Altaf Hussain
-
బాబూరామ్‌కు అశోక చక్ర
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత శౌర్య పతకం అశోక చక్రను జమ్మూకశ్మీర్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ బాబూరామ్‌కు, అలాగే, రెండో అత్యున్నత శౌర్యపతకం కీర్తి చక్రను కానిస్టేబుల్ అల్తాఫ్ హుస్సేన్ భట్‌లకు కేంద్రం ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరులో ధైర్య సాహసాలు ప్రదర్శించి వీరు వీరమరణం పొందారని కొనియాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాయుధ బలగాలకు 144 శౌర్య పతకాలను ప్రకటించారు. ఇందులో 15 శౌర్య చక్ర, 120 సేనా పతకాలు, అశోక చక్ర, కీర్తి చక్ర ఒక్కోటి చొప్పున ఉన్నాయి. జమ్మూలోని పూంఛ్ జిల్లాకు చెందిన బాబూ రామ్ 1999లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. 2002 శ్రీనగర్‌లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌లో బాధ్యతలు చేపట్టి, 14 ఎన్కౌంటర్లలో పాల్గొని 28 మంది ఉగ్రవాదులను అంతమొందించడంలో కీలకంగా ఉన్నారని పోలీసు శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టులో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన వీరమరణం పొందారని పేర్కొంది. శ్రీనగర్‌లోని రత్‌పొరాకు చెందిన కానిస్టేబుల్ భట్ గత ఏడాది అక్టోబర్ 6వ తేదీన గండేర్బల్లో విధుల్లో ఉండగా ఉగ్రవాదుల తూటాలకు వీరమరణం పొందారని అధికారులు తెలిపారు. మూడో అత్యున్నత సాహస పురస్కారం శౌర్యచక్రను ఆర్మీకి చెందిన ఆరుగురికి, వైమానిక దళానికి చెందిన ఇద్దరికి, ఒక నేవీ అధికారికి, ఆరుగురు పోలీస్ పారా మిలటరీ సిబ్బందికి కేంద్రం ప్రకటించింది. మొత్తం 15 పతకాల్లో నాలుగు మరణానంతరం ప్రకటించారు. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మేజర్ అరుణ్ కుమార్ పాండే, రవి కుమార్ చౌధరి, కెప్టెన్ అశుతోష్ కుమార్ (మరణానంతరం), కెప్టెన్ వికాస్ ఖత్రి, రైఫిల్ మ్యాన్ ముకేశ్ కుమార్, సిపాయి నీరజ్ అహ్లావత్లకు శౌర్యచక్ర ప్రకటించినట్లు ఆర్మీ తెలిపింది. అదేవిధంగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 2019 ఎన్నికల సమయంలో నలుగురు మావోయిస్టులను చంపిన సీఆర్పీఎఫ్కు చెందిన ముగ్గురు కోబ్రా కమాండోలకు శౌర్యచక్ర ప్రకటించింది. 201వ బెటాలియన్‌కు చెందిన వీరు డిప్యూటీ కమాండెంట్ చితేశ్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ మంజీందర్ సింగ్, కానిస్టేబుల్ సునీల్ చౌధరి. వీరు 2019 మార్చి 26వ తేదీన సుక్మా జిల్లా జగర్గుండా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉన్న నలుగురు అగ్రశ్రేణి మావోయిస్టులను హత మార్చడంతోపాటు మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని మావోయిస్టులకు తీవ్ర నష్ట వాటిల్లింది. వీరితోపాటు, నేవీలో కెప్టెన్ సచిన్ రుబెన్ సెకిరాకు, వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ పర్మిందర్ అంటిల్, వింగ్ కమాండర్ వరుణ్ సింగ్‌లకు శౌర్య చక్రను ప్రకటించారు. -
'ప్రపంచ మ్యాప్‌లో పాక్ ఉండదు'
-
'ప్రపంచ మ్యాప్‌లో పాక్ ఉండదు'
వాషింగ్టన్: సైన్యం, దాని అడుగుజాడల్లో నడిచే ఐఎస్ఐలే పాకిస్తాన్‌కు ప్రధాన శత్రువులని ఆ దేశ ప్రధాన ప్రతిపక్షం ముత్తహిదా క్వామీ మూవ్మెంట్(ఎంక్యూఎం) ఆరోపించింది. బలూచ్, మొహజిర్ల హక్కులను కాలరాస్తూ సైన్యం అకృత్యాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటం నుంచి పాకిస్తాన్ కనుమరుగవటం ఖాయమని ఎంక్యూఎం నేత అల్తాఫ్ హుస్సేన్ హెచ్చరించారు. తీవ్రవాదుల ఏరివేత పేరిట పాక్ సైన్యం బలూచిస్తాన్‌లో చేపట్టిన సైనిక చర్యలో వేలాది మంది బలూచ్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. సింథి, పక్తూన్, పంజాబ్ భూస్వాములు స్వార్థ ప్రయోజనాల కోసం పాక్ సైన్యానికి దాసోహం అంటున్నారని తెలిపారు. కరాచీ, బలూచిస్తాన్లలో ఆర్మీ తన కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. మొహజిర్, బలూచ్ నాయకత్వాలతో చర్చలు జరిపి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అలా కాకుండా, సైనిక చర్యలు కొనసాగితే దేశం నాశనం కావటం ఖాయమని పేర్కొన్నారు. సైన్యం, ఐఎస్ఐ కుమ్మక్కై తీవ్రవాదులకు ఆశ్రయం, రక్షణ కల్పిస్తూ పొరుగు దేశాల్లో ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నాయని ఆరోపించారు. ఒసామా బిన్ లాడెన్ లాంటి అంతర్జాతీయ తీవ్రవాదులకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐలు అండగా నిలబడి అనేక ఏళ్ల పాటు రక్షణ కల్పించాయని కూడా తెలిపారు. కాగా, అల్తాఫ్ హుస్సేన్ గత కొన్నేళ్లుగా లండన్‌లో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. -
పాక్‌పై తీవ్ర ఆరోపణలు.. పెను దుమారం
ఇస్లామాబాద్: పొరుగు దేశాలవారే కాదు.. సాక్షాత్తు మాతృదేశానికి చెందినవారు సైతం పాకిస్థాన్‌పై తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నారు. పాక్ ప్రపంచానికే క్యాన్సర్ అని, పెద్ద తలనొప్పి అని ఆ దేశానికి చెందిన ముత్తాహిదా కువామి మూమెంట్(ఎంక్యూఎం) పార్టీ చీఫ్ వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ అన్నాడు. అలాగే, ఉగ్రవాదానికి కేంద్ర బిందువు కూడా పాకిస్థానే అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో పాక్ లో పెద్ద దుమారం చెలరేగింది. మాతృదేశంపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయనను ఇక పార్టీ నుంచి పంపించేస్తున్నామని, ఇప్పటి నుంచి అల్తాఫ్ ఆదేశాలను తాము పాటించబోమంటూ ఎంక్యూఎం పార్టీ డిప్యూటీ కన్వీనర్ ఫరూక్ సత్తార్ ప్రకటించాడు. అసలేం జరిగిందంటే.. 25 ఏళ్ల కిందట ఎంక్యూఎం పార్టీని అల్తాఫ్ హుస్సేన్ స్థాపించాడు. అప్పటి నుంచి పార్టీని తన గుప్పిట్లో ఉంచుకొని మనుగడ సాగిస్తున్న అల్తాఫ్ ఇటీవల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన పార్టీకి చెందినవారికి ఇబ్బందులు కలిగించడం, అక్రమ అరెస్టులు చేయడం, వారిపై పోలీసులు వేధింపులకు పాల్పడటం వంటి సంఘటనలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం అల్తాఫ్ అమెరికాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సోమవారం కరాచీలో జరిగిన ఓ సదస్సులో ఫోన్ ద్వారా మాట్లాడుతూ పాక్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. 'పాకిస్థాన్ మొత్తం ప్రపంచానికి ఒక క్యాన్సర్ మహమ్మారి, పెద్ద తల నొప్పి. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్ర బిందువు పాకిస్థానే' అని ఫోన్ ద్వారా స్పీచ్ ఇచ్చారు. దీనిపై సర్వత్రా వెల్లువెత్తాయి. ఈ మాటలు విని ఉలిక్కిపడిన పార్టీ ఇతర నేతలు ఇక ఆయనతో పని లేదని, పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, అల్తాఫ్ ఆదేశాలు ఇక వినబోమని తెగేసి చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ కు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ రేంజర్స్ క్షమాపణలు చెప్పారు. తన పార్టీపై, తన పార్టీ కార్యకర్తలపై వేధింపులు ఎక్కువైన నేపథ్యంలోనే మానసిక ఒత్తిడికి లోనై తాను అలా నోరు జారానని, తనను క్షమించాలని కోరాడు. ఈ వివరణపై స్పందించిన పార్టీ డిప్యూటీ కన్వీనర్ ఫరూక్ సత్తార్.. ముందు తాను ఒత్తిడిలో ఉన్నానని చెప్పిన తర్వాతే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిందని అన్నారు. -
లండన్‌లో పాక్ నేత అల్తాఫ్ హుస్సేన్ అరెస్ట్
లండన్: పాకిస్థాన్‌కు చెందిన ప్రఖ్యాత రాజ కీయ నాయకుడు అల్తాఫ్ హుస్సేన్‌ను అక్రమ ద్రవ్య చెలామణి ఆరోపణలపై మంగళవారం లండన్‌లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హుస్సేన్ పాక్‌లోని ముత్తహిద ఖ్వామీ మూవ్మెంట్(ఎంక్యూఎం) పార్టీ అధినేత. పాక్‌లో అతిపెద్దదైన కరాచీ నగరంపై ఆయనకు, ఎంక్యూఎంకు గట్టి పట్టుంది. అల్తాఫ్ అరెస్ట్ వార్త వ్యాపించడంతో కరాచీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోల్ బంక్‌లు, బ్యాంకులు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. లండన్‌లోని ఒక గృహ సముదాయంలో 60 ఏళ్ల వ్యక్తిని మనీ లాండరింగ్ చేస్తున్నాడన్న సమాచారంతో అరెస్ట్ చేశారు.