AMNS
-
హాజీరా స్టీల్ ప్లాంటు పనులు వేగవంతం
అహ్మదాబాద్: హాజీరా ఉక్కు ప్లాంటు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆర్సెలర్‌మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్ తెలిపారు. ఇది 2026 నాటికల్లా అందుబాటులోకి రాగలదని ’వైబ్రెంట్ గుజరాత్’ సదస్సు 20 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 20,000 మంది పైచిలుకు వర్కర్లు పాలుపంచుకుంటున్నారని మిట్టల్ చెప్పారు. ఆర్సెలర్‌మిట్టల్‌లో భాగమైన ఏఎంఎన్ఎస్ ఇండియా గతేడాది అక్టోబర్‌లో హాజీరా ప్లాంటు సామరŠాధ్యలను 15 మిలియన్ టన్నులకు పెంచుకునేందుకు రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తొలి దశలో ఉత్పత్తిని రెట్టింపు చేయాలని, ఆ తర్వాత మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు మిట్టల్ చెప్పారు. భారత్ దిగుమతులను తగ్గించుకుని, స్వావలంబన సాధించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడం భారత్ ఖ్యాతిని మరింతగా ఇనుమడింపచేసిందని మిట్టల్ చెప్పారు. అటు, గుజరాత్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి, పెట్టుబడుల రాకకు ఇన్వెస్టర్ల సదస్సు ఎంతగానో ఉపయోగపడుతోందని వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వెల్స్పన్ సంస్థ చైర్మన్ బీకే గోయెంకా తెలిపారు. సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్‌పై కసరత్తు చేసేందుకు జపానీస్ వ్యాపార బృందాన్ని నవంబర్‌లో ఆహా్వనించే యోచనలో ఉన్నట్లు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ తకాషి సుజుకీ తెలిపారు. తదుపరి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు వచ్చే ఏడాది జనవరి 10–12 మధ్య గాంధీనగర్‌లో నిర్వహించనున్నారు. -
వైజాగ్ స్టీల్‌పై ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్)పై ప్రైవేట్ రంగ ఉక్కు దిగ్గజం ఏఎంఎన్ఎస్ ఇండియా (ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్) సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఐఎన్ఎల్ కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, కంపెనీ మాత్రం ఈ విషయం ్ర«ధువీకరించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏఎంఎన్ఎస్ మాతృ సంస్థ ఆర్సెలర్‌మిట్టల్ చైర్మన్ లక్ష్మి నివాస్ మిట్టల్ భేటీ అవుతున్నట్లు ఏఎంఎన్ఎస్ గురువారం ట్వీట్ చేసింది. అయితే, సమావేశ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్‌పై కంపెనీ దృష్టి పెట్టిందన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గుజరాత్‌లోని ఏఎంఎన్ఎస్ ఇండియాలో ఆర్సెలర్‌మిట్టల్‌కు 60 శాతం, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌కు 40 శాతం వాటాలు ఉన్నాయి. వైజాగ్ స్టీల్‌పై ఆసక్తిగా ఉన్నట్లు దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. తూర్పు తీరంలో ఉన్న ఆర్ఐఎన్ఎల్ కొనుగోలు చేస్తే ఆగ్నేయాసియా మార్కెట్లలోకి మరింత చొచ్చుకుపోయేందుకు వీలుంటుందని భావిస్తున్నట్లు టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ ఇటీవల తెలిపారు. వైజాగ్ స్టీల్‌లో 100 శాతం వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. -
మహాకూటమిలోకి ఎమ్మెన్నెస్‌ను చేర్చుకోవడంపై మోడీ దృష్టి
సాక్షి, ముంబై: వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇప్పటినుంచే రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించింది. అధికారమే లక్ష్యంగా చేసుకొని ప్రణాళికలు రూపొందిస్తోంది. మూడుసార్లు అధికారానికి దూరంగా ఉన్న కాషాయ కూటమి ఈసారి విజయమే లక్ష్యంగా చేసుకొని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ)ని చేర్చుకొని మహాకూటమిగా అవతరించింది. ఇప్పటికే ఈ కూటమి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలతో పాటు అవినీతిపై ఆందోళనలు కూడా చేసింది. ప్రజల్లో కొంత క్రేజీ సంపాదించుకున్న ఈ మహాకూటమిలో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీని చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలెట్టింది. గత ఎన్నికల్లో శివసేన, బీజేపీల అత్యధిక శాతం ఓట్లు చీల్చి అధికారానికి దూరంగా ఉంచేలా చేసిన ఎమ్మెన్నెస్‌ను కలుపుకుంటే ఈసారి మరింత బలపడొచ్చని ఆశలు పెట్టుకుంది. ఇందుకోసం బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖ నాయకులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఒక వేళ ఈ ప్రయత్నాలు సఫలీకృతమైతే వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో మహాకూటమితో ఎమ్మెన్నెస్ కూడా జతకట్టి బరిలోకి దిగే అవకాశముంది. ఇదేగనుక జరిగితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీల డీఎఫ్ కూటమిని అధికార గద్దె దింపడానికి మార్గం మరింత సులభం కానుంది. గత ఎన్నికల్లో శివసేన, బీజేపీల అత్యధిక శాతం ఓట్లు ఎమ్మెన్నెస్ చీల్చింది. ఎమ్మెన్సెస్ అభ్యర్థులు లక్షాకుపైగా ఓట్లు రాబట్టుకున్నారు. దీంతో శివసేన, బీజేపీలకు తగిన మెజారిటీ రాలేదు. ఫలితంగా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా ముంబైలో ఈ పార్టీ తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు అభ్యర్థులు, ఎన్సీపీకి చెందిన కొందరు అభ్యర్థులు కేవలం ఐదు నుంచి 10 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ మహాకూటమితో పొత్తు పెట్టుకుంటే గత ఎన్నికల పరిస్థితులతో పోలిస్తే పూర్తిగా తారుమారుకావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ మహాకూటమి నాయకులు లోక్‌సభ స్థానాలు చాలా తక్కువగా ఇచ్చే అవకాశాలున్నాయని ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. దీంతో ఎమ్మెన్నెస్ రాష్ట్రంలో సొంతంగా బరిలో దిగకూడదని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు వేర్వేరుగా బరిలో దిగుతాయా..? లేక పొత్తు పెట్టుకుంటాయా..? అనే అంశం ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఇలాంటి కీలక సందర్భంలో మహాకూటమికి ఎమ్మెన్నెస్ లాంటి ధీటైన పార్టీ తోడు దొరికితే కాంగ్రెస్, ఎన్సీపీలను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇబ్బందుల్లోకి నెట్టేందుకు మార్గం సులభమవుందని మోడీ నమ్ముతున్నారు. రాజ్‌ఠాక్రేతో మరింత సన్నిహిత్యం ఉండటంతో తొందరగానే పొత్తు విషయం తెలుతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత రెండు దశాబ్ధాలుగా శివసేన, బీజేపీ కూటములుగా కొనసాగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి మోడీ చేస్తున్న ప్రయత్నాలపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఎంతవరకు సహకరిస్తారనే అనుమానాలు బీజేపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
మారుతున్న వ్యూహాలు
సాక్షి, ముంబై: శివసేన నాయకులు సంజయ్ ఘాడి, మాజీ కార్పొరేటర్ రాజా చౌగులే మహారాష్ట్ర నిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో సోమవారం భేటీ అయ్యారు. దీంతో వారిద్దరు ఎమ్మెన్నెస్‌లో మళ్లీ చేరనున్నారన్న వార్తలకు బలం చేకూరింది. గత కొన్ని రోజులుగా సంజయ్ ఘాడి, రాజా చౌగులే శివసేనను వీడి ఎమ్మెన్నెస్‌లో చేరనున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారికంగా ఇప్పటి వరకు ఎవరూ అధికారిక ప్రకటన చేయకపోయినా, ఠాక్రే నివాస స్థానమైన కృష్ణకుంజ్కు ఇద్దరూ వెళ్లి భేటీ అయ్యారు. ఎమ్మెన్నెస్‌కు చెందిన వీరిద్దరు గతంలో ఈ పార్టీలో ప్రాధాన్యం లభించడం లేదని ఆరోపిస్తూ శివసేనలో చేరారు. 2007లో చౌగులే, 2009లో అసెంబ్లీ ఎన్నికల్ల సీటు ఇవ్వలేదన్న కోపంతో ఘాడీ శివసేన తీర్థం పుచుకున్నారు. ఇప్పుడు శివసేనలో ప్రాధాన్యం లేదంటూ వీరిద్దరు దసరాను పురస్కరించుకుని అధికారికంగా ఎమ్మెన్నెస్‌లో చేరనున్నట్టు సమాచారం. శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి సైతం పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు ఇటీవల బహిరంగంగానే ప్రకటించారు. ఎంపీ టికెట్‌పై హామీ ఇవ్వకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అయితే తాను పార్టీ వీడే ప్రసక్తే లేదని ప్రకటించారు. అసంతృప్తి కారణంగా గతంలో పార్టీ వీడిన వారిని తిరిగి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది వరకే ఒకరిద్దరు సొంతగూటికి వచ్చారు. -
రాజ్ పంచన మనోహర్ జోషీ?
సాక్షి, ముంబై: దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉన్న శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ పెద్ద ఎత్తున వదంతులు వస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి మనోహర్ జోషీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఆయననే బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. దీనికి ఊతమిచ్చే విధంగా రెండు నెలలక్రితం చర్చలు కూడా జరిగాయి. అయితే వినాయకచవితి ఉత్సవాల్లో ఒక్కసారిగా దక్షిణ ముంబైలో రాహుల్ శెవాలే పోస్టర్లు భారీగా దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కయిన మనోహర్ జోషీ, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. అనంతరం మనోహర్ జోషీ మీడియాకు చెప్పిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇంకా దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపాలనేది పార్టీ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ నియోజకవర్గంతోపాటు ఠాణే, కళ్యాణ్ లోకసభ నియోజకవర్గం నుంచి దేన్ని కేటాయించినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను రాహుల్ శెవాలేకు ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్టు ఆయన మాటల ద్వారా అందరికీ తెలిసింది. దీన్నిబట్టి మనోహర్ జోషీ అసంతృప్తితో మాట్లాడారని, ఒక అడుగు వెనక్కివేసినట్టు అందరూ భావించారు. అయితే తాజాగా ఆయన ఎమ్మెన్నెస్బాటలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మనోహర్ జోషి, శివసేన పార్టీ నాయకులు ఎలా స్పందించనున్నారనేది తొందర్లోనే తేలనుంది.