army chief Qamar Javed Bajwa
-
భారత ఆర్మీతో పోలికా! అంత సీన్ లేదు.. కుండ బద్దలు కొట్టిన పాక్ ఆర్మీ మాజీ చీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావెద్ బద్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత సైన్యం సత్తాపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. భారత్ సైన్యంతో పారాడే శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తి పాకిస్తాన్ ఆర్మీకి లేదని కుండబద్దలు కొట్టారు. బ్రిటన్‌లోని పాకిస్తాన్ మీడియా జర్నలిస్టులు హమీద్ మీర్, నజీం జెహ్రాలకు ఇచ్చిన ఇంటర్వూలో జావెద్ ఈ వాఖ్యలు చేశారు. 'భారత ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ సరితూగలేదు. భారత్‌తో పాక్ యుద్ధం చేసే పరిస్థితి లేదు. ట్యాంకులు కూడా పనిచేయడం లేదు. ఫిరంగులను తరలించడానికి డీజిల్ కూడా లేదు' అని బజ్వా తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఆ దేశ సైనిక సామర్థ్యాలపై ప్రశ్నలు లేవెనత్తేలా, సైన్యం నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయి. ఏదేమైనా ఆయన చెప్పిన దాంట్లో మాత్రం వాస్తవం ఉంది. భారత సైన్యం వీరపరక్రమాల ముందు పాక్ సైన్యం సరితూగదని జగమెరిగిన సత్యం. పాకిస్తాన్ కమాండర్స్ సదస్సులోనే బజ్వా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాకిస్తాన్ శుత్రుత్వం పెంచుకోకుండా స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరుచుకుంటేనే మంచిదని ఆయన అన్నారు. భారత్‌తో సుదీర్ఘ విరోధం పాకిస్తాన్‌ను హరించివేస్తుందని పేర్కొన్నారు. భారత్‌తో పోరాడేందుకు అవసరమైన ఆయుద సంపద, ఆర్థిక బలం పాకిస్తాన్‌కు లేవని, అందుకే కశ్మీర్ సమస్యపై ఇరుదేశాలు శాశ్వత పరిష్కారానికి వచ్చే విషయంపై ఆలోచిస్తున్నట్లు కూడా బజ్వా పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ సంక్షోభంతో ప్రజల జీవితాలు దుర్బరంగా మారాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి, ఉద్యోగాలు పోయి అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. చదవండి: సూడాన్ ఆర్మీ-పారామిలిటరీ బలగాల పోరు.. 72 గంటలపాటు కాల్పుల విరమణ! -
పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ఆరోపణలు
లాహోర్: పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరోక్ష విమర్శలు చేశారు. తన పదవి పోయేందుకు కీలక స్థానాల్లో ఉన్న కొందరు కారణమని దుయ్యబట్టారు. తన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ‘ప్రతి సంస్థలో మనుషులుంటారు. అందులో ఒకరిద్దరు తప్పుడువారైనంత మాత్రాన మొత్తం సంస్థను బాధ్యురాలిగా చేయలేము. ఒకవేళ ఒకరు (జనరల్ బజ్వా) తప్పు చేస్తే అది మొత్తం సంస్థ తప్పు చేసినట్లు కాదు.’’ అని ఆయన ట్వీట్ చేశారు. సైన్యానికి తమ పార్టీకి మధ్య సంబంధాలు గత కొద్ది నెలలుగా క్షీణించాయని పాక్ మాజీ మంత్రి ఫవాద్ చెప్పారు. ఐఎస్ఐ చీఫ్‌గా నదీమ్ అంజుమ్ నియామకాన్ని ఇమ్రాన్ గతేడాది తొలుత తిరస్కరించి తర్వాత ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయనకు సైన్యంతో చెడింది. దేశ చరిత్రలో గుర్తుండే ర్యాలీ నిర్వహణకు తన మద్దతుదారులంతా గురువారం మినార్ ఐ పాకిస్తాన్‌కు చేరాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఒకపక్క ఆర్మీ చీఫ్‌ను విమర్శిస్తూ మరోపక్క సైన్యాన్ని ఆయన ప్రశంసించారు. -
మేం చైనాకు ఎంతగానో రుణపడ్డాం!
రావాల్పిండి: అన్ని కాలాల్లోనూ చైనా తమ దేశానికి నిస్సంకోచంగా మద్దతునిస్తున్నదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా పేర్కొన్నారు. ఇలా అండగా నిలిచినందుకు ఆ దేశానికి ఎంతో రుణపడి ఉన్నామని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రావాల్పిండిలో మంగళవారం చైనా ఎంబసీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసగించారు. చైనాతో బలమైన సోదర అనుంబంధం ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్న బజ్వా పేర్కొన్నారు. పాకిస్థాన్, చైనాలు ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైన వ్యూహకర్తలని అభివర్ణించారు. కశ్మీర్ మొదలు అనేక అంశాల్లో అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌కు చైనా సంపూర్ణ మద్దతు అందిస్తున్నదని చెప్పుకొచ్చారు. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు స్వభత్వం లభించకుండా చైనా మోకాలడ్డిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పాక్‌లో తలదాచుకుంటున్న జేషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సైతం చైనా అడ్డుకుంది. ఇటీవల సిక్కిం సెక్టర్లో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా-పాక్ దోస్తీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
ఆ నలుగురు ఉగ్రవాదులకు మరణశిక్ష
పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా సోమవారం కీలక ప్రకటన చేశారు. కరుడుగట్టిన నలుగురు తీవ్రవాదులకు మరణ శిక్ష వేసినట్టు ఆయన ధృవీకరించారు. తమ దేశ పౌరులపై, భద్రతా దళాలపై వారు అతి క్రూరమైన దాడులకు పాల్పడినట్టు వెల్లడించారు. ఆర్మీ కమాండ్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన వెలువరించిన కీలక ప్రకటన ఇదే. అత్తూర్ రెహ్మమాన్, మహమ్మద్ సబీర్, ఫరూక్ భట్టీ, గుల్ జరీన్‌లను నేరస్తులుగా గుర్తించి, ఈ శిక్ష విధించినట్టు తెలిపారు. ఈ నలుగురు 2014 డిసెంబర్ 16న పెషావర్ పాఠశాలపై దాడికి పాల్పడి, ఉరితీయబడ్డ మిలటెంట్ గ్రూపులకు చెందినవారని పేర్కొన్నారు. కాగ, పెషావర్ స్కూల్‌పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో 150 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ దాడిలో నేరస్తులుగా ఉన్న నలుగురికి ఆ దేశం ఉరిశిక్ష వేసింది. ప్రస్తుతం మరణ శిక్ష పడిన ఈ నలుగురు కరుడుగట్టిన ఉగ్రవాదులని, తమ దేశ పౌరులను, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అధికారులను, ఎయిర్‌పోర్టు సెక్యురిటీ ఫోర్స్‌లను అతిక్రూరంగా చంపడంలో వీరి ప్రమేయముందని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. వారి దగ్గరున్న ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. జనరల్ బజ్వా పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా నవంబర్ 29నే ఆయన బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.