ఇస్తున్నారనే ప్రచారంతో అక్కడి టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ► నర్సాపురం సీటు జనసేనకు ఇస్తే ఊరుకునేది లేదని స్థానిక టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ► అలాగే, కృష్ణా జిల్లాలోనూ రెండు, మూడు నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య గందరగోళ వాతావరణం నెలకొంది. విజయవాడ పశ్చిమ నుంచి తాను పోటీచేస్తున్నట్లు జనసేన నేత పోతిన మహేష్ హడావుడి చేస్తుండగా టీడీపీ నేతలు జలీల్‌ఖాన్, బుద్ధా వెంకన్నలు అతనికి అంత సీన్లేదని ఎద్దేవా చేస్తున్నారు. తెనాలిపై మనోహర్, రాజా పట్టు.. ఇక తెనాలి సీటు కోసం జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా పోటీపడుతుండడం రసవత్తరంగా మారింది. సీటు తనదేనని మనోహర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేయగా, రాజా మాత్రం ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతూ తానే పోటీచేస్తానని చెబుతున్నారు. రాజాకు సీటు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే రీతిలో రాజా అనుచరులు తొడలు కొడుతున్నారు. ► కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీటు తమదేనని జనసేన నేతలు ప్రకటించుకోవడంతో అక్కడి టీడీపీ నేత భూమా అఖిలప్రియ మండిపడుతున్నారు. ► అనంతపురం అర్బన్ సీటు కోసం రెండు పార్టీల నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ► ధర్మవరం సీటుపైనా రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం సీటుపైనా సిగపట్లు.. ఇలా మొత్తంగా రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు.. సీఎం అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో రెండు పార్టీలు కత్తులు నూరుకుంటున్నాయి. చంద్రబాబు సీఎం అభ్యర్థిత్వాన్ని పవన్‌కళ్యాణ్ బలపరుస్తున్నా ఆ పార్టీ నేతలు, కేడర్ మాత్రం అంగీకరించడంలేదు. పైగా పవనే సీఎం అభ్యర్థని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతూ జనసేనకు అంత సీన్లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
చంద్రబాబు ముందే జగన్ ను పొగిడిన టీడీపీ నేత
-
పవన్ కల్యాణ్ క్లారిటీ.. ఆలపాటి రాజా ప్రస్థానం ముగిసినట్లేనా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి నుంచి మాజీమంత్రి ఆలపాటి రాజా ప్రస్థానం ముగిసినట్లేనా? రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెనాలి నుంచి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను గెలిపించాలంటూ తెనాలి కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఈ చర్చకు దారి తీసింది. ఇంకా పొత్తులు సంగతి ఖరారు కాకుండానే ఏకపక్షంగా జనసేన తమ అభ్యర్థిని ప్రకటించడం పట్ల తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు బలమైన సీటులో అభ్యర్థిని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారంటూ వారు మండిపడుతున్నారు. మరోవైపు నీ పని నీదేనని ఆలపాటికి టీడీపీ అధినేత చంద్రబాబు ఇదివరకే భరోసా ఇచ్చారనేది విశ్వసనీయ సమాచారం. గుంటూరు పశ్చిమంపై దృష్టి! గతంలో పొన్నూరు, తెనాలి, బాపట్ల, చీరాలలో చంద్రబాబు పర్యటనను ఖరారు చేశారు. తీరా ఒకరోజు ముందు తెనాలి పర్యటనను రద్దుచేసుకుని చంద్రబాబు నేరుగా బాపట్లకు వెళ్లారు. అక్కడ టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు కూడా. తెనాలి అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోకపోవటం, పొత్తులపై అనధికారంగా చేతులు కలిపినందున మనోహర్ కోసం తెనాలి సీటు వదులుకోవటానికి సిద్ధపడటం వంటి కారణాలతో తెనాలి పట్టణంలో పర్యటనను చంద్రబాబు రద్దుచేసుకున్నారని అప్పట్లో చెప్పుకున్నారు. అప్పటి నుంచే ఆలపాటి రాజా భవితవ్యం చర్చనీయాంశంగా మారింది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో ఈ విషయం స్పష్టం అవుతోంది. తెనాలి సీటు విషయంలో అనుమానాలు ఉండటంతోనే ఆలపాటి రాజా గుంటూరు పశ్చిమంపైనా దృష్టి పెట్టారు. అయితే ఆలపాటి రాజాను ఎంపీగా పంపుతారంటూ ఒక ప్రచారం జరుగుతోంది. చివరి నిముషంలో ఆలపాటి రాజాకు చంద్రబాబునాయుడు మొండిచెయ్యి చూపిస్తారంటూ తెలుగుదేశం శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. మనోహర్‌కు గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లు గతంలో రెండుసార్లు తెనాలి నుంచి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్‌గా కూడా పనిచేసిన నాదెండ్ల మనోహర్ 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కేవలం 15 వేల ఓట్లు, 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 29 వేల ఓట్లు పొందారు. 2014లో గెలిచిన ఆలపాటి రాజా, 2019లో 76 వేల ఓట్లు సంపాదించారు. తెనాలిలో బలంగా ఉన్న ఆలపాటి రాజాకు పొత్తుల రూపంలో రాజకీయ ప్రస్థానానికి ఎండ్‌కార్డు పడుతుందా అన్న చర్చ తెలుగుదేశంలో జరుగుతోంది. వాస్తవానికి ఏ ఎన్నికలకు అప్పటి పరిస్థితుల ప్రకారం నిర్ణయం తీసుకోవటం చంద్రబాబుకు అలవాటు. పార్టీకి విధేయత వంటివి ఆయన పట్టించుకోరు. వాడుకుని వదిలేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెనాలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల విషయాన్ని పరిశీలించినా ఈ విషయం తెలిసిపోతుంది. 1994 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ రావి రవీంద్రనాథ్ను పార్టీలో చేర్చుకుని, ఆ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఎమ్మెల్యేగా ఒక టర్మ్ పూర్తిచేసుకున్న డాక్టర్ రవీంద్రనాథ్‌కు 1999 ఎన్నికల్లో రెండోసారి టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు మొండిచెయ్యి చూపారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందిన వైద్యురాలు డాక్టర్ గోగినేని ఉమకు అభ్యర్థిత్వం కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ ఉమ, 2004లో మళ్లీ టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2009 ఎన్నికలకు వేమూరు ఎస్సీలకు రిజర్వుడు కావటంతో ఆ నియోజకవర్గానికి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను తెనాలి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. డాక్టర్ ఉమను కొనసాగించలేదు. అయినా ఆ ఎన్నికల్లో ఆలపాటి ఓటమి పాలయ్యారు. 2014లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆలపాటి రాజా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ చేతిలో ఓడిపోయారు. తెనాలి నుంచి మూడుసార్లు పోటీచేసి ఒకసారి గెలిచిన ఆలపాటికి మరోసారి చంద్రబాబు సీటు ఇస్తారనేది డౌటేనని అంటున్నారు. అయితే ఏకపక్షంగా జనసేన అభ్యర్థిని ప్రకటించడంతో భవిష్యత్ కార్యాచరణపై తెలుగుదేశం శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
ఎన్ఆర్ఐ ఆస్పత్రి అక్రమాల్లో టీడీపీ నేతల పాత్ర!
సాక్షి, విజయవాడ: ఏపీలోని పలు ఆస్పత్రిల్లో ఈడీ సోదాలు చేస్తున్న వేళ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రి, విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిల్లో ఈరోజు(శుక్రవారం) ప్రధానంగా సోదాలు నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. ఎన్ఆర్ఐ ఆస్పత్రి అక్రమాల్లో ప్రముఖంగా టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నిర్మాణం కాకుండా రూ. 43 కోట్లు అక్రమ మార్గంలో దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఎన్ఆర్ఐ ఆస్పత్రి మేనేజ్మెంట్లో కీలకంగా వ్యవహరించిన టీడీపీ మాజీ మంత్రి ఆలపాట రాజా.. సుదీర్ఘకాలం ఎన్ఆర్ఐ ఆస్పత్రి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఐ ఆస్పత్రికి అనుబంధంగా ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు.ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి నిధులు దారి మళ్లించేందుకు ఎన్ఆర్ఐ అగ్రిటెక్ లిమిటెడ్‌ను ఉపయోగించుకున్నట్లు ఈదీకి ఆధారాలు లభించాయి. మరొకవైపు ఈనాడు రామోజీరావు సమీప బంధువు అక్కినేని మణి చైర్మన్‌గా వ్యవహరించిన అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలోనూ చేసిన ఈడీ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్పత్రికి డైరెక్టర్లుగా వ్యవహరించిన వారిని విచారించిన ఈడీ.. కీలక ఆధారాలు సేకరించింది. -
ఈ పాపం టీడీపీదే
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, తెనాలి రూరల్: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన వ్యవహారంలో తెరపై సూత్రధారులు తెనాలి కొత్తపేటకు చెందిన జి.అమ్మేశ్వరరావు, మల్లేశ్వరరావులు కాగా, తెరవెనుక టీడీపీ ప్రముఖులు కథ నడిపినట్లు స్పష్టమవుతోంది. పిటిషన్లు వేయడానికి కారణమైన వీరిద్దరికి టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో ఓ కార్మిక సంఘంలో పని చేసిన అమ్మేశ్వరరావుతో పాటు ఒక కుల సంఘం నేతగా ఉన్న ఎం.మల్లేశ్వరరావులు పేదలకు ఇళ్ల స్థలాలను ఇప్పిస్తామని నమ్మబలికి, వారి నుంచి ధృవీకరణ పత్రాలు, సంతకాలు సేకరించారు. వీటి ద్వారా 2016లో అప్పటి మండల తహశీల్దారుపై అమ్మేశ్వరరావు హైకోర్టులో కేసు వేశారు. అదే కేసులో పిటిషనుదారుల్లో చాలా మంది పేర్లతో మళ్లీ గత డిసెంబర్లో పేదలందరికీ ఇళ్లు పథకంపై పిటిషను దాఖలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సివిల్ న్యాయవాదికి తాను ఈ పత్రాలు ఇచ్చినట్టు అమ్మేశ్వరరావు స్థానికుల వద్ద అంగీకరించాడు. అదేమని అడిగితే ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలం సరిపోదని, అందుకే హైదరాబాద్‌లో సివిల్ న్యాయవాదికి ఇచ్చి పిటిషన్ వేయించినట్టు చెబుతున్నాడు. ‘మీ అంతట మీరే కేసు వేశారా? ఎవరి ప్రోద్భలమైనా ఉందా? ఇళ్ల స్థలాల అర్జీలకంటూ సంతకాలు తీసుకుని, వారి పేర్లతో పిటిషన్ వేయటం ఏమిటి’ అన్న బాధితుల ప్రశ్నలకు అతను సమాధానం ఇవ్వడం లేదు. కొత్తపేటలోని పట్టాభి రోడ్డులో డ్రైనేజి కాలువ పక్కన చిన్న ఇంటిలో నివసించే అమ్మేశ్వరరావు.. హైకోర్టు లాయరుకు భారీ ఫీజులు చెల్లించి.. కోర్టులో పిటిషన్ వేసేంత స్థోమత లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ కేసు కోసం సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న అమ్మేశ్వరరావుకు ఆ పార్టీకి చెందిన పెద్దలు సహకరించడం వల్లే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. టీడీపీ పెద్దలు తెరవెనుక నుంచి ఇచ్చిన సూచనల మేరకు కొంత మంది ఆ పార్టీ నేతల ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అయితే పిటిషన్ వేసిన వారిలో మృతి చెందిన మహిళ ఉండటం, పేర్లు సరిచూసుకోక పోవడం తదితర కారణాల వల్ల ఇట్టే దొరికి పోవాల్సి వస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జి.అమ్మేశ్వరరావు నివసిస్తున్న ఇల్లు మాకు ఏ పాపం తెలియదు ‘మేం తెనాలి చంద్రబాబుకాలనీ వాసులం. మాకు తెలియకుండా, మా ప్రమేయం లేకుండా మా సంతకాలు ఫోర్జరీ చేసి గౌరవ హైకోర్టులో మాకు ప్రభుత్వం వారు ఇచ్చిన ఇళ్ల స్థలాల గురించి కేసు వేసి స్టే ఉత్తర్వులు తీసుకున్నట్లు మాకు టీవీలు, పేపర్ల ద్వారా తెలిసింది. నాలుగేళ్ల క్రితం గుండెమెడ అమ్మేశ్వరరావు, ఎం. మల్లేశ్వరరావులు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటే ఆధార్‌కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చాము. తర్వాత ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఇళ్ల స్థలాలు వచ్చాయి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేయలేదు. మాకు తెలియకుండా మా వివరాలతో కేసు వేసిన కుట్రదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోండి’ అంటూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తుమ్మపూడి అశోక్‌కుమార్, పరుచూరు బేబీ సరోజిని, కొండా నాగమంజుల, కనికరం రాంబాబు, శేని సత్యవతి, ఎస్ లీలాప్రసాద్, చనగవరపు శివకుమారి, షేక్ జిలాని, భీమిశెట్టి రామ్మోహన్రావు తదితరులు తెనాలి త్రీటౌన్ పోలీసు స్టేషన్లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. కుట్రదారులను విచారించండి ఈ ప్రభుత్వ వచ్చిన తర్వాత ‘నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు’ పథకంలో భాగంగా తమకు ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయని, స్థలాన్ని తమకు స్వాధీనం చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఇళ్ల స్థలాల కోసం ఏ కోర్టులోనూ ఎటువంటి కేసులు వేయలేదని, ఏ ప్లీడర్ను కలవలేదని ఫిర్యాదులో వివరించారు. తమ వద్ద నుంచి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తీసుకున్న గుండెమెడ అమ్మేశ్వరరావు, ఎం. మల్లేశ్వరరావు వారి రాజకీయ స్వలాభం కోసం తమ సంతకాలు ఫోర్జరీ చేసి హైకోర్టులో వేసిన ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కుట్రకు పాల్పడిందెవరో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. పేదల్లో కలవరం పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 369, జీవో 488, జీవో 99లను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబర్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు న్యాయమూర్తి మల్లవోలు సత్యనారాయణమూర్తి ఈనెల 8న ఇళ్ల పథకానికి బ్రేక్ వేస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న పొదిలి శివమురళి ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూ మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఇళ్ల పథకాన్ని నిలిపివేయమని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తెనాలివాసుల పేర్లు ఉన్నాయన్న సమాచారం చాలా మంది పేదల్లో కలవరం కలిగించింది. పలువురు తమ పేరు ఉందేమోనన్న ఆందోళనతో పట్టణ 23వ వార్డులోని సచివాలయానికి వెళ్లారు. పిటిషనులో తమ పేర్లు ఉన్నాయేమో చూడాలని సచివాలయం సిబ్బందిని కోరారు. పిటిషన్లో పేర్లు లేని మరికొంత మంది కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అమ్మేశ్వరరావుకు డబ్బులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. చాలాసార్లు అతడి కోసం తిరిగి, ఆశలు వదిలేసుకున్నామని మీడియాకు తెలిపారు. పిటిషన్లో చనిపోయిన మహిళ పేరు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో వేసిన పిటిషన్లో తెనాలికి చెందిన కొండెం ప్రమీల పేరు ఉంది. ఈ పిటిషన్‌ను గత ఏడాది డిసెంబర్లో వేశారు. అయితే కొండెం ప్రమీల అనారోగ్యంతో గత ఏడాది మార్చి 4వ తేదీ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. చనిపోయిన ఈమె ఎలా పిటిషన్ వేస్తుందని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరి పేర్లు రిపీట్ అవ్వగా, కొందరి అడ్రస్‌లు తప్పుడువి ఇచ్చారు. చాలా మంది పిటిషన్లో పేర్కొన్న చిరునామాలలో ఉండటం లేదు. తొలుత ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బయటపెట్టగానే తెలుగుదేశం నేతలు భుజాలు తడుముకోవడం పలు అనుమానాలకు దారితీసింది. పిటిషన్ దారుల్లో మొదటి వ్యక్తిగా చెబుతున్న పొదిలి శివమురళి తాను తమ కులపెద్ద ఎం.మల్లేశ్వరరావుకు ఆధార్‌కార్డు ఇచ్చానని చెబితే, తెనాలి ఎమ్మెల్యే పేరు చెప్పినట్లుగా వక్రీకరిస్తూ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా విలేకరుల సమావేశం పెట్టడంతో ఇందులో తెలుగుదేశం నాయకుల పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. కేసు వేయించింది ఆలపాటి రాజాయే – తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ మండిపాటు ఇళ్ల స్థలాల పథకంపై హైకోర్టులో కేసు వేయించింది మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా అని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పథకంపై హైకోర్టును ఆశ్రయించిన పిటిషనుదారుల్లో ప్రథముడైన పొదిలి శివమురళి వీడియో సాక్షిగా చెప్పిన అంశాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా వక్రీకరించి, తనకు ఆపాదించాలని చూశారని విమర్శించారు. రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం ద్వారా తెనాలిలో ఇక తనకు స్థానం లేదన్న దుగ్ధతో ఆలపాటి రాజానే ఈ కేసు వేయించారని చెప్పారు. దీని వెనుక ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాలనే భారీ కుట్ర ఉందంటూ బుధవారం విలేకరుల సమావేశంలో నిప్పులు చెరిగారు. ముందుగా పిటిషనుదారుల్లో ఒకరైన పొదిలి శివమురళి మాట్లాడిన వీడియోను, దాని ఆధారంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆలపాటి రాజా ప్రెస్‌మీట్ వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు. తాను నాయీబ్రాహ్మణ కులస్తుడినని, తన కులపెద్ద ఎం.మల్లేశ్వరరావుకు ఇళ్ల స్థలాల కోసమని డబ్బులు, ధృవీకరణ పత్రాలు ఇచ్చానని శివమురళి చెబితే, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ఇచ్చానని చెప్పాడంటూ రాజా తనపై ఆరోపణ చేయటం ఏమిటని శివకుమార్ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలను అడ్డుకునే కుట్ర టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే పురుడుపోసుకుందని చెప్పారు. పంచాయతీ కార్యాలయాలపై పార్టీ రంగులు తొలగించాలంటూ టీడీపీకి చెందిన వెంకట్రావుతో కేసు వేయించిందీ రాజానేనని చెప్పారు. క్రిమినల్ మైండ్ కలిగిన రాజా, కోర్టుల్లో తనకు అపారమైన పలుకుబడి ఉందని చెప్పుకుంటూ, సెటిల్మెంట్లు చేయటం అలవాటని ఆరోపించారు. టీడీపీకి చెందిన నన్నపనేని సుధాకర్ దగ్గర కోర్టు కేసు విషయంలో రాజా రూ.25 లక్షలు తీసుకున్నాడని తాను ఏడాది క్రితం ఆరోపించినట్టు ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత రెండు నెలలకు రూ.10 లక్షలు తిరిగి ఇచ్చాడనే విషయాన్ని సుధాకర్ స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. -
పన్ను ఎగవేత కేసులో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా
-
‘దేశం’లో ధిక్కార స్వరం
తెలుగుదేశం పార్టీలో నేతల ధిక్కార స్వరం క్రమంగా పెరుగుతోంది. రానున్న ఎన్ని కలకు అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో అధినేత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు నేతలకు మింగుడు పడటం లేదు. సీనియర్లు, మాజీ మంత్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఇతర పార్టీల నాయకులను టీడీపీలో చేర్చుకోవడాన్ని కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. మరి కొందరైతే అధినేత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచనలు ఇస్తున్నారు. అభ్యర్థుల ఖరారు సమయంలో పార్టీకి అందించిన సేవలు, స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. ఇందు కు భిన్నంగా జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ అధినేతతో తాడోపేడో తేల్చుకునేందుకు రాజధానికి పయనమవుతున్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ అధినేత నిర్ణయాలపై మీడియా ఎదుట అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ ంలో అధినేతకు కొన్ని సూచనలు చేశారు. ఇతర పార్టీల నాయకులను టీడీపీలో చేర్చుకునే ముందు దేశం నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడం లేదంటూ పరోక్షంగా అధినేతకు చురకలంటించారు. పార్టీ అధికారంలో లేకపోయినా 10 ఏళ్ళపాటు నాయకులు, కార్యకర్తలు ఎన్నో కష్టాలుపడి కాంగ్రెస్‌కు ఎదురొడ్డి పోరాడారని, మరెంతో మంది తమ ఆస్తులు, ప్రాణాలను ఫణంగా పెట్టారని గుర్తుచేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను గ్రేడింగ్, ఫిల్టర్ చేసి తీసుకోవాలని సూచించారు. చేర్పులు, మార్పులు అనేవి అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. పార్టీలో చేరే వారి చరిత్ర, అంకితభావం, విశ్వసనీయతను తెలుసుకుని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. మాజీమంత్రి, తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి ఆలపాటి రాజా అధినేతపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకపోయినా, తనకు కాకుండా ఎవరికి సీటు కేటాయిస్తారనే ధోరణిలో ఉన్నారు. సినీనటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావుకు తెనాలి, ఆలపాటి రాజాకు గుంటూరు పశ్చిమ సీటును అధినేత కేటాయించే అవకాశాలున్నట్టు నేతలు చెబుతున్నారు. అయితే ఆలపాటి అభిమానులు తమ నాయకునికి కాకుండా తెనాలి సీటు మరొకరికి కేటాయిస్తే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.మంగళగిరి అసెంబ్లీ సీటును స్థానిక టీడీపీ నేతలకే కేటాయించాలని, బీసీ, ఓసీ ఎవరికి కేటాయించినా తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ రూరల్ అధ్యక్షుడు ఆరుద్ర అంకవరప్రసాద్ చెబుతున్నారు. అక్కడి పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన ముఖ్యనేతల సమావేశంలో స్థానిక వాదాన్ని లేవనెత్తారు. రెండున్నర దశాబ్దాలుగా నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసిన స్థానిన నాయకులు ఎందరో ఉన్నారని, వారిలో ఎవరికి ప్రాధాన్యం ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ పరిస్థితులు ఇందుకు భిన్నంగా లేవు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నిమ్మకాయల రాజనారాయణను పక్కన పెట్టి చలపతి విద్యాసంస్థల అధినేత మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులుకు సీటు ఇవ్వాలని కొందరు నాయకులు, అనుచరులు శుక్రవారం హైదరాబాద్ వెళ్ళారు. గెలుపు గుర్రాలకు టికెట్ కేటాయించాలని ఈ వర్గం కోరుతుంటే, పార్టీని పటిష్టం చేసిన నేతలను విస్మరించడం ఎంత వరకు సరైన చర్యని మిగిలిన వారు ప్రశ్నిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే న్యాయవాది పోట్ల సుబ్బారావుకు టికెట్ కేటాయించాలంటూ స్థానిక నాయకులు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ వెళ్ళారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీగా అధినేత బాబు ప్రకటనలకు భిన్నంగా ఈ ఎన్నికల్లో ఇప్పటి నుంచే పరిస్థితులు చోటుచేసుకోవడం అభిమానులకు నిరాశను కలిగిస్తుంది.