anjum Chopra
-
భరత్ ని బలిపశువును చెయ్యొద్దు
-
కన్నీటి పర్యంతమైన హర్మన్... అక్కున చేర్చుకున్న అంజుమ్.. వీడియో
ICC Womens T20 World Cup 2023: ఇటీవలే సౌతాఫ్రికాలో అండర్-19 టీ20 వరల్డ్‌కప్-2023లో మన అమ్మాయిలు అదరగొట్టి ఐసీసీ టైటిల్ గెలిచారు. అదే జోష్‌ను కొనసాగిస్తూ అదే గడ్డపై ట్రోఫీని ముద్దాడాలని హర్మన్‌ప్రీత్ సేన భావించింది. అందుకు తగ్గట్లుగానే మెరుగైన ప్రదర్శనతో టీ20 మహిళా ప్రపంచకప్-2023 టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లింది. అయితే, కీలక మ్యాచ్‌కు ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అనారోగ్యం బారిన పడిందన్న వార్త అభిమానులను కలవరపెట్టింది. అయినప్పటికీ, పటిష్ట ఆస్ట్రేలియాను ఎదుర్కొనే క్రమంలో బరిలోకి దిగిన హర్మన్ అద్భుత ఇన్నింగ్స్(34 బంతుల్లో 52 పరుగులు) ఆడింది. 173 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా జెమీమా రోడ్రిగ్స్ 24 బంతుల్లో 43 పరుగులతో చెలరేగగా.. హర్మన్ అర్ధ శతకంతో మెరిసింది. అయితే, ఆమె రనౌట్ కావడం టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. ఆఖరి వరకు పోరాడినా గెలుపు గీత దాటలేక ఓటమి ముందు తలవంచింది. మరోసారి ప్రపంచకప్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్ ఈసారి సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కన్నీటిపర్యంతమైంది. అద్భుత పోరాట పటిమ కనబరిచినా.. పరాజయం తప్పకపోవడంతో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న భారత మాజీ సారథి అంజుమ్ చోప్రా హర్మన్‌ను అక్కున చేర్చుకుని ఓదార్చింది. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని హర్మన్‌కు ఓదార్పు మాటలు చెప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో సన్‌గ్లాసెస్ ధరించిన హర్మన్ తన కన్నీటిని మాతృదేశం చూడకూడదనే ఉద్దేశంతోనే వాటిని ధరించినట్లు చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్ ఎలా ఉందంటే! PSL 2023: బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టడానికి వెళ్లిన పాకిస్తాన్ కెప్టెన్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
ఒక్క సీజన్‌కే ధోనిని తప్పుపడతారా?
ముంబై : ఐపీఎల్ 13వ సీజన్లో దారుణమైన ప్రదర్శన కనబరిచిన చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ నుంచి వైదొలిగిన తొలి జట్టుగా నిలిచింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్కే అభిమానులు ఆశలను అడియాశలు చేస్తూ.. ఎవరూ ఊహించిన విధంగా 12 మ్యాచ్‌ల్లో నాలుగే విజయాలు నమోదు చేసి ఏకంగా ఎనిమిది ఓటములతో తీవ్రంగా నిరాశపరిచింది. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో తొలిసారి చివరి స్థానానికి పరిమితం అయ్యింది. (చదవండి : శామ్యూల్స్‌కు మతి చెడింది) మూడు సార్లు ఛాంపియన్, ఐదుసార్లు రన్నరఫ్తో పాటు అన్ని సీజన్స్‌లో ఫ్లే ఆఫ్స్‌కి చేరిన ఘనత కలిగిన చెన్నై ఈసారి టోర్నీలో కనీస పోరాట పటిమను సైతం చూపలేక ఆటగాళ్లు ప్రత్యర్థికి దాసోహమన్నారు. టోర్నీ ఆసాంతం ఫేలమైన ఆట తీరుతో సీనియర్ సిటిజన్స్ అనే బిరుదుతో పాటు అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలను సైతం ఎదుర్కొంది. ఇక కెప్టెన్‌గా ధోని పూర్తిగా విఫలమయ్యాడని.. చెన్నై టీం మొత్తం ప్రక్షాళన చేయల్సిందేనంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చిన విషయం విధితమే. ఐపీఎల్ 2021 సీజన్లోనూ ధోనియే చెన్నై టీంకు సారథ్యం వహిస్తారని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ మంగళవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా ఎంఎస్ ధోని నాయకత్వాన్ని అందరూ విమర్శించడం పట్ల తప్పుబట్టారు. ' ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎంఎస్ ధోని 2008 నుంచి 2020 వరకు( మధ్యలో రెండు సీజన్లు మినహాయించి) చెన్నై సూపర్ కింగ్స్‌ను తన భుజాలపై మోశాడు. ఐపీఎల్ చరిత్రలో ధోని ఒక్కసారి కూడా వేలంలోకి వెళ్లలేదు. ఒక ఐకానిక్ ప్లేయర్‌గా సీఎస్కే జట్టుకు నాయకత్వం వహించాడు. అలాంటిది ఏదో ఒక్క సీజన్లో విఫలమైనంత మాత్రానా అతని నాయకత్వ ప్రతిభను తప్పుబట్టడం సరికాదు. అనుభవజ్ఞమైన ఆటగాడిగా భారత క్రికెట్‌కు సేవలందించిన ధోని.. ఎన్నోసార్లు మ్యాచ్విన్నర్గా నిలిచాడు. ఇటు ఐపీఎల్‌లోనూ సీఎస్కేను విజయవంతంగా నడిపించిన ధోనికి ఒకవేళ జట్టు విఫలమైతే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో అతనికి ముందుగానే తెలుసు. అయినా సీఎస్కేనే ప్రతీ సీజన్లోనూ టైటిల్ గెలవలేదు కదా.. ఏదో ఒక సీజన్లో ఘోర ప్రదర్శన చేసినంత మాత్రానా ఒక్క ధోనినే తప్పు బట్టడం సమంజసం కాదు. (చదవండి : అతని ఆట నాకు ఆశ్చర్యం కలిగించింది) ధోని విఫలమైన మాట నిజమే.. కానీ జట్టులోని మిగతా ఆటగాళ్లు సమిష్టి ప్రదర్శన చేయకపోవడంతోనే ఇలాంటి ప్రదర్శనలు వస్తాయని మాత్రం ఎవరు మాట్లాడుకోవడం లేదు. అయినా ధోనికి ఇలాంటివేం కొత్తేమి కాదు.. సీఎస్కే జట్టును మళ్లీ బౌన్స్‌బాక్ చేసే సత్తా ధోనికి ఉందని నేను నమ్ముతున్నా. వచ్చే సీజన్లో గనుక ధోని నాయకత్వం వహిస్తే సరికొత్త సీఎస్కేను చూడడం ఖాయంగా చెప్పవచ్చు. ' అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే ప్లేఆఫ్‌కు దూరమైన సీఎస్కే తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్ 29న కేకేఆర్‌ను ఎదుర్కోనుంది. -
‘ఇంకా వరల్డ్ చాంపియన్ కాలేదు కదా’
న్యూఢిల్లీ: పురుషుల, మహిళల క్రికెట్‌ను సమాన దృష్టితో చూడాలని ఇటీవల భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ చేసిన వ్యాఖ్యల్ని మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఖండించారు. అసలు ఆ డిమాండే అనైతికమన్నారు. పురుషుల క్రికెట్‌తో మహిళల క్రికెట్‌ను ఎందుకు సమానంగా చూడాలంటూ ప్రశ్నించారు. ఇంకా వరల్డ్‌కప్ లాంటి ఎటువంటి మెగా టైటిల్‌ను గెలవని భారత మహిళా క్రికెట్ జట్టు.. పురుషుల క్రికెట్ జట్టుతో సమానంగా చూడాలంటూ డిమాండ్ చేయడం సరైనది కాదని అంజుమ్ చోప్రా అభిప్రాయ పడ్డారు. (ఆరోజు కోసం ఎదురుచూస్తున్నా..) మన మహిళా క్రికెట్ జట్టు సభ్యులు.. మరొక మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో పోల్చుకోవాలని సూచించారు. ఇక్కడ ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుతో భారత మహిళా జట్టు పోల్చుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. ‘ నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ఈ సమయంలో పురుషుల క్రికెట్‌తో మహిళల క్రికెట్‌ను సమానంగా చూడాలనే చర్చ ఎందుకు వచ్చినట్లు. భారత మహిళా క్రికెట్ జట్టు ఇప్పటివరకూ వరల్డ్‌కప్ గెలవలేదు. భారత మెన్స్ జట్టు వరల్డ్‌కప్ సాధిస్తే, మహిళలు ఇంకా ఎటువంటి మేజర్ ట్రోఫీని సాధించలేదు కదా. మరి పోలిక ఎందుకు’ అని అంజుమ్ చోప్రా పేర్కొన్నారు. బీసీసీఐ ఇటీవల కాంట్రాక్ట్‌ల ప్రకారం.. గ్రేడ్-ఎ మహిళా క్రికెటర్లకు రూ. 50లక్షలు వార్షిక వేతనం వస్తుండగా, అదే కేటగిరీలో ఉన్న మెన్స్ జట్టు సభ్యులకు రూ. 5 కోట్లు వస్తుంది. ఇక ఎ+ కేటగిరీలో ఉన్న పురుష క్రికెటర్లకు రూ. 7 కోట్లు వార్షిక ఆదాయం లభిస్తుంది. (ధోని టార్గెట్ రూ. 30 లక్షలే..) -
సీకే నాయుడు అవార్డుకు ఎంపికైన శ్రీకాంత్, అంజుమ్ చోప్రా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి యేటా ఇచ్చే ప్రతిష్టాత్మక సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఈ ఏడాదికి గానూ భారత దిగ్గజ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, భారత మహిళల జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రాలు ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డును వచ్చే నెల 12వ తేదీన ముంబైలో జరిగే బోర్డు వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఇవ్వనుంది. వీరిద్దరూ క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ వారిని సీకే నాయుడు అవార్డుతో సత్కరిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చెన్నైకు చెందిన శ్రీకాంత్... భారత్‌కు 1981–1992 మధ్య ప్రాతినిధ్యం వహించాడు. 43 టెస్టుల్లో 2062 పరుగులు, 146 వన్డేల్లో 4091 పరుగులు చేసిన ఈ 60 ఏళ్ల కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్... భారత్ 1983లో తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యుడు. అంతేకాకుండా అతను చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలోనే భారత్ 2011లో రెండోసారి ప్రపంచ కప్‌ను గెల్చుకోవడం విశేషం. 1989లో ఇతని సారథ్యంలోనే సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక 42 ఏళ్ల అంజుమ్ చోప్రా తన కెరీర్లో 12 టెస్టులు, 127 వన్డేలు, 18 టి20లు ఆడింది. -
మహిళలకూ ఐపీఎల్ కావాలి
అంజుమ్ చోప్రా వ్యాఖ్య న్యూఢిల్లీ: మహిళల క్రికెట్లో కూడా ఐపీఎల్ తరహా లీగ్ ఉంటే బాగుంటుందని భారత బ్యాట్స్‌వుమన్ అంజుమ్ చోప్రా అభిప్రాయపడింది. ఈ లీగ్ కూడా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ఐపీఎల్‌లాంటి లీగ్ మహిళల క్రికెట్‌కు చాలా సహాయపడుతుంది. ఎందుకంటే భారత్‌తోపాటు మరికొన్ని దేశాల్లో క్రికెట్‌కు అత్యంత ప్రజాదరణ ఉంది. కాబట్టి ఈ లీగ్ కూడా అదరణ పొందుతుంది. ఏ ఆటకైనా మంచి కవరేజీ, ప్రజాదరణ లభిస్తే అది విజయవంతమవుతుంది. ఇప్పటికే ఎన్నో క్రీడల్లో రకరకాల లీగ్‌లు వచ్చాయి... వస్తున్నాయి. రానురాను భారత్‌లో క్రీడలకు మరింత ప్రజాదరణ పెరుగుతుంది’ అని అంజుమ్ వ్యాఖ్యానించింది. క్రికెట్లో సచిన్ తరువాతే ఎవరైనా అని చెప్పిన అంజుమ్... సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లాంటి ఆటగాళ్లను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఆటలోకి వచ్చానని వెల్లడించింది. -
'మహిళా క్రికెట్ కీ ఐపీఎల్ తరహా టోర్నమెంట్ లు అవసరం'
న్యూఢిల్లీ:భారత్ లో మహిళా క్రికెట్ మరింత వెలుగులోకి రావడానికి ఐపీఎల్ తరహా టోర్నమెంట్ ఉంటే మరింత లబ్ధి చేకూరుతుందని మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఈ తరహా టోర్నమెంట్లు వల్ల మరింత ప్రతిభావంతులైన క్రీడాకారిణులు సత్తా చాటుకునేందుకు ఆస్కారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి టోర్నమెంట్ ను ప్రవేశపెడితే అది ఒక దేశానికే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారిణులకు వెలుగులోకి వచ్చే ఆస్కారం లభిస్తుందన్నారు. భారత క్రికెట్ కు ప్రాతినిధ్య వహిస్తున్న ఓ క్రీడాకారిణిగా తాను ఈ విషయాన్ని క్రికెట్ పెద్దలకు విన్నవిస్తున్నానని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆటలకున్న ప్రాధాన్యతను బట్టి ఆలోచిస్తే లీగ్ మ్యాచ్ టోర్నీలు విజయవంతమైయ్యాయన్న సంగతిని ఆమె గుర్తు చేశారు. ప్రతీ ఆటలోనూ ఇప్పటివరకూ పలురకాలైన లీగ్ లు ఆకట్టుకుంటూనే ఉన్నాయన్నారు. భారత్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంటుందన్నారు. ఎంతమంది ఆటగాళ్లు వచ్చినా ఆయన తరువాతేనని అంజుమ్ తెలిపారు. -
దీర్ఘకాలికమైనవి బెటర్..
సెలబ్రిటీ ఇన్వెస్ట్మెంట్స్.. దేశీయంగా మహిళల క్రికెట్‌కి ప్రాచుర్యం తెచ్చిపెట్టిన వారిలో అంజుమ్ చోప్రా కూడా ఒకరు. ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారామె. క్రికెట్లో తనదైన శైలిలో రాణించిన అంజుమ్ చోప్రా.. పెట్టుబడుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పెట్టుబడులకు సంబంధించి అందరికీ ఒకే ఫార్ములా పనిచేయదనే అంజుమ్ చోప్రా మాటల్లోనే మరిన్ని వివరాలు.. పొదుపు, పెట్టుబడులకు నేను అత్యంత ప్రాధాన్యమిస్తాను. అత్యవసర పరిస్థితుల్లోనూ, ఇతరత్రా అవసరాల్లోనూ ఆదుకునేవి ఇవే. నా వ్యక్తిగత విషయాల్లో క్రమశిక్షణగానే ఉంటాను. పెట్టుబడుల అంశాల్లోనూ అలాగే ఉంటానా లేదా అన్నది చెప్పలేను కానీ.. ఒక పద్ధతి మాత్రం పాటిస్తుంటాను. ప్రతి నెలా, ఆర్నెల్లకి ఒకసారి కచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలని పెట్టుకోను. ప్రత్యేకంగా దీర్ఘకాలికమైన వాటిపై ఎక్కువగా దృష్టి పెడుతుంటాను. ఏదైనా పెట్టుబడి పెట్టతగినదని లేదా దీర్ఘకాలికంగా మంచిది అనిపిస్తే తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో దూకుడుగా ఉండను. చాలా మటుకు ఆచి తూచి ఇన్వెస్ట్ చేస్తుంటాను. నేను ఎక్కువగా ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతుంటాను. అది కూడా స్థలం మీదే. అందులోనూ బంజరు భూమి దొరికితే మరీ మంచిది. లేకపోతే.. నిర్మించిన లేదా నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ అయినా కొనేందుకు మొగ్గు చూపుతాను. ఇవేవీ సాధ్యం కాకపోతే.. సురక్షితమైన ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు చేతిలో ఉన్నట్లుంటుంది. ఇందులో కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. కొంత మొత్తం మాత్రం ఫిక్సిడ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాను. రియల్టీ ఇన్వెస్ట్మెంట్లలో ఒకోసారి ఆశించిన ఫలితాలు రాలేదు. అలాగని, అవి కొట్టిపారేయతగ్గ ప్రాపర్టీలు కావు. ఉదాహరణకు ఏడెనిమిదేళ్ల క్రితం ఒక సిటీలో ఒక ప్రాపర్టీ తీసుకున్నాం. ఆ ఏరియాలో భారీగా అభివృద్ధి జరుగుతుందని, ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగిపోతాయని అంతా భావించారు. కానీ మేం అంచనా వేసిన స్థాయిలో దాని విలువ పెరగలేదు. విలువ పెరగడం అంటే.. మరీ వందరెట్లు స్థాయిలో పెరగడమని కాదు.. కనీసం ఒక మోస్తరుగానైనా పెరగాలి కదా. కానీ అది జరగలేదు. అయితే అదృష్టవశాత్తు.. ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడులలో దేనిలోనూ చేదు అనుభవం ఏదీ ఎదురుకాలేదు. ఇక పెట్టుబడుల విషయంలో సలహాలంటే.. ఎవరికి వారు తమ తమ సామర్ధ్యాన్ని బట్టే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కొందరు సంపాదించినదంతా ఖర్చు పెట్టేస్తుంటారు. మరికొందరు సంపాదించే దాంట్లో కొంత మాత్రమే ఖర్చు చేస్తారు. ఏదేమైనా చేతిలో కాస్త డబ్బు ఉంటేనే, కాస్త రిస్కు తీసుకోగలం అనుకుంటేనే ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన వస్తుంది. నన్నడిగితే ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయాల్సిందే. అయితే, ఇది వారి వ్యక్తిగత రిస్కు సామర్ధ్యాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకే సూత్రం పనిచేయదు. మీకు ఎంత ఆదాయం వస్తోంది, ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎంత రిస్కు చేయగలరు అన్న దానిపై పెట్టుబడి సాధనాలను ఎంచుకోవడం ఆధారపడి ఉంటుంది.