కరోనా వల్ల పెళ్లిళ్ల రూపురేఖలు మారిపోయాయి. మండపానికి వందలాదిగా తరలివచ్చే బంధువులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే కట్నకానుకలు పంపిస్తూ ఫోన్‌లోనే వివాహ వేడుకను వీక్షిస్తున్నారు. అసలే రానున్నది పెళ్లిళ్ల సీజన్. ఈ నేపథ్యంలో తన బంధువుల ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకల గురించి యాంకర్ ఝాన్సీ స్పందించింది. తనకు కొడుకు వరుసైన వ్యక్తికి నిశ్చితార్థం జరిగిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ వేడుకను తాను నేరుగా కాకుండా లైవ్‌లోనే వీక్షించాల్సి వచ్చిందని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
"మనందరం ఎన్నో కారణాల వల్ల కోవిడ్‌ను ద్వేషిస్తున్నాం. నేనైతే ఈ వేడుకకు హాజరు కాలేకపోయినందుకు ఆ వైరస్‌ను తిట్టుకుంటున్నాను. పుత్రసమానుడైన సంపత్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. దాన్ని నేను ఆన్‌లైన్‌లో వీక్షించాను. ఈ నిశ్చితార్థ వేడుక కేవలం ఇరు కుటుంబ సభ్యులు మధ్య మాత్రమే జరిగింది. దీని కంటే ముందుగా వారందరికీ కరోనా పరీక్షలు జరపగా నెగెటివ్ అని తేలింది. ప్రపంచవ్యాప్తంగా నాతో సహా 300 మంది ఈ ఎంగేజ్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించారు. ఇది కొత్తదే అయినా నేర్చుకుంటున్నాం. కొంత కష్టమే కానీ తప్పడం లేదు" అని ఝాన్సీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment