alegations
-
ఆరోపణలు రుజువైతే రాజీనామాకు సిద్ధం: గడ్కారీ
న్యూఢిల్లీ: కాగ్ నివేదిక నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలు నిజమని తేలితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, దీనిపై ఆర్థిక శాఖ విచారణకు సిద్ధమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. తాను తప్పు చేయలేదని, ఆరోపణలన్నింటికీ సమాధానాలు ఉన్నాయన్నారు. ‘ప్రపంచంలోని ఏ కోర్టులోనైనా నాపై ఆరోపణలు నిరూపితమైనా.. ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు తేలినా మంత్రి పదవికి, పార్లమెంట్ సభ్యత్వానికీ రాజీనామా చేస్తా’ అని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు చెందిన పుర్తీ గ్రూప్‌నకు రుణ మంజూరీలో అక్రమాలు జరిగాయన్న కాగ్ నివేదికపై ప్రతిపక్షాలు నిలదీస్తుండటంతో ఆయన వివరణ ఇచ్చారు. ఆ నివేదికలో తనపై ఆరోపణలు లేవని, రాజకీయ ప్రయోజనాల కోసమే రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. -
'రేణుకా హటావో కాంగ్రెస్ బచావో'
ఖమ్మం: కాంగ్రెస్‌కు మంచిరోజులు రావాలంటే రేణుకా చౌదరి లాంటి వాళ్లను పార్టీ నుంచి తొలగించాలని గిరిజన సంఘాలు ఆరోపించాయి. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర నాయకులు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్‌అలీతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. 'సాధారణ ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మించి తన భర్త నుంచి కోటి 20 లక్షలు తీసుకున్నారని.. అయినా టికె ట్ ఇప్పించలేదని.. తిరిగి డబ్బులివ్వమంటే ఇవ్వకుంటా మనోవేదనకు గురిచేయడంతో.. మనస్థాపానికి గురై నా భర్త మృతిచెందాడని' డాక్టర్ రాంజీ భార్య అన్నారు. గతంలో పలు మార్లు రేణుకా చౌదరిని సంప్రదించిన ఎలాంటి ఫలితం రాలేదని ఆమె వాపోయారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కుంతియ ముఖ్య అతిధిగా వస్తున్నారని తెలుసుకున్న రాంజీ భార్య, బంధువులతోపాటు గిరిజన నాయకులు పార్టీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుకా హటావో కాంగ్రెస్ బచావో అనే ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కాగా పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ రాంజీ భార్య కుంతియాకు వినతి పత్రం అందించారు.