చరణ్ సినిమాకు హ్యాండిచ్చిన సినిమాటోగ్రాఫర్
మెగా అభిమానులకు షాక్‌ల మీద షాకులిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. బ్రూస్ లీ సినిమాతో ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన చెర్రీ, ఇంతవరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్‌కు వెళ్లలేదు. అఫీషియల్‌గా సినిమా స్టార్ట్ చేసినా.. ఇతర పాత్రలపై సీన్స్ తీస్తున్నారే గానీ చరణ్ మాత్రం షూటింగ్లో పాల్గొనటం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో ఈనెల 6 నుంచి షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ను రీమేక్ చేస్తున్నాడు చరణ్. ధృవ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషయన్స్తో కలిసి పనిచేస్తున్నాడు. అందుకే బంజరంగీ భాయ్‌జాన్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్‌కు పనిచేసిన సినిమాటోగ్రఫర్ అసీమ్ మిశ్రా ధృవ టీంతో కలిశాడు. ఇప్పటికే పూర్తయిన తొలి రెండు షెడ్యూళ్లకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేసిన మిశ్రా. చరణ్ పాల్గొనబోయే మూడో షెడ్యూల్ నుంచి మాత్రం పనిచేయటం లేదు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ నుంచి పిలుపు రావటంతో మిశ్రా, ధృవ సినిమాను మధ్యలోనే వదిలేసి ముంబై వెళ్లిపోయాడట. దీంతో పిఎస్ విందాతో మిగతా సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు ధృవ యూనిట్. చరణ్ షూటింగ్‌కు రాకుండా మరింత ఆలస్యం చేస్తే యూనిట్లో మరింత మంది హ్యాండిచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.