Anjan Kumar Goud
-
ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు
చేవెళ్ల, న్యూస్‌లైన్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడంలేదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. మండల కేంద్రం లోని బస్‌స్టేషన్ వద్ద శనివారం నమోః చాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒంటరిగానే పోటీచేస్తామని పునరుద్ఘాటించారు. అభ్యర్థుల ఎంపికకు పార్టీ నాయకత్వం కసరత్తు ముమ్మరం చేసిందని, ఈనెల రెండో వారంలోగా జాబితా విడుదలవుతుం దని తెలిపారు. ప్రస్తుత సరళి, ప్రజల్లో చైతన్యం, మనోగతాన్ని చూస్తే బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. కొంతమంది రాజకీయ లబ్ధి, వ్యక్తిగత స్వార్థంతోనే పార్టీలు మారుతున్నారే తప్ప తెలంగాణకోసం కాదన్నారు. గుజరాత్‌ను ప్రపంచదేశాలు పొగిడేలా అభివృద్ధి చేసిన నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి కాంగ్రెస్‌పార్టీని అధికారం నుంచి కూకటివేళ్లతో పెకిలించి వేస్తేనే ఈ దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. టీ అమ్మడం నేరంకాదని, దేశాన్ని అమ్మడమే నేరమనే నినాదంతోనే ఎన్నికలకు వెళ్తున్నట్లు వివరిం చారు. తాను చేవెళ్ల లోక్‌సభ టికెట్‌ను ఆశిస్తున్నానని, ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసినట్లు చెప్పారు. టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరంలేదని, గెలిపించడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కంజర్ల ప్రకాష్, అత్తెల్లి విఠల్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ప్రభాకర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ జంగారెడ్డి, మండల అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, సీనియర్ నాయకులు కుంచం శ్రీనివాస్, దేవర ఎల్లారెడ్డి, గోపాల్‌రెడ్డి, ఎత్భార్పల్లి శేఖర్‌రెడ్డి, అనంతరెడ్డి పాల్గొన్నారు. -
ఐక్యతకు స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్
చేవెళ్ల, న్యూస్‌లైన్ : రైతు బాంధవుడు, దేశ ఐక్యతకు స్ఫూర్తిగా నిలిచిన దేశ మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్ గౌడ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహ నిర్మాణ యజ్ఞంలో భాగంగా బీజేపీ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపుమేరకు ఆదివారం చేవెళ్లలో విద్యార్థులతో పెద్దఎత్తున ఐక్యతా రన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అయ్యప్ప దేవాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో అంజన్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. బ్రిటిష్ వారు శిస్తు చెల్లించని రైతుల భూములను స్వాధీనం చేసుకుంటుంటే తీవ్రంగా ప్రతిఘటించి భూములను వారికి తిరిగి ఇప్పించిన ధీశాలి సర్దార్ పటేల్ అన్నారు. స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సుమారు 535 సంస్థానాలను విలీనం చేసిన ఘనత పటేల్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. నిజాం ఎంత మొండికేసినా సైనికచర్యతో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయించిన ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్ అని నివాళులర్పిం చారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ వల్లభాయ్ పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకొని దేశ సమైక్యత, సమగ్రత కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యూనిటీ రన్ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో రికా ర్డు సాధించబోతున్నదని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జాగృతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, వివేకానంద జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్‌రెడ్డి, శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్, బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యుడు ఆంజనేయులుగౌడ్, మండల జేఏసీ కన్వీనర్ మర్ప ల్లి కృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైదిగా గుజరాత్లో ఏర్పాటు చేయనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి అందరూ తోడ్పాటునందించాలని కోరారు. అనంతరం అయ్యప్ప దేవాలయం నుంచి వైఎస్సార్ చౌరస్తా వరకు ఐక్యతా పరుగును నిర్వహించారు. వందలాది విద్యార్థులు జాతీయ పతాకాలు చేతబూని వందేమాతరం... భారత్‌మాతాకీ జై నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పరుగుతీశారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కంజర్ల ప్రకాశ్, జిల్లా నాయకులు జంగారెడ్డి, దేవర గోపాల్‌రెడ్డి, అత్తెల్లి విఠల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, చిలుకూరు గోపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఎం.బాల్‌రాజ్, క్యామ పద్మనాభం, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
బీజేపీ ఒత్తిడితోనే తెలంగాణ ప్రకటన
ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: బీజేపీ ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటన చేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఘట్కేసర్ మండల కేంద్రంలో శనివారం ఆయన పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో అంజన్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో బీజేపీ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. రాబో యే ఎన్నికల్లో నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని సూచించారు. ఈనెల 15న మండల కేంద్రంలో నిర్వహించనున్న ‘యూనిట్ ఫర్ రన్’ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సర్ధార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం గుజరాత్లో ఆవిష్కరణను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పార్టీలకతీంగా ప్రజలంతా పాల్గొనే విధంగా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు సత్యనారాయణ, యువమోర్చ జాతీయ కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గుండ్ల బాల్‌రాజ్, రాష్ట్ర గిరిజన మోర్చ నాయకుడు బిక్కునాథ్‌నాయక్, రాష్ట్ర నాయకుడు మోహన్‌రెడ్డి, పర్యావరణ రాష్ట్ర కన్వీనర్ నల్ల భాస్కర్‌రెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జి లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రామోజీ, దళిత మోర్చ జిల్లా ప్రధానకార్యదర్శి మారేష్, పార్టీ జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి, మీడియా సెల్ జిల్లా కన్వీనర్ తిరుమలరెడ్డి, మండల అధ్యక్షుడు లోడే చంద్ర య్య, ప్రధాన కార్యదర్శి కర్ణాకర్, కీసర మండల అధ్యక్షుడు అశోక్, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్, మహేందర్, ప్రభాకర్, సత్యనారాయణ, వీరేశం, రజనిరెడ్డి, నర్సింహారెడ్డి ఉన్నారు. -
బీజేపీకి ఇద్దరు సారథులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంస్థాగత నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ జిల్లాలో రెండు శాఖలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు గ్రేట ర్ హైదరాబాద్ కమిటీ పరిధిలో ఉన్న జిల్లాలోని 48 జీహెచ్ఎంసీ వార్డులతో రంగారెడ్డి అర్బన్ పేరిట కొత్త కమిటీని ప్రకటించింది. గ్రేటర్లో మిళితం చేయడంతో శివార్లలో పార్టీని పటిష్టం చేయడం సంస్థాగతంగా కష్టమవుతుం దనే అభిప్రాయానికివచ్చిన రాష్ట్ర నాయకత్వం.. రంగారెడ్డి జిల్లాను రెండుగా విభజించింది. రంగారెడ్డి గ్రామీణ, రంగారెడ్డి పట్టణ పేరుతో కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాం తానికి అంజన్‌కుమార్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రంగారెడ్డి అర్బన్‌కు మీసాల చంద్ర య్య (నాచారం)ను అధ్యక్షుడిగా నియమిస్తూ శనివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఉత్తర్వులు అందజేశారు.