Artificial kidney
-
ఇక డయాలసిస్ కష్టాలు తీరినట్టేనా?
వాషింగ్టన్: కిడ్నీలు పూర్తిగా చెడిపోయి.. డయాలసిస్ చికిత్సపై ఆధారపడి జీవించే రోగులకు ఇక ఆ కష్టాలు తీరినట్టే. ఇలాంటి వారికోసం ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు పరిశోధకులు. తీవ్రమైన కిడ్నీవ్యాధితో బాధపడుతూ..రక్తశుద్ధి కోసం డయాలసిస్ చేయించుకునే పేషంట్ల బాధలు అన్నీ ఇన్నీ కావు. వీటికి తోడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేమీకాదు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఫూడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక కృత్రిమ కిడ్నీని రూపొందించింది. ప్రామాణిక డయాలసిస్ చికిత్సా పద్ధతికి స్వస్తి చెపుతూ నూతన సాంకేతిక పద్ధతితో ఆర్టిఫిషీయల్ కిడ్నీని తయారు చేశారు. కన్వెన్షనల్ డయాలసిస్ లో మిషీన్ నడుస్తున్నంత సేపు ..పేషెంట్ మంచానికి పరిమితమై ఉండాలి... రకాల రకాల ట్యూబులతో రోగి శరీరానికి అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రక్రియ మొత్తం ఒక రోజంతా నడుస్తుంది. కానీ ఈ ధరించడానికి వీలుగా రూపొందించిన ఈ కృత్రిమ కిడ్నీ మూలంగా....పేషెంట్ ఫ్రీగా తిరగొచ్చనీ, ట్యూబుల బాధ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. డయాలసిస్ సెషన్స్ ను తగ్గించవచ్చని, దీని ద్వారా అదనపు చికిత్స ప్రయోజనాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఆహారం ఆంక్షలు లేకపోవడంతోపాటూ చికిత్స సమయంలో బాధల్నీ,తీవ్రమైన దుష్ప్రభావాలను నిరోధించినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ప్రయోగదశలో ఉన్న ఈ కృత్రిమ పరికరంద్వారా వ్యర్థ ఉత్పత్తులను, అదనపు నీరు, ఉప్పు లను సమర్ధవంతంగా తొలగించగలదని చెప్పారు. యూరియా, క్రియాటినిన్ మరియు భాస్వరం తదితర వ్యర్థాలను సాధారణం మూత్రపిండాల్లోలాగానే ఫిల్టర్ చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. లాస్ ఏంజిల్స్ లో సేడార్-సినై మెడికల్ సెంటర్ కు చెందిన విక్టర్ గురా దీన్ని ఆవిష్కరించారు. ధరించగలిగిన కృత్రిమ కిడ్నీ నమూనా పరికరాన్ని సీటెల్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్ లో రోగులపై విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగ ఫలితాలను జేసీఐ ఇన్సైట్స్ జర్నల్ లో ప్రచురించారు. ఈ తరహాలో వేరియబుల్ ఆర్టీఫిషియల్ కిడ్నీ ఆవిష్కరణ, దీని ప్రయోగ ఫలితాలు మరింత నూతన డయాలసిస్ టెక్నాలజీ అభివృద్ధికి తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. -
బెల్టు సైజులో కృత్రిమ కిడ్నీలు!
మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి స్వాంతన కలిగించి, ఆశలు పెంచే పరిణామమిది. డయాలసిస్ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఎంచక్కా రోజువారీ పనులు చక్కబెట్టుకుంటూనే రక్తంలోని మలినాలను శుద్ధి చేసేందుకు పనికొచ్చే వేరబుల్ కత్రిమ కిడ్నీ పరీక్షలకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులిచ్చింది. కేవలం 4.5 కిలోల బరువుతో ఉండే ఈ పరికరాన్ని బెల్టు మాదిరిగా నడుముకు చుట్టేసుకోవచ్చు. 0.5 లీటర్ల నీరు, ఇతర రసాయనాల సాయంతో ఎప్పటికప్పుడు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. డయాలసిస్ కేంద్రాల్లో గంటలపాటు గడపాల్సిన పని తప్పిపోతుంది. సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్త విక్టర్ గురా తదితరులు దశాబ్ద కాలం పరిశోధనల ఫలితంగా తయారైన ఈ పరికరాన్ని బ్రిటన్, ఇటలీల్లో 32 మందిపై పరీక్షించారు. అమెరికాలోనూ కొంతమందిపై రెండు దశల్లో పరీక్షలు జరిపిన తరువాత అందరికీ అందుబాటులోకి రానున్నాయి ఈ కృత్రిమ కిడ్నీలు! ఎన్గోతో... వైఫై, వైర్లెస్ ఛార్జింగ్ బ్యాటరీ ఛార్జ్ అయిపోతూంటే చాలు... మనకు కంగారు పెరిగిపోతూంటుంది. ఎక్కడా ఛార్జింగ్ పాయింట్ దొరుకుతుందా అని వెతికేస్తూంటాం. అమెరికాలోని సెయింట్ లూయీ విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బందికి ఇకపై ఈ ఇబ్బంది అస్సలుండదు. ఫొటోలో కనిపిస్తోంది చూడండి... అలాంటి ఎన్గో ఛార్జింగ్ స్టేషన్లు అక్కడ ఏర్పాటు చేశారు మరి. సౌరశక్తి ఫలకాలతో పుట్టే విద్యుత్తును వాడుకుని మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకోవడం, వైఫై సదుపాయం అందుకోవడం మాత్రమే దీని ప్రత్యేకత కాదు. ఈ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన కొన్ని ప్రత్యేకమైన టైల్స్ (పచ్చగా కనిపిస్తున్నాయే... అవే) పై నడిచినా చాలు. కొంత కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఎన్గో స్టేషన్లో 12 ఛార్జర్లు, రెండు యూఎస్బీ పోర్టులతోపాటు రెండు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ కూడా ఉంటాయి. బస్టాండుల్లో, నగరాల్లోని బస్టాపుల్లోనూ ఇలాంటివి ఏర్పాటు చేస్తే భలే ఉంటుంది కదూ!