రోడ్డుపై కూలిన విమానం
39 మంది మృతి.. ఇరాన్లో దుర్ఘటన
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి తబస్ నగరానికి వెళతున్న ఓ విమానం ఆదివారం ఉదయం 9:18 గంటలకు ఓ రోడ్డుపై కూలిపోవడంతో 39 మంది మరణించారు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన సెఫాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-140 విమానం నగర శివార్లలో వందలాది మిలటరీ కుటుంబాలు ఉంటున్న ప్రదేశానికి సమీపంలో రోడ్డుపై కూలిపోయిందని ‘ఐఆర్ఎన్ఏ’ వార్తా సంస్థ పేర్కొంది.
రోడ్డుపక్కన ఓ గోడను, చెట్లను ఢీకొట్టి విమానం పేలిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. రద్దీగా ఉండే ఓ మార్కెట్‌కు 500 మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.