Almatti
-
ఇక ఎత్తిపోసుడే
సాక్షి, హైదరాబాద్: ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలు మంగళవారం ఉదయానికి జూరాల చేరనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జూరాలకు వచ్చే నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంది. జూరాల నిర్ణీత మట్టాలకు నిల్వ చేరిన వెంటనే నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పంపులను ప్రారంభించి కృష్ణా జలాల ఎత్తిపోతలను చేపట్టనుంది. గతేడాది 50 టీఎంసీల మేర నీటిని జూరాలపై ఆధారపడిన ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు తరలించగా ఈ ఏడాది అంతకుమించి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎగువ నుంచి రాగానే ఎత్తిపోత పశ్చిమ కనమల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరిగిన విషయం తెలిసిందే. సోమవారం సైతం ఆల్మట్టిలోకి లక్ష క్యూసెక్కుల మేర వరద వస్తుండగా అంతే మొత్తం నీటిని దిగువ నారాయణపూర్‌కు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టిలో ప్రస్తుతం 129 టీఎంసీలకుగాను 123 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఇక నారాయణపూర్‌లో సైతం 37 టీఎంసీలకుగాను 32 టీఎంసీల నిల్వ ఉండగా అందులోంచి 18 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలారు. ఈ నీరు జూరాల వైపు వస్తోంది. సోమవారం మధ్యాహ్నమే జూరాలకు ముందున్న కర్ణాటకలోని గూగల్ బ్యారేజీని కృష్ణా వరద దాటగా మంగళవారం ఉదయానికి జూరాలను చేరుకోనుంది. జూరాలలో ప్రస్తుతం 9.66 టీఎంసీలకుగాను 1.99 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఇందులో మరో 5 టీఎంసీల నీరు చేరిన వెంటనే భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు పంపులు ప్రారంభం కానున్నాయి. దీంతోపాటే జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగనుంది. చర్యలు చేపట్టండి: కేసీఆర్ గోదావరి పరిధిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతోపాటు కడెం, ఎల్లంపల్లిలో వరద మొదలైనందున వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వరద నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో వరద పరిస్థితిపై కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కడెంకు చేరుకుంటున్న వరదతో ప్రాజెక్టు నిండి ఎల్లంపల్లికి వరద చేరుకునే అవకాశం ఉండటంతో గోలివాడ వద్ద ఉన్న పంపుల్లో ఎన్ని మోటార్లను నడిపిస్తారో పరిశీలించి నీటిని ఎత్తిపోయాలన్నారు. అలాగే కృష్ణా బేసిన్లో భారీ వరదలు వస్తున్నందున దానిపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ద్వారా గరిష్ట నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. శ్రీశైలానికి వరద చేరిన వెంటనే కల్వకుర్తి పంపులను సైతం నడిపించి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్నారు. దీంతోపాటే ప్రతి బ్యారేజీ వద్ద గేట్ల నిర్వహణ, పంపులు మోటార్ల మరమ్మతు పనులు ఉంటే తక్షణమే చేసుకొని ఇంజనీర్లు ఆయా ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎంవో స్మితా సబర్వాల్, ఓఎస్డీ శ్రీపతి దేశ్‌పాండే, ఈఎన్సీ మురళీధర్ తదితరులు హాజరయ్యారు. -
కాళేశ్వరానికి పోటెత్తిన వరద
కాళేశ్వరం/మంథని: కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాలవల్ల ప్రాణహిత నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. కన్నెపల్లి పంపుహౌస్‌లో ఐదు మోటార్లు ఏకధాటిగా నడుస్తుండటంతో గ్రావిటీ కాల్వ ద్వారా వెళుతున్న నీరు అన్నారం బ్యారేజీకి చేరి జలకళ ఉట్టి పడుతోంది. మంగళవారం కన్నెపల్లి పంపుహౌస్‌లో 2వ నంబర్ మోటార్‌కు వెట్‌రన్ పూర్తి చేసి ఎత్తిపోతలు చేస్తున్నారు. 1, 2, 3, 4, 6వ మోటార్లు నీటిని డెలివరీ సిస్టంలో ఎత్తిపోస్తున్నాయి. ఒక్కో మోటార్ రోజుకు 2,210 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఐదు మోటార్లు 24 గంటలు నడిస్తే ఒక్క టీఎంసీ నీరు తరలించొచ్చు. కాగా, మేడిగడ్డ బ్యారేజీలో ప్రస్తుతం 6.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బ్యారేజీలో మొత్తం 85గేట్లు మూసి ఉంచారు. రెండో మోటార్ వెట్‌రన్ మూడు రోజుల క్రితమే అన్నారం పంపుహౌస్‌లో మొదటి మోటార్‌కు అధికారులు వెట్‌రన్ నిర్వహించారు. మోటార్‌ను సోమవారం చాలాసేపు నడిపిం చడంతో సుందిళ్ల బ్యారేజీలోకి నీరు చేరుతోంది. మంగళవారం మొదటి మోటార్ నడిపిస్తూనే రెండో మోటార్‌కు వెట్‌రన్ నిర్వహించారు. దీంతో సుందిళ్ల బ్యారేజీలోకి కాళేశ్వరం జలాలు చేరుతున్నాయి. వారంలో ఎల్లంపల్లికి.. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మరో వారం రోజుల్లో కాళేశ్వ రం జలాలు చేరే అవకాశం ఉంది. కన్నెపల్లిలో ఐదు మోటార్లు ఇప్పటికే ప్రారంభించగా మరో రెండు మోటార్లు నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నారంలోనూ మరో రెండు మోటార్లు నడిపించేలా సన్నాహాలు చేస్తున్నారు. అనుకున్నట్లుగానే మోటార్లు నడిస్తే రెండు మూడు రోజుల్లో సుందిళ్ల బ్యారేజీ పూర్తిగా నిండి ఎల్లంపల్లి దిశగా ఎదురెక్కే అవకాశం ఉంది. 74 గేట్లతో 8.8 టీఎంసీల సామర్థ్యం ఉన్న సుందిళ్ల బ్యారేజీలో ప్రస్తుతం 0.35 టీఎంసీల నీరు చేరింది. కేవలం ఒక్క మోటారు కొద్ది గంటలు నడిస్తేనే ఇలా ఉంటే.. నిరంతరం నాలుగు మోటార్లు నడిస్తే నాలుగు రోజుల్లో బ్యారేజీ నిండి గోలివాడ పంప్‌హౌస్‌కు నీరు చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆల్మట్టిలోకి 15వేల క్యూసెక్కులు ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టికి ప్రవాహాలు తగ్గినా, ఒక టీఎంసీకి తగ్గకుండా ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15,300 క్యూసెక్కు ల మేర ప్రవాహం వస్తోంది. దీంతో ఆల్మట్టిలో ప్రస్తు తం 129 టీఎంసీలకు గానూ 119 టీఎంసీల మేర నిల్వలున్నాయి. మరో 10 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండనుంది. దిగువ నారాయణపూర్ ప్రాజెక్టులోకి పూర్తిగా ప్రవాహాలు తగ్గాయి. ప్రాజెక్టులో 37 టీఎంసీలకు గానూ 34 టీఎంసీల నిల్వలుండగా, 4,500 క్యూసెక్కుల నీటిని కాల్వలకు వదులుతున్నారు. -
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో వరద
జూరాల : జూరాల ప్రాజెక్టుకు పై నుంచి మంగళవారం ఇన్‌ఫ్లో వరద తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.62 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. పై నుంచి ఇన్‌ఫ్లో 30వేల క్యూసెక్కులు వస్తుండగా జలవిద్యుత్ కేంద్రంలో మూడు టరై్బన్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ 28,115 క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ ద్వారా కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల ద్వారా పంపింగ్ కొనసాగిస్తున్నారు. కష్ణానది పై ప్రాంతంలోని కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 122 టీఎంసీల నీటినిల్వ ఉంది. పై నుంచి ప్రాజెక్టుకు 75,590 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా విద్యుదుత్పత్తి ద్వారా 15వేల క్యూసెక్కులను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు క్రస్టుగేట్లన్నీ మూసివేశారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి 18,138 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండగా విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 6వేల క్యూసెక్కులను దిగువన ఉన్న జూరాల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టులోనూ అన్ని క్రస్టుగేట్లను మూసివేశారు. -
మళ్లీ పెరిగిన కృష్ణా వరద
కృష్ణా జలాల వరద మళ్లీ పెరిగింది. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లోకి ఉధృతంగా కృష్ణా ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. ఆల్మట్మి, నారాయణఫూర్లోకి ఏకంగా 2లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం కొనసాగుతుండగా 1.83లక్షల క్యూసెక్కుల మేర దిగువ జూరాలకు వస్తోంది. జూరాలకు వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. గడిచిన నాలుగు రోజులుగా ఆల్మట్టి, నారాయణపూర్‌కు వరద ప్రవాహం తగ్గింది. వర్షాలు తగ్గుముఖం పట్టేయడంతో ప్రవాహాలు తగ్గినా..బుధవారం నుంచి అవి మళ్లీ పుంజుకున్నాయి. బుధవారం ఆల్మట్టిలోకి ఏకంగా 2,07,815 క్యూసెక్కుల మేర రవద రాగా, 2,12,339 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ నీరంతా దిగువ నారాయణఫూర్‌కు వస్తుండటం, అక్కడా ప్రాజెక్టు నిండుకుండలా ఉండటంతో 2,19,201 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఆ నీరంతా దిగువ జూరాల వైపు వస్తోంది. జూరాలకు బుధవారం 1,83,136 క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, 1,78,958 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువ ఎశైలానికి 1,76,076 క్యూసెక్కుల మేర న ఈరొస్తోంది. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ 215.8 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 128 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం పుంచి 19,931 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండటంతో నాగార్జునసాగర్‌లోకి 12,512 క్యూసెక్కుల నీటి ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో సాగర్‌లో ప్రస్తుతం 505.7 అడుగుల వద్ద 125.12 టీఎంసీల నీటి లభ్యత ఉంది.