Anirban Bhattacharya
-
‘జేఎన్‌యూ’ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి దేశద్రోహం కేసులో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతర నిందితులపై ఢిల్లీ పోలీసులు సోమవారం అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేశారు. కన్హయ్యతోపాటు జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలపై దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న అభియోగాలను పోలీసులు మోపారు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి సూత్రధారి అయిన అఫ్జల్ గురు వర్ధంతిని జేఎన్‌యూ క్యాంపస్‌లో 2016 ఫిబ్రవరి 9న కన్హయ్య కుమార్, ఇతర విద్యార్థులు నిర్వహించడంతో వారిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసమే మూడేళ్ల తర్వాత పోలీసుల చేత బీజేపీ ఈ పని చేయిస్తోందని నిందితులు, ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాగా, అభియోగపత్రంలో కశ్మీరీ విద్యార్థులు అఖీబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రయీయా రసూల్, బషీర్ భట్, బషరత్‌ల పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 36 మందిలో సీపీఐ నేత డి. రాజా కూతురు అపరాజిత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్, బానోజ్యోత్స్న లాహిరి, రమా నాగ తదితరులున్నారు. బుధవారం ఢిల్లీ కోర్టు ఈ అభియోగపత్రాన్ని పరిశీలించనుంది. సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫుటేజీతోపాటు పలు పత్రాలను కూడా పోలీసులు అభియోగపత్రంతోపాటు కోర్టుకు సమర్పించారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసేలా కన్హయ్య కుమారే అక్కడున్న గుంపును రెచ్చగొట్టాడని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపితమే: కన్హయ్య ఇన్నాళ్ల తర్వాత చార్జిషీట్ వేయడం తమకు మంచిదేననీ, కేసు విచారణ పూర్తయితే నిజానిజాలు ఏంటో బయటకొస్తాయని కన్హయ్య అన్నారు. సీపీఐ నేత డి. రాజా మట్లాడుతూ రాజకీయ కారణాలతోనే ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేస్తున్నారనీ, దీనిపై తాము కోర్టులోనూ, కోర్టు బయట రాజకీయంగానూ పోరాడతామని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలా చేస్తోందని కేసులో మరో నిందితుడు ఉమర్ ఖలీద్ ఆరోపించారు. షెహ్లా రషీద్ మాట్లాడుతూ ఇది నకిలీ కేసు అనీ, నిందితులందరూ నిర్దోషులుగా కేసు నుంచి బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 9: పార్లమెంటుపై దాడి కేసులో సూత్రధారి అఫ్జల్ గురు వర్ధంతి రోజున అతనిని పొగుడుతూ జేఎన్‌యూ క్యాంపస్‌లో ర్యాలీ ఫిబ్రవరి 10: దీనిపై క్రమశిక్షణా విచారణకు జేఎన్‌యూ యంత్రాంగం ఆదేశం. ఫిబ్రవరి 11: బీజేపీ ఎంపీ మహేశ్ గిరి, ఆరెస్సెస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఫిర్యాదులను స్వీకరించి కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరి 12: కన్హయ్య కుమార్ అరెస్ట్.. భారీ ఆందోళనలకు దిగిన విద్యార్థులు ఫిబ్రవరి 15: కన్హయ్య కేసు విచారణకు ముందు పాటియాలా హౌస్ కోర్టులో విద్యార్థులు, పాత్రికేయులు, అధ్యాపకులను దేశ వ్యతిరేకులుగా పేర్కొంటూ న్యాయవాదుల దాడి. ఫిబ్రవరి 25: తీహార్ జైలుకు కన్హయ్యను పంపిన కోర్టు మార్చి 3: కన్హయ్యకు ఆరు నెలల బెయిలు ఆగస్టు 26: కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్లకు సాధారణ బెయిలు 2019 జనవరి 14: కేసులో అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు -
ఫైన్ కట్టే ప్రసక్తేలేదు... నిరవధిక దీక్ష చేస్తాం
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) వివాదం రోజురోజుకూ ముదిరిపోతుంది. వర్సిటీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ విద్యార్థినేత కన్హయ్యకుమార్కు రూ.10 వేల జరిమానా విధించిన విషయంతెలిసిందే. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడన్న నేరంతో ఏబీవీపీ నాయకుడు సౌరభ్ శర్మకు కూడా రూ.20 వేల జరిమానా విధించింది. అయితే తాము జరిమానా కట్టే ప్రసక్తేలేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. ఉన్నతస్థాయి కమిటీ ఉత్తర్వుల ప్రకారం హాస్టల్ ఖాళీచేసి వెళ్లనున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు రద్దుచేయాలంటూ నిరసనగా బుధవారం నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టబోతున్నట్లు విద్యార్థిసంఘం నేత కన్హయ్యకుమార్ మీడియాకు వివరించారు. తమపై జరుగుతున్న విధానాలు, చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఆఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా గత ఫిబ్రవరి 9న కార్యక్రమం నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ కు జరిమానా విధించడంతో పాటు, ఉమర్, అనిర్బన్ భట్టాచార్యలు వర్సిటీలో మత హింసకు, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన కారణంగా ఉమర్‌ను ఒక సెమిస్టర్, ముజీబ్ గట్టూను రెండు సెమిస్టర్లు, భట్టాచార్యను జూలై 15 వరకు సోమవారం నాడు బహిష్కరించింది. -
కన్హయ్యకు జరిమానా
ఉమర్ ఖాలిద్ సహా ముగ్గురు విద్యార్థుల సస్పెన్షన్ న్యూఢిల్లీ: ఆఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా గత ఫిబ్రవరి 9న కార్యక్రమం నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) రూ.10 వేల జరిమానా విధించింది. ఉమర్ ఖాలిద్ సహా ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 9 నాటి కార్యక్రమంపై దర్యాప్తు జరిపేందుకు వర్సిటీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ.. సాక్ష్యాలు, వీడియో క్లిప్పింగులు తదితరాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఉమర్, అనిర్బన్ భట్టాచార్యలు వర్సిటీలో మత హింసకు, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని పేర్కొంది. ఈ మేరకు ఉమర్‌ను ఒక సెమిస్టర్, ముజీబ్ గట్టూను రెండు సెమిస్టర్లు, భట్టాచార్యను జూలై 15 వరకు బహిష్కరించింది. జేఎన్‌యూలో వచ్చే ఐదేళ్ల వరకు ఎలాంటి కోర్సు చేయకుండా భట్టాచార్యపై నిషేధం విధించింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడన్న నేరంతో ఏబీవీపీ నాయకుడు సౌరభ్ శర్మకు కూడా రూ.20 వేల జరిమానా విధించింది. మొత్తంగా 14 మందిపై జరిమానా విధించింది. అయితే పరిపాలన శాఖ ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కాగా, క్యాంపస్‌లో నిరసన కార్యక్రమ వీడియో ఫుటేజీల్లో మార్పులు చేసి మూడు న్యూస్ చానళ్లు ప్రసారం చేశాయని, వాటిపై విచారణ జరపాలని కోర్టును ఢిల్లీ ప్రభుత్వం కోరింది. -
జేఎన్‌యూ విద్యార్థులకు బెయిల్
రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్య లకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆరునెలల మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోర్టు రూ.25,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. జేఎన్‌యూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ఫిబ్రవరి 24న పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కన్హయ్య కుమార్ తో పాటు జాతి వ్యతిరేక నినాదాలు చేశారని, అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా కన్హయ్య కుమార్ బెయిల్ పై బయటికి వచ్చిన రెండు వారాలకు వీరిద్దరికి బెయిల్ మంజూరైంది. మరో వైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయలేదు.