Army Jawans
-
సరిహద్దుల్లో పేలనున్న సిటీ తుపాకీ
సాక్షి, హైదరాబాద్: భారత సరిహద్దుల్లో కాపుకాసే ఆర్మీ జవాన్ల చేతిలో ‘సిటీ తుపాకీ’ పేలనుంది. ‘అస్మి’ పేరుతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీర్డీఓ) డిజైన్ చేసిన ఈ మొట్టమొదటి భారతీయ సబ్ మెషీన్‌గన్ తయారీ కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ కోసం రూ.4.26 కోట్లతో 550 తుపాకులు తయా రు చేసి సరఫరా చేయనున్నారు. ఇజ్రాయెల్, జర్మనీల్లోని ఆయుధ కర్మాగారాలకు దీటుగా నగరానికి చెందిన ఓ చిన్న సంస్థ ఈ ప్రతి ష్టాత్మక కాంట్రాక్టు దక్కించుకోవడం గమనార్హం. ఈ తుపాకీని సరిహద్దు భద్రతా దళాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలూ వినియోగించనున్నాయి. ప్రముఖుల భద్రత కోసం వినియోగించడానికీ ‘అస్మి’ అనువుగా ఉంటుంది.ఉజీ, హెక్లర్లకు దీటుగా..⇒ పుణేలోని డీఆర్డీఓలో అంతర్భాగమైన అర్మా మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఆర్మీ సంయుక్తంగా ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పరిశోధనతో ‘అస్మి’ రూపుదిద్దుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ బన్సోద్ దీన్ని డిజైన్ చేశారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ప్రమాణాలకు లోబడి, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేశారు. సంస్కృతంలో అస్మిత అంటే ధైర్యం, గర్వం (ప్రైడ్) అని అర్థం. దీన్ని సంక్షిప్తీకరించిన ప్రసాద్ ఈ తుపాకీకి ‘అస్మి’ అని పేరు పెట్టారు. అంతర్జాతీ యంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ తయారు చేసే ఉజీ, జర్మనీలో తయా రయ్యే హెక్లర్, కోచీ ఎంపీ–5 ఆయుధాలకు దీటుగా ‘అస్మి’ పని చేస్తుందని డీఆర్డీఓ ప్రకటించింది.అంతర్జాతీయ పోటీని తట్టుకుని..హైదరాబాద్‌లోని బాలానగర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ సంస్థ చిన్న పరిమాణంలో ఆయుధాలు తయారు చేస్తుంది. అయితే అంతర్జాతీయ పోటీని తట్టుకున్న ఈ సంస్థ ‘అస్మి’ తయారీ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పటికే పది చొప్పున తుపాకులు తయారు చేసి ఆర్మీతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), అసోం రైఫిల్స్‌కు అందించింది. నాణ్యతపై వాళ్లు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ 550 తుపాకుల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.ఈ ఏడాది సెప్టెంబర్ 28 నాటికి వీటిని అందించడానికి లోకేశ్ మెషీన్స్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది. మరోపక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి ఈ సంస్థకు పైలట్ ఆర్డర్ వచ్చింది. ‘అస్మి’ ఈ తరహాకు చెందిన ఇతర ఆయుధాల కంటే 10–15 శాతం తక్కువ బరువుతో ఉంటుంది. దీన్ని ఆపకుండా 2,400 రౌండ్ల వరకు కాల్చే అవకాశం ఉంది.‘అస్మి’ వివరాలివీ..పేరు: అస్మిస్వరూపం: సబ్ మెషీన్ గన్ ఖరీదు: ఒక్కోటి రూ.50 వేలుబరువు: 2.4 కేజీలుపొడవు: 382 మిల్లీమీటర్లుక్యాలిబర్: 9 X 19 ఎంఎంరేంజ్: 100 మీటర్లుమ్యాగ్జైన్: 32 తూటాలుసామర్థ్యం: నిమిషానికి 800 తూటాలుపరిశోధనకు పట్టిన సమయం: మూడేళ్ల లోపు -
సిక్కింలో ఆకస్మిక వరదలు.. గల్లంతైన జవాన్లలో ముగ్గురి మృతదేహాలు లభ్యం
Update: ఆకస్మిక వరదలు సిక్కిం రాష్ట్రాన్ని అల్లాడించాయి. కుండపోత వాన, వరదతో రెండు జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. గల్లంతైన 23 మంది జవాన్లలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బది గుర్తించింది. మిగిలిన వారికోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఒక్కసారిగా భారీ వరదలు ముంచెత్తాయి. లాచెన్లోయలో మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి తీస్తానదిలో అకస్మాత్తుగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో అక్కడి ఆర్మీ శిబిరాలపై వరదల ప్రభావం పడింది. ఊహించని రీతిలో వరదలు పోటెత్తడంతో 23 మంది భారత జవాన్లు గల్లంతైనట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఆర్మీ అధికారుల వాహనాలు కూడా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు పేర్కొంది. ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ఈ వరద ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైనదిగా మారింది. దీనివల్ల దిగువకు 15 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది. దీంతో అర్ధరాత్రి సమయంలోఈ అకస్మిక వరదలు సంభవించాయి. ఆకస్మిక వరద లాచెన్ లోయలో ఉన్న ఆర్మీపోస్టులకు కూడా నష్టం కలిగించింది. సింగ్తమ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరద తీవ్రతకు 23 మంది సిబ్బంది గల్లంతైనట్లు ఈస్ట్రన్ కమాండ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. Shocking News A sudden #cloudburst over #Lhonak Lake in North #Sikkim led to flooding in Teesta river. In which 23 army soldiers went missing. Search and rescue operations are underway. Praying to God for everyone's well being 🙏🏽 #earthquake #teesta #Elvisha #TejRan pic.twitter.com/k9YdYMtXeh — Rocky Yadav (@YadavYadavrocky) October 4, 2023 తీస్తా నది పొంగి ప్రవహించడంతో సింగ్తమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. పశ్చిమ బెంగాల్‌ను సిక్కింను కలిపే 10వ నెంబర్ జాతీయ రహదారి పలు చోట్లకొట్టుకుపోయింది. ఆకస్మిక వరదల నేపథ్యంలో చాలా రోడ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. #WATCH | Sikkim: A flood-like situation arose in Singtam after a cloud burst. (Video source: Central Water Commission) pic.twitter.com/00xJ0QX3ye — ANI (@ANI) October 4, 2023 -
అనంతనాగ్ ఎన్ కౌంటర్... ఆర్మీ అధికారుల వీరమరణం..
-
కార్గిల్ సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
-
కార్గిల్ సైనికులతో మోదీ దీపావళి సంబరాలు..
కార్గిల్: దీపావళి పండగను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం కార్గిల్ చేరుకున్నారు. అక్కడ ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు ప్రధాని స్వీట్లు పంచిపెట్టారు. కార్గిల్‌లో ఆర్మీ సిబ్బందిని ఉద్ధేశించి మోదీ ప్రసంగించారు. ఎంతో కాలంగా జవాన్లు తన కుటుంబ సభ్యులుగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. సైనికులతో కలిసి పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జవాన్ల త్యాగం మరువలేదని అన్నారు. ఇంతకంటే గొప్ప దీపావళిని కోరుకోవడం లేదని తెలిపారు. ఉగ్రవాద ముగింపే దీపావళి పండగని, దాన్ని కార్గిల్ సాధ్యం చేసిందన్నారు. సైనికుల త్యాగాలు దేశం గర్వించేలా ఉన్నాయన్నారు. విజయవంతమైన కార్గిల్ భూమి నుంచి దేశ ప్రజలకు, ప్రపంచానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ #WATCH | "For me, all of you have been my family for years now... it's a privilege to celebrate #Diwali amid all of you," says Prime Minister Narendra Modi, while interacting with members of the Armed Forces in Kargil (Source: DD) pic.twitter.com/H47FM8byeE — ANI (@ANI) October 24, 2022 కాగా 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మోదీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. దేశ సరిహిద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి పండగ జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కార్గిల్‌లో సైనికులతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. -
‘ఏం భయం లేదు మేమున్నాం.. దీపావళి సంతోషంగా జరుపుకోండి’
శ్రీనగర్: యావత్ భారత దేశం దీపావళి వేడుకలకు సిద్ధమైంది. ధంతేరాస్‌లో భాగంగా శనివారం నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ జవాన్లు దీపాలు వెలిగించి, బాణసంచా పేల్చుతూ వేడుకలు నిర్వహించారు. దేశ ప్రజలకు దివాళీ శుభాకాంక్షలు తెలిపారు. నియంత్రణ రేఖ సహా సరిహద్దు ప్రాంతాల్లో దీపావళి జరుపుకొన్నారు. అంతా మంచే జరుగుతుందని ప్రజల్లో ధైర్యం నింపారు. సరిహద్దుల వద్ద తాము అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి చింత లేకుండా కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు ఎలాంటి చితలేకుండా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలని చెప్పాలనుకుంటున్నా. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు, సరిహద్దుల్లో మన జవాన్లు అప్రమత్తంగా, నిరంతరం నిఘా వేస్తూ ఉన్నారని భరోసా ఇస్తున్నాం.’ అని కలెనల్ ఇక్బాల్ సింగ్ తెలిపారు. ధంతేరాస్ సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహించి.. లక్ష్మీగణపతి హారతి పాటలు పాడారు సైనికులు. సైనికులతో మోదీ దీపావళి వేడుకలు.. ఈ దీపావళి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ఆర్మీ సైనికులతో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఏ ప్రాంతానికి వెళ్తారనేది గోప్యంగా ఉంచారు. గత ఏడాది జమ్ముకశ్మీర్‌లోని నౌషేరాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. Jammu and Kashmir | Indian Army soldiers posted along the Line of Control (LoC) in the Akhnoor sector burst crackers & lit earthen lamps as #Diwali festivities began with Dhanteras yesterday pic.twitter.com/ekmaKMJiJr — ANI (@ANI) October 22, 2022 ఇదీ చదవండి: Dhanteras 2022: చీపురు సహా, వీటిని కొనుగోలు చేస్తే..లక్ష్మీ కటాక్షం! -
లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు జవాన్లు మృతి
శ్రీనగర్: లడఖ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ నదిలో పడిపోయిన ఘటనలో ఏడుగురు జవాన్లు ప్రాణాలో కోల్పోయారు. మరో 19 సైనికులకు తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను ఎయిర్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ పేర్కొంది. 26 మంది సైనికుల బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్‌లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చదవండి: లైంగిక ఆరోపణలు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య 7 Indian Army soldiers lost their lives so far in a vehicle accident in Turtuk sector (Ladakh), grievous injuries to others too. Efforts on to ensure best medical care for injured, incl requisition of air effort from IAF to shift more serious ones to Western Command: Army Sources — ANI (@ANI) May 27, 2022 -
యుద్ధ వీరులకు నివాళులర్పించిన రాంచరణ్ (ఫొటోలు)
-
ఎన్కౌంటర్లతో దద్దరిల్లిన కశ్మీర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ వరస ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతోంది. సొఫియాన్ జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల శ్రీనగర్, బందిపొరా కాల్పులతో ప్రమేయమున్న ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు. ‘సొఫియాన్, తుల్రాన్, ఫీరిపొరా గ్రామాల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని 24 గంటల్లో అందిన ప్రాథమిక సమాచారం మేరకు వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఉగ్రవాదులు పోలీసు బృందాలపై కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని లాల్బజార్లో స్థానికేతరుడిని చంపేసిన ఉగ్రవాది ముక్తార్ షా ఈ ఎన్కౌంటర్లో మరణించాడు’అని కశ్మీర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఒక ఎన్కౌంటర్లో ముగ్గురు మరణిస్తే, మరో ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరణించిన ఉగ్రవాదులందరూ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారే. వీరంతా ఇటీవల కాలంలో పౌరులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతూ కశ్మీర్‌లోయలో బీభత్సం సృష్టించినట్టు ఆ అధికారి వివరించారు. చదవండి: (ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం?) పాక్ జాతీయుడు అరెస్ట్ న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులున్నట్లు అనుమానిస్తున్న పాకిస్తాన్ జాతీయుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో దాడులకు కుట్ర పన్నిన అతనిని లక్ష్మీ నగర్లో అదుపులోనికి తీసుకొని, ఏకే 47 గన్స్, ఇతర మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కి చెందిన మొహమ్మద్ అష్రాఫ్ అలియాస్ అలీ(40) బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి చొరబడ్డాడు. పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడని అధికారులు తెలిపారు. -
చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఆ యుద్ధ విద్యలు ఇక్కడివి కావు
సాక్షి, హైదరాబాద్: మడవి హిడ్మా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు. బీజాపూర్ జిల్లాలో తన ఉనికిపై తానే సమాచారం ఇచ్చి, భద్రతా దళాలకు ఎరవేసి, 23మంది జవాన్లను మట్టుబెట్టే ఆపరేషన్‌కు నేతృత్వం వహించి నడిపించిన హిడ్మా నేపథ్యంపై చర్చ సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. హిడ్మాకు అత్యంత కఠిన మావోయిస్టుగా దళంలో పేరుంది. అతను అనుసరించే వ్యూహాలు ప్రత్యర్థులు అంచనా వేయలేకుండా ఉంటాయి. అత్యంత జఠిలంగా.. వ్యూహంలో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటికి వెళ్లలేనంత పకడ్బందీగా ఉంటాయి. చేతికి చిక్కిన, ఎదురైన శత్రువుల పట్ల ఎంతో కఠినంగా వ్యవహరిస్తాడు. జాలి దయ లేకుండా మరణించేవరకు చంపాలన్నది అతని సిద్ధాంతం. అందుకోసం ఏ మార్గం అనుసరించినా తప్పులేదనే మనస్తత్వం. ఇలాంటి పాశవిక దాడులు గతంలో మావోయిస్టులు అనుసరించలేదు. ఇవి ఇక్కడి యుద్ధ విద్యలు కావు 2010 నుంచి మావోల దాడుల్లో, వ్యూహాల్లో, ఆపరేషన్లు నిర్వహించే తీరులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి వారు చేస్తున్న ప్రతి దాడిలోనూ ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. ఇలాంటి పాశవిక యుద్ధ విద్యలు భారత్‌కు చెంది నవి కావు. ఇవి తూర్పు ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలాంటి దేశాల్లో కరుడుగట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు అనుసరించే వ్యూహాలు. మరి అక్కడి వ్యూహాలు ఇక్కడి వారు ఎలా అమలు చేస్తున్నారు? అనే ప్రశ్నకు ఫిలిప్పీన్స్ అన్న సమాధానం వినిపిస్తోంది. మొత్తం దశాబ్దానికిపైగా జరిగిన భారీ ఆపరేషన్లకు హిడ్మానే వ్యూహరచన చేశాడని సమాచారం. తాజా దాడితో పాటు బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో చోటుచేసుకున్న విధ్వంసకర సంఘటనలన్నింటికీ ఇతనే నేతృత్వం వహించాడని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్–1కు కమాండర్‌గా ఉన్న హిడ్మా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నాడు. ట్యాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ (టీసీఓసీ) కూడా హిడ్మా నేతృత్వంలోనే పనిచేస్తుంది. భద్రతా దళాల కోసం మరిన్ని ఉచ్చులు..? ఎరవేసి దాడులు చేయడంలో పేరుగాంచిన హిడ్మా మరిన్ని వ్యూహాలు సిద్ధం చేసి ఉంటాడని నిఘా వర్గాలు ఇప్పటికే భద్రతా దళాలను హెచ్చరించా యి. ప్రతీకార దాడికి దిగే కంటే ఆచితూచి స్పందించడమే మేలని సూచించినట్లు సమాచారం. హిడ్మా కోసం గాలిస్తూ ఆవేశంగా మావోలకు పట్టున్న ప్రాంతాల్లోకి చొరబడితే, ఇదే అవకాశం కోసం చూస్తున్న హిడ్మా మరిన్ని ఉచ్చులతో మరో భారీ దాడికి దిగే అవకాశం లేకపోలేదని పలువురు సీనియర్ ఐపీఎస్‌లు సైతం అభిప్రాయపడుతున్నారు. చదివింది ఐదో తరగతే.. మడవి హిడ్మా (మడవి ఇడమా) అలియాస్ సం తోష్ అలియాస్ ఇడ్మాల్ అలియాస్ పొడియం బీమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల శివారు నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరం లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పువ్వర్తి గ్రామంలో పుట్టి పెరిగాడు. ఇతను పదిహేనేళ్ల క్రితం స్థానిక పరిస్థితుల ప్రభావంతో మావోయిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. బస్తరియా మురియా తెగకు చెందిన హిడ్మా.. చదివింది ఐదో తరగతే అయినా, హిందీ–ఇంగ్లి్లష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. దళంలో అతను చాలామందికి గెరిల్లా యుద్ధవిద్యల్లో శిక్షణ ఇస్తాడు. దండకారణ్యంలో అతన్ని మామూలు స్థాయి దళసభ్యుడు కలవడం దాదాపు అసాధ్యం. భార్యతో కలసి ఉండే అతని చుట్టూ అత్యాధునిక ఆయుధాలతో కూడిన దాదాపు 20 మందికిపైగా దళ సభ్యులు రక్షణ వలయంగా ఉంటారు. అందులో మెజారిటీ సభ్యులు అతని బంధువులు, బాల్యమిత్రులే కావడం గమనార్హం. అనూహ్యం .. అమానవీయం హిడ్మా దశాబ్దానికి ముందే ఫిలి ప్పీన్స్లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అప్పటి మావోయిస్టు చీఫ్ గణ పతి ఆదేశాల మేరకు హిడ్మా బిహార్ మీదుగా నేపాల్ వెళ్లి, అక్కడ నుంచి దొంగ పాస్‌పోర్టు ద్వారా ఫిలిప్పీన్స్ చేరుకుని ఉంటాడని భావిస్తున్నారు. అక్కడే అతను భారీ ప్రాణనష్టమే లక్ష్యం గా భీకరదాడులు చేయడం, వీలైనంత ఎక్కువమందిని చంపడం, ప్రత్యర్థులకు ఎరవేసి చంపడంలో ఆరితేరాడని సమాచారం. హిడ్మా వ్యూహా లన్నీ మూడంచెల్లో ఉంటాయి. తొలుత బాంబులతో దాడి, తర్వాత బుల్లెట్ల వర్షం, ఆ తర్వాత గా యాలతో అల్లాడుతున్న క్షతగాత్రుల గొంతులు కోయడం, శరీరాన్ని కత్తులతో తూట్లుగా పొడవడం తదితర కర్కశ చర్చలన్నీ సైనిక పాలిత, నియంతల పాలనలో సాగుతున్న దేశా ల్లో ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు అనుసరించే యుద్ధతంత్రాలని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో, అంతర్యుద్ధాలు సాగుతున్న దేశాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయని చెబుతున్నారు. 2010లో దంతెవాడలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో ఓ సైనికుడి శవంపై 78 కత్తిపోట్లు ఉండటం దీనికి నిదర్శనం. ఆపై నెలరోజుల వ్యవ ధిలో ఆర్టీసీ బస్సును పేల్చి సాధారణ ప్రజలతోపాటు 30 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపడ మూ హిడ్మా ఆలోచనే అన్న అనుమానాలున్నాయి. పక్కా వ్యూహం .. పకడ్బందీ ప్రణాళిక బీజాపూర్‌లో జొన్నగూడెం సమీప అటవీ ప్రాం తంలో జరిగిన భారీ దాడికి డిసెంబర్, జనవరిలోనే వ్యూహరచన జరిగి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడి కోసం బస్తర్ ప్రాంత నక్సలైట్లలో తాను గెరిల్లా శిక్షణ ఇచ్చిన దాదాపు 300 మందికిపైగా షార్ప్ షూటర్లను హిడ్మా పిలిపించినట్లు సమాచారం. వారికి ప్లాన్ వివరించడంతో పాటు తిరిగి సురక్షితంగా తప్పించుకోవడంపై మాక్ డ్రిల్ నిర్వహించేందుకు 2 నెలలకు పైగానే సమయం పట్టి ఉంటుందంటున్నారు. అంతా సరే అనుకున్నాక.. భద్రతా దళాలకు ఉప్పందించడం, వారు ఇతని కోసం పగలూరాత్రి వెదకడం, వారు తాము అనుకున్న ప్రాంతానికి రాగానే, జవాన్లు తేరుకునేందుకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా సులువుగా దాడి చేసి పారిపోవడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. తమ వద్ద ఉన్న తక్కువ సామగ్రితోనే వీలైనంత ఎక్కువమంది శత్రువులను మట్టుబెట్టడం హిడ్మా లక్ష్యం. బుల్లెట్లను వీలైనంత తక్కువగా వాడటం, జవాన్లను కత్తులతో పొడిచి, మిగిలిన వారిని భయభ్రాంతులకు గురిచేయడం అతని వ్యూహంలో భాగమని అంటున్నారు. జొన్నగూడెం ఆపరేషన్‌లో పీఎల్జీఏకు చెందిన సుమారు 200 నుంచి 250 మంది పాల్గొన్నట్లుగా స్పష్టమవుతోంది. -
సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి
రాజస్థాన్: సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి ఆయన దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రధాని మోదీ రాజస్తాన్‌లోని జైసల్మీర్‌కు చేరుకున్నారు. అక్కడి లొంగ్వాలాలో జరగనున్న ఈ వేడుకల్లో బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ అస్థానా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనే మోదీతో పాటు ఉన్నారు. వీరమరణం పొందిన జవాన్లను నివాళులు అర్పించిన మోదీ..ప్రజలంతా దీపాలు వెలిగించి దేశాన్ని కాపాడుతున్న సైనిక వీరులకు వందనం చేయాలని పిలుపునిచ్చారు. (భారత్‌లో ప్రపంచ ఆయుర్వేద కేంద్రం) దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. జవాన్ల కోసం స్వీట్లు, దేశ ప్రజల ప్రేమ తీసుకువచ్చానంటూ మోదీ వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతీ ఏడాది దీపావళి వేడుకలు దైశ సైనికులతో జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. గతేడాది జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో దీపావళి వేడుకల్లో పాల్గొనగా, 2018లో ఉత్తరాఖండ్ సరిహద్దు సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగను జరుపుకున్నారు. 2017లోనూ ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్లో సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. (కశ్మీర్లో పాక్ దుస్సాహసం) -
మహేశ్ బాబు భావోద్వేగ ట్వీట్
71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు వెల్లడించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. (సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ చెప్పనున్న మహేశ్!) 'మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న భారత హీరోలకు సెల్యూట్ చేస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు' తెలుపుతున్నట్టుగా సూపర్‌స్టార్ పేర్కొన్నారు. లేడీ అమితాబ్ విజయశాంతి, చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా మహేశ్‌తో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు జవాన్‌గా నటించిన విషయం తెలిసిందే. (సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ) It was such an honour meeting all the brave soldiers. This was undoubtedly one of my most memorable days! Huge salute to the nation's heroes who continue to protect us everyday🙏🏼#SarileruMeekevvaru🙏🏻🙌#HappyRepublicDay! 🇮🇳 pic.twitter.com/YIqDafYuUg — Mahesh Babu (@urstrulyMahesh) January 26, 2020 -
సైనికుల కుటుంబాలను ఆదుకోవడం మన కర్తవ్యం
హైదరాబాద్ : దేశ సరిహద్దులో ప్రాణాలను అడ్డుపెట్టి పనిచేస్తున్న సైనికులకు మనం ఎంత చేసినా తక్కువేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ మాజీ సైనికులు, కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయిని మాట్లాడుతూ, సైనికులు తమ కుటుంబాలను, భార్యాపిల్లలను వదిలిపెట్టి దేశాన్ని కాపాడుతున్నారని తెలిపారు. సైనికుల కుటుంబాలను ఆదుకోవడం మనందరి కర్తవ్యం అని అన్నారు. వీరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, మంచి పథకాలను ప్రవేశపెట్టాలని కోరారు. సైనికుల సంక్షేమాన్ని కాపాడాలన్న కారణంతో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఒకరోజు జీతాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు మొదలుకుని ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఒక్క రోజు జీతాన్ని సైనిక సంక్షేమానికి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఒక గ్రూపు ఒక రోజు జీతాన్ని ఇవ్వలేదన్నారు. కెప్టెన్ ఉరేష్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి, సైనిక సంక్షేమ అధికారి శ్రీనిష్ కుమార్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
సంచలనం: పోలీస్ Vs ఆర్మీ
శ్రీనగర్: కల్లోల కశ్మీర్లో కలిసి పనిచేయాల్సిన సైనికులు, పోలీసులు కొట్లాటకు దిగడం సంచలనంగా మారింది. నిషేధిత సమయంలో, అదికూడా సివిల్ డ్రెస్‌లో ప్రయాణిస్తున్న ఆర్మీ జవాన్లను అడ్డుకున్న పాపానికి పోలీసులపై దాడి జరిగింది. జమ్ముకశ్మీర్‌లోని గందర్బల్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుందీ ఘటన. అమర్నాథ్ యాత్ర డ్యూటీ ముగించుకున్న కొందరు ఆర్మీ జవాన్లు బల్తాల్ బేస్ క్యాంపు నుంచి ప్రైవేటు వాహనాల్లో గుండ్వైపునకు ప్రయాణమయ్యారు. సోనామార్గ్ చెక్‌పోస్ట్ వద్ద కాపలా ఉన్న జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఆ వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆర్మీ జవాన్లు వాహనాన్ని వేగంగా పోనిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. సమీపంలోని గుండ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరవేశారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఉంచి, ఎట్టకేలకు ఆర్మీ జవాన్ల వాహనాలు ఆపేశారు. దీంతో ఆగ్రహించిన జవాన్లు.. ‘ఆర్మీవాళ్లనే అడ్డుకుంటారా?’ అంటూ పోలీసులతో వాదనకు దిగారు. గుండ్పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని ఆర్మీ క్యాంపు నుంచి మరికొంత మంది జవాన్లను పిలిపించారు. అందరూ కలిసి పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశారు. స్టేషన్లోకి చొరబడి, సామాగ్రిని, రికార్డులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. అధికారుల పాట్లు.. నేతల ట్వీట్లు కాగా, పోలీసులపై ఆర్మీ జవాన్ల దాడి ఘటనను చిన్నదిగా చూపేందుకు అటు ఆర్మీ, పోలీసు వర్గాలు ప్రయత్నించాయి. కానీ దెబ్బలు తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసుల ఫొటోలు మీడియాలో ప్రసారం కావడంతో చర్యలకు ఉపక్రమించాయి. దాడికి పాల్పడిన ఆర్మీ జవాన్లపై కేసు నమోదు చేశామని, సైనిక పరంగానూ వారిపై విచారణకు ఆదేశాలు జరీ అయ్యాయని జమ్ముకశ్మీర్ ఐజీ మునీర్ అహ్మద్ ఖాన్ మీడియాకు తెలిపారు. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై స్పందించారు. రాష్ట్రపోలీసులపై ఆర్మీ దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం ట్వీట్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో 9 మంది సైనికులకు గాయాలు
జమ్మూ: భారత సైనికులు ప్రయాణిస్తున్న బస్సు రోడ్డు ప్రమాదం బారిన పడటంతో తొమ్మిది మంది గాయపడ్డారు. శనివారం జమ్మూ కశ్మీర్ లోని నాగ్రోటా జిల్లా పరిసర ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుంచి కిందికి జారిపోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన సైనికులను ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రైల్లో యువతిపై సైనికుల గ్యాంగ్ రేప్
-
రైల్లో యువతిపై సైనికుల గ్యాంగ్ రేప్
ఇంట్లోంచి పారిపోయి రైలెక్కిన ఓ యువతిపై.. ఆ రైల్లో ఉన్న ఆర్మీ జవాన్లు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణం హౌరా- అమృతసర్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. ఆ అమ్మాయి ఆదివారం నాడు ఇంటి నుంచి పారిపోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయగా, వాళ్లు రైల్వేశాఖను అప్రమత్తం చేశారు. హౌరా స్టేషన్లో వేలాది మంది మధ్య ఆమెను సీసీ టీవీలో గుర్తించిన పోలీసులు.. ఆమె అమృతసర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు తెలుసుకున్నారు. కానీ అప్పటికే రైలు జార్ఖండ్ దాటింది. రాంచీ డీజీపీ కార్యాలయానికి సమాచారం పంపగా, ఫొటో ఆధారంగా ఆమెను కాపాడే ప్రయత్నాలు మొదలయ్యాయి. రైలును మధుపూర్ స్టేషన్లో ఏడు నిమిషాల పాటు ఆపి.. జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రతి బోగీని చూశారు. అయితే మిలటరీ కోచ్ మాత్రం లోపల నుంచి గడియ వేసి ఉంది. కొంత వాగ్వాదం తర్వాత ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది బోగీలోకి వెళ్లగా.. అందులోనే ఆ అమ్మాయి ఉంది. మహిళా కానిస్టేబుళ్లు ఆమెను జీఆర్పీ స్టేషన్‌కు తరలించి.. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న మంజ్రీష్ త్రిపాఠీ అనే సైనికుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అమ్మాయిని ప్రశ్నించగా.. ముగ్గురు జవాన్లు తనతో బలవంతంగా మద్యం తాగించారని, ఇద్దరు రేప్ చేశారని తెలిపింది. సీసీటీవీ ఫుటేజిలో ఆ ఇద్దరినీ ఆమె గుర్తించింది. అయితే, ఈ ప్రక్రియ అంతా ముగిసి వాళ్లను అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చేసరికి రైలు 22 స్టాపులు దాటి సుల్తాన్పూర్ చేరుకుంది. దాంతో వాళ్లు ఆ బోగీ నుంచి మాయమయ్యారు. దాంతో.. వారితోపాటు ఉన్న మంజ్రీష్ త్రిపాఠీని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేసి ఆర్మీ జవాన్లు!
నాసిక్: ఆర్మీ జవాన్లు ఆగ్రహంతో ఓ పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. ఓ సైనికాధికారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆర్మీ జవాన్లు ఈ దుశ్ఛర్యకు పాల్పడ్డారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ఘటన జరిగింది. తమ అధికారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆర్మీ జవాన్లు బుధవారం నాసిక్ పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. -
వరదలో కొట్టుకుపోయిన 9 మంది జవానులు
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లో శనివారం వరద సహాయక చర్యల్లో పాల్గొన్న తొమ్మిదిమంది జవాన్లు వరద ఉధృతికి కొట్టుకు పోయారు. పుల్వామా జిల్లాలో వరద ఉధృతి శనివారం కూడా కొనసాగుతోంది. సహాయక చర్యలు చేపడుతుండగా.... ఒక్కసారిగా వరద ఉధృతి పెరగటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అలాగే శ్రీనగర్‌లో జీలమ్ నది పోటెత్తుతోంది. దాంతో నది వద్ద అయిదు కిలోమీటర్ల మేర రహదారి కొట్టుకుపోయింది. కాగా శ్రీనగర్ విమానాశ్రయంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. కాగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలలో మృతి చెందినవారి సంఖ్య 120కి చేరింది. వారిలో కొండచరియలు విరిగి 14మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదివేలమంది వరద తాకిడికి గురయ్యారు. -
లైంగిక దాడికి యత్నించిన ముగ్గురు జవాన్లకు రిమాండ్
-
లైంగిక దాడికి యత్నించిన జవాన్లకు రిమాండ్
సికింద్రాబాద్ : ఈస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ఓ బాలికపై లైంగికదాడికి యత్నించిన ముగ్గురు జవాన్లను రిమాండ్‌కు తరలించినట్లు నార్త్‌జోన్ డీసీపీ జయలక్ష్మి తెలిపారు. స్నేహితుడితో దైవ దర్శనానికి వెళ్లివస్తున్న ఓ బాలికపై ఆదివారం రాత్రి ముగ్గురు జవాన్లు లైంగిక దాడికి యత్నించిన విషయం తెలిసిందే. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు లాక్ బహదూర్ శెట్టి (28), తపస్ మెహతి (29), సులాన్ నర్జర్నారి (29) ముగు్గరు జవాన్లను తుకారంగేట్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టుకు తరలించగా న్యాయమూర్తి ఆదేశం మేరకు చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ లోని సాయిబాబా గుడి నుంచి వస్తున్న ఇద్దర్ని రాత్రి పది గంటల సమయంలో ఆర్మీ జవాన్లు అడ్డుకున్నారు. ఆతర్వాత స్నేహితుడిని కొట్టి బాలికను పొదల్లోకి ఎత్తుకెళ్లడంతో అతను స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని.. బాలికను రక్షించారు. ఈ కిరాతకానికి పాల్పడిన ఆర్మీ జవాన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని.. బాధితురాలిని ఆదివారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉంది. -
సికింద్రాబాద్ లో యువతిపై ఆర్మీ జవాన్ల అత్యాచారయత్నం
-
సికింద్రాబాద్ లో యువతిపై ఆర్మీ జవాన్ల అత్యాచారయత్నం
సికింద్రాబాద్ లో ఓ యువతిపై ముగ్గురు ఆర్మీ జవాన్లు అత్యాచారం యత్నానికి ప్రయత్నించినట్టు తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలో స్నేహితుడిని బెదిరించి యువతిని ఎత్తుకెళ్లి ఆర్మీ జవాన్లు కిరాతకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురిపై యువతి స్నేహితుడు తుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ జవాన్లపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ లోని సాయిబాబా గుడి నుంచి వస్తున్న ఇద్దర్ని రాత్రి పది గంటల సమయంలో ఆర్మీ జవాన్లు అడ్డుకున్నట్టు తెలిసింది. ఆతర్వాత స్నేహితుడిని కొట్టి యువతిని పోదల్లోకి ఎత్తుకెళ్లడంతో అతను స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాడని పోలీసులు తెలిపారు. స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని.. యువతిని రక్షించారు. ఈ కిరాతకానికి పాల్పడిన ఆర్మీ జవాన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని.. బాధితురాలిని ఆదివారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని మీడియాకు దృష్టికి రాకుండా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
'చావడానికే ప్రజలు ఆర్మీలో చేరతారు'
పాట్నా : భారతీయ జవాన్లపై జేడీయూ పంచాయతీ శాఖ మంత్రి భీమ్‌సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చావడానికే ప్రజలు ఆర్మీలో చేరతారంటూ ఆయన గురువారమిక్కడ నోరు జారటంతో దుమారం రేగింది. మరణించిన వీర జవాన్ల అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు భీమ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖండించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన మంత్రి భీమ్ సింగ్‌ను ఆదేశించారు. కాగా భీమ్‌సింగ్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. భీమ్‌సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. జవాన్లను కించపరిస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కాగా పాకిస్తాన్ జరిపిన అమానుష దాడిలో అయిదుగురు భారతీయ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు భారతీయ జవాన్ల హత్యపై తాను ఇచ్చిన ప్రకటనపై ప్రతిపక్షాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ గురువారం లోక్‌సభలో మరోసారి వివరణ ఇచ్చారు. దాడిలో మిలిటెంట్లు కూడా పాల్గొన్నట్లు తాను చేసిన ప్రకటనను ఆయన సమర్థించుకుంటూ అప్పటికి తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ప్రకటన చేసినట్లు చెప్పారు.