అట్టహాసంగా అమరనాథ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
కడప కార్పొరేషన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. శనివారం స్థానిక అపూర్వ కళ్యాణమండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులంతా తరలివచ్చారు. ఉదయం 10 గంటలకే కళ్యాణమండపం పూర్తిగా నిండిపోయింది. చాలామందికి కూర్చోడానికి కుర్చీలు లేక నిలబడే వక్తల ప్రసంగాలు విన్నారు. వైఎస్ఆర్సీపీ కడప, చిత్తూరు జిల్లాల పరిశీలకులు జంగా కృష్ణమూర్తి ఆకేపాటి అమర్నాథ్రెడ్డిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ గూడూరు రవి, మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనువాసులు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎస్బీ అంజద్‌బాషా, జయరాములు, డీసీసీబీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, జెడ్పీ వైస్ ైఛె ర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ఆకేపాటికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డీసీసీబీ మాజీ ఛైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథరెడ్డి, ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, నాయకులు మాసీమ బాబు, ఈవీ సుధాకర్‌రెడ్డి, యానాదయ్య, ఎంపీ సురేష్, జీ. చ ంద్రమోహన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు టీకే అఫ్జల్ఖాన్, నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, అనుబంధ విభాగాల కన్వీనర్లు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, పత్తి రాజేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, నిత్యానందరెడ్డి, కరీముల్లా, ఎస్ఎండీ షఫీ, బి. అమర్నాథ్రెడ్డి, మహిమలూరి వెంకటేష్, కిరణ్‌కుమార్, శ్రీలక్ష్మి, కార్పొరేటర్లు పాకా సురేష్, చైతన్య, చల్లా రాాజశేఖర్, బోలా పద్మావతి,ఎస్ఏ షంషీర్, మాజీ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ గురుమోహన్ తదితరులు నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.