ariel survey
-
గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్నినాని ఉన్నారు. అంతకుముందు గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘‘అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నేను ఏరియల్ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానని’ ఆయన అన్నారు. చదవండి : వరద పరిస్థితులపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ -
ప్రశాంతంగా నిమజ్జనం : డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 35 వేల మంది పోలీసులతో పకడ్బందీగా నిమజ్జనం నిర్వహించారు. పాతబస్తీ, బాలాపూర్, ఖైరతాబాద్ శోభాయాత్రలు ప్రశాంతంగా సాగడంలో సీనియర్ ఆఫీసర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 33 జిల్లాల్లో ప్రతి నిమజ్జనం పాయింట్‌ను లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. అంతకుముందు ఏరియల్ సర్వే ద్వారా మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీతో కలిసి డీజీపీ శోభాయాత్రను పర్యవేక్షించారు. ‘పోలీసు అధికారులు, సిబ్బంది ప్రణాళిక ప్రకారం వ్యవహరించారు. వారికి అప్పగించిన పనులను పకడ్బందీగా, వ్యూహాత్మకంగా పూర్తిచేశారు. ప్రతి ప్రాంతంలో గణేశ్ మండపాల నిర్వాహకులను భాగస్వాములను చేసి ఉత్సవాలను ప్రశాంతంగా పూర్తి చేయడంలో సఫలీకృతులయ్యారు’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. -
యాదాద్రిగా మారిన యాదగిరి గుట్ట
యాదగిరి గుట్ట : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామితో కలిసి గురువారం యాదగిరి గుట్టలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ యాదగిరి గుట్టకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన మార్పులన్నీ ఆగమ శాస్త్రం ప్రకారమే ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి యాదగిరి గుట్టకు యాదాద్రిగా నామకరణం చేశారు. యాదగిరి గుట్ట అభివృద్ధికి 100 కోట్ల రూపాయల కేటాయించడం గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన హర్షం వ్యక్తం చేశారు