ASEAN
-
భారత్-ఆసియాన్ స్నేహం చాలా ముఖ్యం: ప్రధాని మోదీ
వియంటైన్: 21వ శతాబ్దం భారతదేశం, ఆసియాన్ దేశాల శతాబ్దంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు ఘర్షణలు, ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశం-ఆసియాన్ స్నేహం ముఖ్యమైనదని అన్నారు. వచ్చే 2025వ ఏడాది ఆసియాన్-భారత పర్యాటక సంవత్సరమని తెలిపారు. లావోస్ వేదికగా 21వ ‘ఆసియాన్- ఇండియా సమ్మిట్’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం పాల్గొని మాట్లాడారు. ‘‘ 10 సంవత్సరాల క్రితం యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రకటించాం. గత దశాబ్దంలో ఇది భారతదేశం, ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలకు కొత్త శక్తిని, దిశను, వేగాన్ని ఇచ్చింది. పొరుగు దేశాలుగా, భాగస్వాములుగా.. మనం శాంతి, ప్రేమిగల దేశాలం. ఒకరి జాతీయ సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం.ఈ ప్రాంత యువత ఉజ్వల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాం.PM Narendra Modi participated in the 21st ASEAN-India Summit in Vientiane, Lao PDR, today. In the 10th year of the Act East Policy, PM announced a 10-point plan to strengthen connectivity and resilience based on the theme of ASEAN Chair 2024, including physical, digital,… pic.twitter.com/acDHohIo1h— ANI (@ANI) October 10, 20242019లో ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమాల ప్రస్తావిస్తూ.. గతేడాది ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం సముద్ర కార్యక్రమాలు ప్రారంభించాం. గత దశాబ్దంలో ఆసియాన్ దేశాలతో భారతదేశ వాణిజ్యం దాదాపు రెండింతలు పెరిగి 130 బిలియన్ డాలర్లకుపైగా ఉంది. 10 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తున్నాం. నలంద విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్లు రెట్టింపు చేస్తాం. భారత్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆసియాన్ విద్యార్థులకు కొత్త గ్రాంట్లు ఇస్తాం’ అని అన్నారు.అంతకు ముందు లావోస్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి.. వియంటైన్లో ప్రవాస భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
బలమైన, ఐక్య ఆసియాన్
న్యూఢిల్లీ: అర్ధవంతమైన, దృఢమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా కృషి చేయాలని ఆసియాన్, భారత్ నిర్ణయించాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు సంబంధించి తలెత్తిన ఇబ్బందుల పరిష్కారానికి అన్వేషించాలని అంగీకరించాయి. గురువారం ఢిల్లీలో జరిగిన ఆసియాన్ విదేశాంగ మంత్రుల భేటీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు. యుద్ధం ప్రభావం ఆహారం, ఇంధన భద్రత, వినియోగవస్తువులు, ఎరువుల ధరల పెరుగుదలతోపాటు రవాణా, సరఫరా గొలుసుపై పడిందన్నారు. వాణిజ్యం, అనుసంధానత, రక్షణ, టీకా ఉత్పత్తి, ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భారత్– ఆసియాన్ తీర్మానించాయి. ఆసియాన్–భారత్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (ఏఐటీఐజీఏ)పై సమీక్ష జరపాలని నిర్ణయించాయి. 10 దేశాలతో కూడిన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్)తో సంబంధాలకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ సమావేశానికి సింగపూర్, బ్రూనై, ఇండోనేసియా, కాంబోడియా, మలేసియా, వియత్నాం దేశాల విదేశాంగ మంత్రులు వారు ప్రధాని మోదీతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. ఏడీపీని విస్తరించాలి: మోదీ న్యూఢిల్లీ: ఆకాంక్ష జిల్లాల పథకం(ఏడీపీ)ను బ్లాకులు, నగరాల్లో కూడా అమలు చేయాలని ప్రధాని మోదీ కోరారు. అవి స్ఫూర్తిదాయ జిల్లాలుగా మారాలని ఆకాంక్షించారు. ‘‘దేశ వ్యాప్తంగా 112 వెనకబడ్డ జిల్లాల్లో కేంద్రం 2018 నుంచి అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో విజయవంతమైంది’’ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల భేటీలో ప్రధాని గురువారం మాట్లాడారు. టీచర్లు డిజిటల్ టెక్నాలజీ, మొబైల్ యాప్‌లతో విద్యాబోధనను బలోపేతం చేయాలన్నారు. రిటైర్డ్ టీచర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ శిక్షణ కోసం ప్రత్యేకంగా టీవీ చానల్ అవసరం ఉందని చెప్పారు. -
‘ఆసియాన్‌తో వ్యూహాత్మక బంధానికి చొరవ’
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా భారత్, ఆసియాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా ఆసియాన్‌తో వ్యూహాత్మక బంధం బలపడుతుందని అన్నారు. 17వ ఆసియాన్-భారత్ సదస్సులో ప్రధాని మోదీ గురువారం ప్రారంభోపన్యాసం చేస్తూ ఆసియాన్‌తో భౌతిక, ఆర్థిక, సామాజిక, డిజిటల్ర, మారిటైమ్ సంబంధాల బలోపేతానికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఆసియాన్‌తో ఆయా రంగాల్లో మెరుగైన సంబంధాల దిశగా చొరవచూపామని, ఈ సదస్సు ఈ దిశగా మరింత కీలకంగా మారుతుందని ఆశిస్తున్నామన్నారు. ప్రతి రంగంలోనూ భారత్-ఆసియాన్ల మధ్య సంబంధాలు బలోపేతమమయ్యేందుకు కృషి చేస్తామని చెప్పారు. తాజా సంపద్రింపులతో తమ మధ్య ఉన్న దూరం మరింత తగ్గుతుందని ఆకాంక్షించారు. ఈ సదస్సులో పది ఆసియాన్ దేశాల నేతలు పాల్గొన్నారు. చదవండి : పన్నుల వ్యవస్థలో పారదర్శకత తెచ్చాం -
మోదీ సంచలనం.. ఆర్సెప్కు భారత్ దూరం!
బ్యాంకాక్: ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ‘‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య’’ (ఆర్సెప్) ఒప్పందంలో చేరేందుకు భారత్ నిరాకరించింది. ఆర్సెప్ ఒప్పంద మూలస్వభావం మారిపోయిందని, అంతేకాకుండా ఈ ఒప్పందం విషయంలో భారత్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకోలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సెప్ ఒప్పందంలో చేరరాదని భారత్ నిర్ణయించింది. భారత్ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృఢసంకల్పంతో ఉండటం.. అంతేకాకుండా ఆర్సెప్ ఒప్పందంలో భారత్ లేవనెత్తిన కీలక అంశాలను పట్టించుకోకపోవడంతో ఈ ఒప్పందానికి భారత్ దూరం జరిగింది. దేశంలోకి చైనా దిగుమతులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందంపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొన్ని కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చింది. వాస్తవానికి బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఆర్సెప్ ఒప్పందం ఖరారు కావాలి. కానీ, భారత్ ఒప్పుకోకపోవడంతో ఈ ఒప్పందం 2020కి వాయిదా పడినట్లేనని భావిస్తున్నారు. భారత్‌తోపాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా 16 దేశాల మధ్య ఆర్సెప్ ఒప్పందం కుదరాల్సి ఉంది. ప్రపంచంలోని సగం జనాభా ఈ దేశాల్లోనే ఉంది. ఆర్‌సెప్‌పై సంతకం చేయడానికి మిగతా దేశాలన్నీ కట్టుబడి ఉన్నాయి, కానీ భారత్ మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా చౌక వస్తువుల వెల్లువలో దేశంలో చిరు వ్యాపారుల పరిస్థితి దెబ్బతింటుందంటూ ప్రధాని మోదీ ఇప్పటికే ఆర్సెప్ ఒప్పందంపై పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆ దేశాధినేతలకు మన ‘ప్రాథమిక’ సందేశం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ గణతంత్ర దినోత్సవం వేడుకలకు విశిష్ట అతిథులుగా ఆగ్నేయ ఆసియా దేశాల సంఘానికి చెందిన పది మంది నాయకులను ఆహ్వానించడం ఎంతో విశేషం. దీన్ని ప్రాంతీయ సహకారం దిశగా భారత్ వేస్తున్న ముందడుగుగా భావించవచ్చు. పైగా గత దశాబ్దకాలంగా ఈ దేశాలను తన వైపు తిప్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్న దశలో ఆ దేశాల అధినేతలను మన గణతంత్ర వేడుకలకు ఆహ్వానించడం ఎంతో ముదావహం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్న విషయం తెల్సిందే. అమెరికా, బ్రిటన్, రష్యాలాంటి రాజ్యాంగాలతోపాటు ‘ఫ్రెంచ్ విప్లవం’ను ప్రధాన స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నాయకత్వంలోని భారత రాజ్యాంగ పరిషత్తు దీన్ని రూపొందించింది. ఫ్రెంచ్ విప్లవం నుంచి స్ఫూర్తిగా తీసుకొని రూపొందించినవి ప్రాథమిక హక్కులు. అందులో ప్రధానమైనది భావ ప్రకటనా స్వాతంత్య్రం. దీన్ని ఇప్పుడు పత్రికా స్వేచ్ఛగా కూడా పరిగణిస్తున్నాం. ఆగ్నేయాసియా దేశాల నుంచి హాజరైన నాయకుల్లో ఎక్కువ మంది తమ దేశాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛను అణచి వేస్తున్నవారే. మన దేశంలో కూడా అప్పుడప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడి మనం భావ ప్రకటనా స్వేచ్ఛను నిలబెట్టుకుంటున్నాం. వివాదాస్పదమైన ‘పద్మావత్’ చిత్రం విడుదలను అడ్డుకునేందుకు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ప్రయత్నించడం రాజ్యాంగం ప్రకారం మనకు సంక్రమించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. ఈ నాలుగు రాష్ట్రాల్లో నిషేధాన్ని సుప్రీం కోర్టు కొట్టివేయడం ద్వారా మన స్వేచ్ఛను రక్షించింది. సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జడ్జీ లోయా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పట్ల దాఖలైన పిటిషన్ విచారణకు ముంబై జర్నలిస్టులను ట్రయల్ కోర్టు అనుమతించలేదు. వారు దీన్ని హైకోర్టులో సవాల్ చేయడం ద్వారా విజయం సాధించారు. సోహ్రాబుద్ధీన్ ఎన్కౌంటర్ కేసులో ఇదివరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. పత్రికా స్వేచ్ఛ విషయంలో ఆగ్నేయ ఆసియా దేశాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. లావోస్ 2014లో కఠినమైన సైబర్ చట్టాన్ని తీసుకొచ్చింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు అంత కఠినమైన చట్టం అవసరం లేదని ప్రపంచ దేశాలు విమర్శించాయి. అదే తరహాలో అక్కడి ఆంగ్ల పత్రిక ‘కాంబోడియా డెయిలీ’ విమర్శించింది. ప్రధాన మంత్రి హన్ సెన్ బహిరంగంగా ఆ పత్రికను తీవ్రంగా విమర్శించారు. ఆ రోజు నుంచి పన్నుల నోటీసుల పేరిట ప్రభుత్వం వేధించడంతో కొన్ని రోజుల్లోనే ఆ పత్రిక మూత పడింది. ప్రధాని అణచివేత ధోరణులను భరించలేక అనేక స్వచ్ఛంద సంస్థలు దేశం విడిచిపోయాయి. మలేసియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా స్వతంత్ర పత్రికలు, వెబ్సైట్లు ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొంటున్నాయి. మలేసియాకు చెందిన ‘మలేసియాకిని’పై భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేసి కోలుకోకుండా చేస్తున్నారు. రాజ్యాంగేతర హత్యలను ప్రశ్నించినందుకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తక్షణం ‘ర్యాప్లర్’ పత్రికను మూసేయాల్సిందిగా ఆదేశించింది. మయన్మార్‌లో రోహింగ్య జాతి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును విమర్శించినందుకు ఆంగ్సాక్ సూచీ ప్రభుత్వం ఇద్దరు ‘రాయటర్స్’ జర్నలిస్టులపై కఠినమైన ప్రభుత్వ రహస్య చట్టం కింద కేసులు పెట్టి వేధిస్తోంది. భారత గణతంత్ర వేడుకులకు విశిష్ట అతిథులుగా వచ్చిన ఆగ్నేయాసియా దేశాధినేతలు ఏ ఉద్దేశంతో వచ్చినా భారత రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకుంటే వారి రాకకు సార్థకత చేకూరుతుంది. -
బండబూతు తిట్టినా.. భేటీ!
-
బండబూతు తిట్టినా.. భేటీ!
లావోస్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో డుటెర్టె బుధవారం అనధికారికంగా భేటీ అయ్యారు. ఆసియన్ సదస్సు గాలా విందు పూర్తయిన తర్వాత వీరు హోల్డింగ్ రూమ్‌లో కలిసి చర్చలు జరిపినట్టు ఫిలిఫినో అధికారులు తెలిపారు. నోటి దురుసుతనంతో ఒబామాను ఉద్దేశించి డుటెర్టె అవమానకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒబామా వెలయాలి కొడుకు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో డుటెర్టెతో మంగళవారం నాటి అధికారిక భేటీని ఒబామా రద్దుచేసుకున్న సంగతి తెలిసిందే. గతంలోనూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసి డుటెర్టె మీడియా పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఒబామాను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల సంబంధాలలో కొంత ఉద్రిక్తతను రేపాయి. ఈ నేపథ్యంలో డుటెర్టె తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఒబామాపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒబామ-డుటెర్టె అనధికారికంగా భేటీ అయి.. పలు అంశాలపై చర్చించారని, అమెరికా-ఫిలిప్పీన్స్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని వారు ఈ భేటీలో గుర్తించారని, చారిత్రక ప్రాతిపదికగా ఇరు దేశాల సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించారని ఫిలిప్పీన్ విదేశాంగ కార్యదర్శి పెఫెక్టో యాసే తెలిపారు. -
ఆర్థిక బంధం మరింత బలపడాలి...
నేపిడా (మయన్మార్): భారత్-ఆసియాన్ దేశాలు గొప్ప భాగస్వాములుగా ఉండడానికి తగిన అన్ని అవకాశాలూ ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం పేర్కొన్నారు. మయన్మార్ రాజధాని నేపిడాలో జరిగిన 12వ భారత్-ఆసియాన్ సదస్సులో ఆయన బుధవారం హిందీలో ప్రసంగించారు. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య రంగాలకు సంబంధించి భారత్‌లో కొత్త శకం ప్రారంభమైందని ఆసియాన్ దేశాధినేతలకు వివరించారు. ఆయా రంగాల అభివృద్ధిలో పరస్పర సహకారానికి భారత్‌తో భాగస్వాములుగా 10 దేశాల ఆగ్నేయాసియా దేశాల సంఘం- ఆసియాన్ ఉండవచ్చని పేర్కొన్నారు. ఆసియాన్ దేశాలతో భారత్ తన సంబంధాలను పటిష్ట పరచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘వాణిజ్యం, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి మన మధ్య ప్రాచీనకాలం నుంచీ సంబంధాలు ఉన్నాయి’ అన్నారు. ఈ సంబంధాలు ఆధునిక సంబంధాలకు పటిష్ట పునాదులుగా నిలుస్తున్నాయని వివరించారు. భారత్ ‘లుక్ ఈస్ట్ పాలసీ’లో ఆసియాన్‌కు ముఖ్య ప్రాధాన్యత ఉంటుందన్నారు. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’గా దీనిని మోదీ పేర్కొన్నారు. సముద్ర జలాలు, సరిహద్దులకు సంబంధించి అన్ని దేశాలు అంతర్జాతీయ నియమ, నిబంధలను పాటించాలని, ఈ బాధ్యత అన్ని దేశాలపై ఉంటుందని అన్నారు. ఆయా అంశాలకు సంబంధించి కొన్ని ఆగ్నేయాసియా దేశాలు-చైనా మధ్య ఇటీవల వివాదాలు తలెత్తిన నేపథ్యంలో మోదీ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మలేషియా కంపెనీలకు ఆహ్వానం... భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని మలేషియా కంపెనీలను మోదీ ఆహ్వానించారు. భారత్‌లో వాణిజ్యానికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. అంతకుముందు ఆయన భారత్-ఆసియాన్ సదస్సులో భాగంగా మయన్మార్ ప్రధాని నజీబ్ రజాక్‌తో ఇంటర్నేషనల్ కన్వెక్షన్ సెంటర్లో సమావేశమయ్యారు. వాణిజ్య, ఆర్థిక సంబంధాల పటిష్టతకు సంబంధించి తమతమ దేశాల్లో పర్యటించాలని పరస్పరం ఇరువురు ప్రధానులూ ఈ సందర్భంగా ఆహ్వానించుకున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ బాగుంది: థాయ్ థాయ్ ప్రధాని ప్రయూత్ ఛోన్-ఓ-ఛాతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ఈ ఆలోచన తమ దేశానికీ ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు. కాగా మోడీ తన పర్యటనలో భాగంగా మయన్మార్ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమ నాయకురాలు అంగ్ సాన్ సూకియాతో కూడా సమావేశమయ్యారు. ఆసియాన్ సదస్సు అనంతరం మోదీ 13న జరగనున్న తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. తరువాత ఈ నెల 15-16 తేదీల్లో ఆస్ట్రేలియాలోని బ్రిస్సేన్‌లో నిర్వహించనున్న జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఈ మూడు సదస్సుల సందర్బంగా ఆయన దాదాపు 40 మందికి పైగా అంతర్జాతీయ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. కాగా జీ-20 సదస్సు సందర్భంగా ఆర్థిక, వాణిజ్య అభివృద్ధికి సంబంధించి మోదీ అత్యద్భుతమైన సూచనలు, సలహాలు అందించగలరన్న విశ్వాసాన్ని ఆస్ట్రేలియా హై కమిషనర్ ప్యాట్రిక్ సుక్లింగ్ న్యూఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆసియాన్‌తో అనుబంధానికి ప్రణాళిక
12వ ఆసియాన్ సమావేశంలో సుష్మాస్వరాజ్ వెల్లడి నేపితా: ఆసియాన్ దేశాలతో విభిన్న రంగాల్లో భారత సంబంధాలు, సహకారాలను మెరుగుపరచేందుకు 2016 నుంచి అమలయ్యేలా ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని భారతదేశం పేర్కొంది. ఆసియాన్‌కు భారత్‌కు మధ్య సేవలు, పెట్టుబడుల రంగాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ నెలలో జరగబోయే ఆర్థిక, వాణిజ్య మంత్రుల సమావేశంలో ఖరారవుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మయన్మార్‌లోని నేపితా నగరంలో శనివారం జరిగిన 12వ ఇండియా - ఆసియాన్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఆసియాన్ దేశాల బృందంతో సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. ఆసియాన్ దేశాల మధ్య భౌగోళిక, సంస్థాగత, ప్రజా సంబంధాలు నెలకొనాలని భారత్ కాంక్షిస్తోందన్నారు. విదేశీ విధానంలో సంస్కృతి, నైపుణ్యం, పర్యాటకం, వాణిజ్యం, సాంకేతిక - (ట్రెడిషన్, టాలెంట్, టూరిజం, ట్రేడ్, టెక్నాలజీ - ఐదు ‘టీ’లు) ప్రాధాన్యం గల అంశాలని.. వీటన్నిటికన్నా ముందు ఒక ‘సీ’ - కనెక్టివిటీ (అనుసంధానం) అనేది ముఖ్యమని సుష్మా పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలను పాటించాలి... దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడా సుష్మాస్వరాజ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. సముద్ర చట్టంపై 1982 ఐక్యరాజ్యసమితి ఒప్పందం సహా అంతర్జాతీయ చట్టాల సూత్రాలకు అనుగుణంగా సముద్రయాన స్వేచ్ఛకు, వనరుల అందుబాటుకు భారత్ మద్దతిస్తుందని పేర్కొన్నారు. వియత్నాం తనకు చెందినవిగా చెప్తున్న పారాసెల్ దీవులకు సమీపంలోని సముద్ర జలాల్లో చైనా ఆయిల్ రిగ్‌ను మోహరించటంతో ఈ అంశంపై వివాదం తలెత్తింది. దక్షిణ చైనా సముద్రంలో భారత్‌కు చెందిన ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్) చమురు బ్లాకులను నిర్వహిస్తోంది. ఈ వివాదాస్పద జలాల్లో భారత్ చమురు అన్వేషణ ప్రాజెక్టులకు చైనా అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ఏడు దేశాల విదేశీ మంత్రులతో సుష్మా చర్చలు ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో.. చైనా, ఆస్ట్రేలియా, కెనడా, వియత్నాం, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, మయన్మార్ దేశాల విదేశాంగ మంత్రులతో సుష్మాస్వరాజ్ విడివిడిగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. వియత్నాం మంత్రి ఫాంబిన్మిన్తో భేటీలో.. దక్షిణ చైనా సముద్రం అంశంతో పాటు, ఇంధన భద్రత, వాణిజ్యం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందించుకునే అంశాన్నీ చర్చించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్తో భేటీలో.. పౌర అణు ఒప్పందంపై చర్చలను వేగవంతం చేయాలని ఇరు పక్షాలూ నిర్ణయించాయని.. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు.