సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా భారత్, ఆసియాన్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా ఆసియాన్‌తో వ్యూహాత్మక బంధం బలపడుతుందని అన్నారు. 17వ ఆసియాన్-భారత్ సదస్సులో ప్రధాని మోదీ గురువారం ప్రారంభోపన్యాసం చేస్తూ ఆసియాన్‌తో భౌతిక, ఆర్థిక, సామాజిక, డిజిటల్‌ర, మారిటైమ్ సంబంధాల బలోపేతానికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
గత కొన్నేళ్లుగా ఆసియాన్‌తో ఆయా రంగాల్లో మెరుగైన సంబంధాల దిశగా చొరవచూపామని, ఈ సదస్సు ఈ దిశగా మరింత కీలకంగా మారుతుందని ఆశిస్తున్నామన్నారు. ప్రతి రంగంలోనూ భారత్-ఆసియాన్‌ల మధ్య సంబంధాలు బలోపేతమమయ్యేందుకు కృషి చేస్తామని చెప్పారు. తాజా సంపద్రింపులతో తమ మధ్య ఉన్న దూరం మరింత తగ్గుతుందని ఆకాంక్షించారు. ఈ సదస్సులో పది ఆసియాన్ దేశాల నేతలు పాల్గొన్నారు. చదవండి : పన్నుల వ్యవస్థలో పారదర్శకత తెచ్చాం
Comments
Please login to add a commentAdd a comment