ambedkar chowrasta
-
హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 చిరు వ్యాపారుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అరటి పండ్ల బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వాహనాలు, ఇతర దుఖాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదం..షార్ట్ సర్క్యూట్ వల్లేనని తెలుస్తోంది. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఆకట్టుకున్న ఎన్సీసీ విద్యార్థుల.. ఫ్లాష్ మాబ్..!
వరంగల్: వరంగల్‌లోని ఎంజీఎం, హనుమకొండలోని అంబేడ్కర్ జంక్షన్లలో శుక్రవారం నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ఆకట్టుకుంది. ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 కార్యక్రమంలో భాగంగా ‘జాయిన్ ది ఫైట్ ఫర్ గార్బేజ్ ఫ్రీ సిటీస్’ అంశంపై ఫ్లాష్‌మాబ్ కొనసాగింది. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ, ఎంజీఎం ఒకేషనల్, ఎల్బీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి నృత్యాలు చేశారు. ఈసందర్భంగా కార్పొరేషన్ సీఎంహెచ్ఓ రాజేశ్ మాట్లాడుతూ.. ఈనెల 17న మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఫ్లాష్ మాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఈఈ సంజయ్, సూపరింటెండెంట్ దేవేందర్, ఎస్ఐలు శ్యాంరాజ్, వెంకన్న, గొల్కొండ శ్రీను, భీమయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
నోటుకు ఓటు అమ్ముకోవద్దు
కందుకూరు, న్యూస్‌లైన్:: ఎన్నికల్లో విచ్చలవిడిగా ధనం ఖర్చు చేయడం.. డబ్బున్న వాళ్లకే రాజకీయాల్లో ప్రాధాన్యం పెరగడం. ఆదర్శాలు, ఆశయాలు కేవలం మాటలకే పరిమితం కావడం.. ప్రజల్ని నాయకులు తప్పుదోవ పట్టించి తమ పబ్బం గడుపుకొంటున్నారని.. ఓటర్లు సైతం నోటుకు ఓటు అమ్ముకుంటున్నారనే విషయమై ఆయన ఎంతగా ఆవేదనకు గురయ్యారో ఈ చిత్రమే నిదర్శనంగా నిలుస్తోంది. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కందుకూరు జెడ్పీటీసీ అభ్యర్థి పూలగాజుల జంగయ్య వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేశారు. నోటుకు ఓటు అమ్ముకునే సంప్రదాయాన్ని పారదోలాలంటూ మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్, మహాత్మా జ్యోతీరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్ సిద్ధాంతాల సాధన కోసమే తాను జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కును డబ్బుకు అమ్ముకుంటే తమను తాము మోసం చేసుకున్నట్లేనన్నారు. జనరల్ కోటాలో ప్రతి ఒక్కరూ పోటీ చేయవచ్చన్నారు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తాను జెడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలో ఉన్నానని.. అల్మరా గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన వేడుకున్నారు. జంగయ్యకు మద్దతుగా నాయకులు ఢిల్లీ రాములు ముదిరాజ్, గండు ఈశ్వర్ మాదిగ, సత్తయ్య పాల్గొన్నారు.