Aqua Exports
-
సంధ్య ఆక్వా కంపెనీ కేసుపై విజయ్ సాయి రెడ్డి క్లారిటీ
-
సంధ్య ఆక్వా ఎక్స్ కంపెనీ నలుగురు ప్రతినిధులకి సీబీఐ నోటీసులు
-
‘సంధ్య’ నిర్వాకాలతో ఎగుమతులకు దెబ్బ
మహారాణిపేట: సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ దిగుమతి చేసుకున్న 25 వేల కిలోల ఇన్ యాక్టివ్ డ్రై ఈస్ట్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలడం మత్స్య ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమ రవాణా వల్ల 20 ఏళ్ల క్రితం కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన మత్స్యకారుల త్యాగానికి విలువ లేకుండా పోయిందన్నారు. భూములిచ్చిన 766 మంది మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు ఇస్తామన్న మాటను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. దేశ అభివృద్ధి కోసం విశాఖ పోర్ట్ యాజమాన్యానికి భూములిస్తే వారు ప్రైవేటు వ్యక్తులకు కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి భూములు అప్పగించారన్నారు. కంటైనర్ టెర్మినల్‌లో ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో అంతర్జాతీయ స్మగ్లర్లు అక్రమ వ్యాపారాలకు విశాఖను ఎంచుకుంటున్నారన్నారు. దీనివల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినడమే కాకుండా మత్స్య ఎగుమతులపై ప్రభావం చూపుతుందన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు భారత మత్స్య పరిశ్రమకు రాయితీలు, ప్రోత్సాహకాలు రద్దు చేయాలని నిర్ణయించడం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ యాజమాన్యం నిర్వాకాలతో మత్స్య పరిశ్రమ, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంధ్యా ఆక్వా సంస్థతో పాటు విశాఖ కంటైనర్ టెర్మినల్, జేఎం బక్షి సంస్థలను దీనికి బాధ్యులుగా చేసి సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు కంటైనర్ దిగుమతులను విశాఖ పోర్ట్ అథారిటీ స్వయంగా పరిశీలించాలని కోరారు. దిగువ స్థాయి కస్టమ్స్ అధికారులు ప్రమేయం లేకుండా ఇదంతా జరగదని, వీసీటీపీఎల్, జేఎం భక్షి సంస్థలు ఇందుకు బాధ్యత వహించాలన్నారు. విశాఖకు దిగుమతి అవుతున్న ప్రతి కంటైనర్‌ను పూర్తిగా స్కానింగ్ చేసిన తర్వాత దేశంలోకి అనుమతించాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు దూడపోలయ్య, గుంటు దానయ్య, వాసుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు . -
‘మేత’వన్నె పులి
సాక్షి, అమరావతి: డ్రై ఈస్ట్ మాటున రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను బ్రెజిల్ నుంచి సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ పేరిట దిగుమతి చేసుకున్న ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. రొయ్యల మేత మాటున రూ.లక్షల కోట్ల డ్రగ్స్ దందా సాగిస్తూ ‘మేత’వన్నె పులిగా ‘సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్’ ఖ్యాతిపొందింది. ఈ క్రమంలో అసలు డ్రై ఈస్ట్ అంటే ఏమిటి? ఎలా తయారవుతుంది.? ఏయే అవసరాల కోసం ఎంత మోతాదులో వినియోగిస్తారు. ఆక్వా ఫీడ్ తయారీలో నిజంగానే వాడతారా? ఫీడ్ తయారీలో ఈ సంస్థ ఎప్పుడు అడుగు పెట్టింది ? ప్లాంట్ సామర్థ్యం ఎంత ? ఎందుకు ఇంత పెద్దమొత్తంలో ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది? అనే అంశాలపై చర్చ జరుగుతోంది 90 శాతానికిపైగా ఆహార ఉత్పత్తుల తయారీలోనే డ్రై ఈస్ట్ అనేది సజీవ సూక్ష్మజీవుల సమాహారం. ఇదొక ఇమినో బూస్టర్‌లా ఉపయోగపడుతుంది. శిలీంధ్రాల జాతికి చెందిన దీని శాస్త్రీయ నామం సక్కరో మైసెస్. ప్రధానంగా యాక్టివ్ డ్రై ఈస్ట్, ఇన్స్టంట్ డ్రై ఈస్ట్, ఫాస్ట్ యాక్టింగ్ ఇన్స్టంట్ ఈస్ట్, బ్రెడ్ మెషిన్ ఈస్ట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా బేకరీ, ఆహార ఉత్పత్తుల తయారీలో వాటి ఆకృతి, రుచి, పెరుగుదలకు వాడుతుంటారు. ఆక్వా, పౌల్ట్రీ, యానిమల్ ఫీడ్ తయారీలోనూ కొద్దిగా వాడతారు. ఈస్ట్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలు దేశీయంగా చాలా ఉన్నాయి. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం, విదేశాలతో పోల్చుకుంటే ధర ఎక్కువగా ఉండడంతో మెజార్టీ ఆహార ఉత్పత్తుల తయారీదారులు విదేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంటారు. బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, చైనాలో ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. దేశీయంగా క్వాలిటీని బట్టి కిలో రూ.200 నుంచి రూ.480 వరకు ఉంటే, ఒక్క బ్రెజిల్‌లోనే కిలో రూ.70కు అందుబాటులో ఉంటుంది. కారణం ఇక్కడ ఎక్కువగా పండే బార్లీ నుంచి ఈస్ట్ ఉత్పత్తి చేసే కంపెనీలు ఎక్కువగా ఉండడమే. అందుకే ఒక్క బ్రెజిల్ నుంచి ఏటా 500 టన్నుల ఈస్ట్ మన దేశానికి దిగుమతి అవుతుంది. దిగుమతి అయ్యే డ్రై ఈస్ట్‌లో నూటికి 90 శాతానికి పైగా ఆహార ఉత్పత్తుల తయారీలోనే ఉపయోగిస్తారు. ఆక్వా, పౌల్ట్రీ, యానిమల్ ఫీడ్ తయారీలో వాడకం ఐదు శాతం లోపే ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువగా ఫీడ్ సప్లిమెంట్ కోసం వాడతారు. ఆక్వా సాగులోనూ హెక్టారుకు 5 గ్రాములకు మించి వాడరు ఆక్వాసాగులో ఈస్ట్‌ను రైతులు ఉపయోగిస్తుంటారు. సాగుకు ముందు చెరువులను సిద్ధం చేసే సమయంలో వాటర్ ఫ్యూరిఫికేషన్ చేస్తారు. ఈ సమయంలో వరిపిండి, తవుడు, బెల్లం, నీరు కలిపిన ద్రావణంలో 1–2 గ్రాములు ఈస్ట్‌ను కలిపి 24 గంటలపాటు పులియబెట్టి ఆ తర్వాత చెరువులో కలుపుతారు. దీనివల్ల పైటో ప్లాంటన్ (వృక్ష సంబంధమైన ప్లవకం), జూ ప్లాంటన్ (జంతు సంబంధమైన ప్లవకం) తయారవు తుంది. వీటిని తినేందుకు రొయ్యలు ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. ఇలా హెక్టార్‌కు ఐదు గ్రాములకు మించి వినియోగించరు. ఆ తర్వాత వ్యాధికారక క్రిములను తట్టుకొని మెరుగైన రోగనిరోధకశక్తిని పొందేందుకు, నీటి నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రో బయోటిక్స్గానూ వాడుతుంటారు. వీటి తయారీలో కూడా ఈస్ట్‌ను ఫీడ్ కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. రొయ్యల మేత తయారు చేసే ఫీడ్ కంపెనీలు దేశీయంగా 16 ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 14 లక్షల టన్నుల మేత ఉత్పత్తి జరుగుతుంది. ఒక్క అవంతి ఫీడ్ కంపెనీయే ఏటా 5–6 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత సీపీఎఫ్ కంపెనీ 2 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంటే, మిగిలిన కంపెనీలన్నీ ఏటా 50 వేల నుంచి లక్ష టన్నులలోపు ఉత్పత్తి చేస్తుంటాయి. ఏకంగా 25 టన్నులెందుకు? ఇక సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెట్ పేరిట అధికారికంగా పామర్రులో రెండు ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, నెల్లూరులో బ్లాక్‌వాటర్ షల్ ఫిష్ హేచరీ ఉంది. రెండు నెలల క్రితం కాకినాడ జిల్లా మూలపేట వద్ద మరో ప్రాసెసింగ్ ప్లాంట్, వజ్రకూటం వద్ద ఏటా 60వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్వా ఫీడ్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఒక్క కిలో కూడా మార్కెట్లోకి రాలేదు. కేజీ మేత తయారీ కోసం కేవలం 5 గ్రాములకు మించి డ్రై ఈస్ట్‌ను వాడరు. అంటే 25 టన్నుల డ్రై ఈస్ట్ ద్వారా కనీసం 5 లక్షల నుంచి 6 లక్షల టన్నుల మేత తయారు చేయొచ్చు. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 60 వేల టన్నులు మాత్రమే. ఈ లెక్కన ఇంత పెద్ద ఎత్తున డ్రైడ్ ఈస్ట్ దిగుమతికి ఆర్డర్ ఇవ్వడం వెనుక చాలా గూడుపుఠాణి ఉందని అర్థమవుతోంది. టీడీపీ, బీజేపీ పెద్దల సహకారంతోనే డ్రై ఈస్ట్ పేరిట డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. రైతులకు రూ.కోట్లలో బకాయిలు మరోవైపు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ రోజుకు 80 టన్నుల నుంచి 150 టన్నుల రొయ్యలను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు ఉన్న ఆక్వా రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది. వీటిని ప్రాసెస్ చేసి అమెరికా, చైనాకు ఎగుమతి చేస్తుంది. గతంలో ఎక్స్పోర్ట్ కంపెనీలు చెప్పిందే ధర.. ఇచ్చిందే సొమ్ము అన్నట్టుగా ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అప్సడా చట్టం చేయడం, పైగా కౌంట్ల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ప్రాసెసింగ్ కంపెనీలు కొనుగోలు చేసేలా ప్రతి 15రోజులకోసారి పర్యవేక్షిస్తుండడంతో కంపెనీల ఆటలు సాగడం లేదు. స్థానిక ఆక్వా రైతులను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈక్వెడార్ నుంచి 17 కంటైనర్లలో రొయ్యలను దిగుమతి చేసుకొని వాటిని ప్రాసెస్ చేసి తిరిగి అమెరికా, చైనాకు ఎగుమతి చేస్తున్నారని తెలియడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కంపెనీని కొంతకాలం పాటు సీజ్ చేసింది. ఎగుమతులకూ బ్రేకులేసింది. ఇటీవల కాలంలో ఈ సంస్థ రైతులకు రూ.కోట్లలో బకాయి పడింది. రొయ్యలు సరఫరా చేసినందుకు ఈ కంపెనీ తనకు రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉందని భీమవరానికి చెందిన ఓ రైతు ‘సాక్షి’కి తెలిపారు. ఈ విధంగా సుమారు రూ.10 కోట్లకు పైగా ఈ సంస్థ రైతులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. బకాయిలు చెల్లించేలా చూడాలి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదమే. ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలను ప్రాసెస్ చేసి అమెరికాకు పంపుతున్న సమయంలో అప్సడా ఉక్కుపాదం మోపింది. చట్టపరంగా చర్యలు తీసుకుని కంపెనీని చాన్నాళ్లు మూసేసింది. ఇటీవల ప్రారంభించిన ఫీడ్ ప్లాంట్ తయారీకి ఎలాంటి అనుమతులూ లేవని చెబుతున్నారు. ఉత్పత్తిని పూర్తిస్థాయిలో ప్రారంభించని ఈ సంస్థకు ఇంతపెద్ద ఎత్తున డ్రై ఈస్ట్ దిగుమతి చేసుకోవల్సిన అవసరం ఏముంది? ఏదేమైనా ముందుగా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు అణాపైసలతో సహా చెల్లించి తీరాల్సిందే. ఈ సంస్థను అడ్డంపెట్టుకుని డ్రై ఈస్ట్ మాటున డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న టీడీపీ, బీజేపీ పెద్దలెవరో తెలియాలంటే సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
'మత్తు' చుట్టూ చుట్టాలే
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఒంగోలు/గాంధీ నగర్ (విజయవాడ సెంట్రల్)/ పిఠాపురం/ చీరాల/ విశాఖ సిటీ/ సాక్షి ప్రతినిధి,గుంటూరు: విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ దందాలో వేళ్లన్నీ టీడీపీవైపే చూపుతున్నాయి. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు భారీగా డ్రగ్స్‌ను దిగుమతి చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, అధిపతి కూనం కోటయ్య చౌదరి టీడీపీలో ప్రముఖులైన నారా, నందమూరి, రాయపాటి, ఆలపాటి, దామచర్ల, లావు కుటుంబాలకు అత్యంత సన్నిహితులన్నది బహిర్గతమైంది. డ్రగ్స్ మాఫియా బండారం బట్టబయలు కావడంతో బెంబేలెత్తిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికి దిగి విషయాన్ని పక్కదారి పట్టించాలని కుట్ర పన్నారు. ఈ అంకంలో భాగంగా ఒకపక్క సీబీఐ అధికారుల సోదాలు కొనసాగుతుండగానే గురువారం రాత్రే చంద్రబాబు, లోకేశ్ వరుస ట్వీట్లు చేస్తూ టీడీపీ శ్రేణులతోపాటు టీడీపీ అనుకూల మీడియాకు సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే టీడీపీ అనుకూల మీడియా అవాస్తవాలు, అభూత కల్పనలు జోడిస్తూ దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా డ్రగ్స్ దందా వెనుక తాము ఉన్నామనే విషయాన్ని కప్పిపుచ్చవచ్చని చంద్రబాబు భావించారు. అయితే కూనం కోటయ్య చౌదరితో టీడీపీ నేతల వ్యాపార బంధం వెలుగు చూడటంతో బాబు కుట్ర బెడిసికొట్టింది. చంద్రబాబు వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబంతో కూనం కుటుంబానికి ఉన్న వ్యాపార బంధం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. రాయపాటి, దామచర్ల, లావు కుటుంబ సభ్యులతో కూనం కోటయ్య చౌదరి కలసి ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూనం వీరభద్ర చౌదరితో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకు ఉన్న బంధాన్ని రుజువు చేసే వ్యాపార లావాదేవీల పత్రాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదురుతుందనే సంకేతాలు అందిన వెంటనే బ్రెజిల్ నుంచి భారీగా డ్రగ్స్ దిగుమతికి తెర తీసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడం గమనార్హం. కింగ్ పిన్ కోటయ్య చౌదరి.. డ్రగ్స్ దందాలో కీలక పాత్రధారులైన సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితులని ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఆయన సన్నిహితులు, వ్యాపార భాగస్వాముల జాబితాను చూస్తే ఆ విషయం తేలిపోతోంది. దామచర్ల సత్యం (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ సోదరుడు), రాయపాటి జీవన్ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారంతా ఓ కోటరీగా పెద్ద ఎత్తున వ్యవహారాలు సాగించారన్నది వెల్లడైంది. వారు విదేశాల్లో అత్యంత సన్నిహితంగా తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దామచర్ల సత్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుతోనూ సాన్నిహిత్యం ఉంది. సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరితోపాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆలపాటి రాజాకు వ్యాపార బంధం ఉంది. వారిద్దరూ సంతకాలు చేసిన పలు పత్రాలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విశాఖ కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్న సంధ్యా ఆక్వా కంపెనీకి నందమూరి కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేశ్ తోడల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్‌కు కూనం కోటయ్య చౌదరి అత్యంత సన్నిహితుడు. ఆయన కుటుంబం సహకారంతోనే విశాఖ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. సంధ్యా ఆక్వా కంపెనీతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి వ్యాపార బంధం ఉందన్నది ఇప్పటికే బయటపడింది. పురందేశ్వరి కుమారుడు చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగా కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరి ఆక్వా వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో డ్రగ్స్ దందాలో తీగ లాగితే చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి కోటరీ అక్రమాల డొంకంతా కదులుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ.. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పాత్ర ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో మద్యం కుంభకోణానికి పాల్పడిన సిండికేట్‌లో ఆ కంపెనీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఆ కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు విశాఖ డ్రగ్స్ దందాను కూడా కలిపి మొత్తంగా మద్యం, డ్రగ్స్ మాఫియా గుట్టును ఛేదించే పనిలో నిమగ్నమైంది. పొత్తుతోనే బరితెగింపు.. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎప్పుడో సిద్ధపడ్డారు. అందుకోసం కాళ్ల బేరానికి కూడా దిగజారతానని గతేడాదే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పొత్తును అవకాశంగా చేసుకుని భారీగా డ్రగ్స్ దందాకు పచ్చ మాఫియా బరితెగించింది. ఎన్నికల ముందు భారీగా డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి తరలించేందుకు పథకం వేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే సంధ్యా ఆక్వా కంపెనీ ద్వారా బ్రెజిల్ నుంచి 25 వేల కిలోల ఈస్ట్ దిగుమతి ముసుగులో భారీగా డ్రగ్స్‌ను చేరవేసేందుకు ప్రణాళిక రూపొందించింది. రెండు నెలల్లో డ్రగ్స్ విశాఖ చేరుకునేలా అంతా సిద్ధమైంది. అటు దగ్గుబాటి ఇటు చంద్రబాబు కుటుంబాలు సహకారం ఉండటంతో తమ దందాకు అడ్డు ఉండదని భావించారు. డ్రగ్స్ మాఫియాపై అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్‌కు ఉప్పందడంతో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం విశాఖ పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ బాగోతం బట్టబయలైంది. పచ్చ కుట్ర బెడిసికొట్టింది. ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ తక్షణమే ప్రతి స్పందించింది. డ్రగ్స్ దందాతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలకు ఉన్న బంధాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నియమావళిని ఉల్లంఘిస్తూ చంద్రబాబు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో నివేదించింది. దీనిపై జాతీయ ప్రెస్ కౌన్సిల్‌కు కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. డ్రగ్స్ దందాపై సత్వరం సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి పాత్రధారులతోపాటు సూత్రధారులను నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేసింది. కూనం కుటుంబం కథ... విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులైన సంధ్యా ఆక్వా ఫుడ్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అధినేతలు కూనం వీరభద్ర చౌదరి, కుమారుడు కూనం కోటయ్య చౌదరి స్వగ్రామం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి. ఆక్వా రంగంలో ఉత్థాన పతనాలను చూసిన వీరభద్ర చౌదరి డ్రగ్స్ వ్యాపారంలో కాలు మోపాడు. కాకినాడ ప్రధాన కేంద్రంగా ఆక్వా ఫుడ్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, ప్రీ ప్రోసెసింగ్ ప్లాంట్ల ముసుగులో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అటు టీడీపీ ఇటు రాష్ట్ర బీజేపీ అగ్రనేతల అండదండలతో తన కార్యకలాపాలను విస్తరించాడు. కూనం కుటుంబానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంధ్యా ఆక్వా ప్రీ ప్రోసెసింగ్ ప్లాంట్లతో పాటు ఆక్వా కల్చర్ చెరువులు కూడా ఉన్నాయి. వీరి వ్యాపార లావాదేవీలు కొండపి, ఒంగోలు, కందుకూరు, పర్చూరు నియోజకవర్గాల్లోనూ సాగుతున్నాయి. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సోదరుడు దామచర్ల సత్యనారాయణ(సత్య)తో కూనం కుటుంబానికి వ్యాపార లావాదేవీలున్నాయి. టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో దామచర్ల సత్యకు చెందిన పొగాకు గోడౌన్లో సంధ్యా ఆక్వా పేరుతో ప్రీ ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటైంది. కూనం కుటుంబానికి విజయవాడకు చెందిన సౌమ్యుడిగా పేరున్న ఓ టీడీపీ నేతతోనూ సంబంధాలున్నట్లు సమాచారం. కోటయ్య చౌదరి, టీడీపీ నేత తనయుడు తనయుడు విదేశాల్లో మంచి సన్నిహితులని తెలిసింది. కాకినాడ తీరంలో కలకలం డ్రగ్స్ తీగ లాగితే కాకినాడ జిల్లా కొత్తపల్లి తీరంలోని మూలపేటలో డొంక కదిలింది. మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 10 మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు జరిపారు. సీబీఐ ఇన్స్పెక్టర్ బల్వీందర్ సింగ్ ఆధ్వర్యంలో సీబీఐ బృందం ఈ తనిఖీలు చేసింది. జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి సమీపాన ఉన్న సంధ్య ఆక్వా సీడ్ తయారీ కంపెనీ, కృష్ణా జిల్లా పామర్రు తదితర ప్రాంతాల్లో ఉన్న సంధ్య ఆక్వా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెబుతున్నారు. కత్తిపూడి సమీపంలోని సంధ్య ఆక్వా సీడ్ కంపెనీని ఇటీవలే ప్రారంభించారు. దీనిలో ఆక్వా సీడ్ తయారీకి అవసరమైన ముడి సరుకును బ్రెజిల్ నుంచి దిగుమతి చేయడంతో ఆ సరకు నౌక ద్వారా విశాఖకు కంటైనర్లలో చేరింది. వాటిలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు సంధ్య కంపెనీలన్నింటిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించి మందులు, ఇతర శాంపిల్స్ సేకరించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించిన సీబీఐ అధికారులు తిరిగి సోదాలు చేస్తామని తెలిపారు. చీరాలకు లింకు? డ్రగ్స్ దందాకు చీరాలతో కూడా లింకులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సంధ్యా ఆక్వా పేరుతో వాడరేవులో గత రెండేళ్లుగా కంపెనీ నడుస్తోంది. దీన్ని పురందేశ్వరి అల్లుడు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. గత పది రోజులుగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయని సమాచారం. మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్ పరీక్ష డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం మరికొన్ని శాంపిల్స్‌ను పరీక్షించగా ఫలితాలు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో న్యాయమూర్తి సమక్షంలో 25 వేల కేజీల సరుకుతో కూడిన కంటైనర్‌ను సీజ్ చేశారు. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి రవాణా నౌక ద్వారా విశాఖకు వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19, 20వ తేదీల్లో 49 బ్యాగుల్లో శాంపిల్స్‌ను పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో ఈ నెల 21వ తేదీన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా శుక్రవారం మరోసారి వీసీటీపీఎల్కు వెళ్లి మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్‌ను పరీక్షించారు. వాటి ఫలితాలు కూడా పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం. న్యాయమూర్తి సమక్షంలో రికార్డులతో పాటు శాంపిల్స్‌ను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి సమక్షంలోనే బ్యాగులను సీజ్ చేశారు. మరికొన్ని సీబీఐ బృందాలు సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోమరిన్ని ఆధారాలతో సీబీఐ అధికారులు త్వరలోనే అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘ఆలపాటి’ ఆర్థిక బంధం విశాఖ డ్రగ్స్ కేసులో కీలక పాత్రధారి కూనం వీరభద్ర చౌదరి(వీరభద్రరావు)తో మాజీ మంత్రి ఆలపాటి రాజాకు ఉన్న ఆర్థిక సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. ఆలపాటి రుణాలకు కూనం సెక్యూరిటీ ఇవ్వడంతోపాటు ఎన్ఆర్ఐ అకాడమీతో భాగం పంపిణీ చేసుకోవడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. 2015 అక్టోబరు 31న ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు అరండల్‌పేట విజయా బ్యాంకు బ్రాంచ్‌లో రూ.2 కోట్లు రుణం (దస్తావేజు నంబరు 11158/2015) తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 9న మరో రూ.12 కోట్లు అదే బ్యాంకు నుంచి రుణాన్ని పొందారు. దీనికి ఆలపాటి రాజా భార్య ఆలపాటి మాధవితోపాటు కూనం వీరభద్రరావు, ఎన్ఆర్ఐ అకాడమీ ఆస్తులను (దస్తావేజు నంబరు 12521/2015) తనఖా పెట్టారు. 2021లో కూనం వీరభద్రరావుకు ఎన్నారై అకాడమీకి సంబంధించి పార్టీషన్ దస్తావేజు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. కూనం వీరభద్రరావు తమ ఆస్తులను తనఖా పెట్టి 2017లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు రుణాన్ని ఇప్పించారు (దస్తావేజు నంబరు 4581/2017). ఇదే దస్తావేజును 2021లో (నంబరు 12205/2021) రద్దు చేసుకున్నారు. దీంతోపాటు మరికొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా వీరిద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. -
రూ. లక్షన్నర కోట్ల ఎగుమతులు
సాక్షి, అమరావతి: వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2019–20లో తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కును చేరుకున్న రాష్ట్ర ఎగుమతులు నాలుగేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. 2019–20లో రాష్ట్రం నుంచి రూ.1,04,829 కోట్ల ఎగుమతులు జరగగా 2022–23 నాటికి రూ.1,59,368.02 కోట్ల మార్కును చేరుకోవడం గమనార్హం. నాలుగేళ్లలో ఎగుమతులు దాదాపు రూ.55 వేల కోట్ల మేర పెరిగాయి. రాష్ట్రాల వారీగా ఎగుమతుల వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా విడుదల చేసింది. అత్యధికంగా ఆక్వా 2022–23లో దేశవ్యాప్తంగా రూ.36,20,630.9 కోట్ల విలువైన ఎగుమతులు జరగగా 4.41 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. రూ.12,00,001.94 కోట్ల ఎగుమతులతో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ నుంచి అత్యధికంగా రూ.19,872.82 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు జరగగా రూ.9,919 కోట్ల ఎగుమతులతో ఫార్మా రంగం రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలవారీగా చూస్తే ఉమ్మడి విశాఖ రూ.48,608.59 కోట్ల విలువైన ఎగుమతులతో అగ్రభాగాన ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రూ.31426.23 కోట్ల ఎగుమతులతో ఆ తర్వాతి స్థానం దక్కించుకుంది. 10 శాతం మార్కెట్ వాటాపై దృష్టి దేశీయ ఎగుమతుల్లో 2030 నాటికి 10 శాతం వాటాను సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా 2025–26 నాటికి రాష్ట్రంలో అదనంగా 110 మిలియన్ టన్నుల అదనపు సామర్థ్యం అందుబాటులోకి తెచ్చే విధంగా ఏకకాలంలో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ సెజ్‌ల్లో కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.18,897 కోట్లను వ్యయం చేస్తోంది. రామాయపట్నం పోర్టు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుండగా మిగిలిన పోర్టులు 18 నుంచి 24 నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటికి అదనంగా రూ.3,700 కోట్లతో మరో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. వీటి చెంతనే ఫుడ్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. నాలుగు ఫిషింగ్ హార్బర్లు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి రానుండగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కొత్తగా ని ర్మించే నాలుగు పోర్టుల ద్వారా అదనంగా లక్ష మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర జీడీపీ, ప్రజల తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో.. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించడంతో జిల్లాల వారీగా ఎగుమతి అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎగుమతిదారులకు చేయూతనందించేలా తగినంత మంది అధికారులు అందుబాటులోకి వచ్చారు. విదేశాలకు ఇతర ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలతోపాటు కొత్త దేశాల్లో అవకాశాలను గుర్తించి స్థానిక అవకాశాలను పరిశీలిస్తున్నాం. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వినియోగించుకుంటూ సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. నాలుగు పోర్టులతో పాటు పోర్టులకు ఆనుకుని పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీమారిటైమ్ బోర్డు. -
భారత్‌లో ఆక్వా రంగాన్ని దెబ్బతీయాలని చైనా కుట్ర
సాక్షి, అమరావతి: భారత్‌లో ఆక్వా రంగాన్ని దెబ్బతీయాలని చైనా కుట్ర చేస్తోంది. భారత్ నుంచి చైనాకు ఎగుమతి అయ్యే ష్రింప్ ప్యాకింగ్‌పై కరోనా అవశేషాలు ఉన్నాయంటూ కుంటి సాకులు వెతుకుతోంది.. కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ చైనా వారానికి ఐదు నుంచి ఏడు ఆక్వా కంపెనీలను డీలిస్టింగ్ చేస్తోంది. అదీకాక వర్చువల్ ఆడిట్ పేరుతో కంపెనీలపై బ్యాన్ విధిస్తోంది. ఆక్వా ఇండియా ఎకానమీపై చైనా అధ్యక్షుడు జిన్ పిన్ కుతంత్రం చేస్తున్నాడు. చైనా నిర్ణయంతో పలు రాష్ట్రాలు, ఏపీలోని ష్రింప్ ఎగుమతిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంపై సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ), కేంద్రం జోక్యం చేసుకోవాలని ఎగుమతి దారులు కోరుతున్నారు. ఏపీలోని భీమవరం కేంద్రంగా భారీగా ష్రింప్ ఎక్స్పోర్ట్ కంపెనీలు యాంటీ వైరస్ టెస్టులు చేసినా చైనా వెనక్కి పంపుతోందటూ వ్యాపారులు తెలిపారు. భారత్ నుంచి ప్రతి ఏడాది 30 నుంచి 40 వేల కోట్ల అక్వా ఉత్పత్తులు ఆమెరికా, చైనా, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. చైనా 58 కంపెనీలు సస్పెండ్ చేయగా 16 కంపెనీలు డీలిస్టింగ్ చేసింది. భారత్‌కు చెందిన రూ. 1200 కోట్ల దిగుమతులు,1000 కంటైనర్లు చైనా పోర్టుల్లో నిలిచిపోయాయి. -
కరోనా ఎఫెక్ట్: నిత్యావసర వస్తువుగా గుర్తించాలి
సాక్షి, అమలాపురం: కరోనా దెబ్బకు ఆక్వా మరింత కుదైలేంది. గత మూడు నెలలు నుంచి ఎగుమతులు నిలిచిపోయి. ధరలు పడిపోయి ఆందోళనలో ఉన్న రైతులకు..తాజా లాక్‌డౌన్‌తో ప్రొసెసింగ్ ప్లాంట్లు కూడా మూతపడడంతో కొనేవారు కూడా లేక లబోదిబోమంటున్నారు. ఒకవైపు చెరువుల్లో పలు రకాల వైరెస్ విజృంభిస్తుండడంతో పట్టుబడులు చేస్తున్నా...కొనేవారు లేకపోవడంతో భారీ నష్టాలను చవిచూడనున్నారు. కరోనా ప్రభావంతో చైనా, అమెరికా, యూరప్ దేశాలకు వనామీ రొయ్యల ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో గడిచిన మూడు నెలలుగా ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెద్దగా పట్టుబడులు జరగకున్నా మార్చి నెల నుంచి జోరందుకున్నాయి. కౌంట్ రాకున్నా వైట్ స్పాట్‌తోపాటు ఇతర వైరెస్‌ల కారణంగా కౌంట్‌తో సంబంధం లేకుండా పట్టుబడులు చేస్తున్నారు. అయితే వీటిని కొనేవారు లేకుండా పోయారు. జిల్లాలో అధికారికంగాను, అనధికారికంగాను కలిపి సుమారు 62 వేల ఎకరాల్లో వెనామీ సాగు జరుగుతోంది. ఇప్పుడు 80 శాతం విస్తర్ణంలో సాగు జరుగుతుండగా, ఎకరాకు కనీసం 2 టన్నులకుపైగా దిగుబడిగా వస్తుంది. పట్టుబడులు జోరుగా సాగుతున్నందున ఒక్క మార్చి నెల 15 నుంచి ఏప్రిల్ 20 మధ్యన సుమారు 74 వేల మెట్రిక్ టన్నుల రొయ్యలు మార్కెట్‌కు రానున్నాయని అంచనా. వైరెస్‌ల కారణంగా అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాల్లో పట్టుబడులు జోరుగా సాగుతున్నాయి. రొయ్యలు కొనేవారు లేకుండా పోవడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోకుండా పోయింది. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకుండా పోవడంతో ఎగుమతిదారులు కొనుగోలు పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు స్థానికంగా నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్‌లను ఆదివారం జనతా కర్ఫ్యూ, సోమవారం నుంచి మార్చి 31 వరకు లాక్ డౌన్ కారణంగా మొత్తం వీటిని మూసివేయాలని అధికారులు ఆదేశించారు. వీటిలో పనిచేసే కారి్మకులు ఇళ్లకు పరిమితం కావడం, అక్కడక్కడా వస్తున్నా పోలీసులు అడ్డుకోవడంతో కొనుగోలు మొత్తం నిలిచిపోయింది. జిల్లాలో ప్రధాన ఎగుమతి కంపెనీలకు చెందిన కోల్డ్‌స్టోరేజ్‌లు సుమారు 54 వరకు ఉన్నాయని అంచనా. సామర్థ్యాన్ని బట్టి 5 వేలు నుంచి పది వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యం ఉంది. సుమారు రెండు లక్షల మంది కారి్మకులు పనిచేస్తున్నారు. కారి్మకులు ప్లాంట్లకు రాకపోవడానికి తోడు, మూడు నెలలుగా ఎగుమతులు నిలిచిపోయి కోల్డ్‌స్టోరేజ్‌లు నిండుకున్నాయని ఎగుమతిదారులు చెబుతున్నారు. దీనివల్ల ఇప్పుడు పట్టుబడుగా వస్తున్న రొయ్యలను కొనుగోలు చేయలేమని వారు చేతులు ఎత్తివేస్తున్నారు. అంతర్జాతీయంగా కాకుండా జాతీయ, స్థానిక మార్కెట్‌కు సైతం రొయ్యలు వెళ్లే పరిస్థితి లేదు. అమలాపురం, మలికిపురం, ఉప్పాడ, తొండంగి, తాళ్లరేవు, కాట్రేనికోన వంటి ప్రాంతాల్లో చిన్నచిన్నగా కొనుగోలు చేసే రొయ్యల కేంద్రాలు సైతం లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. వీటి ద్వారా రోజుకు కనీసం 5 టన్నుల వరకు రొయ్యలు కొనుగోలు చేస్తారు. అంతరాష్ట్రాల రవాణా బంద్ కావడం, బస్సులు, లారీలు తిరగకపోవడంతో వీరు కొనుగోలు చేసినా సరుకు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చండి: మంత్రులను కోరిన ఆక్వా రైతులు రొయ్యలను నిత్యవసర వస్తువుల జాబితాలో చేర్చాలని కోనసీమ ఆక్వా రైతులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా ఇన్చార్జిమంత్రి, మత్స్యశాఖమంత్రి మోపిదేవి వెంకటరమణ, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్‌లను విజ్ఞప్తి చేశారు. కోనసీమ ఆక్వా రైతులు అమలాపురంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. రైతులు విపత్కర పరిస్థితుల్లో ఉన్నందున ప్రభుత్వం స్పందించాలని వారు వేడుకున్నారు. దీనిపై మంత్రులు విశ్వరూప్, మోపిదేవి, ఎమ్మెల్యే పొన్నాడలకు ఫోన్లు చేసి తమ సమస్యలను ఏకరువుపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రులు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి రొయ్యల రవాణా వరకు అనుమతులు ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని కోనసీన ఆక్వా డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌రాజు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పుడు పరిస్థితుల్లో ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే వారు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉత్పన్నమవుతుందని అల్లవరానికి చెందిన ఆక్వారైతు గుండెపూడి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వాను నిత్యావసర వస్తువుగా పరిగణించి స్థానికంగా కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆక్వా ఎగుమతులు, కొనుగోలు, రవాణాకు ప్రభుత్వం అంగీకారం లాక్డౌన్ నుంచి మినహాయింపునిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం ఆక్వా ఎగుమతులు కొనుగోలు చేసే కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు, ఆక్వా ఉత్పత్తులను ఒకచోట నుంచి మరో చోటుకు రవాణా చేసేందుకు ప్రభుత్వం అనుమతిని తాజాగా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. వీటిని లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది. అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్, యానిమల్ హజ్బెండరీ, డెయిరీ డెవలప్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య జీవో 209ని విడుదల చేశారు. వీటిని అన్ని జిల్లాల కలెక్టరేట్లకు పంపించారు. ప్రస్తుతం ఆక్వాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా హేచరీలు, ప్రాసెసింగ్ సెంటర్లు, ఆక్వా మేత, మందుల దుకాణాలు, హేచరీల నుంచి పిల్ల రవాణా, రొయ్యల రవాణాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆక్వా రైతుల్లో కరోనా కల్లోలం
భీమవరం: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆక్వా రైతుల్లో కలవరం మొదలైంది. వైరస్ భయాలతో రొయ్యల ఎగుమతులు నిలిచిపోతాయని రైతులు ఒక్కసారిగా పట్టుబడులు చేపట్టడంతో ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. రొయ్యలు 100 కౌంట్ ధర కిలోకు రూ.60 పతనమైంది. గతంలో కిలో రూ.240 పలికే రొయ్య వంద కౌంట్ ధర ప్రస్తుతం రూ.180 పలుకుతోంది. ఇతర దేశాల్లో సైతం కరోనా వైరస్ వల్ల ఆయా ప్రభుత్వాలు అనేక ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు కరోనా వైరస్‌ను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల కూడా రొయ్యల అమ్మకాలపై ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలుగా ధరల్లో కొద్దిగా తగ్గుదల కనిపిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యంగా పెరుగుతున్న రొయ్యలను సైతం పెద్దమొత్తంలో రైతులు పట్టుబడి చేసేస్తున్నారు. దీంతో ధరలు భారీగా పడిపోయాయి. పట్టుబడులు పెరగడంతో కూలీలు, ఐస్‌కు తీవ్ర గిరాకీ నెలకొంది. (ఆ నలుగురూ ఎక్కడ..?) నిలిచిన ఎగుమతులు: చైనా, అమెరికా వంటి దేశాలకు రొయ్యల ఎగుమతులు నిలిచిపోతాయని, దీనివల్ల రొయ్యల ధరలు మరింతగా తగ్గే ప్రమాదం ఉందంటూ భయపడి రైతులు పట్టుబడులు సాగిస్తున్నారు. జిల్లాలో సుమారు 90 వేల ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల సాగు చేస్తుండగా మరొక 1.10 లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. గత వారం 30 కౌంట్ రొయ్యలు కిలో సుమారు రూ.500 పైబడి ధరకు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.460 పడిపోయింది. అలాగే కిలో 100 కౌంట్ రొయ్యలు రూ. 240 నుంచి రూ.180కు తగ్గిపోయింది. 90 కౌంట్ రూ.190, 80 కౌంట్ రూ.200, 70 కౌంట్ రూ. 210, 60 కౌంట్ రూ.230, 50 కౌంట్ రూ.250, 40 కౌంట్ రూ.310 కొనుగోలు చేస్తున్నారు. (కరీంనగర్లో ఇండోనేషియన్లకు ఏం పని..?) పెరిగిన రొయ్యల పట్టుబడులు జిల్లాలో రొయ్యల సాగుచేస్తున్న రైతులు ఎక్కువగా వేసవి సీజన్లో మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తారు. ఫిబ్రవరి నుంచి వాతావరణం అనుకూలంగా ఉండడం రొయ్యలకు పెద్దగా తెగుళ్లు సోకకపోవడం వంటి కారణంగా వల్ల మంచి దిగుబడులు సా«ధిస్తారు. నాలుగు నెలల కాలంలో రొయ్యలు ఆరోగ్యవంతంగా పెరిగితే కిలోకు 30 కౌంట్ సాధించే అవకాశం ఉంది. 30, 40 కౌంట్ రొయ్యలకు అత్యధిక ధర లభిస్తుంటుంది. అయితే ఇటీవల అమెరికా, చైనా వంటి దేశాల్లో 50 కౌంట్ పైబడిన రొయ్యలను ఎక్కువగా కొనుగోలు చేయడంతో ఎగుమతిదారులు కూడా వాటిపట్ల మక్కువ చూపుతున్నారు. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ కారణంగా రొయ్యల ధరలు మరింత తగ్గిపోతాయని రైతులు ఆందోళనకు గురై వారం రోజులుగా పెద్ద మొత్తంలో పట్టుబడులు సాగిస్తున్నారు. దీంతో రొయ్యల పట్టుబడి పట్టే కూలీలు, ఐస్‌కు డిమాండ్ పెరిగింది. రొయ్యల పట్టుబడి పట్టే కూలీలకు గతంలో రూ. 600 ఇస్తే ప్రస్తుతం రూ. 800 పైబడి డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలీలకు రోజువారీ కూలీ సొమ్ములతోపాటు ఉదయం టీ, టిఫిన్స్, మధ్యాహ్న భోజనంతోపాటు కూల్ డ్రింక్స్ ఇతర సదుపాయాలు కలి్పంచాల్సి వస్తున్నదని చెబుతున్నారు. అలాగే ఒకేసారి రొయ్యల పట్టుబడులు పెరగడంతో ఐస్‌కు కూడా డిమాండ్ పెరిగిందని ఐస్ ధరల్లో పెద్ద వ్యత్యాసం లేకున్నా అవసరం మేరకు ఐస్ కావాలంటే సమయం పడుతుందని రైతులు తెలిపారు. కరోనా వైరస్ భయంతో ఎటువంటి వ్యాధులూ లేని ఆరోగ్యవంతమైన రొయ్యలను సైతం పట్టుబడులు చేస్తున్న కారణంగానే కూలీలకు, ఐస్‌కు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎగుమతి అవుతున్న రొయ్యలు గతంలో ఇచ్చిన ఆర్డర్ల మేరకే జరుగుతున్నాయి. రొయ్యల ఎగుమతి అయ్యే దేశాల నుంచి రొయ్యల దిగుమతులు నిలిపివేయాలని ఎటువంటి ఆంక్షలూ లేవని ఎగుమతిదారులు స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా గతంలో చైనాకు రొయ్యల ఎగుమతులు నిలిచిపోగా గత మూడు రోజులుగా తిరిగి ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. రొయ్యల ఎగుమతులపై ఎటువంటి ప్రభావం లేకున్నా కేవలం రైతుల్లో ఆందోళన కారణంగా పట్టుబడులు పెరగడం వల్లనే ధరల్లో మార్పు వచ్చిందని ఎగుమతిదారులు స్పష్టం చేస్తున్నారు. రొయ్యల ఎగుమతులు నిలిచిపోలేదు రొయ్యల ఎగుమతులు నిలిచిపోతున్నాయనే వదంతులను రైతులు నమ్మవద్దు. అనవసరంగా జరుగుతున్న ప్రచారంతో పట్టుబడులుచేసి రైతులు నష్టపోవద్దు. చైనా దేశానికి కూడా రొయ్యల ఎగుమతులు అవుతున్నాయి. రొయ్యలకు భవిష్యత్తులో మరింత డిమాండ్ ఏర్పడి ధరలు కూడా పెరిగే అవకాశం వుంది. రైతులు పరిస్థితులను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని కౌంట్ తక్కువ ఉన్న ఆరోగ్యవంతమైన రొయ్యలను పట్టుబడులు పట్టకుండా ఉంటే మేలు కలుగుతుంది. – భీమాల శ్రీరామమూర్తి, ఏపీ సీఫుడ్స్ సప్లయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి -
ఆక్వా ఎగుమతులపైయాంటీ బయోటిక్స్ దెబ్బ!
యాంటీ బయోటిక్స్ అంటే.. కొన్ని జాతుల సూక్ష్మ జీవుల జీవన ప్రక్రియలో భాగంగా తయారయ్యే రసాయనిక పదార్థాలే యాంటీ బయోటిక్స్. ఈ రసాయానాలు మిగిలిన సూక్ష్మ జీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. యాంటీ బయోటిక్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకున్న వారికి అలర్జీ, విష లక్షణాలు కనిపిస్తాయి. ఆహార నాళంలోని సూక్ష్మజీవుల్లో మార్పులు వచ్చి యాంటీ బయోటిక్స్ నిరోధక శక్తి కలిగిన కొత్త సూక్ష్మ జీవుల జాతులుగా మారే ప్రమాదం ఉంది. మనం తీసుకునే సముద్ర ఆహార ఉత్పత్తుల కణజాలంలో క్లోరాం ఫెనికాల్ అవశేషాలు ఎముక మూలుగ(బోన్‌మారో)కు హాని చేస్తాయి. రక్త హీనత కూడా ఏర్పడుతుంది. నైట్రో ఫ్యూరాన్ అవశేషాలు కేన్సర్‌కు దారితీస్తాయని పశోధనల్లో తేలింది. ఈ కారణాల నేపథ్యంలో సముద్ర ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలు జల జీవుల పెంపకంలో యాంటీ బయోటిక్స్‌ను నిషేధించాయి. సురక్షితమైన రొయ్యల సాగుకు జాగ్రత్తలు యాంటీ బయోటిక్స్ అవశేషాలు కలిగిన రొయ్యల ఎగుమతిలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆక్వా రైతులు, హేచరీల యజమానులు, మందుల తయారీ సంస్థలు ఆక్వా పెంపక రంగంతో అనుబంధం ఉన్న వారు యాంటీ బయోటిక్స్‌ను నిబద్ధతతో వాడాలి. హేచరీల్లో రొయ్యల పెంపకంలో యాంటీ బయోటిక్స్ అన్ని జాతుల పెరుగుదలను సమర్థవంతంగా నియంత్రించి వాటిని పూర్తిగా నిర్మూలిస్తాయి. కొన్ని జాతుల సూక్ష్మ జీవుల యాంటీ బయోటిక్స్‌ని తరచుగా వాడే సందర్భాల్లో వ్యాధికారక జీవుల జన్యువులు బయోటిక్స్‌ను నిరోధించే శక్తిని సంతరించుకుని తర్వాత సంతతులకు అందజేస్తాయి. ఈ ప్రక్రియలో ఏర్పడే కొత్త రకాల సూక్ష్మ జీవులను యాంటీ బయోటిక్స్ వాడినా నిర్మూలించలేం. చెరువుల్లో ప్రోబయోటిక్స్ వాడకం ద్వారా యాంటీ బయోటిక్స్ వాడే అవసరం ఉండదు. ఆక్వా రైతులు ఇవి అనుసరిస్తే మేలు.. చెరువుల్లో రోగ నిరోధానికి, రోగ నిర్మూలనకు ఆహారంతో పాటు అందజేసే యాంటీ బయోటిక్స్ రొయ్యల శరీరంలో నిల్వ ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందువల్ల యంటీబయోటిక్స వాడకంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలను రైతులు తప్పనిసరిగా పాటించాలి. యాంటీ బయోటిక్స్ వాడిన చెరువుల్లో రొయ్యలను ఆహారంగా తీసుకునే వారికి కలిగే హానిని గుర్తించాలి. యాంటీ బయోటిక్స్ వాడకంలో నిర్ధేశించిన గరిష్ట పరిమితులు, విత్‌డ్రా సమయం గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. హేచరీ/రొయ్యల పెంపకంలో వాడే మందులో యాంటీ బయాటిక్స్ లేవనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. రైతులు వాడే మందులను అసలైన ప్యాకింగ్‌లోనే లేబుల్స్‌తో సహా ఉంచాలి. సాంకేతిక సలహాదారు ద్వారా చెరువుల్లో ఉపయోగించే మందుల ఉపయోగాలను తెలుసుకోవాలి. హేచరీల్లో/ఫారంలో వాడే మందుల వివరాలు, ఉపయోగించిన కారణాన్ని సాంకేతిక సలహాదారుతో నమోదు చేయించాలి. హేచరీ నుంచి తెచ్చిన పిల్లలను, వాటి పెంపకంలో వాడే ఆహారాన్ని తరచూ పరీక్ష చేయించి యాంటీ బయోటిక్స్ అవశేషాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. పశువైద్యంలో వాడే మందులు విదేశాల నుంచి తెప్పించినప్పుడు అవి ఆక్వా కల్చర్‌లో వాడటానికి అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని తె లుసుకోవాలి. అవి ఏ దేశం నుంచి దిగమతి చేశారో గుర్తించి శానిటరీ సర్టిఫికెట్ తప్పనిసరిగా గమనించాలి. యాంటీ బయోటిక్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై తోటి రైతులకు కూడా అవగాహన కలిగించి వాడకాన్ని నియంత్రించాలి. రొయ్యల పెంపకం సమయంలో ఆక్వా కల్చర్ గ్రేడ్ మందులు, అనుమతించిన మందులును మాత్రమే పంపిణీ చేయాలని సదరు సంస్థలను రైతులు అడగాలి. యాంటీ బయోటిక్స్ వాడకం ఆపేసిన తర్వాత చెరువుల్లో నీటి ఉష్ణోగ్రత 22 సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు 15 రోజులు, ఇంకా ఎక్కువగా ఉంటే 20 నుంచి 25 రోజుల తర్వాత పట్టుకోవాలి. శాస్త్రీయ సాంకేతిక సలహాల కోసం మత్స్యశాఖ అధికారులను తరచూ కలిసి వారి ఆదేశాలను పాటించాలి. - చినగంజాం