Aquatic
-
తీర ప్రాంతంలో విషాదం.. 34 మంది జలసమాధి
ఆంటనానారివో(మడగాస్కర్): బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలసవెళ్తున్న శరణార్థులు ప్రమాదవశాత్తు జలసమాధి అయ్యారు. శనివారం రాత్రి వాయవ్య మడగాస్కర్ తీరం దగ్గర్లోని హిందూ సముద్రజలాల్లో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మడగాస్కర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్రాన్స్ అధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్ దేశంలోని అంబిలోబే, టమతమే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఒక పడవలో బయల్దేరారు. మార్గమధ్యంలో నోసీ బే అనే ద్వీపం సమీపంలో హిందూ సముద్రజలాల్లో పడవ మునిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. 24 మందిని అక్కడి మత్స్యకారులు కాపాడారు. మయోటే అనేది పేదరికం కనిపించే చిన్న ద్వీపాల సముదాయం. అంతకుమించిన నిరుపేదరికంతో మగ్గిపోతున్న మడగాస్కర్‌లో కంటే మయోటేలో జీవనం కాస్త మెరుగ్గా ఉంటుందని శరణార్థులు అక్కడికి వలసపోతుంటారని అధికారులు చెప్పారు. -
సర్వీసెస్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ ప్రారంభం
విశాఖపట్నం : అంతర సర్వీసెస్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌ను తూర్పు నావికా దళం కమాండ్ స్విమ్మింగ్ పూల్‌లో చీఫ్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ ప్రదీప్రాణా మంగళవారం ప్రారంభించారు. స్విమ్మింగ్, వాటర్‌పోలో, స్పింగ్ బోర్డ్, హైబోర్డు డైవ్ అంశాల్లో ఐదు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఆర్మీకు చెందిన రెడ్, గ్రీన్ జట్లతో పాటు నేవీ, ఎయిర్‌ఫోర్స్ జట్లకు చెందిన 170 మంది స్విమ్మర్లు పోటీపడుతున్నారు. తూర్పు నావికా దళ సర్వీసెస్ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో ఐఎన్ఎస్ సర్కార్స్ నిర్వహిస్తున్న ఈ చాంపియన్‌షిప్ ఈ నెల 20న జరిగే ఫైనల్స్‌తో ముగియనున్నాయి.