Appala swamy
-
కిడ్నీ వ్యాధిని జయించాడు
కాశీబుగ్గ: పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం పరిధిలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సీరం క్రియాటినిన్ లెవెల్ పది పాయింట్లు దాటి డయాలసిస్ చేయాల్సిన ఓ కిడ్నీ వ్యాధి బాధితుడికి డయాలసిస్ అవసరమే లేకుండా రెండు నెలల్లోనే సీరం క్రియాటినిన్ లెవెళ్లు రెండున్నరకు దిగిపోయాయి. బతకడం కష్టమే అనుకున్న దశ నుంచి ఆ వ్యక్తి సాధారణ స్థితికి వచ్చాడు. కిడ్నీ వ్యాధిని జయించి ఆస్పత్రి వైద్యులను ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన ఉంగ అప్పలస్వామి(48)ని రెండున్నర నెలల కిందట కడుపు ఉబ్బిపోయి, కాళ్లు, చేతులు, ముఖం పొంగిపోయి రెండు మూడు రోజుల్లో మరణిస్తాడనే మాటలతో పలాస కిడ్నీ పరిశోధన కేంద్రానికి తీసుకువచ్చారు. అన్ని పరీక్షలు చేశాక రెండు కిడ్నీలు పాడైపోయిన దశలో ఉన్నాయని ఏప్రిల్ 12న వైద్యులు నిర్ధారించారు. సీరం క్రియాటినిన్ 10.02 పాయింట్లు ఉందని, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నావని డయాలసిస్ చేసుకోవాలని అతనికి సూచించారు. డయాలసిస్ చేయించుకోవడానికి ఇష్టపడని అప్పలస్వామి వైద్యులు ఇచ్చిన ఉచిత మందులతో ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి రెండు పూటలు చప్పటి ఇడ్లీలు, మధ్యాహ్నం చప్పటి పప్పుతో కూడిన భోజనం తీసుకున్నాడు. మూడు పూటలు భోజనానికి ముందు, తర్వాత కలిపి 23 రకాల మాత్రలు వేసుకున్నాడు. అలా సుమారు రెండు నెలలు ఆహార నియమం పాటించాడు. మధ్యలో ఏప్రిల్ 19న ఆస్పత్రికి మందులకు వెళ్లినప్పుడు పరీక్షిస్తే సీరం క్రియాటినిన్ 8.04కు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ జూన్ 18వ తేదీన పరీక్ష చేయించుకుంటే 2.7 గా సీరం క్రియేటిన్ నమోదైంది. పల్లె ఆహార అలవాట్లే తనను కాపాడాయని, పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ కిడ్నీ పరిశోధన కేంద్రంలోనే వైద్య సేవలు పొందానని అప్పలస్వామి ఆనందంగా చెప్పాడు. ఈ ప్రత్యేకమైన కేస్‌కు సంబంధించి పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ యర్ర రాకేష్ ను వివరణ కోరగా కిడ్నీ వ్యాధి సోకినపుడు ఆయా శరీర తత్వాలను బట్టి వారిలో మార్పులు వస్తాయని తెలిపారు. అనేక మంది చనిపోతారని, ఆహార అలవాట్లతో కొందరు నెగ్గుకురాగలరని వివరించారు. కిడ్నీ వ్యాధి బాధితునికి పూర్తిగా నయం కావడం తమకు సంతోషంగా ఉందన్నారు. -
Ronanki Appalaswamy: నడిచే బహు భాషాకోవిదుడు
కళింగాంధ్రలో జన్మించి రచయితగా, బోధకుడిగా, అనువాదుకుడిగా, సాహితీ విమర్శకుడిగా, అభ్యుదయవాదిగా ఆచార్య రోణంకి అప్పలస్వామి చేసిన పయనం తరగని స్ఫూర్తిని పంచింది. ఆయన 1909 సెప్టెంబరు 15వ తేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఇజ్జవరం గ్రామంలో జన్మించారు. మూడో ఫారం చదువుతుండగానే పోతన భాగవతంలోని ఘట్టాలను కంఠస్థం చేసిన అప్పలస్వామి, తర్వాత కాలంలో ప్రపంచమే నివ్వరపోయేటంత భాషావేత్తగా ఎదిగారు. విజయనగరం ఎంఆర్ కళాశాలలో ఆంగ్ల బోధకుడిగా 1934లో కెరీర్ ప్రారం భించారు. ఒక వైపు ఆంగ్ల అధ్యాపకునిగా ఉంటూనే ఫ్రెంచ్, స్పానిష్, గ్రీకు, హీబ్రూ, ఇటాలియన్ వంటి యూరోపియన్ భాష లను ఆధ్యయనం చేశారు. ఆయా భాషల్లో కవితలు, రచనలు చేయడమేకాక అను వాదాలూ చేశారు. గ్రామఫోన్ ప్లేట్లు పెట్టుకొని జర్మన్, లాటిన్ లాంటి భాషల్లో నైపుణ్యం సంపా దించారు. హిందీ, ఒడియా, కన్నడం, బెంగాలీ వంటి భార తీయ భాషల్లో సైతం అసర్గళంగా మాట్లాడే శక్తి సొంతం చేసుకున్నారు. విజయనగరంలో వున్న తొలినాళ్లలో ‘సాంగ్స్ అండ్ లిరిక్స్’ పేరిట తొలికవితా సంపుటిని 1935లో వెలువ రించారు. అల్లసాని పెద్దన, క్షేత్రయ్య రచనలను ఆంగ్లీకరిం చారు. మేకియవెల్లి ఇటాలియన్ భాషలో రాసిన ‘ప్రిన్స్’ గ్రంథాన్ని, ‘రాజనీతి’ పేరుతో తెలుగులోకి సరళంగా అనువదించారు. మహాకవి గురజాడ కలం నుంచి జాలువారిన ‘పూర్ణమ్మ’, ‘తోకచుక్క’లను ఇంగ్లీష్‌లోకి అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, నారాయణ బాబు, విశ్వ సుందరమ్మ, చాకలి బంగారమ్మ వంటివారిని ప్రపంచ కవితా ప్రియులకు పరిచయం చేసింది రోణంకి వారే. ఆకాశవాణిలో కొన్ని సంవత్సరాలు ప్రసంగాలు చేశారు. ఆంగ్లభాషలో ఉత్తమ బోధకుడిగా, పలు భాషల్లో నిష్టాతుడిగా ఖ్యాతిగాంచిన రోణంకి అప్పలస్వామిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోధన చేయమని ఆహ్వానం లభిం చింది. యూజీసీ ఎమెచ్యూర్ ప్రొఫెసర్‌గా నియమించింది. చాగంటి సోమయాజులు (చాసో), శ్రీరంగం నారాయణబాబు, చిర్రావూరి సర్వేశ్వర శర్మలు రోణంకికి మంచి స్నేహితులు. ప్రముఖ చిత్రకారుడు అంట్యాకుల పైడి రాజు ఎంతో సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. (క్లిక్ చేయండి: ఉత్తమ కథల సంకలనంలో ‘వేంపల్లె’ కథ) ప్రముఖ రచయిత ఆరుద్ర, రోణంకి మాష్టారుకు శిష్యుడే. అందుకే తన తొలి కావ్యం ‘త్వమేవాహం’ను అప్పల స్వామికి అంకితం చేశారు. డాక్టర్ మానేపల్లి తన తొలి కవితా సంపుటి ‘వెలిగించే దీపాలు’ను రోణంకి గారికే అంకితమిచ్చి మాష్టారు రుణం తీర్చుకున్నారు. పీవీ నరసింహారావు, పుట్టపర్తి నారాయణా చార్యుల వంటి వారితో సమాన ప్రతిభా పాటవాలు కలిగిన ఆచార్య అప్పలస్వామి జీవిత చరిత్రను, రచనలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. - డాక్టర్ జి. లీలావరప్రసాదరావు వ్యాసకర్త అసిస్టెంట్ ఫ్రొఫెసర్, బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం (సెప్టెంబరు 15నఆచార్య రోణంకి అప్పలస్వామి జయంతి) -
హత్యా? ఆత్మహత్యా?!
పట్టుకోండి చూద్దాం ‘‘ ‘‘ఓసారి జరిగినదంతా రివైండ్ చేసుకో’’ అన్నాడు. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాడు అప్పలస్వామి. ముందురోజు ఉదయం పదిన్నర కావస్తుండగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని ఫోన్ మోగింది. ‘‘హలో’’ అన్నాడు కానిస్టేబుల్ అప్పలస్వామి. ‘‘సర్. రోడ్ నంబర్ 12 నుంచి మాట్లాడుతున్నాను సర్. మా అపార్ట్మెంట్లోని రెండో ఫ్లోర్లో ఉండే ఓ సారు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు వెంటనే రావాలి’’ అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి కంగారుగా. ‘‘అవునా? వివరాలు చెప్పు’’ అన్నాడు అప్పలస్వామి. అతను చెప్పినవన్నీ నోట్ చేసుకుని ఇన్స్పెక్టర్ దగ్గరకు పరుగెత్తాడు. అందరూ కలిసి సదరు అపార్ట్‌మెంట్‌కు బయలుదేరారు. అపార్ట్మెంట్లోని జనమంతా కిందే ఉన్నారు. చనిపోయిన వ్యక్తి గురించే అనుకుంటా... మాట్లాడుకుంటున్నారు. పోలీసుల్ని చూస్తూనే మాటలు ఆపేసి అలర్ట్ అయ్యారు ‘‘ఎక్కడ?’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘ఫ్లాట్ నంబర్ 205 సర్’’ అన్నాడు వాచ్‌మేన్. వెంటనే ఆ ఫ్లాట్‌కి వెళ్లారు. తలుపు తీసేవుంది. హాల్లో సోఫా దగ్గర కింద కూర్చున్నాడా వ్యక్తి. తల వెనక్కి వాలిపోయింది. నుదుటి మీద బుల్లెట్ గుర్తు ఉంది. రక్తం చింది ముఖమంతా కారింది. ఓ చేతిలో తుపాకి, మరో చేతిలో ఒక క్యాసెట్ ఉన్నాయి. జేబులోంచి ఖర్చీఫ్ తీశాడు ఇన్స్పెక్టర్. దాన్ని క్యాసెట్ మీద వేసి క్యాసెట్ తీసుకున్నాడు. ఎదురుగా ఉన్న టీపాయ్ మీదే టేప్ రికార్డర్ ఉంది. క్యాసెట్ పెట్టి ఆన్ చేశాడు. ‘‘నేను జీవితంతో విసిగిపోయాను. చాలా విరక్తిగా ఉంది. ఒంటరితనం భయపెడుతోంది. బతుకంటేనే రోత పుడుతోంది. నాకే ఎందుకిలాంటి జీవితాన్నిచ్చాడో దేవుడు! అందుకే ఇక ఈ జీవితం వద్దనుకుంటున్నాను. దీన్నించి పారిపోవాలనుకుంటున్నాను.’’ రికార్డర్ ఆగిపోయింది. రివైండ్ చేసి, ఫార్వార్డ్ చేసి చూశాడు. ఆ మాటలు తప్ప ఇంకేమీ లేవు. ‘‘ఈయనకి ఎవరూ లేరా?’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘లేదు సార్. భార్య చనిపోయింది. పిల్లలు లేరు. చాలాకాలంగా ఈ సార్ ఒక్కరే ఈ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఈ మధ్య చాలా దిగులుగా ఉంటున్నారు. కానీ ఇంత పని చేస్తారని అనుకోలేదు’’ అన్నాడు వాచ్‌మేన్. ‘‘చాలా మంచి మనిషి సర్. తన పనేంటో తను చూసుకుపోయేవారు. కానీ ఎవరికైనా కష్టం వచ్చిందంటే సాయపడటానికి అందరికంటే ముందుండేవారు. ఈయన ఇలా చేస్తారని అనుకోలేదు’’ అన్నాడొకాయన. ‘‘అవును సర్. మా పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవారు. వద్దన్నా ఏదో ఒకటి తెచ్చి ఇస్తూ ఉండేవారు’’ అంటూ కళ్లొత్తుకుంది ఇంకొకావిడ. అందరూ చెప్పింది విన్నాడు ఇన్స్పెక్టర్ ప్రకాశ్. ఒంటరితనం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అనిపించింది. వెంటనే బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి స్టేషన్‌కి బయలుదేరాడు. ‘‘మొత్తం రివైండ్ చేశాను సర్. ఏమీ అర్థం కాలేదు’’ అన్నాడు అప్పలకొండ బుర్ర గోక్కుంటూ. చిన్నగా నవ్వి, ‘‘ఓసారి క్యాసెట్ మళ్లీ ఆన్ చెయ్’’ అన్నాడు ప్రకాశ్. అప్పలస్వామి క్యాసెట్ పెట్టి విన్నాడు. ఏమీ అర్థం కాలేదు. మళ్లీ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. ‘‘చివర్లో ఏం వినిపించింది?’’ అన్నాడు ప్రకాశ్. ‘‘గన్ పేలిన సౌండ్ సర్’’ ‘‘అదే అసలు రహస్యం బయటపెట్టింది’’ అప్పటికీ అప్పలస్వామికి ఆ రహ స్యం ఏమిటో అర్థం కాలేదు. పోనీ మీకు అర్థమైందా? ఆ వ్యక్తిది ఆత్మహత్య కాదు హత్య అని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు? -
పెన్షనర్ల గుండెల్లో టెన్షన్
* ఏపీలో లక్షల పింఛన్లపై వేలాడుతున్న వడపోత * కత్తి కుంటిసాకులు చూపుతూ వేటేస్తున్న అధికారులు ఈ ఫొటోలోని బడ్నాన అప్పలస్వామి, నరసమ్మలు దంపతులు. అప్పలస్వామి వయసు 70 ఏళ్లు, నరసమ్మ వయసు 66 సంవత్సరాలు. వీరిది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఎరకందొరవలస గ్రామం. నిరుపేదలైన వీరికి గత ఏడాది రచ్చబండలో రేషన్‌కార్డు ఇచ్చారు. అప్పటి నుంచీ వీరికి వృద్ధాప్య పింఛను వస్తోంది. తాజాగా సర్కారు చేపట్టిన తనిఖీల్లో భాగంగా అధికారులు ఈ దంపతులకు పింఛను కత్తిరించేశారు. వారు కాళ్లావేళ్లా పడ్డా.. స్థానిక నేతలు బతిమిలాడినా కనికరం చూపలేదు. ఇంతకీ పింఛను కత్తిరించటానికి అధికారులు చూపిన కారణం.. పండు ముదుసలులైన వీరిద్దరి ఫొటోలతో ఉన్న రేషన్ కార్డులో వారి వయసు 25 ఏళ్లు, 22 ఏళ్లుగా నమోదై ఉండటమే! రేషన్ కార్డు నమోదులో ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పును సాకుగా చూపి.. పండు ముదుసలులు కళ్లెదుట కనబడుతున్నా పింఛన్లు కత్తిరించేశారు!! ఈ ఒక్క ఉదాహరణ చాలు.. సామాజిక పింఛన్లను ఏరివేయటానికి సర్కారు వారు ఎంతగా తహతహలాడుతున్నారో తెలియడానికి!!! సాక్షి, హైదరాబాద్: ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరు! నెలకు రూ.వెయ్యి చొప్పున పింఛన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం 13.18 లక్షల మంది పింఛనుదారుల బతుకు ఆధారాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఎన్నికల సమయంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్‌దారులకు రూ. 1,000 చొప్పున, వికలాంగులకు రూ. 1,500 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పెరగాల్సిన పింఛనుదారుల సంఖ్యను కుదిస్తోంది. గురువారం గాంధీ జయంతి సందర్భంగా ఆర్భాటంగా పెంచిన పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుండగా.. రాష్ట్రంలో 13.18 లక్షల మంది పింఛనుదారుల భవితవ్యం గందరగోళంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 43.12 లక్షల పింఛన్లు ఉండగా.. సెప్టెంబరు 18 నుంచి 25వ తేదీ లోపు పరిశీలించిన గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు అనర్హత పేరుతో 3.34 లక్షల పింఛన్లను తొలగించారు. అలాగే ఆధార్ కార్డు లేదన్న కారణంగా మరో 1.63 లక్షల ఫించన్లను పక్కనపెట్టారు. ఇవికాకుండా.. సామాజిక పింఛన్లకు ఇంకా 2.61 లక్షల మంది అర్హులు ఉన్నారని గత ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం సందర్భంగా గుర్తించిన దరఖాస్తులను బుట్టదాఖలు చేసింది. ఇక తాజా కసరత్తులో గ్రామ, మండల కమిటీలకు 5.60 లక్షల మంది పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారు. రీవెరిఫికేషన్ పేరుతో ఈ దరఖాస్తులను కూడా పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు ఇవ్వాలా? వద్దా? అన్నది తేల్చలేదు. సర్కారు సాయంతో ఇల్లు కట్టుకున్నా కట్... 2007లో ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా భవనాలు నిర్మించుకున్న వారిని సైతం జాబితా నుంచి అనర్హులుగా ప్రకటించారు. తామేమీ సొంతంగా గూడు నిర్మించుకోలేదని ప్రభుత్వ సహాయంతో నిర్మించిన గృహాలను సైతం ఓ కారణంగా చూపి పింఛన్లు రద్దు చేయడమేమిటని గ్రామసభల్లో ప్రశ్నించినప్పటికీ పట్టించుకోలేదు. ఇక.. అర్హులై ఉండి ఇన్నాళ్ళూ పెన్షన్ దక్కక బాధపడే వారంతా కొత్తగా దరఖాస్తు చేసుకుంటే పింఛన్ అందిస్తామని ప్రగల్భాలు పలికిన సర్కారు పెద్దలు.. అలా దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరికి కూడా పింఛన్ల జాతరలో పింఛన్ అందివ్వకపోవడం గమనార్హం. కాగా, వేలిముద్రలతో సరిపోల్చుతూ ఐదారేళ్లుగా పింఛన్ పొందుతున్నప్పటికీ ఆధార్ లేదన్న కారణంగా 1.63 లక్షల పింఛన్లను పక్కనపెట్టారు. నిరంతరం వేలాడనున్న వడపోత కత్తి... పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికి వడపోత కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో కొన్నేళ్ళుగా పింఛన్లు తీసుకుంటున్న 43.12 లక్షల మందిలో అనర్హులుగా 4.97 లక్షల మందిని తేల్చారు. ప్రస్తుతం ఏరివేత అనంతరం 38.15 లక్షల మందే అర్హులుగా తేల్చారు. ఈ జాబితా వడపోతను నిరంతరం కొనసాగించాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా కమిటీలు ధ్రువీకరించిన అర్హుల జాబి తాను థర్డ్ పార్టీతో మరోసారి పరిశీలింపజేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు ఓ మంత్రి వెల్లడిం చారు. సానుభూతితోనూ, మానవతా థృ క్పథం తో అందించే పింఛన్ల జాబితాపైనా ఇకపై ఆంక్ష ల పర్వం కొనసాగించాలని నిర్ణయించారు. నామమాత్ర కేటాయింపులతో ఎలా? ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాజిక భద్రత కింద బడ్జెట్లో రూ. 1,338 కోట్లు మాత్ర మే కేటాయించారు. గడిచిన 5 నెలల కాలంలో 43.12 లక్షల మందికి పింఛన్ల కోసం ప్రతి నెలా రూ. 130 కోట్ల చొప్పున చెల్లించారు. ఆ లెక్కన ఆ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.650 కోట్లు అవు తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఇక మిగిలిన ఏడు నెలల కాలానికి ప్రభుత్వం తేల్చిన 38.15లక్షల మందికి (మెజారిటీ పింఛన్లు రూ. 1,000 చొప్పు న, మరికొన్ని రూ. 1,500 చొప్పున) పింఛన్లు ఇవ్వాలన్నా నెలకు దాదాపు రూ. 450 కోట్ల చొప్పున రూ. 3,080 కోట్లు కావాలి. గడిచిన ఐదు నెలల్లో చెల్లించిన మొత్తా న్ని కలిపితే కనీ సంగా రూ. 3,730 కోట్లు అవసరం. బడ్జెట్లో రూ. 3,292 కోట్ల లోటు చూపిస్తున్న ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా సమకూర్చుతుందన్న విషయాన్ని చెప్పడం లేదు. ఈ లెక్కన ప్రస్తుత నిధులతో మూడో నెలలో పెంచిన పింఛన్ ఎలా చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పింఛన్ల కత్తిరింపు అమానవీయం: వైఎస్సార్సీపీ పింఛన్లు పెంచుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇపుడు కోతలు విధించడం అమానవీయం, అమానుషమని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 2 నుంచి పిం ఛన్ల మొత్తం పెరుగుతుందని ఆశతో ఎదురు చూసిన లక్షలాది వృద్ధులు, వితంతువుల పింఛన్లను అడ్డంగా క త్తిరించి వారి ఉసురు పోసుకుంటున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ఒక ప్రకటనలో విమర్శించారు. ఓవైపు కోత లు పెడుతూ మరోవైపు ‘భరోసా’ ఇస్తున్నామ ని గొప్పలు చెప్పుకుంటారా? అని ప్రశ్నిం చారు. ఆధార్ కార్డు లేదన్న కారణంగా 1.7 లక్షలు, అనర్హులంటూ 3.5 లక్షల మంది పింఛన్లకు కోత విధించారని విమర్శించారు. వృద్ధులకు, వితంతువులకు సామాజిక భద్రతను కల్పించే ఈ పింఛన్లను సంతృప్తస్థాయిలో ఇస్తారా? ఇవ్వరా? అని నిలదీశారు.