Anna vastunnadu
-
రెండో రోజు కొనసాగుతున్న ‘వైఎస్సార్ కుటుంబం’
-
రెండో రోజు కొనసాగుతున్న ‘వైఎస్సార్ కుటుంబం’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం రెండో రోజూ కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. ఏపీ అన్ని జిల్లాల్లో చురుగ్గా కార్యక్రమం జరుగుతోంది. వైఎస్సార్ కుటుంబంలో చేరేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తిరుపతిలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారని చెప్పారు. వైఎస్సార్ కుటుంబంలో చేరడానికి జనం ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తలో ఉందని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. వైఎస్సార్ జిల్లాలో జరిగిన యూత్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ సైనికులు కదలాలని పిలుపునిచ్చారు. -
‘వైఎస్ఆర్ కుటుంబానికి అద్భుత స్పందన’
-
‘వైఎస్ఆర్ కుటుంబానికి అద్భుత స్పందన’
సాక్షి, హైదరాబాద్ : మనిషి...మనిషితో అనుబంధం వైఎస్ఆర్ కుటుంబమైతే... రాష్ట్ర ప్రజలకు, సొంత మామకే వెన్నుపోటు చంద్రబాబు కుటుంబమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యేలు కళావతి, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి అద్భుత స్పందన వస్తోంది. ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో 4 లక్షల మంది సభ్యులుగా చేరారు. వైఎస్ఆర్ కుటుంబంలో డిజిటల్ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా చేరొచ్చు. www.ysrkutumbam.com కు లాగాన్ అయి సభ్యులుగా చేరవచ్చు. వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని మళ్లీ తీసుకువచ్చి ...చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు. కాగా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం’ ప్రారంభమైన విషయం తెలిసిందే. పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్టోబర్ 2 వరకు ప్రతీ బూత్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరు రోజుకు రెండు కుటుంబాలను కలసి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అలాగే వైఎస్సార్ కుటుంబంలో చేరాలనుకునే వారు 9121091210 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఇలా మిస్డ్‌కాల్ ఇస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి కార్యాలయంతో నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది. చంద్రబాబు పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు, తాము ఎదుర్కొంటున్న కష్టాలను ప్రజలు తెలియజేయవచ్చు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీవరకు 20 రోజులపాటు వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం కొనసాగనుంది. కాగా ప్రకాశం జిల్లా రాయవరం కల్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వైఎస్ఆర్ కుటుంబం ప్రారంభమైంది. ఇందులో టౌన్ కన్వినర్ కృష్ణ, రైతు విభాగం నేత పోతి రెడ్డి, నర్సింహారావు, పలువురు జడ్పీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రేపటి నుంచి 'వైఎస్సార్ కుటుంబం'
-
టీడీపీ సవాల్‌కు వైఎస్ఆర్ సీపీ రెడీ: రోజా
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన 9 హామీలపై టీడీపీ సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన పథకాలపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఒకవేళ అనుమానం ఉంటే చంద్రబాబును తక్షణమే రాజీనామా చేయమనాలని, ఆ పథకాలను ఎలా చేసి చూపిస్తారో జగన్ నిరూపిస్తారని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోజా మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ టీడీపీ బుర్రపెట్టి ఆలోచిస్తే.. 2019 నాటికి...10 లక్షల కోట్ల బడ్జెట్లో వైఎస్ జగన్ చెప్పిన పథకాలన్నీ కచ్చితంగా అమలు అవుతాయి. మంత్రి యనమల రామకృష్ణుడు వెంటనే అసెంబ్లీని సమావేశపరిస్తే లెక్కలతో సహా వైఎస్ జగన్ సమాధానం చెబుతారు. ఇప్పటివరకూ టీడీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి మాత్రమే భయపడేదని, అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌ను చూసి కూడా వణికిపోతున్నారని అర్థం అవుతోంది. అయినా మా పార్టీ ఎవరి సలహాలు తీసుకుంటే టీడీపీకి ఎందుకు?. నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకున్నారు. అయితే ఆయనకు నాయకత్వం లోపించే సలహాలు తీసుకున్నారా?. మరి అలాంటి మోదీతో జతకట్టి ఎన్నికలకు ఎందుకు వెళ్లారు. ఎన్నికల్లో గెలుస్తామని చంద్రబాబుకు నమ్మకం, నాయకత్వ లక్షణాలు ఉంటే పవన్ కల్యాణ్ కాళ్లు ఎందుకు పట్టుకున్నారో చెప్పాలి. తండ్రీకొడుకులు నిప్పా...తుప్పా? చంద్రబాబు అనుభవనం రాష్ట్రాన్ని దోచుకోవటానికే పనికి వచ్చింది. మహిళల గురించా ఆయన మాట్లాడేది. కేబినెట్లో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. ఆ మంత్రులను కూడా చంద్రబాబు తీసేశారు. మహిళలను గౌరవించడం ముందు ఆయనే నేర్చుకోవాలి. రాష్ట్ర మహిళల మానప్రాణాలు రక్షించలేకపోతున్నారు. ఎక్కడికక్కడ మద్యం షాపులు పెట్టి తాళిబొట్టు తెంచుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి విజయవాడకు పారిపోయారు. ఇక ఆయన కుమారుడు లోకేశ్ చూస్తే కామెడీ ఆర్టిస్ట్ గుర్తొస్తారు. ప్రతిదానికి లోకేష్ సవాల్ అంటారు. ఆయన యాష్ ట్రేకు ఎక్కువ, డస్ట్‌బిన్‌కు తక్కువ. దమ్ము, ధైర్యం ఉంటే ఇసుక దోపిడీ, విశాఖ భూ కుంభకోణం, మద్యం వ్యాపారస్తులకు ఇచ్చిన లైసెన్స్‌ల అవకతవకలు బయటపడాలంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. మీ నాన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు వస్తే దమ్మున్న మొనగాడు కాబట్టే వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణ వేశారు. తండ్రీకొడుకులు తుప్పు కాదు నిప్పు అని అనుకుంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. లోకేశ్ ఇంకోసారి సవాల్ విసిరితే.. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడ కొడితే ఏం అవుతుందో పప్పుకు కూడా అదే పరిస్థితి ఎదురు అవుతుంది’ అని అన్నారు. సోమిరెడ్డిది సోది... ఇక నెల్లూరు ప్రజలు ఛీకొట్టి తరిమేసిన సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకుని మంత్రి పదవి ఇచ్చారని రోజా అన్నారు. సోమిరెడ్డి చెప్పేదంతా సోదేనని, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు కాబట్టే ఆయనకు చంద్రబాబు మంత్రిపదవి కట్టబెట్టారని ఎద్దేవా చేశారు.