ambarise
-
బాధ కాదు బాట చూడాలి..
బెంగళూరుకు చెందిన వీణా అంబరీష బస్సు ప్రమాదంలో కుడి కాలిని కోల్పోయింది. ఆ తరువాత డిప్రెషన్ బారిన పడింది. ఆ చీకటి నుంచి అతి కష్టం మీద బయటపడి అర్ధంతరంగా ఆగిపోయిన చదువును కొనసాగించింది. ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘కరీ దోశ’ పేరుతో ఫుడ్ స్టాల్ ప్రారంభించి తన కాళ్ల మీద తాను నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది వీణా అంబరీష. కొన్ని సంవత్సరాల క్రితం.. భరతనాట్యం డ్యాన్సర్ అయిన వీణ తన ఆరంగేట్రం కోసం సన్నాహాలు చేసుకుంటోంది. కాలేజీకి వెళ్లడానికి రోడ్దు దాటుతున్నప్పుడు బస్సు ఢీకొట్టడంతో ప్రమాదానికి గురై కుడికాలు కోల్పోయింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన తరువాత వాకింగ్ స్టిక్‌తో నడవడం మొదలు పెట్టింది. చాలా కష్టంగా అనిపించేది. భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్న వీణ తనకు జరిగిన ప్రమాదాన్ని జీర్ణించుకోలేపోయింది. కలల రెక్కలు విరిగిన బాధ ఆమె కళ్లలో కన్నీరై కనిపించేది. ‘నాకు ఇలా జరిగిందేమిటి!’ అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల వీణ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్లిందంటే.. ‘ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదు’ అని బలంగా అనుకునేంతగా. అయితే వీణ తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక దృశ్యం కారణం అయింది. ఆ దృశ్యం తనకు వేకప్–కాల్‌గా పనిచేసింది. ఫిజికల్ డిజేబిలిటీ సర్టిఫికెట్ తీసుకోవడానికి విక్టోరియా హాస్పిటల్‌కు వెళ్లిన వీణ అక్కడ ఒక మహిళను చూసింది. ఆమెకు రెండు కాళ్లు లేవు. ఆమె తన బిడ్డను లాలిస్తూ బువ్వ తినిపిస్తోంది. ఒక క్షణం ఆమె ముఖం వైపు చూసింది వీణ. రవ్వంత బాధ కూడా ఆమె ముఖంలో కనిపించలేదు. జీవనోత్సాహంతో ఆ ముఖం వెలిగిపోతోంది. తాను ఏవైతే పెద్ద సమస్యలు అనుకుంటుందో అవి గాలిలో దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఈ ఒక్క దృశ్యం వీణ ఆలోచనలో పూర్తిగా మార్పు తీసుకువచ్చింది. ‘ఏదో సాధించాలి’ అనే ఉత్సాహం మనసులోకి వచ్చింది. ఆగిపోయిన చదువును కొనసాగించింది. మంచి మార్కులతో పరీక్షలు పాసైంది. ఆ తరువాత ఎంబీఏ పూర్తి చేసింది. బ్యాంకులలో సేల్స్ ఆఫీసర్‌గా, ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ టెస్టర్‌గా పనిచేసింది. ఒకవైపు గంటల కొద్దీ చేసే ఉద్యోగం.. మరోవైపు పిల్లల ఆలనా పాలనా కష్టమనిపించింది. ఒక సౌత్ అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎడతెగకుండా జరిగే మీటింగ్‌లు, పనిభారం వల్ల కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో పదిహేను రోజులు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది వీణ. దానికి ఫిట్నెస్ ట్రెయినర్ అయిన ఆమె భర్త ప్రోత్సాహం తోడైంది. గత సంవత్సరం బెంగళూరులో ‘కరీ దోశ’ పేరుతో దోశ స్టాల్ మొదలు పెట్టినప్పుడు ‘ఎంబీఏ చదివి ఇదేమిటీ’ అన్నట్లుగా మాట్లాడారు కొద్దిమంది. వారి మాటలేవీ పట్టించుకోలేదు వీణ. ప్రత్యేకత ఉంటేనే ఫుడ్ స్టాల్ అయినా పెద్ద వ్యాపారమైనా విజయం సాధిస్తుంది. మరి ‘కరీ దోశ’ స్పెషల్ ఏమిటి? కరీ దోశే! తమిళనాడులోని మధురై ప్రాంతంలో ‘కరీ దోశ’గా పిలిచే వేడి వేడి దోశ దానిపై ఆమ్లెట్, మటన్ కీమా చాలా ఫేమస్. కరీ దోశ బెంగళూరులో కూడా హిట్ అయింది. ఈ దోశ కోసం కస్టమర్లు పొద్దున్నే లైన్ కడతారు. స్టాల్ ప్రారంభించడానికి ముందు ‘కరీ దోశ’ రుచులలో ప్రావీణ్యం సంపాదించడానికి రెండు నెలల పాటు ఇంట్లోనే ఉంది వీణ. వంటగది తన పాఠశాలగా, ప్రయోగశాలగా మారింది. ‘కరీ దోశ’ స్టాల్ పొద్దున ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అందుబాటులో ఉంటుంది. ఇక మిగిలిన సమయమంతా ఇంట్లోనే పిల్లలతో గడుపుతుంది వీణ. చిరునవ్వే సందేశం.. బాధ లేనిది ఎవరికి? బాధ పడుతూ కూర్చోవడం కంటే దాని నుంచి బయటపడడానికి కొత్తబాట వెదకాలి. మనకంటే ఎక్కువ బాధలు పడుతున్న వారు, పెద్ద పెద్ద సమస్యల్లో ఉన్న వారు ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉన్నారు. అంత కష్టంలోనూ వారి పెదవి మీద కనిపించే చిరునవ్వు మనకు సందేశాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. – వీణా అంబరీష ఇవి చదవండి: World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్‌తో జాగ్రత్త! -
రగులుతున్న చిచ్చు
రోజు రోజుకూ పెరుగుతున్న వర్గపోరు రమ్య ఫిర్యాదుపై భగ్గుమన్న ‘మండ్య’ నేతలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే ఓడిందని విమర్శ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన మాపై ఆరోపణ చేస్తే ఊరుకోమంటూ హెచ్చరిక కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదాపై సీనియర్ల ఆగ్రహం సీఎంపై అధిష్టానానికి ఫిర్యాదుకు కేపీసీసీలో ఓ వర్గం వ్యూహం సాక్షి, బెంగళూరు : రాష్ర్ట కాంగ్రెస్‌లో అసమ్మతి రగులుతూనే ఉంది. రోజురోజుకూ పార్టీలో వర్గ పోరు పెచ్చుమీరుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తమ పార్టీ కన్నా బీజేపీయే అధికంగా సీట్లు సాధించడం కాంగ్రెస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీలో విభేదాలకు అద్దం పడుతోంది. తన ఓటమికి మంత్రి అంబరీషే కారణమంటూ మండ్య లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రమ్య అధిష్టా నానికి ఫిర్యాదు చేయడం.. ముఖ్యమంత్రి నిర్లక్ష వైఖరే కారణమంటూ కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ తన మద్దతుదారులతో విమర్శలు చేయిస్తుండటం ఇందుకు నిదర్శనం. మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీని సీఎం సిద్ధరామయ్య వాయిదా వేస్తుండటంపై పార్టీ నేతలు అసంతృప్తితో రగలిపోతున్నారు. రమ్య కాంగ్రెస్ అధిష్టానానికి చేసిన ఫిర్యాదులో ‘ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే మండ్య జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైతుందని...సదరు నాయకులు భావించారు. అంతేకాకుండా పార్టీ భవిష్యత్‌ను ఫణంగా పెట్టి వ్యక్తిగత ప్రయోజనం ఆశించి మంత్రి అంబరీష్, అతని అనుచరులు తెరవెనుక మంత్రాంగాన్ని నడిపి నన్ను ఓడించారు.’ అని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆరోపణలపై మండ్యకు చెందిన కాంగ్రెస్ నాయకులు శివరామేగౌడ, అమరావతి చంద్రశేఖర, ఎల్.డీ రవి తదితరులు బుధవారం బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రమ్యపై నిప్పులు చెరిగారు. తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ‘గత పార్లమెంటు ఉప ఎన్నికల్లో గెలిచిన రమ్య అనంతరం స్థానిక నాయకుల పట్ల చిన్నచూపు చూశారు. మా మాటకు ఏ మాత్రం విలువ ఇవ్వలేదు. క్షేత్ర స్థాయి కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలకూ ఆమె అందుబాటులో లేరు. ఈ కారణాల వల్లే రమ్య ఓడారు. అయితే అనవసరంగా మాపై ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక నాయకులైన మమ్మల్ని, క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ కోసం క ృషి చేసే మాపై ఇలా లేనిపోని విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం. అవసరమైతే పార్టీని వీడడానికైనా మేంసిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని కేపీసీసీ నాయకుల ద ృష్టికీ తీసుకెళ్లాం. ఇక అధిష్టానాన్ని కలిసి వాస్తవాలను వివరించే ఆలోచనలో ఉన్నాం. త్వరలో ఈ విషయంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు. సీఎం ‘వాయిదా’ మంత్రం.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీని వాయిదా వేస్తుండటంపై కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అసంత ృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విస్తరణ చేపడితే కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఒకే ఒక కారణంతో సిద్ధు విస్తరణను వాయిదా వేస్తూ నిర్లక్షం చేస్తున్నారని వారు వాపోతున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా పూర్తి స్థాయిలో మంత్రి మండలి లేకపోవడం సరికాదు. రానున్న శాసనసభ సమావేశాల్లోపు మంత్రి మండలి విస్తరణ చేపట్టక పోతే హై కమాండ్‌ను కలిసి సిద్ధు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేయడానికి కేపీసీసీలోని ఓ ప్రముఖ నాయకుడి వర్గం సిద్ధమవుతోంది.’ అని పేర్కొన్నారు.