‘ఇది నా పురాకృత పుణ్యఫలం’ | annamayya family member harinarayanacharyulu interview | Sakshi
Sakshi News home page

‘ఇది నా పురాకృత పుణ్యఫలం’

Published Sun, Feb 5 2017 11:02 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

annamayya family member harinarayanacharyulu interview

స్వామివారి కీర్తనలతోనే ఈ స్థాయికి..
‘సాక్షి’తో అన్నమయ్య 12వ తరానికి చెందిన హరినారాయణాచార్యులు
 
‘తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి అనునిత్యం జరిగే సుప్రభాత, మేలుకొలుపుసేవలో పాల్గొంటాను. మధ్యాహ్నం జరిగే కల్యాణోత్సవంలో నేను కన్యాదాతను. రాత్రి జరిగే శయనోత్సవంలో పవళింపుసేవలో కీర్తనలు గానం చేస్తాను. ఇదంతా నా పురాకృత పుణ్యఫలంగా భావిస్తా’’ అని అంటున్నారు తొలి వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య 12వ తరానికి చెందిన వారసుడు తాళ్లపాక హరినారాయణాచార్యులు. ఆదివారం నగరంలో జరిగిన అన్నమాచార్య పదనృత్యాంజలి కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుమల నుంచి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
– రాజమహేంద్రవరం కల్చరల్‌
 
నేను తాళ్లపాక అన్నమయ్యకు 12వ తరానికి చెందినవాడిని.  తాళ్లపాక అన్నమయ్య, పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, తిరువేంకటనాథాచార్యులు, తాళ్లపాక చిన్నన్న, అప్పలాచార్యులు, కోనప్పాచార్యులు, చిన్నశేషాచార్యులు, అనంతాచార్యులు, శేషాచార్యులు, రామాచార్యులు.. ఆ తరువాత నేను హరినారాయణాచార్యులు.. నన్ను తిరుమల దేవాలయంలో నేటికీ ‘తాళ్లపాకస్వామి’అని పిలుస్తుంటారు. అన్నమయ్య వాడిన రాగిపాత్రలు నేటికీ మా వద్ద పదిలంగా ఉన్నాయి.
మరిన్ని కీర్తనలు వినాలనే..
అన్నమయ్య నుంచి మరిన్ని కీర్తనలు వినాలనే స్వామి కొన్ని చేష్టలు చేసేవారని మా పెద్దలు చెబుతుండేవారు. ఒకరోజున ఏకాంతసేవకు సమయం మించిపోతోందని అన్నమయ్య పరుగులు తీస్తూ, స్వామి సన్నిధికి చేరుకున్నాడు. ఆ సమయంలో అన్నమయ్య కీర్తనలు వినాలని స్వామి లేచి కూర్చున్నాడని, బ్రహ్మ కడిగిన పాదము అలాగే వచ్చిందని చెబుతారు.
ఎన్నో అనుభవాలు
సుప్రభాత సేవలో కీర్తనలు నేను పాడుతున్నప్పుడు–ఒక్కో సమయంలో స్వామి ముఖాన సన్నని చిరునవ్వు గోచరిస్తుంది. మరోసారి ప్రపంచంలోని ఆనందమంతా ఆయన వదనంలో కనిపిస్తుంది . కొన్ని సమయాల్లో గంభీరంగా కనిపిస్తుంది.. అన్నమయ ఆధ్యాత్మిక, శృంగార, భక్తి, వైరాగ్యరంగాలకు సంబంధించిన 32 వేల సంకీర్తనలు రచించారు. నేడు 12వేల కీర్తనలు మాత్రమే లభిస్తున్నాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement