భారత్‌-ఆసియాన్ స్నేహం చాలా ముఖ్యం: ప్రధాని మోదీ | PM Modi says INDIA ASEAN friendship important over global conflicts | Sakshi
Sakshi News home page

భారత్‌-ఆసియాన్ స్నేహం చాలా ముఖ్యం: ప్రధాని మోదీ

Published Thu, Oct 10 2024 7:18 PM | Last Updated on Thu, Oct 10 2024 7:29 PM

PM Modi says INDIA ASEAN friendship important over global conflicts

వియంటైన్: 21వ శతాబ్దం భారతదేశం, ఆసియాన్ దేశాల శతాబ్దంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు ఘర్షణలు, ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశం-ఆసియాన్ స్నేహం ముఖ్యమైనదని అన్నారు. వచ్చే 2025వ ఏడాది ఆసియాన్-భారత పర్యాటక సంవత్సరమని తెలిపారు. లావోస్‌ వేదికగా 21వ ‘ఆసియాన్- ఇండియా సమ్మిట్‌’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం పాల్గొని మాట్లాడారు.   

‘‘ 10 సంవత్సరాల క్రితం యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రకటించాం. గత దశాబ్దంలో ఇది భారతదేశం, ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలకు కొత్త శక్తిని, దిశను, వేగాన్ని ఇచ్చింది. పొరుగు దేశాలుగా, భాగస్వాములుగా.. మనం శాంతి, ప్రేమిగల దేశాలం. ఒకరి జాతీయ సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం.ఈ ప్రాంత యువత ఉజ్వల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాం.

2019లో ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమాల ప్రస్తావిస్తూ.. గతేడాది ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం సముద్ర కార్యక్రమాలు ప్రారంభించాం. గత దశాబ్దంలో ఆసియాన్ దేశాలతో భారతదేశ వాణిజ్యం దాదాపు రెండింతలు పెరిగి 130 బిలియన్ డాలర్లకుపైగా ఉంది. 10 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తున్నాం. నలంద విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్‌లు రెట్టింపు చేస్తాం. భారత్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆసియాన్‌ విద్యార్థులకు కొత్త గ్రాంట్లు ఇస్తాం’ అని అన్నారు.

అంతకు ముందు లావోస్‌ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి.. వియంటైన్‌లో ప్రవాస భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement