ananthkumar hegde
-
BJP: వివాదాస్పదులకు మొండిచేయి
నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో బీజేపీ సిట్టింగ్ ఎంపీలకు బాగా తెలిసొస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా 370, ఎన్డీఏకు 400 పై చిలుకు లోక్‌సభ స్థానాలను కమలనాథులు లక్ష్యంగా పెట్టుకోవడం తెలిసిందే. ఆ క్రమంలో ప్రతి లోక్‌సభ స్థానాన్నీ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ‘టార్గెట్ 400’ లక్ష్యసాధనకు అడ్డొస్తారనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా క్షమించడం లేదు. ఆ క్రమంలో ఎంతటి సీనియర్లనైనా సరే, సింపుల్‌గా పక్కన పెట్టేస్తోంది. దాని ఫలితమే... వివాదాస్పదులుగా పేరుబడ్డ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేశ్ బిదురి, అనంత్‌కుమార్ హెగ్డే వంటి సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్ల నిరాకరణ! రమేశ్ బిదురి ఈ సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. నిండు సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని బిదురి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారానికి దారి తీసింది. ఆయన్నూ సస్పెండ్ చేయాల్సిందేనంటూ విపక్షాలు హోరెత్తించాయి. దాంతో రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బిదురికి టికెట్ నిరాకరించింది. అనంత్‌కుమార్ హెగ్డే కర్ణాటకలో సీనియర్ బీజేపీ నేత. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు. కేంద్ర మంత్రిగానూ చేశారు. రాజ్యాంగంలో చాలా అంశాలను మార్చాల్సి ఉందని, అందుకు బీజేపీకి ప్రజలు 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. విపక్షాలన్నీ వాటిని అందిపుచ్చుకుని బీజేపీని దుయ్యబట్టాయి. హెగ్డే వ్యాఖ్యలతో పారీ్టకి సంబంధం లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. దాంతో ఆయన నాలుగుసార్లు వరుసగా నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది. పర్వేష్ సాహిబ్‌సింగ్ ముస్లిం చిరు వ్యాపారులను పూర్తిగా బాయ్‌కాట్ చేయాలంటూ ఏకంగా ఢిల్లీలోనే బహిరంగ సభలో పిలుపునిచ్చి కాక రేపారు. సభికులతోనూ నినాదాలు చేయించారు. దాంతో పశి్చమ ఢిల్లీ సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఆయనకు కూడా ఈసారి టికెట్ గల్లంతైంది. వీరేగాక ఇతరేతర కారణాలతో ఈసారి చాలామంది సీనియర్లు, సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత దిగి్వజయ్‌సింగ్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 3.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మట్టికరిపించిన చరిత్ర ఆమెది. . కాకపోతే మంటలు రేపే మాటలకు సాధ్వి పెట్టింది పేరు. నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా అభివరి్ణంచినా, ముంబై ఉగ్ర దాడు ల్లో అమరుడైన పోలీసు అధికారి హేమంత్ కర్కరేకు తన శాపమే తగిలిందంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి ఈసీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నా ఆమెకే చెల్లింది. 195 మందితో బీజేపీ విడుదల చేసిన తొలి విడత జాబితాలో ప్రజ్ఞకు మొండిచేయి చూపారు. తాను పలు సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణమని ఆమే స్వయంగా అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఆ మంత్రిని తీసేస్తేనే సభలో కూర్చుంటాం’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని, అందుకే తాము అధికారంలోకి వచ్చామని కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కేంద్రాన్ని నిలదీశారు. సదరు మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అలా చేస్తేనే తాము సభను జరగనిస్తామని, సభలో కూర్చుంటామని స్పష్టం చేశారు. అటు లోక్‌సభతోపాటు రాజ్యసభ కూడా ఇదే విషయం పెద్ద ధుమారంగా మారింది. త్వరలోనే రాజ్యాంగంలోని లౌకిక(సెక్యులర్) అనే పదాన్ని తొలగిస్తామని, అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అనంతకుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అసలు రాజ్యాంగం అంటే గౌరవం లేని వ్యక్తికి సభలో కూర్చునే అర్హతే లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆజాద్ అన్నారు. ఇక రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడి పోడియం చుట్టూ చేరిన సభ్యులు ఇది ముమ్మాటికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు జరిగిన అవమానం అని నినాదాలు చేశారు. ఇలాంటి వాటిని మరోసారి జరగనివ్వకూడదని వెంటనే దీనిపై కేంద్రం స్పందించి కేంద్రమంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, కేంద్రం మాత్రం ఈ వివాదం నుంచి పక్కకు జరిగింది. అనంతకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని ప్రభుత్వానికి ఆయన మాటలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కేంద్రమంత్రి విజయ్ గోయెల్ రాజ్యసభలోలో మాట్లాడుతూ ప్రభుత్వానికి అనంతకుమార్ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు. మరోపక్క, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ హెగ్డే వ్యాఖ్యలకు ప్రభుత్వానికి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేశామని, సమావేశాలు మరో ఐదు రోజులు మాత్రమే ఉన్నాయని, తాను ప్రతిపక్షం ఈ విషయం అర్ధం చేసుకొని సభలోకి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. -
తమ రక్తం..తల్లిదండ్రులెవరో తెలియని వారు..
సాక్షి, బెంగళూరు: ఆయన ఎంపీ, కేంద్ర మంత్రి కూడా. అయితే ఆయన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో రోజుకో వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఆయనే కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే. తనదైన శైలి వ్యాఖ్యలతో సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఈటెల్లాంటి మాటలతో విరుచుకుపడుతూ చర్చనీయాంశంగా మారారు. తాజాగా ఆయన రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యలు మరోసారి రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆదివారం రోజున కొప్పళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంత్‌కుమార్ హెగ్డే....‘కొంత మంది తాము లౌకికవాదులమని చెప్పుకుంటూ ఉంటారు. తమ రక్తం గురించి, తమ తల్లిదండ్రులెవరో తెలియని వారు మాత్రమే ఇలా చెప్పుకుంటారు. హిందుత్వానికి ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఎవరో ఒకరిద్దరు వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి మాట్లాడినంత మాత్రాన మేం మారబోము. ప్రస్తుతం రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే రాజ్యాంగాన్ని మార్చేందుకే మేం వచ్చాం’ అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి హెగ్డేకి మతి తప్పింది: దినేష్ గుండూరావ్ సాక్షి, బెంగళూరు: ‘కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డేకు మతిస్థిమితం తప్పింది. అధికారం తలకెక్కింది. అందుకే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేష్ గుండూరావ్ మండిపడ్డారు. సోమవారం కేపీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హెగ్డే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటపుడు రాజ్యాంగాన్ని కాపాడతానని, రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకుంటానని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రమాణానికే విలువ ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం విచారణకు అనుమతించరాదు భూపసంద్ర డీనోటిఫికేషన్ అంశానికి సంబంధించి సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరాదని కోరారు. ఎమ్మెల్సీ ఉగ్రప్ప మాట్లాడుతూ మంత్రి హెగ్డే వల్లే కరావళిలో కులఘర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు. -
సిగ్గులేని రాజకీయాలు.. ప్రకాష్ రాజ్ ఫైర్
సాక్షి, చెన్నై : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి రాజకీయాలపై ట్విట్టర్లో స్పందించారు. ఈసారి బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డేపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. హిందుత్వం-జాతీయత ఒక్కటేనని హెగ్డే ఈ మధ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వాటిని ఖండిస్తూ ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. నేషనలిజం, హిందుత్వం ఒక్కటేనని చెబుతున్న మంత్రిగారు ఆమాటకు అర్థం కూడా వివరిస్తే బాగుంటుందని తొలుత ప్రకాశ్ రాజ్ మొదట ఓ ట్వీట్ చేశారు. ఇస్లాం మతాన్ని ప్రపంచంలోనే లేకుండా చేయాలని ఈయనగారు భావిస్తున్నారేమోనంటూ అనంతకుమార్ మాట్లాడిన వీడియోను పోస్టు చేశారు. ఆపైనే అసలు విమర్శలతో ఓ పోస్టును ప్రకాశ్ ఉంచారు. ‘‘ ఆ రెండూ ఒకటేనని అంటున్నప్పుడు అసలు మతం విషయాన్ని లేవనెత్తటం ఎందుకు? అంబేద్కర్, అబ్దుల్ కలాం, రెహమాన్, కుష్వంత్ సింగ్, అమృత ప్రీతమ్, డాక్టర్ కురియన్ వీరంతా ఎవరు?. నాలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటి? మేం ఈ దేశానికి చెందిన వాళ్లం కాదా? అసలు మీ ఏజెండా ఏంటి? పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్‌కు ప్రతీకలా? సెక్యులర్ దేశం మనందరిది. ఈ సిగ్గులేని రాజకీయాలతో మీకు ఒరిగేది ఏంటి? అంటూ ప్రకాష్ రాజ్ అనంతకుమార్‌పై మండిపడ్డారు. కాగా, 52 ఏళ్ల ప్రకాష్ రాజ్ ఇంతకు ముందు గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చురకలు అంటించిన విషయం తెలిసిందే. Should we Indians ..Let this gentleman ..fool us ..distort and hijack.. our HINDUTVA .. ..our WAY OF LIFE... #justasking pic.twitter.com/klJ4GM28xG — Prakash Raj (@prakashraaj) December 7, 2017 This minister says ..”Islam should be wiped out in this world” ..so when he talks of HINDUTVA does he mean it’s a way of life...#justasking pic.twitter.com/UtgZyat6Dz — Prakash Raj (@prakashraaj) December 7, 2017 Mr..minister what do you mean when you say “nationalism and hindutva”are one and mean the same ...#justasking pic.twitter.com/jsrlBJIomR — Prakash Raj (@prakashraaj) December 7, 2017 -
మోదీ కేబినెట్లో వివాదాల ఎంపీ
-
మోదీ కేబినెట్లో వివాదాల ఎంపీ
సాక్షి, బెంగళూర్: మోదీ కొత్త పరివార్‌లో ఇలా కొలువు దీరిందో లేదో అప్పుడు అందులోని మంత్రుల పనితీరుపై వారి వారి సామార్థ్యాల ఆధారంగా లెక్కలు కట్టేస్తున్నారు. అదే సమయంలో వారిపై ఉన్న వివాదాలను కూడా కొందరు వెలుగులోకి తెచ్చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన అనంతకుమార్ హెగ్డే ప్రస్తుతం కేంద్ర మంత్రి(సహాయ)గా పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓ వైద్యుడి పై దాడిచేసిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. త్వైకాండో స్పెషలిస్ట్ అయిన హెగ్డే వైద్యుడి పీకపట్టుకుని పలు మార్లు ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. పక్కనే ఉన్న సిబ్బంది అడ్డుకునేందుకు యత్నించగా, వారిని హెగ్డే అనుచరులు పక్కకు లాగేయటం వీడియోలో ఉంది. తీవ్ర గాయాలపాలైన వైద్యుడు తర్వాత మీడియాకు దాడి ఘటనను వివరించారు కూడా. సిర్సి పట్టణంలోని టీఎస్ఎస్ ఆస్పత్రిలో ఈ యేడాది జనవరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన తల్లికి వైద్యం అందించటంలో నిర్లక్ష్యం వహించారనే వైద్యుడిపై ఇలా దాడిచేయగా, హేగ్డేపై కేసు కూడా నమోదు అయ్యింది. వీడియో పాతదే అయినా ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కావటంతో వీడియో వైరల్ అవుతోంది. ఇక ఆయనకు వివాదాలు కొత్తేం కాదు. ఇస్తాం ఉన్నంత కాలం టెర్రరిజం ఉంటుందని, ఆ మతాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తేనే టెర్రరిజం అంతమవుతుందని మంటపుట్టించే వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కున్నారు కూడా. 28 ఏళ్ల వయసులోనే రాజకీయ దురంధరుడు మార్గరెట్ అల్వాను ఓడించిన అనంత హెగ్డే.. వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. -
బీజేపీ ఎంపీ ఆస్పత్రిలో పరుగెత్తించి కొట్టాడు
బెంగళూరు: కర్ణాటకలో ఓ బీజేపీ ఎంపీ తన ప్రతాపాన్ని చూపించారు. ఆస్పత్రి సిబ్బందిపై విరుచుకుపడ్డారు. పిడిగుద్దులతో చుక్కలు చూపించారు. ఆ సమయంలో ఆయనను ఆపేందుకు ఆస్పత్రి ఇతర సిబ్బంది సైతం వెనుకడారు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాలో చిక్కి ఇప్పుడు వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్దే కొద్ది రోజుల కిందట కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లాలోగల సిర్సిలో తన తల్లిని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఆమెకు వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని భావించి ఒక్కసారిగా ఆగ్రహంతో ఆస్పత్రిలో సిబ్బందిలోని ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నారు. ఆస్పత్రి ఆవరణంలోనే అందరూ చూస్తుండగా పరుగెత్తించి కొట్టారు. అతడు అడ్డుకుంటున్నా ఆగకుండా దాడి చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆస్పత్రి ఆవరణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. బాధితుడు ఆస్పత్రిలోని వీడియోతో సహా ఆధారాలు చూపించి ఫిర్యాదు చేసిన పోలీసులు మాత్రం ఇంత వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.