కృష్ణా జలాల వరద మళ్లీ పెరిగింది. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లోకి ఉధృతంగా కృష్ణా ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. ఆల్మట్మి, నారాయణఫూర్‌లోకి ఏకంగా 2లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం కొనసాగుతుండగా 1.83లక్షల క్యూసెక్కుల మేర దిగువ జూరాలకు వస్తోంది. జూరాలకు వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది.
గడిచిన నాలుగు రోజులుగా ఆల్మట్టి, నారాయణపూర్‌కు వరద ప్రవాహం తగ్గింది. వర్షాలు తగ్గుముఖం పట్టేయడంతో ప్రవాహాలు తగ్గినా..బుధవారం నుంచి అవి మళ్లీ పుంజుకున్నాయి. బుధవారం ఆల్మట్టిలోకి ఏకంగా 2,07,815 క్యూసెక్కుల మేర రవద రాగా, 2,12,339 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ నీరంతా దిగువ నారాయణఫూర్‌కు వస్తుండటం, అక్కడా ప్రాజెక్టు నిండుకుండలా ఉండటంతో 2,19,201 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఆ నీరంతా దిగువ జూరాల వైపు వస్తోంది.
జూరాలకు బుధవారం 1,83,136 క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, 1,78,958 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువ ఎశైలానికి 1,76,076 క్యూసెక్కుల మేర న ఈరొస్తోంది. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ 215.8 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 128 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం పుంచి 19,931 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండటంతో నాగార్జునసాగర్‌లోకి 12,512 క్యూసెక్కుల నీటి ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో సాగర్‌లో ప్రస్తుతం 505.7 అడుగుల వద్ద 125.12 టీఎంసీల నీటి లభ్యత ఉంది.