appeal pitition
-
ఉరిశిక్షపై సుప్రీంకు వెళ్లడానికి దోషులకు 60 రోజుల గడువు
న్యూఢిల్లీ: ఉరిశిక్ష పడిన దోషులు శిక్ష నుంచి ఉపశమనానికి సుప్రీంకోర్టుకెక్కడానికి 60 రోజులు గడువు ఉన్నప్పటికీ ఈ లోగా వారికి డెత్ వారంట్లు ఎందుకు జారీ చేస్తున్నారని సుప్రీంకోర్టు గురువారం ట్రయల్ కోర్టులను ప్రశ్నించింది. 2018లో గుజరాత్‌లోని సూరత్‌లో మూడేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకేసులో అనిల్ సురేంద్ర సింగ్ యాదవ్‌ని ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు కూడా సమర్థించింది. ఆ తర్వాత కేవలం 33 రోజుల్లోనే కింది కోర్టు డెత్ వారంట్లు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాదవ్ సుప్రీంకోర్టుకెక్కాడు. దీంతో బెంచ్ యాదవ్ డెత్ వారంట్‌పై స్టే విధించింది. హైకోర్టు తీర్పుని సుప్రీంలో సవాల్ చేసుకోవడానికి దోషులకు 60 రోజులు గడువు ఉంటుందని, ఈలోగా డెత్ వారంట్లు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. అలాంటప్పుడు కింది కోర్టులు డెత్ వారంట్లు ఎలా జారీ చేస్తారని సుప్రీం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. -
చెన్నమనేని అప్పీల్ ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్ : పౌరసత్వ వివాదం కేసులో సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. సింగిల్ జడ్జి ఆదే శాల్లో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించడంతో అప్పీల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ కోరారు. అందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం బుధవారం అనుమతించింది. భారత పౌరసత్వం పొందేందుకు చెన్నమనేని వాస్తవాలనే తెలిపారని, తప్పుడు సమాచారం ఇచ్చారనే ఫిర్యా దులోని అంశాలు అసత్యాలని న్యాయవాది వాదిం చారు. రాజకీయ ప్రత్యర్థులే పిటిషనర్‌పై ఫిర్యా దులు చేస్తున్నారన్నారు. అప్పీల్ పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలిస్తే అంతా ఆమోదయోగ్యంగానే ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయ పడింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని న్యాయవాది కోరడంతో అందుకు ధర్మాసనం అనుమతిచి్చంది. -
మాల్యాకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. లండన్ హౌస్ తనఖా పెట్టి తీసుకున్నరుణాలను యూబీఎస్‌కు తిరిగి చెల్లించాలంటూ బుధవారం యూకే కోర్టు మాల్యా షాక్ ఇచ్చింది. మరోవైపు ఫ్యుజిటివ్ ఆర్థిక నేరస్థుల చట్టం కింద చర్యలపై బోంబే హైకోర్టులో చుక్కెదురైంది. ఫ్యుజిటివ్ ఆర్ధిక నేరస్థుల చట్టం 2018 కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను నిలిపివేయాలని కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు గురువారం తోసి పుచ్చింది. కోట్ల రూపాయలను స్వదేశీ బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టాలనే లక్ష్యంగా బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన చట్టమే ఫ్యుజిటివ్ ఆర్థిక నేరగాళ్ళ చట్టం -2018. ఈ చట్టం ప్రకారం విజయ్ మాల్యాను పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని, ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని ఈడీ ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. దీన్ని నిలిపివేయాలంటూ మాల్యా పెట్టుకున్న పిటిషన్ తాజాగా కోర్టు తిరస్కరించింది. బంగారు టాయిలెట్ పాయే? స్విస్‌బ్యాంకు యూబీఎస్‌కు మాల్యా చెల్లించాల్సిన 26.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.19.50కోట్లు) రుణానికి బదులుగా సుమారు రూ.80 లక్షలు (88,000 పౌండ్ల) చెల్లించాలని యూకే బుధవారం ఆదేశించింది. ఈ మొత్తాన్ని జనవరి 4, 2019 నాటికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గడువు లోపు ఈ డబ్బును చెల్లించకపోతే.. లండన్ లోని రీజెంట్స్ పార్క్ ఇంటిని స్వాధీనం చేసుకొనేందుకు యూబీఎస్‌కు గ్రీన్ సిగ్నల్‌వచ్చినట్టేనని, దీంతో మాల్యా బంగారు టాయెలెట్ పోయినట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా విజయ్ మాల్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నాయకత్వంలోని 13బ్యాంకుల కన్సార్షియానికి రూ.9వేల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టి 2016 మార్చిలో లండన్ పారిపోయాడు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తుల జప్తుపై ఎస్బీఐ కన్సార్షియానికి అనుకూలంగా యుకె హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆయనకు దాదాపు రూ.12,500 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని సమాచారం. -
అప్పీలుకు రాక్షసుడు
సాక్షి, చెన్నై : చిన్నారి అనే దయ లేకుండా ఆరేళ్ల హాసినిపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా అతి కిరాతకంగా హతమార్చిన నరరూప రాక్షసుడు దశ్వంత్ హైకోర్టు తలుపు తట్టాడు. తనకు విధించిన ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. నాలుగు వారాల్లోపు వివరణ ఇవ్వాలని పోలీసులకు న్యాయమూర్తులు ఆదేశాలు జారీచేశారు. చెన్నై శివారులోని కుండ్రత్తూరు సంబంధం నగర్‌కు చెందిన దశ్వంత్ (24) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మాంగాడు సమీపం మహాలింగం అపార్టుమెంటులో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న సమయంలో అఘాయిత్యానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. అదే అపార్టుమెంటులో నివసిస్తున్న బాబు కుమార్తె ఆరేళ్ల వయస్సున్న హాసిని గత ఏడాది ఫిబ్రవరి 5 వ తేదీన ఎత్తుకెళ్లాడు. ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ఆపై సజీవంగా తగులబెట్టి హతమార్చడం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అరెస్టుచేసి కటకటాల్లోకి నెట్టగా బెయిల్ మీద దర్జాగా దశ్వంత్ బయటకు వచ్చాడు. జైలు జీవితంతో మంచివాడిగా మారుతాడుకున్న వాడు మరింత కిరాతకుడయ్యాడు. జులాయిగా తిరగడం మొదలెట్టిన దశ్వంత్ ఖర్చుల కోసం డబ్బు ఇవ్వలేదన్న ఆగ్రహంతో కన్న తల్లి సరళను సైతం కడతేర్చి ఉడాయించాడు. ఈ నరరూప రాక్షసుడ్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు అరెస్టుచేసి కోర్టు బోనులో నిలబెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఇతనికి ఉరి శిక్ష విధిస్తూ చెంగల్పట్టు మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చి నెలన్నర రోజుల అనంతరం దశ్వంత్ అప్పీలుకు సిద్ధం అయ్యాడు. బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పీలుకు దశ్వంత్ తనకు విధించిన ఉరి శిక్షను పిటిషన్లో వ్యతిరేకించాడు. చార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలను వివరించారు. మహిళా కోర్టు విచారణ తీరును గుర్తు చేశాడు. సాక్షుల విచారణ, వాంగ్మూలం గురించి వివరించాడు. అయితే, సాక్షుల వాంగ్మూలం అంతా అసంబద్ధంగా ఉందని ఆరోపించాడు. పోలీసులు సమర్పించిన ఆధారాల గురించి వివరిస్తూ, విచారణలో అవన్నీ తారుమారయ్యాయని పేర్కొన్నాడు. అస్సలు విచారణ సమగ్రంగానే సాగలేదని హైకోర్టు దృష్టికి తెచ్చాడు. తనకు శిక్ష వి«ధించి కేసును ముగించాలన్నట్టుగానే తంతు సాగిందే గానీ సమగ్ర విచారణ జరగ లేదని ఆరోపించాడు. ఆ ఉరి శిక్షను రద్దు చేయాలని, సాక్ష్యాలు, ఆధారాలను సమగ్రంగా పరిశీలించి తుది తీర్పును ఇవ్వాలని దశ్వంత్ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు పరిగణించింది. న్యాయమూర్తులు విమల, రామతిలగం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం విచారణకు స్వీకరించింది. అలాగే దశ్వంత్ పిటిషన్‌కు నాలుగు వారాల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. చదవండి: హాసిని అత్యాచారం కేసులో దశ్వంత్ కు ఉరి కిరాతకుడు దశ్వంత్ ముంబైలో అరెస్ట్ -
అప్పీళ్ల దాఖలుకు నేడు ఆఖరు
► పునర్విభజన ముసాయిదాపై భారీగా అప్పీళ్లు ► అత్యధికంగా వరంగల్ జిల్లాపై 9500 ► 17వేల అభ్యంతరాల పరిశీలన పూర్తి హన్మకొండ అర్బన్: జిల్లాల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాల (అప్పీళ్లు) దాఖలుకు గడువు మంగళవారం(20వ తేదీ)తో ముగియనుంది. వరంగల్ జిల్లాలో వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 22న ముసాయిదా ప్రకటన విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు ఉన్నట్లయితే 30రోజుల్లోగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో గానీ, ఆన్లైన్ ద్వారా గానీ తమ అభ్యంతరాలను అందజేయాలని కోరింది. జిల్లా నుంచి మొదటి రోజు నుంచే ఆన్లైన్ దరఖాస్తులు వెల్లువెత్తాయి. సోమవారం రాత్రి వరకు మొత్తం 21వేల దరఖాస్తులు అందాయి. వీటిలో ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తులు 14,800 కాగా.. కలెక్టరేట్ సెల్లో అందజేసినవి సుమారు 7వేల వరకు ఉన్నాయి. చివరి రోజు కావడంతో మంగళవారం మరికొన్ని దరఖాస్తులు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వెంట వెంటనే పరిశీలన జిల్లాకు సంబంధించి అందిన మొత్తం అప్పీళ్లను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. ప్రతిరోజూ వెబ్సైట్ ద్వారా వచ్చిన దరఖాస్తులు ప్రాథమికంగా పరిశీలన చేసి అవసరం మేరకు జిల్లా కలెక్టర్ ముందు ఉంచి కలెక్టర్ సంతకంతో వాటిని ప్రాధాన్యతా క్రమంలో మళ్లీ అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అందిన సుమారు 21వేల దరఖాస్తుల్లో సుమారు 17వేల దరఖాస్తులకు పైగా అధికారులు పరిశీలన పూర్తి చేసి అప్లోడ్ చేశారు. నాలుగు కేటగిరీలుగా... జిల్లాల విభజనపై అందిన అప్పీళ్లు మొత్తం నాలుగు కేటగిరీలుగా అధికారులు విభజిస్తున్నారు. 1.పరిశీలనకు అర్హతలేనివి, 2.ఇతర జిల్లాలకు పంపించాల్సినవి, 3. ప్రభుత్వ పరిశీలనకు పంపాల్సినవి, 4. పరిశీలనకు స్వీకరించాల్సినవి. ఈ విధంగా ప్రస్తుతం దరఖాస్తులు పరిశీలించారు. అయితే వాటిలో సుమారు వెయ్యికి పైగా దరఖాస్తులు అధికారులు వివిధ కారణాలతో జిల్లా స్థాయిలోనే తిరస్కరించారు. ఉదాహరణకు... వ్యక్తుల తమ ఫొటోలతో అప్లోడ్ చేసినవి, సంబంధం లేని విషయాలు ప్రస్తావించినవి, ఆడియో క్లిప్పింగ్‌లు, వీడియో క్లిప్పింగ్‌లు అప్లోడ్ చేసినవి ... ఈ విధమైన అభ్యంతరాలను జిల్లా స్థాయిలో తరస్కరిస్తున్నారు. ప్రస్తుతం నాల్గవ స్థానంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో అత్యధిక అప్పీళ్లు వచ్చిన వాటిలో జిల్లా ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కరీంనగర్, 2వ స్థానంలో నల్లగొండ, 3వ స్థానంలో మహబూబ్‌నగర్, 4వ స్థానంలో వరంగల్ జిల్లాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాపై 9500, హన్మకొండపై 3091, జయశంకర్ జిల్లాపై 1236, మహబూబాబాద్‌పై 939 అప్పీళ్లు ఆన్లైన్ ద్వారా అందాయి. -
రామలింగరాజుకు బెయిల్
-
రామలింగరాజుకు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : రామలింగరాజుకు ఊరట లభించింది. సత్యం కుంభకోణం కేసులో ఆయనకు న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజుతో పాటు మిగతా నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. రామలింగరాజు, రామరాజు రూ.లక్ష చొప్పున, మిగతా నిందితులు రూ.50 వేలు పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాగా సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ ఆయన నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
'ఆ అధికారం మాకు లేదు..హైకోర్టుకు వెళ్లండి'
హైదరాబాద్: సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ సత్యం రామలింగరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సవాల్ చేస్తూ రామలింగరాజు, ఇతర నిందితులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారు పెట్టుకున్న అప్పీల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. పిటిషన్‌ను సమీక్షించే అధికారం తమకు లేదన్న నాంపల్లి కోర్టు.. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. -
'సత్యం' శిక్షను సవాలుచేసిన రామలింగరాజు
-
'సత్యం' శిక్షను సవాలుచేసిన రామలింగరాజు
సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలుచేస్తూ ఆ సంస్థ వ్యవస్థాపక సీఈవో రామలింగరాజు సోమవారం నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టుకు సమర్పించారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి గత గురువారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.