Anaparthi Assembly constituency
-
‘బాబు నన్ను మోసం చేశారు..’ ఏడ్చేసిన నల్లమిల్లి
సాక్షి, తూర్పు గోదావరి: కూటమిలో చిచ్చుతో అనపర్తి రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. టీడీపీ కరపత్రాలను, జెండాలను కుప్పలుగా తగలబోసి అందులో ఓ సైకిల్‌ను వేసి కాల్చేశారు. అధిష్టాన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి గురైన నల్లమిల్లి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ‘‘నాకు టికెట్ రాకుండా పెద్ద కుట్ర చేశారు. నాకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తా’’ అంటూ గురువారం ఉదయం అనుచరులతో జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టకున్నారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో ప్రజల్లోకి వెళ్తానన్న ఆయన.. ప్రజల నిర్ణయం మేరకు పోటీ చేస్తానని ప్రకటించారు. ‘‘నేను టీడీపీకి మద్దతివ్వను. బీజేపీకి కూడా ఓటు వేయమని చెప్పను. చంద్రబాబు నన్ను నమ్మించి మోసం చేశారు. నా నియోజకవర్గంలో ఏ మాత్రం బలం లేని బీజేపీకి ఎలా సీటు కేటాయిస్తారు?.. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చేది లేదు’’ అంటూ స్పష్టం చేశారాయన. టీడీపీ తరఫున అనపర్తి టికెట్‌ను ఈ మాజీ ఎమ్మెల్యే ఆశించారు. అయితే తనతో సంప్రదింపులేం జరపకుండా అధినేత చంద్రబాబు పొత్తులో భాగంగా ఆ సీటును చంద్రబాబు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించారు. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా ఎం. శివకృష్ణంరాజు పేరును బీజేపీ బుధవారం సాయంత్రం నాటి జాబితాలో అధికారికంగా ప్రకటించింది. దీంతో.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతకు ముందు.. అనపర్తిలో నల్లమిల్లి అనుచరుల ఆగ్రహావేశాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనపర్తి సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారంటూ నల్లమిల్లి అనుచరుల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. మంట్లలో సైకిల్‌ను టీడీపీ కరపత్రాలను తగలబెట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం తన నివాసంలో అనుచరులతో భేటీ అయిన రామకృష్ణారెడ్డి.. చివరకు రెబల్‌గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. -
అనపర్తి: ‘రామకృష్ణారెడ్డి అక్రమాలను ప్రజలకు వివరిస్తా’
సాక్షి,అనపర్తి: కాకినాడలోని అనపర్తిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ళ పర్వం సాగుతోంది. స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి పరుడంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచాడు. దీంతో ఇద్దరూ బహిరంగ చర్చకు సిద్దమయ్యారు. ఇవాళ (శుక్రవారం) ముహూర్తం ఖరారు చేసుకున్న చేసుకునన్నారు. దీంతో అనపరర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి చర్చలకు వేదికను సిద్ధం చేశారు. అయితే అక్కడికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి బయల్దేరగా.. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నల్లమిల్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనపర్తిలో టీడీపీ నేత రామకృష్ణారెడ్డి తనకు చేసిన సవాలును ఎదుర్కోవడానికి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సిద్ధమైయ్యారు. రామకృష్ణారెడ్డి చేసిన అక్రమాలను స్క్రీన్ పెట్టి మరీ ప్రజలకు వివరిస్తానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ చర్చకు పోలీసులు అనుమతివ్వలేదు. ఇరుపక్షాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. -
అనపర్తి మాజీ ఎమ్మెల్యే మృతి
సాక్షి, అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి కన్నుమూశారు. 1989, 2004లో అనపర్తి ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రామారెడ్డి కుటుంబసభ్యులకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
అనపర్తిలో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు
అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. అనపర్తి అసెంబ్లీ సీటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నల్లమిల్లి టిక్కెట్ ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీ నామాలు చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. అనపర్తి మండల అధ్యక్షుడు కర్రి ధర్మారెడ్డితో సమావేశమైన తెలుగు తమ్ముళ్లు ఈ మేరకు హుకుం జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తుండడంతో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు స్థానిక నేతలు కలవరపడుతున్నారు. అనపర్తి అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎ.ముక్తేశ్వరరావు పోటీ చేస్తున్నారు.