Arbitration Panel
-
‘అయోధ్య’ కేసులో మధ్యవర్తిత్వం ప్రారంభం
ఫైజాబాద్(యూపీ): రామజన్మభూమి–బాబ్రీ మసీదు సమస్యను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో ఉన్న అవధ్ వర్సిటీలో కమిటీ బుధవారం నిర్వహించిన భేటీకి 25 మంది పిటిషనర్లు తమ న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. కమిటీలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎఫ్.ఎం. ఖలీఫుల్లా, న్యాయవాది శ్రీరామ్ పంచు, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి రామజన్మభూమి పునరుద్ధరణ్ సమితికి చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద్, మహంత్ దినేంద్రదాస్ (నిర్మోహీ అఖారా), త్రిలోకీనాథ్ పాండే(రామ్‌లల్లా విరాజ్మాన్), స్వామి చక్రపాణి, కమలేశ్ తివారీ (హిందూ మహాసభ)తో పాటు ఇక్బాల్ అన్సారీ, మొహమ్మద్ ఉమర్, హాజీ మహబూబ్, మౌలానా అష్‌హద్ రషీదీ జమాత్ ఉలేమా ఏ హింద్), వసీమ్ రిజర్వీ (ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు) తదితరులు హాజరయ్యారు. కాగా, మధ్యవర్తిత్వ కమిటీతో చర్చలు సహృద్భావ వాతావరణంలో సాగాయని స్వామి అవిముక్తేశ్వరానంద్ తెలిపారు. ఈ మధ్యవర్తిత్వ కమిటీ మూడు రోజుల పాటు పిటిషనర్లతో చర్చలు జరుపుతుంది. -
బన్సల్ కేసులో ఇన్ఫీకి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) రాజీవ్ బన్సల్‌కి పరిహారం వివాదంపై ఆర్బిట్రేషన్ కేసులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు రూ. 12.17 కోట్ల బకాయిని వడ్డీతో పాటు చెల్లించాల్సిందేనని ఆర్బిట్రేషన్ ప్యానెల్ స్పష్టం చేసింది. బన్సల్ ఇప్పటికే తీసుకున్న రూ. 5.2 కోట్ల మొత్తాన్ని వాపసు చేయాలన్న సంస్థ అభ్యర్థనను ప్యానెల్ తిరస్కరించిందని బీఎస్ఈకి ఇన్ఫీ తెలియజేసింది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రతించి, తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వివరించింది. ఇన్ఫోసిస్ గత యాజమాన్యం, వ్యవస్థాపకుల మధ్య చిచ్చు రేపిన అంశాల్లో బన్సల్ పరిహారం కూడా ఒకటి కావడం గమనార్హం. 2015లో రాజీవ్ బన్సల్ ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగినప్పుడు.. ఆయనకు పరిహారం కింద 24 నెలల జీతం లేదా రూ. 17.38 కోట్లు ఇచ్చేందుకు ఇన్ఫీ అంగీకరించింది. దీని ప్రకారం ముందుగా రూ. 5 కోట్లు చెల్లించింది. అయితే, ఈ డీల్‌పై సంస్థ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితరులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. మిగతాది చెల్లించకుండా నిలిపివేసింది. ఈ వివాదంతో ఇన్ఫోసిస్‌పై బన్సల్ ఆర్బిట్రేషన్ ప్యానెల్‌ను ఆశ్రయించగా.. తాజా ఆదేశాలు వెలువడ్డాయి. -
కెయిర్న్‌పై భారత్‌కు ఎదురుదెబ్బ
స్టే ఇవ్వటానికి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్ నో... న్యూఢిల్లీ: బ్రిటన్ చమురు దిగ్గజ సంస్థ– కెయిర్న్ ఎనర్జీ ప్రారంభించిన ఆర్ర్‌బిట్రేషన్ ప్రక్రియపై స్టే విధించాలని భారత్ దాఖలు చేసిన పిటిషన్‌ను అంతర్జాతీయ త్రిసభ్య ఆర్బ్రిట్రేషన్ ప్యానల్ తోసిపుచ్చింది. గతనెలలోనే జరిగిన ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం– భారత్ ఆదాయపు పన్ను శాఖ రూ.10,247 కోట్ల రెట్రాస్పెక్టివ్ పన్ను (గత వ్యాపార లావాదేవీలకు వర్తించే విధంగా అమలు చేసే పన్ను) చెల్లించాలంటూ కెయిర్న్‌కు డిమాండ్ నోటీసులిచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ, కెయిర్న్ ఎనర్జీ ఈ అంతర్జాతీయ ఆర్బ్రిట్రేషన్ను ఆశ్రయించింది. రెట్రాస్పెక్టివ్ పన్ను విధానం కింద ఏకంగా రూ.10,247 కోట్ల పన్ను వేయడం సరికాదంటూ కెయిర్న్ వ్యాజ్యం దాఖలు చేసింది. అయితే దీనిపై స్టే ఇవ్వటంతో పాటు అసలు ఈ పన్ను విధింపు భారత్– బ్రిటన్ ద్వైపాక్షిక పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందం కిందికి వస్తుందా? రాదా? అన్న విషయాన్ని కూడా ఆర్బ్రిట్రేషన్ ప్రక్రియలో విచారించాలనిభారత్ చేసుకున్న అభ్యర్థనను త్రిసభ్య ధర్మాసనం మార్చి 27న తోసిపుచ్చింది. కొత్తగా ఏర్పాటయిన కెయిర్న్ ఇండియాకు భారత్‌లోని తన అసెట్స్‌ను బదలాయించటం, స్టాక్ ఎక్సే్ఛంజింగ్లో లిస్ట్ కావటం ద్వారా కెయిర్న్ ఎనర్జీ క్యాపిటల్ గెయిన్స్ పొందిందని పేర్కొంటూ, 2014 జనవరిలో భారత్ ఆదాయపు పన్ను శాఖ ఆ సంస్థకు రెట్రాస్పెక్టివ్ పన్ను డిమాండ్ నోటీసు పంపింది. క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయించలేదని పేర్కొంటూ, 2014 ఏప్రిల్‌లో కెయిర్ ఇండియాకు సైతం ఆదాయపు పన్ను శాఖ రూ.20,495 కోట్ల పన్ను డిమాండ్ ఇచ్చింది. అయితే ఈ రెట్రాస్పెక్టివ్ పన్ను విధింపు ఎంతమాత్రం తగదని కెయిర్న్ ఎనర్జీ గత ఏడాది మే నెలలో అంతర్జాతీయ ఆర్ర్బిట్రేషన్ను ఆశ్రయించింది. భారత్ ప్రభుత్వం నుంచి 5.6 బిలియన్ల పరిహారాన్ని కూడా సంస్థ డిమాండ్ చేస్తోంది.