AMVI
-
ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి
సాక్షి, గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండలం గామలపాడు వద్ద గల ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం దాడి చేశారు. లెక్కల్లో చూపని 72 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్‌తో పాటు మరో నలుగురు రవాణా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆర్టీఏలో అర్ధరాత్రి ‘వసూల్ రాణి’
వరంగల్: ఆమె రోడ్డెక్కిందంటే ఆ రహదారిలో వెళ్లే వాహనదారులకు హడల్.. పెన్ను పట్టిందంటే చాలు.. రాసే ఫైన్ 50 వేల రూపాయలపైనే. అయితే ఈ ఫైన్ కేవలం రశీదు కావాలని అడిగిన వ్యక్తులకే మాత్రమే. అదే రశీదు అక్కర్లేదనుకుంటే అందులో సగం డబ్బులు ఆమె చేతిలో పెడితే చాలు వాహనాన్ని వదిలేస్తారు. లేదంటే ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి ఫైన్ మొత్తం కట్టాల్సిందే. ఆమె గురించి తెలిసిన వాహనదారులు అంత మొత్తం డబ్బులు కట్టలేక.. ఫైన్‌లో సగం డబ్బులు చెల్లించి బతుకు జీవుడా అంటే తమ బండ్లు తీసుకెళుతున్నారు. సదరు అధికారిణి మామునూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై అక్రమ వసూళ్లకు పాల్పడుతూ వాహనదారులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన ప్రస్తుతం ఆర్టీఏలో హాట్‌టాపిక్‌గా మారింది. వరంగల్ రవాణాశాఖలో ఏఎంవీఐగా పనిచేస్తున్న సదరు అధికారిణి శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లింది. తిరిగి అర్ధరాత్రి తన అద్దె వాహనంలో డ్రైవర్, ఆనుచరులతో కలిసి వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్ధరాత్రి వరకు తిష్టివేసింది. మామునూరు గ్రామశివారులో రహదారి నుంచి వెళ్లే వాహనాలను ఆమె ఆపి తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు పలు సాకులు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. కిలోమీటర్ మేర లారీలతోపాటు పలు రకాల వాహనాలు నిల్చిపోగా వందలాది వాహనదారులు మాముళ్లు సమర్పించుకున్నారు. పెనాల్టీ కట్టినట్లుగా రశీదు కావాలని నిలదీసిన వాహనదారుల పై ఆ మహిళా అధికారి మండిపడ్డారు. వాహనాల తాళం చెవులు లాక్కోవడమేగాక వాహనాలను సీజ్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఆ మహిళా అధికారిని ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఎస్కె సైదులు ఆమె సమక్షంలోనే అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా వసూళ్ల దందా నడుస్తుండగా ఓ మీడియాకు సమాచారం అందింది. వారు రంగంలోకి దిగడంతో సదరు అధికారిని గమనించి ప్రైవేట్ డ్రైవర్‌తోపాటు అక్కడి నుంచి జారుకుంది. దీంతో బాధిత వాహనదారులు మహిళా అధికారిని ఇంట్లో పని చేసే సైదులును పట్టుకుని దేహశుద్ధి చేసి మామునూరు పోలీసులకు అప్పగించారు. ఆతడి వద్ద రూ.3 వేలు ఉండగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఓ చానల్ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎంవీఐ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న సైదులును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్సై తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత రవాణా శాఖ డీటీ సీ శివలింగయ్యకు సమాచారం అందజేశామని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై యుగంధర్ వెల్లడించారు. పోలీసు నివేదిక ఆధారంగా ఏఎంవీఐపై చర్యలు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై సదరు మహిళా ఏఎంవీఐ ఆర్ధరాత్రి అక్రమంగా మామూళ్లు వసూళ్లు చేస్తోందనే ఆరోపణలపై విచారిస్తున్నామని డీటీసీ శివలింగయ్య తెలిపారు. మామునూరు సీఐతో మాట్లాడి వివరాలు సేకరించామని, పోలీసుల నివేదికను బట్టి ఏఎంవీఐపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. - శివలింగయ్య, డీటీసీ -
చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి: ఏఎంవీఐ అరెస్ట్
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండలం పొందుర్తి ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై గురువారం తెల్లవారుజామున అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర వద్ద అక్రమంగా ఉన్న రూ.12 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం రవీంద్రను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పొందుర్తి ఆర్టీఏ చెక్‌పోస్ట్ సిబ్బంది వాహనదారుల నుంచి అధిక మొత్తంలో నగదు వసూల్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలువురు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఏసీబీ అధికారులు గురువారం తెల్లవారుజామున సదరు ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించారు. -
డ్రైవింగ్ లెసైన్స్ ఉండాల్సిందే
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: లెసైన్స్ లేకుండా వాహనాలు నడిపితే సహించేది లేదని ఉప రవాణాశాఖ కమిషనర్ (డీటీసీ) డాక్టర్ వి.సుందర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం గుంటూరు ఆర్టీవో పరిధిలోని అదనపు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు(ఏఎంవీఐలు) గుంటూరులో మూడు బృందాలుగా ఏర్పడి ద్విచక్ర వాహనాలు, కార్ల తనిఖీ నిర్వహించారు. దృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లెసైన్స్ లేని 40కిపైగా వాహనాలను ఆర్టీసీ బస్టాండ్‌కు, రవాణాశాఖ కార్యాలయానికి తరలించారు. కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు జరుగుతాయని చెప్పారు. వేసవి సెలవుల్లో మైనర్లకు వాహనాలు ఇస్తున్నారని, లెసైన్స్ లేకుండా తనిఖీల్లో పట్టుబడితే వెయ్యి రూపాయల జరిమానా విధించడంతోపాటు రెండు రోజులు వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధ పడేకంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారం రోజులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామని చెప్పారు.