Artificial 3d
-
వినూత్నం: రోబో టీచరమ్మ.. పిల్లలు బుద్ధిగా, సైలెంట్‌గా ఉండాల్సిందే..
'సినిమాల్లో హ్యుమనాయిడ్ రోబోను చూడగానే పిల్లల సంతోషం ఇంతా అంతా కాదు. సినిమాల్లో కనిపించే రోబో క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెడితే? ‘అబ్బో! ఆ అల్లరికి అంతు ఉండదు’ అనుకుంటాం. అయితే ‘ఐరిష్’ అనే ఈ రోబో ముందు మాత్రం పిల్లలు బుద్ధిగా, సైలెంట్‌గా ఉండాల్సిందే. ఇంతకూ ఎవరీ ఐరిష్?' కేరళలోని తిరువనంతపురం కేటీసీటీ హైయర్ సెకండరీ స్కూల్ లోకి ఫస్ట్ జెనరేటివ్ ఏఐ స్కూల్ టీచర్ ఐరిష్ అడుగు పెట్టింది. ఈ హ్యుమనాయిడ్ ఉపాధ్యాయురాలు మూడు భాషల్లో మాట్లాడగలదు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు స్పష్టంగా జవాబులు చెప్పగలదు. ఎడ్టెక్ ‘మేకర్ల్యాబ్స్’ రూపకల్పన చేసిన ఈ జెనరేటివ్ ఏఐ స్కూల్ టీచర్ కేరళలోనే కాదు దేశంలోనే మొదటిది. ‘ఐరిష్ నాలెడ్జ్బేస్ ఇతర ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కంటే విస్తృతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది’ అంటుంది మేకర్ ల్యాబ్స్. చదువుకు సంబంధం లేని సబ్జెక్ట్‌ల జోలికి ‘ఐరిష్’ వెళ్లదు. ‘కృత్రిమ మేధతో అవకాశాలు అనంతం అని చెప్పడానికి ఐరిష్ ఒక ఉదాహరణ. పిల్లలు అడిగే సందేహాలకు టీచర్‌లాగే ఐరిష్ సరిౖయెన సమాధానాలు ఇవ్వగలదు’ అంటున్నారు ‘మేకర్ల్యాబ్స్’ సీయీవో హరిసాగర్. ‘మేకర్ల్యాబ్స్తో కలిసి ఎన్నో రకాల వర్క్‌షాప్‌లు నిర్వహించాం. వీటి ద్వారా పిల్లలు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ ప్రింటింగ్‌కు సంబంధించిన నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు’ అంటున్నారు స్కూల్ ప్రిన్సిపాల్ మీరా ఎంఎన్. ఇవి చదవండి: International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే? జీవితంపై అధికారం హక్కులపై ఎరుక -
3డీబ్రెయిన్... ఎలుక మెదడులా పనిచేస్తుంది!
అచ్చం ఎలుక మెదడు మాదిరిగా పనిచేసే కృత్రిమ త్రీడీ మెదడు ఇది. ఆప్టికల్ మైక్రోస్కోపు ద్వారా తీసిన ఈ చిత్రాన్ని బోస్టన్లోని టఫ్ట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. చిత్రంలో ఆకుపచ్చ, పసుపు రంగుల్లో కనిపిస్తున్నవి నాడీకణాలు కాగా.. నీలి రంగులో ఉన్నది పట్టుతో తయారుచేసిన మూస. మెదడు కణజాలాన్ని పోలినట్లు కృత్రిమ కణజాలంతో శాస్త్రవేత్తలు ఇలా నాడీకణాలను అభివృద్ధిచెందించారు. మూస రంధ్రాలు(నల్లరంగులో ఉన్నవి) గుండా వ్యాపించి, ఒకదానితో ఒకటి అల్లుకున్న ఈ నాడీకణాలు మెదడులోని నాడీకణాల మాదిరిగానే పనిచేస్తాయట. ఇంతవరకూ ఇలాంటి నాడీకణాలను చిన్నచిన్న గాజు గిన్నెల్లో, అదీ 2డీ రూపంలో మాత్రమే రూపొందించారు. ఇలా 3డీ నాడీకణాలను, కణజాలాన్ని తయారుచేయడం మాత్రం ఇదే తొలిసారట. ఈ 3డీ మెదడు రెండు నెలలకుపైనే సజీవంగా ఉంటుందట. మెదడు కణజాలానికి దెబ్బ తగిలినప్పుడు ఎలాంటి మార్పులు, నష్టం కలుగుతాయి? ఆ గాయాన్ని మాన్పేందుకు వివిధ మందులు వాడినప్పుడు మెదడు కణజాలం ఎలా ప్రతిస్పందిస్తుంది? అన్నది అధ్యయనం చేసేందుకు ఈ త్రీడీ మెదడును సృష్టించారట. తమ పరిశోధనతో మెదడు గాయాలకు, నాడీ వ్యాధులకు కొత్త చికిత్సలను కనుగొనేందుకు వీలుకానుందని వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.