appanapalli
-
అత్తమామల దాష్టీకం.. కర్టెన్ తాడుతో
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని మామిడికుదురు మండలం అప్పనపల్లిలో అమానుషం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న కడలి శాంతి అనే మహిళపై ఆమె అత్తమామలు మంగళవారం హత్యాయత్నం చేశారు. కర్టెన్ తాడుతో మహిళకు ఉరివేసేందుకు ప్రయత్నించగా ఆమె పెద్దగా కేకలు వేసింది. దీంతో అత్తమామలు ఆమెను కాలితో పొత్తి కడుపులో తన్నారు. బాధిత మహిళ కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోగా ఆమె ప్రాణాలతో బయటపడింది. కాగా శాంతి యూరినల్ ఆగిపోవడంతో ఆమెను హుటాహుటిన రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(మాస్టారు నీచత్వం: విద్యార్థితో) -
కాజ్ వే దాటుతుండగా ఇద్దరు వ్యక్తుల గల్లంతు
సాక్షి, తూర్పు గోదావరి : ఉభయ గోదావరి జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు కాజ్ వే దాటుతుండగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఘటన శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అప్పనపల్లిలో చోటు చేసుకుంది. కాగా, కొట్టుకుపోయిన ముగ్గురిలో ఒకరిని కాపాడినట్లు స్థానికులు పేర్కొన్నారు. మిగతా ఇద్దరి ఆచూకి కోసం పడవలపై గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా గల్లంతయిన వారు సమీర్ భాషా, నానిలుగా గుర్తించినట్లు తెలిపారు. -
శ్రీపుష్పయాగంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
వైభవంగా ద్వాదశ ప్రదక్షిణలు అప్పనపల్లి,(మామిడికుదురు) : శ్రీనివాసా గోవిందా, శ్రీవేంకటేశా గోవిందా అంటూ భక్తుల కోలాహలం నడుమ కనులపండువలా సాగిన శ్రీబాలబాలాజీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం శ్రీపుష్పయాగంతో సంపూర్ణమయ్యాయి. పచ్చని పందిళ్లు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు, పలు రకాల పుష్ప సోయగాల నడుమ శ్రీదేవీ, భూదేవీ సమేతంగా బాలబాలాజీ స్వామి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. మేళతాళాలు, భక్తుల కోలాహలం నడుమ ద్వాదశ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. వేద పండితులు భక్తులతో కలిసి 12 పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 12 రకాల మంగళ వాయిద్యాలు, 12 రకాల ప్రసాదాలతో ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. కల్యాణోత్సవాల్లో చివరి అంకంగా స్వామి వారి శ్రీపుష్పయాగం (పవళింపు సేవ) వైభవంగా నిర్వహించారు. శ్రీపుష్పయాగంలో పాల్గొన్న దంపతులకు ఉ«భయ దేవేరులతో కొలువు తీరిన బాలబాలాజీ స్వామి వారి తరఫున తాంబూలాలు అందించారు. ముందుగా సుప్రభాత సేవతో ఐదోరోజు శ్రీబాల బాలాజీ స్వామి వారిని మేల్కొలిపారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజచినజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీవారికి సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. బాలభోగం, నివేదన, వేదపారాయణం హృద్యంగా ఆలపించారు. నిత్యహోమం, నిత్యారాధన, మంగళశాసనం, తీర్థప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలను వైభవోపేతంగా జరిపించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, ఈఓ పొలమూరి బాబూరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. -
పులకించి‘నది’
వైభవంగా శ్రీవారి చక్రస్నానం వసంతోత్సవంలో పాల్గొన్న భక్తులు అప్పనపల్లి(మామిడికుదురు) : శ్రీబాలబాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం వైనతేయ గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం వైభవంగా జరిగింది. భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ సుదర్శన పెరుమాళ్‌కు గోదావరి నదిలో పుణ్యస్నానం చేయించారు. గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలను నివారించే స్వామిగా ప్రాచుర్యం పొందిన సుదర్శన పెరుమాళ్‌తో పాటు గోవిందా... గోవిందా...గోవింద... అంటూ భక్తులు గోదావరి నదిలో తలారాస్నానం చేసి పునీతులయ్యారు. చక్రస్నానం వైభవోపేతంగా నిర్వహించారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఉభయ దేవేరులతో కొలువుదీరిన శ్రీవారిని ముందుగా పల్లకిలో ఊరేగిస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు వసంతాలు చల్లుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో వసంతోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారితో పాటు సుదర్శన పెరుమాళ్‌కు నదీతీరంలో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిపించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. శ్రీవారికి సహస్రనామార్చన, బాల భోగం నివేదన, వేదపారాయణ, నిత్యహోమం, పూర్ణాహుతి, బలిహరణ, తీర్థప్రసాద గోష్ఠి, ధ్వజారోహణ, మంగళా శాసనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి పొలమూరి బాబూరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ట్రస్టు బోర్డు సభ్యులు కంకిపాటి సుబ్బారావు, సుందరనీడి వీరబాబు, బోనం బాబు, వాసంశెట్టి వెంకట్రావు, పోతుమూడి రాంబాబులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, దేవస్థానం ఉద్యోగులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేటితో ముగియనున్న కల్యాణోత్సవాలు శ్రీబాల బాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీపుష్పయాగం, రుత్విక్ సన్నానంతో ముగుస్తాయని ఆలయ ఈఓ పి.బాబూరావు తెలిపారు. నేటి కార్యక్రమాలు.. ఉదయం 5 గంటలకు శ్రీవారికి సుప్రభాత సేవ 6 గంటలకు సహస్రనామార్చన, 7 గంటలకు బాల భోగం నివేదన, 7.30కు వేదపారాయణం, నిత్యహోమం, మంగళా శాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి రాత్రి 7 గంటలకు నిత్యారాధన ఉత్సవాలు, నిత్య హోమం, 8 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం(పవళింపు సేవ), మంగళశాసనం, రుత్విక్ సన్మానం, తీర్ధ ప్రసాద గోష్ఠి -
లోక కల్యాణార్థం ఘనంగా వేద సదస్యం
ఘనంగా మూడో రోజు కార్యక్రమాలు అప్పనపల్లి(మామిడికుదురు) : బాలబాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో మూడో రోజు మంగళవారం భక్తుల కోలాహలంతో ఆలయం సందడిగా మారింది. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, శ్రీవారికి సహస్ర నామార్చన, బాల బోగ నివేదన, చతుస్థానార్చనలు, వేద పారాయణ, హోమాలు, బలిహరణ, మంగళశాసనాలు, తీర్థ ప్రసాద గోష్టి, సదస్యం (పండిత సన్మానం) వేద పారాయణ, నిత్య హోమం, బలిహరణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సదస్యంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలు అంతర్వేది, వాడపల్లి, మురముళ్ల, భీమవరం, ఆచంట, ద్వారకా తిరుమల, మందపల్లి, దవళేశ్వరం తదితర ఆలయాల నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం, జగత్ రక్షణ కోసం వేద సదస్యం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆకట్టుకున్న కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెదపట్నం గ్రామానికి చెందిన పుచ్చల తాతారావు, మొగలికుదురుకు చెందిన ఉప్పులూరి సుబ్బారావు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆనంద పరవశులను చేశాయి. ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, ఆలయ ఈఓ పొలమూరి బాబూరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. నేటి కార్యక్రమాలు... ఉదయం ఐదు గంటలకు శ్రీవారికి సుప్రభాత సేవ, ఆరు గంటలకు శ్రీవారికి సహస్రనామార్చన, ఏడు గంటలకు శ్రీవారికి బాల భోగ నివేదన, 7.30 గంటలకు వేదపారాయణ, నిత్యహోమం, పూర్ణాహుతి, బలిహరణ, 10 గంటలకు శ్రీవారికి చక్రస్నానం, తీర్థ ప్రసాద గోష్ఠి, సాయంత్రం ఏడు గంటలకు ధ్వజా అవరోహణ, మంగళాశాసనం, తీర్థ ప్రసద గోష్ఠి -
అంగరంగ వైభవంగా బాలబాలాజీ కల్యాణోత్సవం
పులకించిన భక్తజనులు అప్పనపల్లి(మామిడికుదురు) : భక్తుల కోలాహలం, గోవిందనామ స్మరణ, మంగళవాయిద్యాలు, నయనానందకరంగా అలంకరించిన పూల మండపంలో అప్పనపల్లి పుణ్యక్షేత్రంలో బాలబాలాజీ స్వామి దివ్య తిరు కల్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. జ్యేష్ట శుద్ధ ఏకాదశి శుభ ముహూర్తం రాత్రి 9.02 గంటలకు ఉభయ దేవేరులను బాలబాలాజీ స్వామి పరిణయమాడారు. కల్యాణానికి ముందుగా స్వామి, అమ్మవార్ల గుణగణాలను వివరిస్తూ నిర్వహించిన రాయబార ఉత్సవం (ఎదుర్కోలు సన్నాహం) కడు రమణీయంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు నడుమ పలు రకాల పుష్పాలతో సుందరంగా రూపొందించిన మంటపంలో శ్రీదేవి, భూదేవిలతో కొలువు తీరిన బాలాజీ స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం పొందారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం ఏసీ, ఈఓ పి.బాబూరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణోత్సవంలో పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆలయం తరఫన స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమలాపురం వేంకటేశ్వరస్వామి, అంతర్వేది లక్ష్మీనర్శింహస్వామి ఆలయాలకు చెందిన వేద పండితులు తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. రావులపాలేనికి చెందిన మన్యం సుబ్రహ్మణ్యేశ్వరరావు కుటుంబ సభ్యులు మంచి ముత్యాలు, పగడాలు తలంబ్రాలుగా అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు మద్దాల తిరుమల శింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిçష్యులు చమలచెర్ల మురళీకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం ఆద్యంతం కనుల పండువలా నిర్వహించారు. కల్యాణోత్సవంలో 260 మంది దంపతులు కర్తలుగా పాల్గొన్నారు. శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, అమలాపురం ఆర్డీఓ కె.గణేష్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య, జెడ్పీటీసీ సభ్యులు విత్తనాల మాణిక్యాలరావు, గంగుమళ్ల కాశీఅన్నపూర్ణ తదితరులు కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. -
నవవరునిగా బాలబాలాజీ
-వార్షిక దివ్యతిరుకల్యాణోత్సవాలకు శ్రీకారం -నేటి రాత్రి 9.02 గంటలకు పరిణయ వేడుక మామిడికుదురు (పి.గన్నవరం) : భక్తజనమనోరంజకంగా వైనతేయ తీరాన కొలువైన బాలబాలాజీ నవవరుడయ్యాడు. వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కర్పూరాగరు సుగంధ వీచికల నడుమ స్వామి కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరిగింది. జ్యేష్ఠ శుద్ధ దశమి ఆదివారం సాయంత్రం ఆరు గంటల శుభ ముహూర్తాన పాంచరాత్ర ఆగమానుసారం స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి వారి అర్చక బృందం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. బాలబాలాజీతో పాటు ఉభయ దేవేరుల బుగ్గన చుక్క పెట్టి వారిని పెళ్లికొడుకు, పెళ్లికుమార్తెలుగా తీర్చిదిద్దారు. కల్యాణోత్సవాలు నిరాటంకంగా జరగాలని కోరుతూ విష్వక్సేనారాధన నిర్వహించారు. తదుపరి పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, పరిషదక్షిణ, మృత్సంగ్రహణం, అంకురార్పణ, హోమం, మంగళాశాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం ఏసీ, కార్యనిర్వహణాధికారి పి.బాబూరావు కల్యాణోత్సవాలు కనుల పండుగలా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. నేటి కార్యక్రమాలు -ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ -ఆరు గంటలకు స్వామి వారికి సహస్రనామార్చన -ఏడు గంటలకు శ్రీవారికి బాల భోగ నివేదన -ఎనిమిది గంటలకు చతుస్ధానార్చనలు - 10 గంటలకు ధ్వజారోహణ, నీరాజన మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద గోష్ఠి -సాయంత్రం 4 గంటలకు బాల బాలాజీ స్వామి వారి తిరువీధి ఉత్సవం -ఆరు గంటలకు చతుస్థానార్చనలు, నిత్యోపాసన, బలిహరణ -రాత్రి 8 గంటలకు స్వామి వారి రాయబారోత్సవం (ఎదుర్కోలు సన్నాహం) -9.02 గంటలకు దివ్య తిరు కల్యాణోత్సవం, తీర్థ ప్రసాద గోష్ఠి -
బాలాజీ ఆలయానికి కల్యాణశోభ
నేటి నుంచే తిరు కల్యాణోత్సవాలు సోమవారం రాత్రి 9.02 గంటలకు కల్యాణం అప్పనపల్లి (మామిడికుదురు) : నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతూ, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే పరంధాముడిగా పూజలందుకుంటున్న బాల బాలాజీ స్వామి దివ్య క్షేత్రం వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పచ్చని మామిడి తోరణాలు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాల కాంతులు, కర్పూర పరిమళాలతో శ్రీవారి ఆలయం కల్యాణ శోభ సంతరించుకుంది. ఆదివారం నుంచి గురువారం వరకు నిర్వహించే కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జ్యేష్ఠ శుద్ధ దశమి ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. స్వామి వారి తిరు కల్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సోమవారం రాత్రి 9.02 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పాంచరాత్ర ఆగమానుసారం కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం ఏసీ, ఈఓ పి.బాబూరావు తెలిపారు. గ్రామ చరిత్ర: మూడున్నర దశాబ్ధాల క్రితం అప్పన్న అనే బాలుడు తపస్సు చేసి తరించడం వల్ల ఈ గ్రామానికి ‘అప్పనపల్లి’ అని పేరు వచ్చిందని ప్రతీక. పూర్వం ‘అర్పణేశ్వరుడు’ అనే యతీంద్రుడు పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైనతేయ నదీ తీరాన ఇసుక మేటలు వేసిన ప్రశాంత స్థలంలో ముక్కంటిని ధ్యానిస్తూ శివ సాక్షాత్కారం పొందాడని ఈ అర్పణ ఫలితాలు కాలక్రమేణా ‘అప్పనపల్లి’గా ప్రసిద్ధి చెందాయని మరో కథనం. నూతన ఆలయ నిర్మాణం: 1970 మార్చి 18న నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1991 జూలై నాలుగో తేదీన టీటీడీ ఉచితంగా సమర్పించిన మూలవిరాట్, సబ్సిడీపై కొనుగోలు చేసిన పద్మావతిదేవి, ఆండాళ్‌తాయార్, గరుడాళ్వార్ల విగ్రహాలను శ్రీమాన్ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ఆలయానికి చేరుకునేది ఇలా... స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా 70 కిలో మీటర్లు ప్రయాణించి తాటిపాక చేరుకోవాలి. కాకినాడ నుంచి అమలాపురం పాశర్లపూడి మీదుగా అప్పనపల్లి చేరుకునే వారికి 64 కిలో మీటర్లు. ఆలయానికి రావడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. -
విశ్వేశ్వరునికి లక్ష ఖర్జూరార్చన
అప్పనపల్లి(మామిడికుదురు) : శివోద్భవ దినమైన మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా గురువారం స్థా నిక శ్రీఅన్నపూర్ణా కాశీ విశ్వేశ్వరాలయంలో లక్ష ఖర్జూరార్చన వైభవంగా జరిగింది. పూ జ్యం జగన్నాథశర్మ ఆధ్వ ర్యంలో ఆలయార్చకుడు దొంతుకుర్తి సత్యనారాయణశర్మ నేతృత్వంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, మహన్యాసం, రుద్రాభిషేకం జరిపి అనంతరం లక్ష ఖర్జూరాలతో స్వామి వారిని అర్చించారు. అమ్మవారికి కుంకుమార్చన, రుద్రహోమం, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను జరిపించారు. పలువురు భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శివ కేశవ భక్త బృందం ఆధ్వర్యంలో 2005 నుంచి ఏటా శివుని పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
చంద్రబాబు నోట సమైక్యం మాట రావడం లేదు