Anchor Jhansi
-
నటి ఝాన్సీకి ఇంత పెద్ద కూతురు ఉందా? డ్యాన్సర్ కూడా! (ఫొటోలు)
-
35 ఏళ్లకే గుండెపోటుతో మృతి.. యాంకర్ ఝాన్సీ ఎమోషనల్
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏ పని చేయాలన్నా మేనేజర్ల మీదే ఆధారపడుతుంటారు. వారి కాల్షీట్లు, సినిమాలు, రెమ్యునరేషన్.. ఇలా అన్నీ మేనేజర్లే చూసుకుంటూ ఉంటారు. మేనేజర్ ఓకే అన్నాకే ఆయా ప్రాజెక్టులో భాగమవుతారు. మేనేజర్లకు సెలబ్రిటీలకు మధ్య మంచి అనుబంధమే కొనసాగుతుంది. తాజాగా యాంకర్ ఝాన్సీ మేనేజర్ శ్రీను మరణించాడు. దీంతో యాంకర్ ఎమోషనలైంది. ఎంతో సమర్థవంతుడు శ్రీను.. ముద్దుగా సీను బాబు అని పిలుచుకుంటాను. నాకు అతడే పెద్ద సపోర్ట్ సిస్టమ్. హెయిర్ స్టయిలిష్ట్గా ప్రయాణం ప్రారంభించిన అతడు నాకు వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా మారాడు. నా పనులన్నింటినీ ఎంతో సమర్థవంతంగా నిర్వహించాడు. అతడే నా రిలీఫ్. నన్ను బ్యాలెన్స్‌గా ఉంచాడు. అతడే నా బలం. తను ఎంతో మంచివాడు, సహృదయుడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు. అతడు నా దగ్గర పనిచే స్టాఫ్ మాత్రమే కాదు నా కుటుంబసభ్యుడు. మాటలు రావడం లేదు నా తమ్ముడి కంటే ఎక్కువే. నా కుటుంబానికి కూడా ఎంతో కావాల్సినవాడు. 35 ఏళ్లకే గుండెపోటుతో మరణించాడు. ఈ వార్త నన్ను ఎంతో బాధకు గురి చేసింది. మాటలు రావడం లేదు. జీవితం నీటిబుడగలాంటిది అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై సెలబ్రిటీలు, అభిమానులు స్పందిస్తూ యాంకర్ ఝాన్సీ మేనేజర్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. 35 ఏళ్లకే గుండెపోటు ఏంటి? దేవుడు ఎందుకిలా చేస్తున్నాడు? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by @anchor_jhansi చదవండి: అర్జున్ చేతుల మీదుగా భార్యకు సీమంతం.. సీక్రెట్స్ చెప్పిన ఆ ముగ్గురు.. గుండె బరువెక్కడం ఖాయం! -
పోలీసుల రైడ్‌లో దొరికిపోయానంటూ వార్తలు సృష్టించారు: ఝాన్సీ
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి పలు పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అందులో నిజం ఎంతున్నది పక్కన పెడితే ఎప్పుడూ ఏదో ఒక రకంగా హెడ్‌లైన్స్‌లో ఉంటారు. ప్రేమలు,బ్రేకప్‌లు ఇలా.. సినిమాల కంటే పర్సనల్ విషయాలతో మరింత హైలైట్ అవుతుంటారు. యాంకర్ ఝాన్సీ విషయంలోనూ ఇలానే జరిగింది. గతంలో ఆమె వ్యక్తిగత జీవితంపై ఓ వార్త తెగ హల్చల్ చేసింది. దీనిపై స్వయంగా వివరణ ఇచ్చింది ఝాన్సీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. ''నేను ఓ ప్రముఖ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నానని, పోలీసుల రైడ్‌లో దొరికిపోయానని ఓ వెబ్సైట్ వాళ్లు పిచ్చిరాతలు వార్తలు సృష్టించారు. అలా ఎవరు రాయించారో, ఎందుకు రాయించారో నాకు తెలుసు. దానికి తప్పకుండా వాళ్లు అనుభవిస్తారు. కానీ నిజనిజాలు తెలియకుండా అలాంటి అబాండాలు వేస్తే మానసకింగా ఎంత క్షోభకు గురయ్యానో వాళ్లకు తెలియదు. అంతేకాకుండా ఈ వార్త వళ్ల నేను ఓ పదవి కూడా కోల్పోయాను. చాలా కాలంగా యూనిసెఫ్ తరపున పని చేయడంతో నన్ను కర్ణాటక అండ్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని వాళ్లు అనుకున్నారు. కానీ సరిగ్గా అలాంటి సమయంలో ఈలాంటి రూమర్స్ రావడంతో నాకు దక్కాల్సిన పదవి కూడా రాకుండా పోయింది'' అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ. -
నన్ను చాలామంది మోసం చేశారు : యాంకర్ ఝాన్సీ
యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సుమ తర్వాత ఇండస్ట్రీలో ఆ స్థాయిలో పేరు సంపాదించుకుంది ఝాన్సీ. ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా బుల్లితెరపై ఎన్నో సక్సెస్ఫుల్ కార్యక్రమాలు హోస్ట్ చేసిన ఆమె సినిమాల్లోనూ మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. ఈమధ్య బుల్లితెరపై ఈమె హడావిడి కాస్త తగ్గినా వెండితెరపై మాత్రం జోరు కొనసాగిస్తుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కెరీర్లో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి పంచుకుంది. ''నా గురించి కొత్తలో చాలామంది ఈమె ఫైర్ బ్రాండ్, పొగరు ఇలా.. అనుకునేవారు. కానీ నాతో కలిసి పనిచేసిన వారికి తెలుసు నేను ఏంటన్నది. నన్ను అర్ధం చేసుకున్నవారు కొన్నేళ్ల పాటు నాతో జర్నీ చేశారు. నచ్చని వాళ్లు 13 ఎపిసోడ్స్‌తోనే ఫుల్స్టాప్ పెట్టేశారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఓ డ్యాన్స్ షోకి 99కి ఎపిసోడ్స్ నేను యాంకర్‌గా చేస్తే 100వ ఎపిసోడ్‌కి నా స్థానంలో వేరేవాళ్లతో యాంకరింగ్ చేయించారు. దానికి కారణం ఏంటన్నది నాకు చెప్పరు. నేను అడగలేదు. నాకు రావలసిన క్రెడిట్ నాకు రాకుండా చేసిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. నన్ను ఎంతోమంది మోసం చేశారు. కానీ వాళ్లందరిని గుర్తు పెట్టుకొని కక్ష సాధించే పని నేను ఎప్పుడూ చేయలేదు. అది మంచితనమో, పిచ్చతనమో తెలియదు'' అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ. -
ఝాన్సీతో విడాకులు.. 8 ఏళ్లు కోలుకోలేకపోయా.. : జోగి నాయుడు ఎమోషనల్
టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన జోగి నాయుడు తర్వాతి కాలంలో నటుడిగానూ మారారు. స్వామి రారా, దృశ్యం, కుమారి 21 ఎఫ్, నువ్వలా నేనిలా, గుంటూరు టాకీస్ వంటి పలు చిత్రాల్లో నటించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయన్ను ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా నియమించింది. జోగి నాయుడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. యాంకర్ ఝాన్సీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన కూతురు పుట్టాక ఆమెతో విడిపోయారు. తనతో ఉండటానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఝాన్సీ ఒప్పుకోకపోవడంతో విడాకులు ఇచ్చేశారు. తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. తాజాగా తన మొదటి పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు జోగి నాయుడు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు.. '1995లో ఝాన్సీ నాకు తొలిసారి పరిచయమైంది. అప్పుడామె ఇంటర్ చదువుతోంది. జీకే మోహన్ తీసిన ఓ సినిమాలో తను నటించింది. అప్పుడు నేను జీకే మోహన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నా. ఆ సమయంలోనే మా ప్రేమ చిగురించింది. మేము కలిసున్న జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుని సంతోషపడుతూ ఉంటాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, తను యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. చిన్న స్థాయి నుంచి పైకి ఎదుగుతూ వచ్చాం. దాదాపు తొమ్మిదేళ్లపాటు మేమిద్దరం కలిసే ఉన్నాం. కానీ ఇద్దరం మంచి స్టేజీకి వచ్చిన తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఏడాదిలోనే విడిపోవాల్సి వచ్చింది. అప్పటికి మాకు ధన్య అనే కూతురు ఉంది. బ్రహ్మానందం, చిరు మమ్మల్ని కలపాలనుకున్నారు కలిసుండాలని నేను ఎంతో ప్రయత్నించాను, కానీ అది జరగలేదు. మా బంధం ఇంతవరకే అని రాసిపెట్టుందేమో, దాన్నెవరు ఆపగలరు? కానీ నాకున్న ఎమోషన్స్ వల్ల ఏడెనిమిది సంవత్సరాలు ఆ బాధలో నుంచి బయటపడలేకపోయాను. బ్రహ్మానందం ఒక తండ్రి స్థానంలో నిలబడి మమ్మల్ని కలిపేందుకు చాలా ప్రయత్నించారు. చిరంజీవి కూడా మమ్మల్ని కూర్చోబెట్టి రెండు,మూడు గంటలపాటు మాట్లాడారు. కానీ వర్కవుట్ కాలేదు. తనతో నడిచిన ప్రయాణంలో జీవితకాలం సరిపడా జ్ఞాపకాలు పోగేసుకున్నాను. వారానికోసారి పాపను చూసేదాన్ని ఆ తర్వాత మేమిక కలవడం జరగని పని అని అర్థమయ్యాక అమ్మానాన్న చెప్పిన మాట విని రెండో పెళ్లి చేసుకున్నాను. కానీ నా కూతురు దూరమైపోయిందన్న బాధ మాత్రం అలాగే ఉంది. తను నాకు దూరంగా సంతోషంగా ఉంది. కానీ తనను చూడలేకపోతున్నాను నా తమ్ముడు చనిపోయాడు. వాడిని ఎప్పటికీ చూడలేను. వీళ్లిద్దరి విషయంలో ఒకలాగే ఫీలవుతాను. ఇద్దరూ ఎక్కడో ఉన్నారు. కానీ మాట్లాడలేకపోతున్నా. ఝాన్సీతో విడాకులు తీసుకున్న తర్వాత నా కూతురు చిన్నప్పుడు తల్లి దగ్గర పెద్దయ్యాక తండ్రి దగ్గర ఉండాలని కోర్టు చెప్పింది. అందుకే తల్లి దగ్గరే పెరిగింది. వారానికోసారి పంపించేది. పేగు బంధాన్ని చుట్టపుచూపుగా తీసుకువస్తే అన్యాయం అనిపించింది. గంట కోసం దెబ్బలాడేవాడిని మా మామయ్య తనను తీసుకువచ్చినప్పుడు టైం చూసుకుని గంట అయిపోయింది అనేవారు. అరగంట, గంట కోసం దెబ్బలాడేవాడిని. నా కూతురిని పంపించనని అనేవాడిని. అది చూసి నా చిట్టితల్లి కన్నీళ్లుపెట్టుకునేది. అలా ఎన్నోసార్లు ఏడుస్తూ వాళ్లతో వెళ్లిపోయింది. నా బిడ్డ నలిగిపోతుందని అర్థమై ఇక మీదట పంపించొద్దన్నాను. కానీ తను స్కూల్‌కు వెళ్లేటప్పుడు, ఆడుకునేటప్పుడు చూడాలని వాళ్లుండే కాలనీలోనే ఇల్లు తీసుకున్నాను. అందరూ డిస్టర్బ్ అవుతుండటంతో నేనే దూరంగా వచ్చేశా. నా కూతురు ఎప్పటికైనా నా దగ్గరకు వస్తుందిలే అనుకున్నాను. అది జరగలేదు. అందుకే దేవుడు కరుణించి నాకు కొత్త జీవితం ఇచ్చి ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చాడు. వాళ్లలోనే నా ధన్యను చూసుకుంటున్నాను' అని ఎమోషనల్ అయ్యారు జోగి నాయుడు. చదవండి: కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కేరళ స్టోరీ -
గర్వపడుతున్నా, ఇది నా అదృష్టం: యాంకర్
కరోనా వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్, కర్ఫ్యూ అమలవతుండటంతో చాలామంది తమ ఉపాధిని కోల్పోయి పూట గడవని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వారి కోసం సెలబ్రిటీలు ముందుకు వస్తూ ఉన్నంతలో వారికి సాయం చేస్తున్నారు. అందులో యాంకర్ ఝాన్సీ కూడా ఒకరు. బుల్లితెర యాంకర్ ఝాన్సీ లాక్డౌన్ వల్ల ప్రభావితమైన పేదలకు నిత్యావసర సరుకులను అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటోంది. ఈ సేవా కార్యక్రమాలను ఆమె టీమ్ దగ్గరుండి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన మేకప్ మ్యాన్ అసిస్టెంట్ రమణ చేస్తున్న మంచి పనుల గురించి అభిమాలతో చెప్పుకుంటూ ఉద్వేగానికి లోనైంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. "నా దగ్గర పని చేస్తున్న సిబ్బందిని చూసి గర్వపడుతున్నా. నా టచప్ అసిస్టెంట్ రమణ లాక్డౌన్లో నిరుపేదలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తున్నాడు. నాకు వీలైనంతలో ఒక 25 మందికి నెలకు సరిపడా సరుకులు ఇచ్చే పనిని రమణ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అందులో చిన్న మొత్తం మిగిలింది. అయితే దాన్ని నీ దగ్గరే ఉంచు రమణా అని చెప్పినప్పటికీ, ప్రస్తుతం తనకు ఇబ్బంది లేదంటూ అవసరం ఉన్న మరో నలుగురికి నిత్యావసరాలు అందించాడు. మంచితనం డబ్బుతో రాదు.. రమణ, శ్రీను పుట్టుకతోనే గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తులు, వీరితో పని చేయడం నా అదృష్టం" అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Jhansi (@anchor_jhansi) చదవండి: హీరోగా జూ.ఎన్టీఆర్ అందుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
కోవిడ్ వల్ల అలా నిశ్చితార్థం, కష్టమే, కానీ..: ఝాన్సీ
కరోనా వల్ల పెళ్లిళ్ల రూపురేఖలు మారిపోయాయి. మండపానికి వందలాదిగా తరలివచ్చే బంధువులు ఇప్పుడు ఆన్లైన్లోనే కట్నకానుకలు పంపిస్తూ ఫోన్లోనే వివాహ వేడుకను వీక్షిస్తున్నారు. అసలే రానున్నది పెళ్లిళ్ల సీజన్. ఈ నేపథ్యంలో తన బంధువుల ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకల గురించి యాంకర్ ఝాన్సీ స్పందించింది. తనకు కొడుకు వరుసైన వ్యక్తికి నిశ్చితార్థం జరిగిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ వేడుకను తాను నేరుగా కాకుండా లైవ్‌లోనే వీక్షించాల్సి వచ్చిందని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. "మనందరం ఎన్నో కారణాల వల్ల కోవిడ్‌ను ద్వేషిస్తున్నాం. నేనైతే ఈ వేడుకకు హాజరు కాలేకపోయినందుకు ఆ వైరస్‌ను తిట్టుకుంటున్నాను. పుత్రసమానుడైన సంపత్ ఎంగేజ్మెంట్ జరిగింది. దాన్ని నేను ఆన్లైన్లో వీక్షించాను. ఈ నిశ్చితార్థ వేడుక కేవలం ఇరు కుటుంబ సభ్యులు మధ్య మాత్రమే జరిగింది. దీని కంటే ముందుగా వారందరికీ కరోనా పరీక్షలు జరపగా నెగెటివ్ అని తేలింది. ప్రపంచవ్యాప్తంగా నాతో సహా 300 మంది ఈ ఎంగేజ్‌మెంట్‌ను ఆన్లైన్లో వీక్షించారు. ఇది కొత్తదే అయినా నేర్చుకుంటున్నాం. కొంత కష్టమే కానీ తప్పడం లేదు" అని ఝాన్సీ తెలిపింది. View this post on Instagram A post shared by Jhansi (@anchor_jhansi) -
ఐసోలేషన్‌లో ఎందుకున్నానంటే? : ఝాన్సీ
హైదరాబాద్ : ఇటీవల కొందరు తెలుగు సీరియల్స్ నటులు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరికొందరికి కరోనా సోకిందనే తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో పలువురు వాటిపై వివరణ కూడా ఇచ్చారు. తాజాగా ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీకి కరోనా సోకిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. తనకు కరోనా సోకిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.(చదవండి : ‘దాని కంటే ముందు నన్ను నేను నిరూపించుకోవాలి’) తను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ఇటీవల చేసిన ఓ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకుని.. కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ చానల్స్ తప్పుడు వార్తలు ప్రచురించాయని చెప్పారు. ఐసోలేషన్‌కు, క్వారంటైన్‌కు తేడా ఉందని చెప్పారు. కరోనా అందరికి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాంటప్పడు కరోనా సోకినవారిపై వివక్ష చూపడం సరికాదన్నారు. కరోనా వస్తే ఏం చేయాలి.. భయపడకుండా ముందకు ఎలా వెళ్లాలో ఆలోచించాలన్నారు. అనారోగ్య సమస్యలు, వయసు పైబడినవారి విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. (చదవండి : ఆ కూలీకి పోటెత్తిన సుశాంత్ అభిమానుల కాల్స్) తను వర్క్ చేసే సెట్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. అందుకే ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. ఇప్పటికే ఏడు రోజుల ఇంక్యూబేషన్ సమయం పూర్తయిందని.. మరో వారం రోజులు ఇంట్లోనే ఉంటానని చెప్పారు. రిస్క్ తీసుకోకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికైతే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వెల్లడించారు. ఒకవేళ తనకు పాజిటివ్ వస్తే.. జాగ్రత్తగా ఉంటానని, హెల్త్ ఎలా ఉందనేది షేర్ చేస్తానని అన్నారు. వార్తలు రాసేముందు నిజాలు తెలుసుకోవాలని.. సరైన సమాచారం లేకుండా తప్పుడు వార్తలు రాయవద్దని కోరారు. కరోనాను జాగ్రత్తగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. View this post on Instagram clearing the doubts A post shared by Jhansi (@anchor_jhansi) on Jul 6, 2020 at 10:34pm PDT -
బిగ్‌బాస్ ఫలితంపై యాంకర్ ఝాన్సీ అసహనం
తెలుగువారిని ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ 3 ముగిసినప్పటికీ దానిచుట్టూ వివాదాలు మాత్రం వదలడంలేదు. ప్రేక్షకులు కురిపించిన ఓట్ల వర్షంతో అంచనాలు తలకిందులు చేస్తూ రాహుల్ సిప్లిగంజ్ ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ‘గత రెండు సీజన్లలో పురుష కంటెస్టెంట్లకే టైటిల్ దక్కింది.. ఈసారి మహిళకు అవకాశమిద్దాం’ అని శ్రీముఖి అభిమానులు చేసిన ప్రచారాన్ని ఎవరూ లెక్కచేయలేదు. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో శ్రీముఖి ఓ సందర్భంలో.. ‘నేను జెండర్‌ను వాడను’ అని చెప్పింది. అయితే అందుకు భిన్నంగా ఆమె సోషల్ మీడియా అకౌంట్లో మాత్రం శ్రీముఖి కుటుంబ సభ్యులు #THISTIMEWOMAN అంటూ ప్రచారం నిర్వహించడం గమనార్హం. మూడో‘సారీ’ ఇక తెలుగులో బిగ్‌బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకోగా ఒక్కసారి కూడా మహిళలు విన్నర్‌గా నిలవలేకపోయారు. టాప్ 5లో చోటు దక్కించుకుని ఫినాలేలో అడుగుపెట్టినా.. వట్టిచేతులతోనే వెనుదిరిగారు. ముచ్చటగా మూడోసారి.. కూడా మేల్ కంటెస్టెంట్ విన్నర్‌గా అవతరించాడు. టైటిల్ ఫేవరెట్ అనుకున్న శ్రీముఖి క్రేజ్ రాహుల్ నిజాయితీ ముందు తక్కువే అయింది. దీంతో ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకోక తప్పలేదు. ఇక బిగ్‌బాస్ ఫలితంతో శ్రీముఖి అభిమానులు నిరాశలో మునిగిపోగా.. పలువురు సెలబ్రిటీలు కామెంట్లు చేస్తున్నారు. ప్రేక్షకులు అందుకు సిద్ధంగా లేరు ప్రముఖ యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా బిగ్‌బాస్ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ వీక్షకులు మహిళను గెలిపించడానికి సిద్ధంగా లేరని అభిప్రాయపడింది. ‘అమెరికా వంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవటం లేదు. అలాంటిది తెలుగు ప్రేక్షకులు మాత్రం బిగ్‌బాస్ విన్నర్‌గా మహిళను ఎందుకు గెలిపిస్తారు?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది. లింగభేదం ఇంకా ఉనికిలోనే ఉందంటూ కామెంట్ చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి తన బెస్ట్ ఇచ్చిందని ఝాన్సీ ప్రశంసలు కురిపించింది. -
యాంకర్ భర్తకు రెండో పెళ్లి..
విశాఖపట్నం ,నర్సీపట్నం: వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తెలుగు సినీరంగంలో నటుడిగా రాణిస్తున్నారు. తొలుత ఒక యాంకర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు విడిపోయారు. దీంతో తన స్వగ్రామం చెర్లోపాలేనికి చెందిన సౌజన్యను రెండవ వివాహం చేసుకున్నారు. -
నా చిర్నవ్వే నాకు 'తోడు'
నేనూ అందరమ్మాయిల్లాగానే పదవ తరగతి వరకు హాఫ్ లంగా అంచుల పట్టీలు(ఫ్రిల్స్) విప్పి రెండు మూడేళ్ళు అదే యూనిఫాం వాడేదాన్ని. మూడు యూనిఫాంస్తోనే స్కూలింగ్ గడిచిపోయింది. గుంటూరు జమీందారీ కుటుంబమే అయినా అమ్మానాన్నలకి పనుల విషయంలో తేడా లేదు. అన్ని పనులూ ఇద్దరూ చేసేవారు. నాకు తెలిసి నేనెప్పుడూ ఇస్త్రీ లేని యూనిఫాంతో స్కూల్‌కి వెళ్ళలేదు. అమ్మ చీరలు కూడా నాన్నే ఇస్త్రీ చేసేవారు. వంటకూడా యిష్టంగా చేసేవారు. ఇంట్లో వర్క్ డివిజన్ ఉండేది. నాన్న కాంట్రాక్టర్ అయినా మంచి హోమ్ మేకర్. మగాళ్ళు చాలా అగ్రెసివ్‌గా ఉన్న కాలంలో మా ఇంట్లో జెండర్ న్యూట్రాలిటీ ఉండేది. చిన్నప్పట్నుంచీ నాకది రాదు, నేను చేయలేను అని చెప్పడం నాకిష్టం ఉండేది కాదు. ‘‘పెదవులపై చిర్నవ్వులు మోసుకొని కోర్టు మెట్లెక్కాను. దానికి నేను పెట్టిన పేరు ఆపరేషన్ స్మైల్. ఆ నవ్వు నా కోసం కాదు. నిత్యజీవితంలో ఎన్నో అవమానాలను భరిస్తూ, ఎంతో హింసాయుతమైన జీవితాన్ని అనుభవిస్తూ రోజూ ఛస్తూ బతుకుతోన్న ఎందరో ఆడవాళ్ళకు కోర్టుకెళ్ళడం తప్పేం కాదనే భరోసానిచ్చేందుకు నేనూ మా అమ్మా కోర్టుకెళ్లిన ప్రతిసారీ మరచిపోకుండా ఇంట్లోనుంచి చిర్నవ్వులను మోసుకెళ్ళే వాళ్ళం. కోర్టు చుట్టూ ఎందరో ఆడవాళ్ళు. వాళ్ళందరి గుండెల్లో రేపెలా ఉంటుందోననే గుబులు. కానీ ఎవరికోసమో మనం బతకలేంగా! మన కోసమే మనం బతకాలి. ఇది జీవితం నటన కాదు. అందుకే మనకి నచ్చినట్టు మనం బతకాలి. రోజూ ఎందరో ఆడవాళ్ళ సమస్యలను తెరపైకి తెస్తోన్న ఝాన్సీ నిజజీవితంలో ఇంతలా డీలా పడిపోతే ఇక సాధారణ మహిళలు ఎలా ఉంటారు. మరింతగా కుంగిపోరూ!. అందుకే రోజూ నేను తెరపైన చెప్పే ధైర్యాన్నే ఆచరణలోనూ వారికందివ్వాలనుకున్నాను. పెదవులపై చెరగని చిర్నవ్వుని అభినయించాను’’ కోర్టుకెళ్లడం భారంగా, నామోషీగా ఫీలయ్యేవాళ్లెందరో మన చుట్టూ ఉంటారు. కానీ అది తప్పు. అది చెప్పడానికే నేను ప్రతి వాయిదా ఒక పిక్నిక్లా భావించాన్నేను. అమ్మానేనూ నచ్చిన పదార్థాలు, బాగా నచ్చిన పుస్తకాలూ ఎప్పటికీ చెదరని సన్నటి చిర్నవ్వులతో కోర్టుమెట్లెక్కేవాళ్ళం. కోర్టు లోపల కూడా జడ్జిగారి పోడియంకి దగ్గరగా కూర్చునేదాన్ని. ‘‘ఝాన్సీ...ఝాన్సీ...ఝాన్సీ మూడు సార్లూ... నా పేరే... కోర్టుహాలు బయట నుంచొని బంట్రోతు పిలుస్తున్నాడు గట్టిగా. ఎందుకో గుండె కలుక్కుమంది. ఎంత ధైర్యంగా ఉన్నా. అది కూడా ఒక్క క్షణమే. తమాయించుకొని లోనికెళ్ళా. ఎనిమిదేళ్ళ నా పోరాటానికి విముక్తి లభించింది. నేను డైవోర్స్ తీసుకోవడాన్ని చాలా మంది చాలా రకాలుగా భావించారు. గుచ్చి గుచ్చి అడిగారు. మనస్సు నొచ్చుకునే ప్రశ్నలు. మన సర్వస్వాన్నీ నియంత్రించే ప్రశ్నలు. మనస్సుని గాయంచేసే మాటలెన్నో...నా చుట్టూ ఉన్న మనుషులు, నాతోనే ఉన్న స్నేహితులు, చాలా అందంగా సాయం చేస్తామని వచ్చినవారే అందులో చాలా మంది. ఎవ్వరేమన్నా నేను లక్ష్యపెట్టలేదు. ఎందుకంటే జీవితం నాది కనుక. మా పెళ్ళి అయినప్పటి నుంచే మా యిద్దరికీ కుదరదని నేననుకున్నాను. అయినా ఒక ఛాన్స్ ఇచ్చాను. ట్రై చేసాను. ఆ వ్యక్తితో కలసి జీవించడానికి కావాల్సిన సఖ్యత లేదు. మాది కలిసి నడిచేందుకు అనువైన ప్రయాణం కాదు. కానీ ఆ నిర్ణయం తీసుకోడానికి 11 ఏళ్ళు పట్టింది. ‘‘ఐ హావ్ మై ఓన్ లైఫ్ అండ్ విజన్’’. పక్కవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు అనుగుణంగా మీ జీవితాన్ని మార్చుకోవద్దు. అది మన పిల్లలైనా సరే. ముల్లు గుచ్చుకున్నా నవ్వేయడానికి ఇది నటన కాదని ముందే చెప్పాను. పోతపోసిన పితృస్వామ్య భావజాలంలో ఘనీభవించిన పురుషులెందరో... అదే భావజాలాన్ని మోస్తున్న స్త్రీలు కూడా...నన్ను ఆపే ప్రయత్నం చేసారు. నేనెవరినైతే నమ్ముతానో అందర్నీ సంప్రదించాను.‘‘లెట్ మై ఫైట్ బి మైన్’’. కానీ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని కోల్పోవాల్సి వచ్చింది. నా మిత్రులెవరో, ఎవరు కాదో అనుభవం తేల్చింది. నా ప్రయాణంలో ఇద్దరు మిత్రులు జారిపోయారు. ఇద్దరు మాత్రమే మిగిలారు. ఏ దాపరికం లేకుండా నన్ను నేనుగా స్వచ్ఛంగా పంచుకునే, ఇష్టంగా ప్రకటించుకునే మిత్రులు వీళ్లు. రామలక్ష్మి. శీతల్. వరదనీటికి కొట్టుకుపోయిన చెత్తపోగా మిగిలిన సారవంతమైన నేలలాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ. ఇక నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ నాతోనే ఉన్నారు. నా ప్రయాణం రెండు దారులుండే సొరంగం కాదు. ఒకే మార్గం గుండా చీకట్లోంచి ప్రారంభమై, గుహఅంచున దాగిన వెలుతురు రేఖలవైపే నా ప్రయాణం. అమ్మ ఆల్ ఇండియా రేడియోలో ప్రొడ్యూసర్. వుమన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమం కావడంతో అవి వింటూ తెలుసుకునే దాన్ని. చాలా వోకల్‌గా ఉండేదాన్ని. సంగీతం నాకెందుకు రాదని సంగీతంలో జాయిన్ అయ్యాను. గట్టిగా అరవడం వస్తే చాలనుకునేదాన్ని. నాకిక పాడ్డం రాదని డిక్లేర్ చేసాక వీణ నేర్చుకున్నాను. ఎవరైనా ఏదైనా చేయొచ్చు. సాధన కావాలంతే, అదేమంత కష్టంకాదని నా పట్టుదల. ఎస్పి బాలు లాగానో, చిత్ర లాగానో పాడలేకపోవచ్చు. పీటీ ఉష లాగా పరిగెత్తలేకపోవచ్చు. కానీ సాధన ద్వారా ఏదోమేరకు ఏదైనా సాధించొచ్చు. గ్రూప్ సింగింగ్‌కి వెళితే లిప్‌సింక్ ఇవ్వమనే వాళ్ళు. నువ్వు పాడితే పక్కాళ్ళు పారిపోతారు, పెదాలు కదిలిస్తే చాలనే వాళ్ళు. నాకెప్పుడూ ఓ బ్యాచ్ ఉండేది. టెంత్ క్లాస్ వరకూ నేనెప్పుడూ ఏదో దాంట్లో లీడర్‌గా ఉండే దాన్ని. కాళ్ళు పీకేవి. ఎప్పుడూ లో బీపీ. స్పోర్ట్స్‌కి పనికిరానన్నారు. కానీ వాలీబాల్, డిస్క్, జావలిన్ త్రోలో నేషనల్ గేమ్స్‌ని రిప్రజెంట్ చేశాను. అప్పట్నుంచే గెలవడం ముఖ్యం కాదు పాల్గొనడం ప్రధానం అనే భావం ఏర్పడింది. ప్రయాణం చాలా నేర్పిస్తుంది. గమ్యం మాత్రమే కాదు ప్రయాణం కూడా ప్రధానమే. విజయమే కాదు ఓటమే చాలా నేర్పిస్తుంది అలాగే స్నేహాలు కూడా. నా పన్నెండవ ఏట అమ్మ మాక్సీమ్ గోర్కీ ‘అమ్మ’ నవల చదవమని యిచ్చింది. ఆల్ ఇండియా రేడియో యువవాణిలో సింపోజియం కోసం చదివిన ఆ పుస్తకం నాలో సాహిత్యకాంక్షను రేకెత్తించింది. ఎలెక్స్ హెలీ ‘రూట్స్’(ఏడుతరాలు) పుస్తకం నాలో సామాజిక స్పృహను వేళ్ళూనుకునేలా చేసింది. ఏది చదవాలి? ఏది చదవకూడదు అని అమ్మెప్పుడూ నిర్దేశించలేదు. కానీ ‘చలం’ పుస్తకం చదువుతున్నప్పుడు మాత్రం నీకింకా ఆ వయస్సు రాలేదని వారించింది. ఇక నాకు నంది అవార్డుని తెచ్చిపెట్టిన తొలి పాత్ర నన్నెంతగానో ప్రభావితం చేసింది. ఓల్గాగారు రాసిన ‘తోడు’ కథని అక్కినేని కుటుంబరావుగారి డైరెక్షన్లో మధు అంబటి కామెరాతో సినిమాగా తీసారు. జీవితమంతా ప్రతిపనికీ ఆమెపైన ఆధారపడి బతికి, భార్య (చనిపోయి) దూరమయ్యాక కనీసం గుండీలు కూడా కుట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న భర్త ఒకవైపు, భర్త చని పోయి స్వేచ్ఛాగాలులు పీల్చుకుని, తనకోసం జీవిం చడం మొదలుపెట్టిన స్త్రీ మరోవైపు. ఈ సినిమాలో ఈ యిద్దరి మధ్యా నేను అనుసంధానకర్తను. ఈ కథలో నేను పూర్తిగా ఇమిడిపోయాను. ఈ కథే కాదు. అన్ని పాత్రల్లోనూ లీనమై, ఆ పాత్ర నిజంగా నేనైతే ఎలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. సెంట్రల్ వర్సిటీ నుంచి అప్పుడే ఇండస్ట్రీలో కొచ్చిన కొంగ్రొత్త భావజాలం, కొత్త నీరు గీత, అనురాధ, హేమంత్ గ్రూప్‌లో పెరగడం, నాకు దొరికిన గురువులు భరణి గారు, నిమ్ గారు, శ్యాంబెనగళ్ డైరెక్షన్లో గోపీచంద్‌గారి అబ్బాయి సాయిచంద్ గారి ‘గోపీచంద్‌కీ అమర్ కహానియా’ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వుమన్ విజయగాధ ఇతివృత్తంగా తీసిన ‘విజేత’ లాంటివెన్నో నన్ను ప్రభావితం చేసాయి. అలా ప్రారంభమైన నా జీవితాన్ని నన్ను నేనుగా తీర్చిదిద్దుకుంటూ వచ్చాను. పోచంపల్లి కాటన్ చీర కట్టుకుంటే ఉత్తమత్వం అనీ, మిడ్డీలూ, స్లీవ్‌లెస్‌లూ వేసుకుంటే తప్పనే స్వభావం కాదు నాది. సౌకర్యంగా అనిపించేది వేసుకోవచ్చు. అలా వేసుకోను అని చెప్పే స్వేచ్ఛ కూడా ఉండాలి. పురుషులు దగ్గరికి తీసుకోవడం కొందరికి అసభ్యంగా అనిపించకపోవచ్చు. కొందరికి వీపురాసి, పిరుదులు తాకినా అది తప్పనిపించక పోవచ్చు. కానీ ఆ స్పర్శలోని ఆంతర్యాన్ని బట్టి నాలాంటి కొందరికది నచ్చకపోవచ్చు. ఎంత వరకు లిమిట్ అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఏ వివక్షనీ నేను సహించేదాన్ని కాదు. అందుకే నా ముందు చెత్తజోక్స్ వేసుకోవడానికి భయపడతారు. ఇలా ఉండడానికి చాలా మందిని కోల్పోయి ఉండొచ్చు. అయినా నాకు ఏ ఇబ్బందీ లేదు. నాకిష్టమైనట్లు నేనుండగలను అనేది అర్థం కావడానికి నాకే చాలా కాలం పట్టింది. మనం ఉంటోంది అంతా తులసి వనం కాదు. కలుపు మొక్కలుంటాయి. వాటి మధ్య కూడా మహిళలు తమ అస్తిత్వాన్ని నిలుపుకునే చైతన్యం రావాలి. తమ హక్కుల్ని సాధించుకునే పోరాటపటిమ కావాలి. – అత్తలూరి అరుణ,ఫొటోలు: కె. రమేష్ బాబు -
హస్నా జరూరీ హై
కనబడుట లేదు రూపం: తెల్లగా అందంగా ఉంటుంది వయసు: తగ్గిస్తుంది బరువు: దించుతుంది వెడల్పు: కనీసం మూడు అంగుళా తత్వం: తియ్యగా చల్లగా ఉంటుంది పేరు: చిరునవ్వు పై లక్షణాలున్న చిరునవ్వు హైదరాబాద్ నగరంలో కనబడుట లేదు. నగరంలోని ఒత్తిళ్లను తట్టుకోలేక మాయం అయిపోయింది. కనిపించిన వారు వెంటనే పెదాలపైకి చేర్చుకోగలరు. నవ్వు అందంగా ఉంటుంది. కావాలంటే అద్దంలోకి నవ్వి చూడండి. నవ్వు తెల్లగా ఉంటుంది- నవ్వితే అది తేటతెల్లం అవుతుంది. నవ్వు తియ్యగా ఉంటుంది- రుచి చూడాలంటే నవ్వాల్సిందే. ఆ నవ్వుకి ఎవరైనా సరే తియ్యగా మాట్లాడాల్సిందే. నవ్వు చల్లగానూ, వెచ్చగానూ ఉంటుంది ఆశ్చర్యంగా..! కోపంలో చల్లగా, కష్టాల్లో వెచ్చగా ఉంటుంది. ఇది రాస్తూ నేనూ నవ్వుతున్నా, చదువుతూ మీరు ఓ చిరునవ్వేసుకోండి. దరహాస దాతా ! సుఖీభవ.. స్మైల్ ప్లీజ్.. మన మహానగరంలో ఉన్న లక్షలాది బైకుల్లో ఒకానొక బైక్‌పై కనిపించిన క్యాప్షన్ ఇది. ఆ సమయానికి యధాలాపంగా డ్రైవ్ చేస్తున్న నన్ను ఆ వ్యక్తి ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. వెంటనే నా ముఖంపై ఏ ఎక్స్ప్రెషన్ ఉందో గమనించాను. కనుబొమ్మలు ముడిపడి, పెదాలు ముడుచుకుని, బుగ్గలు ఒకింత బిగుసుకుని.. సీరియస్‌గా ఉన్నానేమో అనిపించింది. ఇలా ఉన్నానేంటబ్బా అనుకున్న మరు క్షణంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. మనసున తొణికిన చిరునవ్వు పెదాలపైకి వచ్చేసింది. ముఖం విచ్చుకుంది. ఆ అజ్ఞాత బైకు వీరుడికి నా థ్యాంక్స్. ఇలా రోజులో కొంత మందికైనా చిరునవ్వు పంచి పెడుతున్నందుకు. నవ్వుదాతా సుఖీభవ. ఏడ తానున్నాదో నవ్వు.. నేను రేడియో జాకీగా పని చేసిన కొద్ది కాలంలో రోజూ ఉదయాన్నే చిరునవ్వుతో ఆఫీస్ చేరేదాన్ని. ఆ నవ్వు ఆ రోజంతా నన్ను ఫ్రెష్‌గా ఉంచేది. ఓ రోజు షోలో పంచుకున్న ఈ విషయానికి ఎందరో కనక్ట్ అయ్యారు. ప్రస్తుతం.. బస్‌స్టాప్‌లో అలసిన ముఖాలు, ఫుట్‌పాత్‌పై బరువైన పేదరికం, ట్రాఫిక్‌లో చిరాగ్గా చోదకులు.. చిరునవ్వు జాడ కనిపించడం లేదు. ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్న చోట చిరునవ్వు చిందేయడం తేలికే. కానీ ఒక్కరే ఉన్న చోట చిరునవ్వు చిరునామా లేదు. పోనీ ఒక్కరే తమలో తాము నవ్వుకుంటే సచ్చిదానందం అనుకోరు సరికదా.. మెంటల్ కేస్ అని ఫిక్స్ అవుతారు. మనలో మనం అటుంచండి, పక్క వ్యక్తిని చూసి కూడా నవ్వకపోతే ఏమనాలి. నవ్వులు రువ్వే నవ్వమ్మా.. తెలియని వారిని చూసి నవ్వితే ఏమనుకుంటారో అని నవ్వం. తెలిసిన వారిని చూసి నవ్వితే ఏం అడిగేస్తారో అని భయం. ఇలా నవ్వును దాచేస్తే ఏలా. నవ్వితే తిరిగి నవ్వే సమాధానంగా వస్తుంది. చిరునవ్వులో మ్యాజిక్ ఉంది. నవ్వితే మీరు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారని రీసెర్చ్‌లు ఘోషిస్తున్నాయి. నేను మా అమ్మగారు కొన్నేళ్ల కిందట ఓ ఎక్స్పరిమెంట్ చేశాం. పర్సనల్ ఇష్యూస్‌లో కోర్టుకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం అంతా బరువుగా ఉండేది. దీనికి చెక్ పెడుతూ మా అమ్మగారు నవ్వులు పంచే ఏంజిల్ అవతారం ఎత్తారు. నేనూ ఓ నవ్వు కలిపాను. ఎవరిని చూసినా కళ్లలో మెరుపుతో, చిరునవ్వుతో పలకరించేవాళ్లం. ఆ రకంగా కోర్టు వాతావరణాన్ని మార్చేశాం. నవ్వే మంత్రమూ.. ‘రానీ రానీ కష్టాల్ కోపాల్ తాపాల్’ అన్న మహాకవి ‘హాసం లాసం’ కూడా రానీ అన్నాడు. ఎంతటి బరువైన సమస్యకైనా ఎంతటి డిప్రెషన్‌కు అయినా చిరునవ్వే మంత్రం అని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఒక చిరునవ్వు మెదడులోని సెరొటోనిన్ అనే కెమికల్ని విడుదల చేస్తుందట. దాని వల్ల రిలాక్స్ అవుతామట. పెద్దగా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల ఎండోర్ఫిన్స్ విడుదలై ఉత్తేజపరుస్తాయట. మరింక ఆలస్యం దేనికి.. ఖర్చు పెట్టక్కర్లేకుండా రిఫ్రెష్ అవ్వడానికి చిరునవ్వే వరం. పాశ్యాత్య దేశాల్లో ఎవరైనా ఎదురుపడితే చాలు తెలిసినా, తెలియకపోయినా పలకరింపుగా ఓ చిరునవ్వు విసురుతూ వెళ్లిపోతుంటారు. వాళ్లు మన నగరానికి వస్తే అయోమయానికి గురి కావడం ఖాయం. నగరం నవ్వుల వనం.. ఉరుకుల పరుగుల మన నగరానికి నవ్వడం నేర్పించాలి. అందుకు పెద్ద ప్రణాళిక ఏమీ అక్కర్లేదు. జస్ట్ మీరొక్కరు నవ్వండి చాలు అంతే చిరునవ్వు పాకిపోతుంది. బ్రెజిల్‌లోని నిటెరోయ్ అనే నగరాన్ని ‘ద స్మైలింగ్ సిటీ’ అని ముద్దుగా పిలుస్తారు. ఆ నగరాన్ని ఎప్పటికైనా చూడాలని నాకు కోరిక. ఆ సిటీ తిరిగి నవ్వుతుందట అంటే, అక్కడి జనాభా అంతా సంతోషంగా ఉన్నట్టే కదా. మన హైదరాబాద్‌ను కూడా భారతదేశానికి స్మైల్ క్యాపిటల్‌గా మారుద్దాం. కష్టంలో ఉంటే చిరునవ్వు కష్టం అంటారా, ఒక్కసారి నవ్వి చూడండి మీ కష్టం తేలికైపోతుంది. కష్టాల్, నష్టాల్, ఉరుకుల్, పరుగుల్ ఎన్ని ఉన్నా కూడా మనం పూయిద్దాం నవ్వుల్ పువ్వుల్. మిషన్ ‘హైదరాబాద్ స్మైల్’ మీరు నవ్వండి పక్క వ్యక్తినీ నవ్వించండి. స్మైల్ ప్లీజ్. facebook.com/anchorjhansi -
ఆదిలోనే అవకాశాలు రావడం అదృష్టం
టీవీ, సినీ నటి ఝాన్సీ రాజమండ్రి కల్చరల్ :టీవీ ప్రసారాలు ప్రారంభమైన తొలినాళ్లలోనే తనకు అవకాశాలు వచ్చాయని, అది తన అదృష్టమని ప్రముఖ టీవీ యాంకర్, సినీనటి ఝాన్సీ తెలిపారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి రాజమండ్రి వచ్చిన ఆమె తన టీవీ, సినీ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. రాణించడానికి కారణం టీవీ ప్రసారాల ప్రారంభ దశలోనే నాకు అవకాశాలు రావడంతో అన్ని రకాల యాసలు అలవాటయ్యాయి. విభిన్న పాత్రలు లభించాయి. చాలామంది ప్రేక్షకులు నన్ను కలిసినప్పుడు నా నటన యాంత్రికంగా ఉండదని, బుల్లితెరపై నన్ను చూస్తుంటే కుటుంబ సభ్యురాలిని చూసినట్టే ఉంటుందని చెబుతుంటారు. దానికి కారణం తొలితరం నటిని కావడమే. చదువూసంధ్యా నేను మాస్టర్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ చేశాను. అలాగే మెడికల్ లాలో డిప్లొమా కూడా చేశాను. నేటి సినిమాల తీరుతెన్నులు ఈ మధ్య విడుదలవుతున్న చిన్న సినిమాలు చాలా బాగుంటున్నాయి. చిన్న సినిమా కొత్త ఆలోచనలకు వేదికగా మారింది. దర్శకుడి సృజనాత్మకత, ప్రతిభ అన్నీ చిన్న సినిమాల్లో వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమకు పెద్ద సినిమా ఎంత ముఖ్యమో, చిన్న సినిమా కూడా నా దృష్టిలో అంతే ముఖ్యం. నా సినిమాల గురించి ఎన్ని సినిమాల్లో చేశానో లెక్కపెట్టుకోలేదు. సుమారు 50 సినిమాలు చేసి ఉండొచ్చు. అభిమాన హీరో ఎవరంటే చెప్పడం కష్టం. అక్కినేని నాగార్జున, జగపతిబాబుల నటనంటే ఇష్టపడతాను. సాక్షితో అనుబంధం సాక్షితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లో వచ్చే సిటీ ప్లస్‌లో ‘ఝాన్సీ కీ రాణి’ పేరిట ఓ ఫీచర్ చేస్తున్నా. -
ఐ లైక్ పాజిటివ్ మైండ్స్ : ఝాన్సీ
బుల్లితెర బాట చూపినా... వెండి తెర వెలుగునిచ్చినా.. జీవితంలో ఎత్తుపల్లాలు ఎదురైనా.. తనను మున్ముందుకు నడిపిస్తోంది.. ఆశావాహ దృక్పథమే అని అంటున్నారు యాంకర్ ఝాన్సీ. ఆమెను కదిలిస్తే జీవితంలోని భిన్నమైన కోణాలు కన్పిస్తాయి. చిన్నప్పటి నుంచి గూడుకట్టుకున్న ఎన్నెన్నో అనుభూతులు పలుకరిస్తాయి. సిటీప్లస్‌తో ఝాన్సీ పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే.. ‘ఆత్మ విశ్వాసం మనిషిని నడిపిస్తుంది. పరిస్థితులు పాఠాలు నేర్పిస్తాయి. ప్రతి మలుపులో రెండు దారులుంటాయి. ఒకటి నెగెటివ్.. మరొకటి పాజిటివ్. బట్ ఐ ఆల్వేస్ లైక్ పాజిటివ్ వే. అలాంటి మనస్తత్వమే.. నన్ను నడిపిస్తోంది. ఏఎన్నార్.. తనికెళ్ల.. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడూ పాజిటివ్ అనుభవాలే చెబుతారు. ఆయన జీవితంలో నెగెటివ్ లేదా..? తనికెళ్ళ భరణిగారు ఎప్పుడూ వైవిధ్యంగా ఆలోచిస్తారు. అవ న్నీ జనానికి నచ్చుతాయో లేదోనని ఆలోచించరా..? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వెదికాను. వారి ఆలోచనా విధానమే కరెక్టని తెలుసుకున్నాను. గ్లామర్ ఫీల్డ్‌లో ఎంటరయ్యాక ప్రతి ఆదివారం తనికెళ్ల భరణి గారింటికి వెళ్లడం ఆనవాయితీగా మారింది. అక్కడికి వెళ్తే ఏదో ఒక ైవె విధ్యమైన ఆలోచన మొదలవుతుంది. స్వామి వివేకానందుడి బోధనలు కూడా నన్నెంతో ప్రభావితం చేశాయి. ఆశావాదపథం వైపు నడిపించాయి. అల్లరిపిల్లని.. చిన్నతనం నుంచి అల్లరిగానే ఉండేదాన్ని. స్కూల్ డేస్ నుంచి కాలేజ్ వరకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. అప్పుడు మూడో తరగతి అనుకుంటా. చేతిలో కేరియర్.. భుజానికి స్కూల్ బ్యాగ్.. బ్యాగ్ జేబులో రూట్ పాస్. హయత్‌నగర్‌లో బస్సెక్కి మలక్‌పేటలోని వికాస భారతి స్కూల్‌కు వచ్చేదాన్ని. ‘ మా చిట్టితల్లి ఎంత కష్టపడుతోందో’ అని అమ్మ మురిసిపోవడం నాకు ఇన్స్పిరేషన్. స్కూల్‌కు డుమ్మా కొడదామనిపించినా అమ్మ ఆనందం నన్ను వెనక్కి లాగేది. ఆ జారుడు బండల్లో... గచ్చిబౌలి వెళ్లినప్పుడల్లా ఆ బండరాళ్లు పలకరిస్తుంటాయి. పెద్ద పెద్ద రాళ్లు.. మధ్యలో చెరువు.. ఫ్రెండ్స్‌తో కలసి ఆడుకున్న క్షణాలు.. అన్నీ మనోయవనికపై అలా కదలిపోతుంటాయి. అమ్మది ఆకాశవాణిలో ఉద్యోగం.. నాన్న కాంట్రాక్టరు. నేను కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నా. కొన్నేళ్లు గచ్చిబౌలీలోని గవర్నమెంట్ క్వార్టర్స్‌లో ఉన్నాం. స్కూల్ మధ్యాహ్నం మూడున్నరకే అయిపోయేది. అమ్మానాన్నలు వచ్చే సరికి సాయంత్రం ఆరు దాటేది. ఏడ్చేశాను.. గచ్చిబౌలి క్వార్టర్స్‌కు వెళ్లాలంటే ఒకే ఒక బస్సు ఉండేది. ఆదివారాలు అమీర్‌పేటలోని మా బంధువుల ఇంట్లో ఉండేవాళ్లం. అక్కడి నుంచే షాపింగ్‌కో.. సినిమాకో.. ఇంకెక్కడికైనా వెళ్లే వాళ్లం. శనివారం ఆకాశవాణి ప్రోగ్రాం అయిపోగానే అమ్మ నన్ను ఒక్కదాన్నే బస్సెక్కి అమీర్‌పేట వెళ్లమంది. నాకేం భయం! 9 నంబర్ కదా.. నాకు తెలుసు అన్నట్టు బస్సెక్కాను. పావలా ఇచ్చి అమీర్‌పేటకు టికెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇమేజ్ హాస్పిటల్ ఉన్న చోట అప్పట్లో చెరువు ఉండేది. అదే అమీర్పేటని ధీమాగా ఉన్నాను. కిటీకీ లోంచే చూస్తూ కూచున్నా.. ఎంతకూ చెరువు రాదే..! చెరువు దాటేశామా ? అసలీ బస్సు అమీర్‌పేట వెళ్తుందా ? కండక్టర్‌ను అడిగితే.. ఛా... నాకు తెలియదా ఏంటీ? అయినా డౌట్.. కండక్టర్ ఇది వయా ఎటు వైపు అని.. ఈగోతోనే అడిగాను. అమీర్‌పేట నుంచే అన్నాడు. ఇంతలో లాస్ట్ స్టాప్ సనత్‌నగర్ వచ్చేసింది. అదేంటని కండక్టర్‌ను అడిగా.. అమీర్‌పేట్ ఎప్పుడో వెళ్లిపోయిందని ఆయన అనగానే.. నాకూ ఏడుపొచ్చేసింది. వెనక్కు వెళ్లడానికి డబ్బుల్లేవు. ఇంతలో ఓ పెద్దావిడ డబ్బులిచ్చింది. అమీర్‌పేటలో దించమని కండక్టర్‌కు చెప్పింది. ఇంకేం.. క్వార్టర్స్‌లోని ఆడపిల్లలమంతా కలసి.. సైకిళ్లు వేృుకుని.. దర్గా దాటి ఆ చెరువు దగ్గరకు వచ్చేసేవాళ్లం. అక్కడ జారుడు బండగా ఉండే ఓ పెద్ద రాయిని మౌంట్ ఎవరెస్ట్ అని పిలిచేవాళ్ళం. సాయంత్రానికి డ్రెస్ మొత్తం మాసిపోయేది. అమ్మవాళ్లు వచ్చేసరికి ఇంటికెళ్లి బుద్ధిగా డ్రెస్ మార్చుకునేదాన్ని. బాలానందంతో నిఘంటువు నాంపల్లి అసెంబ్లీ ఏరియాతో అనుబంధం విడదీయలేనిది. నాన్న అసెంబ్లీ వద్ద కాంట్రాక్టు పనులు చేసేవారు. నేను బాలానందంలో ప్రోగ్రాం ఇవ్వడానికి ప్రతి శనివారం వెళ్లేదాన్ని. సరదాగా చేసినా.. ఈ ప్రోగ్రామ్స్‌తో వచ్చిన డబ్బుతో.. ఒక నిఘంటువు కొనుక్కున్నాను. ఇప్పటికీ అది పదిలంగా దాచుకున్నాను. బాలానందం ప్రోగ్రాం అయిపోగానే అమ్మ ఆ పక్కనే ఉన్న జామ్జామ్ హోటల్‌కు తీసుకెళ్లేది. ఇప్పటికీ అక్కడే ఉంది. అక్కడ చాయ్, మస్కాబన్ ఇప్పించేది. ఇప్పటికీ ఆ రుచి మరచిపోలేదు. అట్నుంచి రోడ్డు దాటి అసెంబ్లీకి వెళ్లేదాన్ని. అక్కడ హోటల్లో కోల్డ్ కాఫీ స్పెషల్. నేను రావడమే ఆలస్యం.. నాన్న కోల్డ్ కాఫీ ఆర్డరిచ్చేవాడు. అసెంబ్లీ పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్స్‌లో బాలభవన్ ఉండేది. అక్కడే పెయింటింగ్, డాల్మేకింగ్, మ్యూజిక్ నేర్చుకున్నాను. జాగ్రఫీ చాలా ఇష్టం ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ. మా క్లాస్‌లో 20 మందిమే ఉండేవాళ్లం. బుద్ధిమంతుల్లా కనిపించినా.. అల్లరి చేయడంలో ఎవరికి వారే సాటి. జాగ్రఫీ క్లాసంటే బాగా ఇష్టం. ఆ టైంలో ఎవరు అల్లరి చేసినా కోపం వచ్చేది. క్లిక్ క్లిక్.. నో ఫియర్! ఆకాశవాణీలో ఎప్పుడో బ్యాంకు అధికారి నన్ను చూశారట. స్టేట్‌బ్యాంకు యాడ్‌లో నన్ను తీసుకోవాలనుకున్నారు. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారు. ఆకాశవాణిలో షూట్ చేశారు. కొత్త కదా. ఇలా... అలా అంటూ సలహాలి చ్చారు. తర్వాత వాళ్లే.. ఏంటీ జంకూ బొంకూ లేకుండా అదరగొట్టేశావ్ అన్నారు. ఈ కలివిడితనం సిటీలైఫే నేర్పింది. అదే నా కెరీర్‌కు ప్లస్ అయింది. ఆ తర్వాత హెయిర్ ఆయిల్ యాడ్.. ఇంకెన్నో యాడ్స్‌లో నటించే అవకాశం. విజేత సీరియల్ మరో అవకాశం. అందులోని ఏడుపు సీన్.. గ్లిజరిన్‌తో లాగించేయమన్నారు. కానీ సహజసిద్ధమైన యాక్టింగ్ కోసం సీటీలో డిఫరెంట్ ట్రెండ్స్ అధ్యయనం చేశాను. కనుపాపల్లో నీళ్లూరించే గాధలు విన్నాను. ఆనందం పంచే అనుభవాలు తెలుసుకున్నాను. అవర్‌ప్లేస్ అంటే ఇష్టం.. సిటీ టేస్ట్ విషయానికి వస్తే.. బిర్యానీ అంటే ప్రాణం. రుచి కోసం ఒకసారి 12 హోటళ్లకు వెళ్ళాను. అన్నమైనా మానేస్తాను కానీ.. బిర్యానీ ఎంతైనా తినేస్తాను. బంజారాహిల్స్‌లోని అవర్‌ప్లేస్ నాకు బాగా సూట్ అయింది. ఎంతగా అంటే.. అక్కడొకామె నాకోసం ఎదురుచూస్తుండేంది. ఈ రోజు ఇంకా ఝాన్సీ రాలేదేంటి? అని ఆరా తీస్తుంది. ప్యారడైజ్ బిర్యానీ లైక్ చేస్తాను. కరాచీ బేకరీలో బిస్కెట్లు... మొజాంజాహీ మార్కెట్లోని ఓ షాపులోని ఐస్ క్రీం చాలా చాలా ఇష్టం. అబిడ్స్‌లో డ్రెస్సులు కొనడం చిన్నప్పటి నుంచి ఇష్టం. గోల్కొండ పైదాకా వెళ్ళడం.. అక్కడి నుంచి ‘కెవ్వు...’ మంటూ కేకేయడం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటు. కోటలో ఉండే దర్వాజాలు మరీ ఇష్టం. పెద్ద పెద్ద రాళ్లన్నా ఇష్టమే. రాళ్లను పగుల గొట్టకుండా ఇళ్లుకడితే.. ఆ ఇంటికి వెళ్లి చూడాలనిపిస్తుంది. గ్రేట్ కల్చర్ భాగ్యనగరం అంటే భిన్నమైన జీవనశైలి. విభిన్నమైన వ్యక్తుల కలయిక. నగరంలో ఒక్కో ప్రాంతం ఒక్కో శైలికి ప్రతీక. అందులో పాతబస్తీ మరీ ప్రత్యేకం. తీరికలేని జీవితంలో.. సాంస్కృతిక ఆనవాళ్లు చెదిరిపోకుండా సిటీ తన గొప్పదనాన్ని చాటుకుంటుంది. కొందరు కావాలనో.. నోరు తిరగకో.. హైదరాబాడ్ అంటుంటారు. అలా ఎవరైనా అంటే.. సరిగ్గా ఉచ్ఛరించమని చెబుతాను. - వనం దుర్గాప్రసాద్ ఫొటోలు : ఎస్.ఎస్.ఠాకూర్