annamayya family member
-
చిక్కుల్లో సింగర్ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక
Annamayya Family Fires On Sravana Bhargavi: అనేక గీతాలను ఆలపించి టాలీవుడ్ ప్రముఖ సింగర్‌గా గుర్తింపు పొందింది శ్రావణ భార్గవి. అయితే గత కొద్ది కాలంగా ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె తాజాగా వివాదంలో చిక్కుకుంది. అందుకు కారణం ఆమె పాడిన పాటే. విషయంలోకి వెళితే..తిరుమల శ్రీవారిని తన పద సంకీర్తనలతో మెప్పించి, మైమరపించిన తొలి తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యుల సంకీర్తలను శ్రావణ భార్గవి పాడటంతో ఈ వివాదం మొదలైంది. శృంగార సంకీర్తన పట్ల గాయని శ్రవణా భార్గవి చేసిన వీడియోపై అన్నమయ్య వంశస్తుడు హరినారాయణ చార్యులు మండిపడుతున్నారు. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి చిత్రీకరించడం పట్ల తప్పుబట్టారు. అలాగే ఆమె అందాన్ని వర్ణించడానికి ఆ కీర్తనను ఉపయోగించటం తప్పు అని ఆగ్రహిస్తున్నారు. ఈ విషయంపై శ్రావణ భార్గవితో మాట్లాడితే ఆమె బాధ్యతరాహిత్యంగా సమాధానిచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని, అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తామని ఆయన అన్నారు. చదవండి: డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. -
వైఎస్ కుటుంబం ఆదరణ మరచిపోలేనిది: అన్నమయ్య వంశస్తులు
సాక్షి, తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని తన సంకీర్తనలతో ఓలలాడించిన తాళ్లపాక అన్నమాచార్యుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం రాయచోటి కేంద్రంగా శ్రీఅన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయడంపై తాళ్లపాక అన్నమయ్య వంశస్తుల ఆనందానికి అవధులు లేవు. సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామి అంశతో పుట్టిన అన్నమయ్య తన 95ఏళ్ల జీవితకాలంలో 32వేల సంకీర్తనలతో శ్రీవారిని కీర్తిస్తూ రచనలు చేశారు. శ్రీవారి పరమభక్తుడైన అన్నమయ్య పేరును ఓ కొత్త జిల్లాకు నామకరణం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలుగు ప్రజలే కాకుండా విశ్వమంతటా ఉన్న శ్రీవారి భక్తులందరూ స్వాగతిస్తున్నారు. భక్తులే కాదు.. తమిళ, కన్నడ, మహారాష్ట్రకు చెందిన కళాకారులు సైతం ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షిస్తున్నారని తాళ్లపాక అన్నమయ్య 12వ తరం వారసులు తాళ్లపాక హరినారాయణాచార్యులు ఆనందం వ్యక్తం చేశారు. తాళ్లపాక అన్నమయ్య కుమారుడైన పెద్ద తిరుమలాచార్యుల సంతతికి చెందిన హరినారాయణాచార్యులు ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో సంకీర్తనా కైంకర్యము, కల్యాణోత్సవంలో తన సేవలను అందిస్తున్నారు. నాడు వైఎస్ జీవనభృతి కల్పించారు.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తాళ్లపాక అన్నమయ్య వంశస్తులకు జీవన భృతి అందించి అరుదైన ఘనత కల్పించారని హరినారాయణాచార్యులు గుర్తు చేశారు. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆ సమస్యను వైఎస్ దృష్టికి తీసుకువెళ్ళగానే అన్నమయ్య తరాల వారికి జీవనభృతి కల్పిస్తూ యుద్ధప్రాతిపదికన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అన్నమయ్య పేరిట ఓ జిల్లా రావడం చాలా సంతోషకరమన్నారు. శ్రీఅన్నమయ్య జిల్లా ప్రకటించడం జన్మజన్మల అదృష్టంగా తమ కుటుంబాలు భావిస్తున్నాయని హరినారాయణచార్యులు హర్షం వ్యక్తం చేశారు. అన్నమయ్య వారసులుగా తాము శ్రీవారి పవళింపు సేవ, సుప్రభాతం, శ్రీవారి కల్యాణోత్సవాల్లో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ వంశ పరంపర కొనసాగిస్తున్నామన్నారు. అన్నమయ్య పేరు జిల్లాకు పెట్టడం శ్రీవారి అనుగ్రహంగా, సీఎం వైఎస్ జగన్ మా కుటుంబంపై ఉంచిన నమ్మకానికి ప్రతీకగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. అన్నమయ్య మార్గం.. అంతులేని ఆనందం ‘‘తిరుమలకు పదపితాహుడు అన్నమయ్య నడిచిన మార్గాన్ని అన్నమయ్య మార్గంగా అభివృద్ధి చేసేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్నిస్తోంది. తిరుమలకు ప్రస్తుతమున్న ఘాట్ రోడ్లు నిర్మించడానికి పూర్వం భక్తులు శేషాచలం అడవిలోని అన్నమయ్య మార్గం ద్వారానే శ్రీవారి దర్శనానికి నడచి వచ్చేవారు. ఇప్పటికీ కొంతమంది భక్తులు ఇదే సంప్రదాయం పాటిస్తూ అన్నమయ్య నడయాడిన మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు ఆ మార్గానికి గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ సంకల్పించడం... ఇదే సమయంలో ఆయన పేరును ఓ జిల్లాకు నామకరణం యాధృచ్ఛికమే కావొచ్చు. కానీ తాళ్ళపాక వంశస్తులకు మాత్రం ఎనలేని ఆనందాన్ని ఇస్తోంది.’’ అని హరినారాయణాచార్యులు వ్యాఖ్యానించారు. -
‘ఇది నా పురాకృత పుణ్యఫలం’
స్వామివారి కీర్తనలతోనే ఈ స్థాయికి.. ‘సాక్షి’తో అన్నమయ్య 12వ తరానికి చెందిన హరినారాయణాచార్యులు ‘తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి అనునిత్యం జరిగే సుప్రభాత, మేలుకొలుపుసేవలో పాల్గొంటాను. మధ్యాహ్నం జరిగే కల్యాణోత్సవంలో నేను కన్యాదాతను. రాత్రి జరిగే శయనోత్సవంలో పవళింపుసేవలో కీర్తనలు గానం చేస్తాను. ఇదంతా నా పురాకృత పుణ్యఫలంగా భావిస్తా’’ అని అంటున్నారు తొలి వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య 12వ తరానికి చెందిన వారసుడు తాళ్లపాక హరినారాయణాచార్యులు. ఆదివారం నగరంలో జరిగిన అన్నమాచార్య పదనృత్యాంజలి కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుమల నుంచి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – రాజమహేంద్రవరం కల్చరల్ నేను తాళ్లపాక అన్నమయ్యకు 12వ తరానికి చెందినవాడిని. తాళ్లపాక అన్నమయ్య, పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, తిరువేంకటనాథాచార్యులు, తాళ్లపాక చిన్నన్న, అప్పలాచార్యులు, కోనప్పాచార్యులు, చిన్నశేషాచార్యులు, అనంతాచార్యులు, శేషాచార్యులు, రామాచార్యులు.. ఆ తరువాత నేను హరినారాయణాచార్యులు.. నన్ను తిరుమల దేవాలయంలో నేటికీ ‘తాళ్లపాకస్వామి’అని పిలుస్తుంటారు. అన్నమయ్య వాడిన రాగిపాత్రలు నేటికీ మా వద్ద పదిలంగా ఉన్నాయి. మరిన్ని కీర్తనలు వినాలనే.. అన్నమయ్య నుంచి మరిన్ని కీర్తనలు వినాలనే స్వామి కొన్ని చేష్టలు చేసేవారని మా పెద్దలు చెబుతుండేవారు. ఒకరోజున ఏకాంతసేవకు సమయం మించిపోతోందని అన్నమయ్య పరుగులు తీస్తూ, స్వామి సన్నిధికి చేరుకున్నాడు. ఆ సమయంలో అన్నమయ్య కీర్తనలు వినాలని స్వామి లేచి కూర్చున్నాడని, బ్రహ్మ కడిగిన పాదము అలాగే వచ్చిందని చెబుతారు. ఎన్నో అనుభవాలు సుప్రభాత సేవలో కీర్తనలు నేను పాడుతున్నప్పుడు–ఒక్కో సమయంలో స్వామి ముఖాన సన్నని చిరునవ్వు గోచరిస్తుంది. మరోసారి ప్రపంచంలోని ఆనందమంతా ఆయన వదనంలో కనిపిస్తుంది . కొన్ని సమయాల్లో గంభీరంగా కనిపిస్తుంది.. అన్నమయ ఆధ్యాత్మిక, శృంగార, భక్తి, వైరాగ్యరంగాలకు సంబంధించిన 32 వేల సంకీర్తనలు రచించారు. నేడు 12వేల కీర్తనలు మాత్రమే లభిస్తున్నాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.