Amma Makkal Munnetra Kazhagam
-
ఓ వైపు ఆహ్వాన ఏర్పాట్లు, మరో వైపు టెన్షన్
సాక్షి, చెన్నై: చిన్నమ్మను ఆహ్వానించేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఏర్పాట్లలో మునిగిన నేపథ్యంలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలు ఆ శిబిరంలో ఉత్కంఠను రేపాయి. జైలులో చిన్నమ్మ జ్వరంతో బాధపడుతున్నట్టు, ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన సమాచారంతో ఆ శిబిరంలో కలవరం బయలుదేరింది. జైలు నుంచి శశికళ బయటకు వచ్చినా, అన్నాడీఎంకేకు ఢోకా లేదని, అమ్మ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్షా కాలం ముగియడంతో ఈనెల 27న శశికళ జైలు నుంచి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఆమెకు ఆహా్వనం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఏర్పాట్లలో మునిగాయి. హొసూరు నుంచి చెన్నైకి కాన్వాయ్ రూపంలో ర్యాలీకి నిర్ణయించారు. శశికళ కోసం పోయెస్‌గార్డెన్‌లో రూపుదిద్దుకుంటున్న భవనం ఐటీ వివాదంలో ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. టీనగర్‌లోని చిన్నమ్మ వదినమ్మ ఇలవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో తాత్కాలికంగా చిన్నమ్మకు బస ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో బుధవారం మధ్యాహ్నం చిన్నమ్మ జ్వరం బారినపడ్డ సమాచారంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల్ని కలవరంలో పడేసింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న చిన్నమ్మను బెంగళూరులోని శివాజీ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చిన సమాచారం ఉత్కంఠలో పడేసింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్టు , స్వల్ప శ్వాస సమస్య తలెత్తినట్టుగా జైళ్ల శాఖ వర్గాలు పేర్కొనడం కాస్త ఊరట. -
శశికళ విడుదల ఖాయం
సాక్షి, చెన్నై: జనవరి 27న జైలు జీవితం నుంచి చిన్నమ్మ శశికళ బయటకు రావడం ఖాయం అని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆమెకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ శిక్షా కాలం జనవరిలో ముగియనున్న విషయం తెలిసిందే. ఆమె ముందుగానే విడుదల అవుతారన్న ప్రచారం సాగినా, అందుకు తగ్గ పరిస్థితులు కనిపించలేదు. తన ముందస్తు విడుదల విషయంగా శశికళ చేసుకున్న విజ్ఞప్తిని కర్ణాటక జైళ్లశాఖ వర్గాలు పరిశీలనలో ఉంచాయి. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ ముందుస్తుగాకాదు అని, శిక్షాకాలం ముగియగానే జనవరి 27న విడుదల కావడం తథ్యమని, ఇందులో మార్పు ఉండదని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు తాజాగా ధీమా వ్యక్తం చేసే పనిలో పడ్డాయి. చదవండి: నో పార్టీ.. ఓన్లీ సేవ మంగళవారం చిన్నమ్మ రాక గురించి చెన్నైలోని కార్యాలయంలో ఆ కళగం వర్గాలు సమావేశం కావడం, ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టడం గమనించదగ్గ విషయం. జనవరి 27న చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం ఖాయమని, నేరుగా మెరీనా తీరానికి వెళ్లి అమ్మ జయలలిత సమాధి వద్ద శపథం చేయనున్నారని, ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్తారని ఆ కళగం నేత ఒకరు పేర్కొన్నారు. చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో 65 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లకు నిర్ణయించామని, ఇందుకు తగ్గ ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. మరో 28 రోజుల్లో చిన్నమ్మ బయటకు వస్తారని, ఇది జరిగి తీరుతుందని ఆ నేత ధీమా వ్యక్తంచేశారు. -
జనవరి 27న శశికళ విడుదల!
సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో నాలుగేళ్ల శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె విడుదల విషయంగా కొంత కాలంగా రక రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ముందుగానే ఆమె విడుదల అవుతారన్న చర్చ జోరుగానే సాగినా, అందుకు తగ్గ దాఖలాలు కనిపించలేదు. అలాగే, శిక్షా కాలం ముగిసినా, జైలులో లగ్జరీ వ్యవహారం ఆమె మెడకు చుట్టుకోవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇవన్నీ ఊహాజనితాలే అని పేర్కొనే రీతిలో శిక్షా కాలం ముగియగానే చిన్నమ్మ జయలలిత జైలు నుంచి బయటకు రావడం ఖాయం అవుతోంది. ఇందుకు తగ్గ వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చింది. (చదవండి : రూ.300 కోట్ల శశికళ ఆస్తుల జప్తు?) విడుదల ఖాయమేనా? బెంగళూరుకు చెందిన నరసింహమూర్తి చిన్నమ్మ శశికళ విడుదల సమాచారాన్ని సేకరించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆయన చేసుకున్న విజ్ఞప్తికి బెంగళూరు జైళ్ల శాఖ వర్గాలు వివరాల్ని సమర్పించాయి. శశికళ జైలుకు వచ్చిన వివరాలు, ఆమె శిక్ష కాలం ముగింపు గురించి పేర్కొంటూ, జరిమాన రూ. పది కోట్లు చెల్లించిన పక్షంలో జనవరి 27న విడుదల అవుతారని ప్రకటించారు. ఒక వేళ జరిమానా చెల్లించని పక్షంలో 2022 ఫిబ్రవరి 27న విడుదల అవుతారని సూచించారు. ఈ సమాచారంతో చిన్నమ్మ సేనల్లో ఆనందం తాండవిస్తోంది. చిన్నమ్మ విడుదల కావడం ఖాయమని, ఇక, తమకు మంచి రోజులు వచ్చినట్టే అని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, చిన్నమ్మ న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ పేర్కొంటూ, శిక్షా కాలం ముగిసినానంతరం జనవరి 27న ఆమె విడుదల అవుతారని ఇది వరకే తాను పేర్కొన్నట్టు గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం ఆమె ముందే విడుదలకు అవకాశం ఉందన్నారు. గతంలో జైలులో ఉన్న రోజుల లెక్కింపు, సత్ ప్రవర్తన విషయంగా పరిస్థితులు అనుకూలించిన పక్షంలో అక్టోబర్‌లోనే జైలు నుంచి విడుదల అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. -
తమిళనాట పోలీసు కాల్పులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ఓటర్లకు పంచేందుకు దాచిన నగదును అధికారులు స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. అధికారుల తనిఖీల్లో రూ.1.48 కోట్ల నగదు పట్టుబడింది. ఈ ఘటనలో టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మ మక్కల్ మున్నెట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. తమిళనాడులో 38 ఎంపీ స్థానాల పోలింగ్తోపాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉన్నాయి. తేని జిల్లా ఆండిపట్టి అసెంబ్లీ స్థానం వాటిలో ఒకటి. ఆండిపట్టిలో ఓటర్లకు పంచేందుకు ఏఎంఎంకే నాయకులు రూ. 2 కోట్లను ఏప్రిల్ 16న పట్టణానికి తీసుకొచ్చి ఓ నేత ఆఫీస్‌లో దాచారు. డబ్బును అనేక ప్యాకెట్లలోకి చేర్చి, ఏ ప్యాకెట్‌ను ఏ వార్డుకు పంపాలో రాశారు. సమాచారం అందుకున్న ఆదాయపు పన్ను విభాగం (ఐటీ), ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం పొద్దుపోయాక అక్కడికి చేరుకుని సోదాలు చేసేందుకు ప్రయత్నించారు. ఏఎంఎంకే కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు డబ్బు దాచిన కార్యాలయం తలుపులు పగులగొట్టి నగదును తీసుకెళ్లిపోతుండటంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. రూ. 2 కోట్లలో కార్యకర్తలు రూ. 52 లక్షలు తీసుకెళ్లగా, రూ. 1.48 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
సీఎం అయ్యేందుకు పన్నీర్‌సెల్వం కుట్ర
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సంచలన ప్రకటన చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామిని పదవి నుంచి తప్పించేందుకు డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. చెన్నైలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతేడాది జూలై 12న ఓ మిత్రుడి చొరవతో తనను పన్నీర్‌సెల్వం కలుసుకున్నారని దినకరన్ తెలిపారు. ఈ సందర్భంగా తనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రతిపాదించారని వెల్లడించారు. ‘ఇద్దరం కలిసి పళనిస్వామిని అధికారం నుంచి దించేద్దాం’ అని తనతో చెప్పారన్నారు. కేవలం పళనిస్వామిని తప్పించి సీఎం పీఠం ఎక్కాలన్న అత్యాశతో పన్నీర్‌సెల్వం తనను కలిశారని విమర్శించారు. గత నెలలో మరోసారి తనను కలిసేందుకు పన్నీర్‌సెల్వం యత్నించగా, తాను అంగీకరించలేదని చెప్పారు. 2017లో జరిగిన సమావేశం సందర్భంగా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళపై తిరుగుబాటు చేసినందుకు ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. పన్నీర్‌సెల్వం తనను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ విషయాలను బయటపెట్టాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయమై పన్నీర్‌సెల్వంను మీడియా ప్రశ్నించగా..‘అదంతా గడిచిపోయిన కథ‘ అంటూ క్లుప్తంగా జవాబిచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఏకమయ్యాం.. రాష్ట్రాభివృద్ధి కోసమే పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమయ్యాయని మంత్రి తంగమణి అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వీలుకాకపోవడంతో ప్రజలు, పార్టీలో గందరగోళం సృష్టించేందుకు దినకరన్ కొత్త నాటకాలు మొదలెట్టాడని ఆరోపించారు. 18 మంది దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కేసులో విజయం సాధిస్తామని అన్నాడీఎంకే నేత మురుగవేల్ అన్నారు. -
దినకరన్ ఇంటిపై దాడి
సాక్షి, చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత, ఎమ్మెల్యే దినకరన్ ఇంటిపై ఆదివారం మధ్యాహ్నం పెట్రో బాంబు దాడికి యత్నం జరిగింది. ఈ ఘటనలో బాంబు విసిరిన వ్యక్తి సహా నలుగురు గాయపడ్డారు. చెన్నై బీసెంట్‌నగర్‌లో దినకరన్ నివాసం ఉంది. ఇటీవల పార్టీ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాంచీపురంనకు చెందిన పరిమళన్ తన కారులో పెట్రో బాంబులతో దినకరన్ ఇంటికి వచ్చాడు. కారును ఆపి, అందులో ఉన్న పెట్రో బాంబును దినకరన్ ఇంట్లోకి విసిరే యత్నం చేశాడు. అయితే, అది చేజారి కారులోనే పడింది. దీంతో అందులోని మిగతా పెట్రో బాంబులు అంటుకుని పేలడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న దినకరన్ వాహన డ్రైవర్, ఫొటోగ్రాఫర్, ఆటోడ్రైవర్ గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దినకరన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: అన్నాడీఎంకే బహిష్కృత నేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన ఇటీవల స్థాపించిన కొత్త పార్టీ గుర్తు, పార్టీ పేరు ఉపయోగించొద్దని దినకరన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దినకరన్ పార్టీ గుర్తు, పేరుపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మరోవైపు తాను స్థాపించింది రాజకీయ పార్టీ కాదని, తాత్కాలికంగా చేసుకున్న ఒక ఏర్పాటు మాత్రమేనని స్వయంగా దినకరన్ చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీని ఇటీవల స్థాపించారు. మదురై జిల్లా మేలూరులో నిర్వహించిన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. పైన నలుపు, మధ్యలో తెలుపు, కింది భాగంలో ఎరుపు, మధ్యలో దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత ఫొటోతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ తొలి సమావేశాన్ని ఈనెల 24వ తేదీన తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నట్లు దినకరన్ ప్రకటించారు. ఎంజీఆర్, జయలలిత సారథ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని సాధించి తీరుతామని, అప్పటి వరకు ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ పేరుతో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బహిష్కృతులైన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు దినకరన్‌కు మద్దతుగా ఉండటం గమనార్హం. -
చిన్నమ్మ చిరాకు
సాక్షి, చెన్నై: టీటీవీ దినకరన్ కొత్తగా స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’పై శశికళ చిరాకు పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్బావ సభలో దినకరన్ తనను తాను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా శశికళను ప్రస్తావించడం, అడయారులోని దినకరన్ ఇంటినే పార్టీ చిరునామాగా చూపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టే ఆలోచన లేదని ఈ ఏడాది జనవరి 17వ తేదీన నీలగిరిలో ప్రకటించిన దినకరన్ అకస్మాత్తుగా పార్టీని ప్రకటించడం వెనుక అంతరార్థం ఏమిటని చిన్నమ్మ సన్నిహితుల వద్ద ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీ పెట్టడంతో ఎంజీఆర్ సినిమాల్లో విలన్లా అన్నాడీఎంకేను, పార్టీ చిహ్నాన్ని ఎడపాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గానికి దినకరన్ అప్పగించినట్లయిందని శశికళ కోపగించుకున్నట్టు తెలుస్తోంది. దినకరన్ పార్టీ పెట్టడం శశికళ కుటుంబంలోని పలువురు సభ్యులకు కూడా ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు దినకరన్ పార్టీలో అప్పుడే అసంతృప్తి చెలరేగింది. ద్రవిడ సిద్ధాంతాలను, అన్నాదురైకి తగిన స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ సీనియర్ నేత నాంజిల్ సంపత్ శనివారం పార్టీ నుంచి తప్పుకున్నారు. -
దినకరన్‌కు సీనియర్ నేత ఝలక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కొత్తగా స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’లో ద్రవిడ సిద్ధాంతాలను, అన్నాదురైకి తగిన స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ సీనియర్ నేత నాంజిల్ సంపత్ వైదొలిగారు. మరే పార్టీలో చేరనని, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటునానని తెలిపారు. నాంజిల్తోపాటు మరికొందరు దినకరన్ అనుచర నేతలు సైతం అదేరకమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమిళ ప్రజలు ఎంతో ఆదరించి అభిమానించే ద్రవిడ సిద్ధాంతాలు, అన్నాదురైకి చోటు లేకుండా కేవలం జయలలిత బొమ్మతో నెగ్గుకురావడం అసాధ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. అమ్మను అవమానిస్తున్నారు: దినకరన్ తన పార్టీ పతాకంలో జయలలిత బొమ్మవేయడాన్ని తప్పుపడుతూ పార్టీ నుంచి వైదొలగడం ద్వారా నాంజిల్ సంపత్ అమ్మను అవమానించాడని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆయన ఎంతో సీనియర్ డీఎంకే, ఎండీఎంకేల నుంచి అన్నాడీఎంకేలో చేరినవారన్నారు. ఇపుడే తానేదో పచ్చి అబద్ధాలు చెబుతున్నానని చెప్పడాన్ని అంగీకరించనని అన్నారు. పార్టీ ఏర్పాటు, పేరు నిర్ణయాన్ని అందరితోనూ చర్చించలేనని స్పష్టం చేశారు. ప్రజలు ఏం కొరుకుంటున్నారో అదిమాత్రమే తాను చేయగలనని అన్నారు. పార్టీ తొలి సమావేశాన్ని ఈనెల 24వ తేదీన తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నట్లు దికరన్ ప్రకటించారు.