asha workers demands
-
బేగం బజార్ సీఐపై చేయిచేసుకున్న ఆశా వర్కర్స్
-
చంద్రబాబు సర్కార్ మోసం రోడ్డెక్కిన ఆశ వర్కర్లు
-
ఏపీలో సమస్యల పరిష్కరం కోసం కార్మికుల ఆందోళన
-
రేవంత్ సారు మీ హామీ ఎక్కడ?
-
ఆశా వర్కర్ల జీతాలు పెంచాలంటూ బీజేపీ మహిళా మోర్చ నిరసన
-
12.30కి పెళ్లి.. ధర్నాలో చిక్కుకున్న వధువు.. అక్కడే ఉన్న సోదరుడు..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): వివాహ సమయం దగ్గరపడుతోంది.. ఫంక్షన్‌హాల్‌కు చేరుకోవాల్సిన పెళ్లికూతురు.. ఆశ వర్కర్లు చేస్తున్న ధర్నా ప్రాంతంలో చిక్కుకుంది.. పెళ్లి సమయానికి ఫంక్షన్ హాల్‌కు చేరకుంటే పరిస్థితి ఏమిటని బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.. కారులోంచి పెళ్లికూతురును బయటకు తీసుకొచ్చి.. ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టి పెళ్లి మండపానికి తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పట్టణ శివారులోని టీఆర్‌నగర్ కాలనీకి చెందిన నేరెళ్ల సాహితికి మధుకర్‌తో జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డు నాయీబ్రాహ్మణ సంఘ భవనంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. సాహితి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి టీఆర్‌నగర్ నుంచి కారులో జగిత్యాలకు బయలు దేరారు. కలెక్టరేట్ వద్దకు రాగా నే అక్కడ ఆశ వర్కర్లు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ధర్నా చేస్తున్నారు. పెళ్లికూతురు కారు అక్కడే చిక్కుకుపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకారులతో మాట్లాడినా ఫలితం లేదు. ఆందోళనకారులు రోడ్డుపైనే బైఠాయించారు. చేసేదిలేక పెళ్లికూతురు సోదరుడు స్వరాజ్ కృష్ణ అక్కడే ఉన్న ఒకరి ద్విచక్ర వాహనం తీసుకున్నారు. పెళ్లి కూతురును దానిపై ఎక్కించుకుని వేరే మార్గం ద్వారా పెళ్లి మండపానికి తీసుకెళ్లాడు. నిర్దేశిత సమయానికి వివాహం జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: Transgender SI: మానవత్వం చాటుకున్న ట్రాన్స్‌జెండర్ ఎస్ఐ -
కదం తొక్కిన ఆశ వర్కర్లు
సుల్తాన్‌బజార్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నట్లు తమకు కూడా రూ.10,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతూ ఆశ వర్కర్లు తలపెట్టిన ‘తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి’కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని కోఠి డీఎంఈ కార్యాలయానికి వస్తున్న ఆశ వర్కర్లను సుల్తాన్ బజార్ పోలీసులు కోఠి డీఎంహెచ్ఎస్ గేటు వద్ద అడ్డుకున్నారు. 865 మంది ఆశా వర్కర్లతో పాటు సీఐటీయూ నాయకులను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఘటనపై 8 కేసులను నమోదు చేశారు. తమ హక్కుల కోసం నిరసన తెలిపేందుకు వస్తున్న ఆశ వర్కర్లను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారని తెలంగాణ ఆశ యూనియన్ అధ్యక్షురాలు పి.జయలక్ష్మి ఆరోపించారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ శుక్రవారం (13న) రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 19న కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని వెల్లడించారు. -
ఆందోళన పథం
కేశంపేట: ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందేందుకు కృషి చేస్తున్న ఆశ కార్యకర్తల జీవితాలు సంతోషంగా లేవు. ఆరు నెలలుగా వారికి వేతనాలు అందకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. గ్రామాల్లో పని చేస్తున్న ఆశ కార్యకర్తలు ప్రతి కుటుంబం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు టీకాలను సకాలంలో అందజేస్తున్నారు. అదేవిధంగా కుష్టు, క్షయతో పాటు ఇతర అంటువ్యాధుల నివారణకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గ్రామాల పైన పూర్తి అవగాహన ఉండడంతో వీరి సాయంతో సర్కారు పోలియో, కంటివెలుగు తదితర కార్యక్రమాలను విజయవంతం చేస్తోందని చెప్పవచ్చు. ఇంతటి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఆశ కార్యకర్తలను సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. వారికి నెలకు రూ. 7,500 చొప్పున అందిస్తున్న వేతనాలను 6 నెలలుగా చెల్లించడం లేదు. దీంతో వారికి పూటగడవడం కష్టంగా మారడంతో పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురించింది. పలుమార్లు తమ వేతనాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ‘ఆశ’ల బాధ్యతలు మాతా శిశుసంరక్షణ, ఆసుపత్రిలో ప్రసవాలు చేయించడం, గర్భిణులు, చిన్నారులకు సకాలంలో టీకాలు ఇప్పించడం ఆశ కార్యకర్తల ముఖ్య విధి. గ్రామాల్లో అంటువ్యాధులు సోకిన వారికి ప్రాథమిక చికిత్స అందించడం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం తదితర విధులను నిర్వహిస్తారు. క్షయ, కుష్టు బాధితులకు ఎప్పటికప్పుడు మాత్రలు, మందులు అందజేయడం వీరి విధి. దీంతోపాటు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తుంటారు. గర్భిణుల ప్రసవం కోసం వారిని పీహెచ్‌సీలకు తరలిస్తుంటారు. జిల్లాలో 1,123 మంది ఆశ కార్యకర్తలు పని చేస్తున్నట్టు జిల్లా వైధ్యాధికారులు తెలిపారు. ఆశ కార్యకర్తల కోసం నిధులు మంజూరు కాకపోవడంతో పారితోషికం అందించడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. వెంటనే చెల్లించాలి ప్రభుత్వం మా సేవలను గుర్తించి రూ. 6 వేలుగా ఉన్న పారితోషికాన్ని 7,500లకు పెంచింది. కానీ, ఎప్పడూ సరిగా అందడం లేదు. సక్రమంగా పారితోషికం ఇవ్వాలి. ఆశ కార్యకర్తలు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. పెంచిన పారితోషికాన్ని వెంటనే చెల్లించాలి. – లలిత, ఆశ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు పోషణ భారంగా మారింది. ఆరు నెలలుగా పారితోషికం లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. మాకు చెల్లించాల్సిన పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలి. కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నాం. మా పారితోషికం విషయంలో సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలి. – వసంత, ఆశకార్యకర్త కేశంపేట -
డాక్టర్‌ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన
హిందూపురం టౌన్ : ఆశావర్కర్‌ను దూషించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ సీపీఎం, సీఐటీయూ, ఆశా వర్కర్లు మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, సీపీఎం డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్టు వైద్యురాలు మాధవి పరిగికి చెందిన ఆశా వర్కర్ పద్మను‘చెప్పుతో కొడతా’ అంటూ దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసం అన్నారు. చాలీచాలని జీతాలతో జీవిస్తున్న ఆశావర్కర్లను దూషించిన డాక్టర్‌పై క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎంఓ రుక్మిణమ్మ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు నారాయణస్వామి, రాజప్ప, రాము, లింగారెడ్డి, మారుతీ, ఆశావర్కర్లు భాగ్యలక్ష్మి, జయమ్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.