Appalanarsamma
-
సత్యం రామలింగరాజు తల్లికి ఊరట
సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగరాజు తల్లి అప్పలనర్సమ్మ బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. కరూర్ వైశ్యా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఆమెకున్న అకౌంట్లను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది. సీబీఐ ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అప్పలనర్సమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ జి.రాధారాణి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున వినోద్‌కుమార్ దేశ్‌పాండే, సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.నాగేందర్ వాదనలు వినిపించారు. అప్పలనర్సమ్మ కుమారులపై కేసు నమోదు చేసినప్పుడు బంధువులతో పాటు ఆమె బ్యాంక్ ఖాతాలనూ ఫ్రీజ్ చేశారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. అయితే సీబీఐ చార్జీషీట్లో ఆమె పేరు ఎక్కడా లేదని, నిందితులకు ఆర్థిక నేరాల కింద శిక్ష కూడా విధించారని చెప్పారు. పిటిషనర్ 85 ఏళ్ల వృద్ధురాలని, రోజు వారీ అవసరాలకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అనంతరం నాగేందర్ వాదనలు వినిపిస్తూ.. రామలింగరాజు ఆర్థిక నేరాలతో పిటిషనర్ కూడా లబ్ధి పొందారన్నారు. 1999 నుంచి 2001 వరకు ఆమె పేరుపై 3,92,500 షేర్లు ఉన్నాయన్నారు. నేరాలు మోపబడిన కంపెనీలో ఆమె డైరెక్టర్‌గానీ, ప్రమోటర్‌గానీ కాకపోవడంతో చార్జీషీట్లో పేరు చేర్చలేదని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగిందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిట్ పిటిషన్‌ను అనుమతిస్తూ.. బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని సీబీఐని ఆదేశించారు. వారెవ్వా (క్లిక్: హైదరాబాద్.. 31 వేల రిజిస్ట్రేషన్లు.. రూ.15 వేల కోట్లు) -
నిన్ను హతమారిస్తే తలనొప్పి పోతుందని..
సీతమ్మధార (విశాఖ ఉత్తర) : ఫోర్తుటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి అక్కయ్యపాలెంలోని మునసుబు వారి వీధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైయింది. మృతురాలి సోదరి పద్మ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన దేవరాపల్లి అప్పలనర్సమ్మ(38)కు సామాళ్లుతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఈ నేపథ్యంలో గొడవులు జరగడంతో ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకుని ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అప్పలనర్సమ్మ ప్రస్తుతం హెల్త్‌కేర్‌లో పనిచేస్తుంది. విడాకుల సమయంలో భరణం కింద నగదు ఇవ్వడానికి భర్త ఒప్పకున్నా కొన్ని నెలలుగా సరిగ్గా ఇవ్వడంలేదు. దీంతో అప్పలనరసమ్మ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భరణం చెల్లించకపోవడంతో కోర్టు సామాళ్లుకు 30 రోజుల రిమాండ్ విధించింది. కొద్ది రోజుల కిందటే అతను జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పలనర్సమ్మ ఫోన్ ఆదివారం నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె సోదరి పద్మ అనుమానంతో మంగళవారం ఇంటికి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడం.., లోపలి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సాయంతో ఇంటి తాళం పగలగొట్టారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పలనర్సమ్మ రక్తపుమడుగులో ఉండడంతో వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. ఫోర్తుటౌన్ సీఐ ఈశ్వరరావు తన బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహం పక్కన లభించిన కత్తెరను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల, చెవుల మీద గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమె మెడలో పుస్తెల తాడు లేకపోగా, కిందన రెండు పుస్తెలు లభించాయి. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. తనిఖీలు చేస్తున్న డాగ్‌స్క్వాడ్ భిన్న కోణాల్లో దర్యాప్తు ఘటనా స్థలిలో వివరాలు సేకరించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఈశ్వరరావు తెలిపారు. ఆమె కాల్‌డేటాను పరిశీలించి అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలి భర్త సామాళ్లుని అదుపులోకి తీసుకొని విచారించామని, ముఖ్యంగా శనివారం రాత్రి 8గంటల తరువాత ఏం జరిగింది అన్న కోణంలో విచారిస్తున్నామని తెలిపారు. మరోవైపు శనివారం రాత్రి అక్కతో తాను మాట్లాడానని అప్పలనర్సమ్మ సోదరి పద్మ పోలీసులకు తెలిపింది. భరణం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన సామాళ్లు అక్క అప్పలనర్సమ్మకు ఫోన్ చేసి... నీకు ప్రతి నెలా భరణం చెల్లించలేకపోతున్నాను... నిన్ను హతమారిస్తే తలనొప్పి పోతుందని బెదిరించినట్లు చెప్పిందన్నారు. మరుసటి రోజు నుంచి అక్క ఫోన్ పనిచేయడం మానేసిందని.. ప్రస్తుతం విగతజీవిగా మారిందని పద్మ ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వేడుకుంది. -
ఉసురు తీసిన పింఛన్
బ్యాంక్‌కు వెళ్లి వస్తూ అప్పలనర్సమ్మ మృతి చిట్టినగర్ : ప్రభుత్వం ఇచ్చే పింఛను సొమ్ము కోసం వృద్ధులు ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో పింఛన్లకోసం వెళ్లి వస్తూ జైనాబీ, పడాల కాంతమ్మ, పిళ్లా లక్ష్మి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలు మరిచిపోకముందే 32వ డివిజన్ పరిధిలో బుధవారం మరో వృద్ధురాలి ప్రాణం పోయింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కొత్తపేట ఆంజ నేయవాగు బ్రహ్మంగారి మఠం ప్రాంతానికి చెందిన వెండిముద్దల అప్పలనర్సమ్మ (70)కు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛను అందుతోంది. వచ్చే నెల నుంచి బ్యాంక్ ఖాతాలోనే పింఛను డబ్బులు వేస్తామని అధికారులు చెప్పడంతో రెం డు రోజులుగా బ్యాంక్‌లో ఖాతా తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కొత్తపేట కేబీఎన్ కాలేజీ సమీపంలోని ఓ జాతీయ బ్యాంక్‌కు వెళ్లి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వాలని అడగ్గా మరో పది రోజుల వరకు ఖాళీ లేదని అధికారులు చెప్పారు. బంగారయ్య కొట్టు సమీపంలోని మరో జాతీయ బ్యాంక్‌కు వెళ్లగా దరఖాస్తు పూర్తిచేసి ఇవ్వాలని కోరారు. ఖాతా తెరిచి బుధవారం పాస్ పుస్తకం తీసుకుని ఆనందంగా ఇంటికి వెళుతుండగా సొమ్మసిల్లి పడిపోయి ప్రాణం వదిలింది.