asim
-
‘కాస్గంజ్’ కేసులో 28 మందికి యావజ్జీవం
లక్నో: సంచలనం సృష్టించిన కాస్గంజ్ హింసాకాండ కేసులో 28 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.80 వేల చొప్పున జరిమానా చెల్లించాలని దోషులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2018 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో నిర్వహించిన తిరంగా యాత్రలో హింస చోటుచేసుకుంది. మత కలహాలు చెలరేగాయి. తిరంగా యాత్రను కొందరు అడ్డుకున్నారు. యాత్రలో పాల్గొన్న చందన్ గుప్తా అనే వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో హింస మరింత ప్రజ్వరిల్లింది. కాస్గంజ్ మూడు రోజులపాటు అట్టుడికిపోయింది. ఈ ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. చందన్ గుప్తాను హత్య చేయడంతోపాటు హింసకు కారణమైన దుండుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడడం, జాతీయ జెండాను అవమానించడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ప్రభుత్వం అప్పగించింది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం 28 మందిని దోషులుగా తేల్చింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. నసీరుద్దీన్, అసీమ్ ఖురేషీ అనే నిందితులపై తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా గుర్తించింది. -
Mahadev app case: సీఎం బఘేల్‌కు డబ్బు పంపలేదు
రాయ్‌పూర్: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్‌చేసిన నగదు కొరియర్ ఆసిమ్ దాస్ తాజాగా మాటమార్చాడు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్ల నగదు పంపించారని విచారణలో అతడు అంగీకరించాడని ఈడీ వెల్లడించడం తెల్సిందే. ఆసిమ్ తన లాయర్ షోయబ్ అల్వీ ద్వారా మరో వాంగ్మూలమిస్తూ ఈడీ డైరెక్టర్, ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. ‘‘ఈ కేసులో నన్ను బలిపశువును చేస్తున్నారు. వాస్తవానికి సీఎం బఘేల్సహా ఏ రాజకీయనేతకూ నేను డబ్బులు అందజేయలేదు. ఈడీ అధికారులు ఇంగ్లిష్‌లో ఉన్న వాంగ్మూలంపై బలవంతంగా నా సంతకం చేయించుకున్నారు. నాకు ఇంగ్లిష్ రాదు. ఎవరో వచ్చి డబ్బు సంచులు కారులో పెట్టి వెళ్లిపోయాడు. డబ్బుతో నేను హోటల్రూమ్కి వెళ్లగానే ఈడీ అధికారులొచ్చి అరెస్ట్‌చేశారు. కేసులో నన్ను కావాలనే ఇరికించారని నాకప్పుడు అర్ధమైంది’’ అని దాస్ వివరించారు. -
పాక్ సైన్యానికి కొత్త బాస్
పాకిస్తాన్లో సైనిక దళాల ప్రధానాధికారి పదవి చుట్టూ కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. చివరకు ఆ పదవి లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మునీర్‌కే దక్కింది. ఈ నెల 29న లాంఛనంగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. పాక్ పుట్టుపూర్వోత్తరాలూ, తీరు తెన్నులూ గమనించే వారికి దేశాధ్యక్ష, ప్రధాని పదవులకన్నా సైనిక దళాల ప్రధానాధికారి పదవికి అక్కడుండే ప్రాధాన్యత అసాధారణమైనదని ఇట్టే తెలుస్తుంది. రాజ్యాంగంలో రాసుకున్న దానికి భిన్నంగా అత్యంత శక్తిమంతమైన పదవిగా అదెందుకు మారిందో చెప్పటం అంత సులభం కాదు. కార్యనిర్వాహక వ్యవస్థ చెప్పినట్టు నడుచుకోవటానికి భిన్నంగా దాన్నే శాసించే స్థాయికి సైన్యం రావ టంలో అవినీతి రాజకీయ నేతల బాధ్యతే అధికం. ఆ సంగతలా ఉంచి మూడు దశాబ్దాలుగా సైనిక దళాల ప్రధానాధికారి పదవి ఎంపిక ప్రక్రియ చిన్న చిన్న ఇబ్బందులు మినహా సజావుగానే సాగుతోంది. కానీ ఈసారి మాత్రం పెను వివాదాలు చుట్టుముట్టాయి. లెఫ్టినెంట్ జనరల్ మునీర్‌కు ఆర్మీ చీఫ్ పదవి రాదని కొందరూ, వస్తుందని కొందరూ విశ్లేషణలు చేశారు. ఆయనకు ఆ పదవి దక్కనీయనని ఈమధ్యే మాజీ ప్రధానిగా మారిన ఇమ్రాన్ ఖాన్ ప్రతిజ్ఞలు చేశారు. తమ పార్టీనుంచి ఎన్నికైన దేశాధ్యక్షుడి ద్వారా ఆయన ఎంపికను నిలువరిస్తానన్నారు. కానీ వీటన్నిటినీ దాటుకుని కోటలో పాగా వేయటం లెఫ్టినెంట్ మునీర్‌కి సాధ్యపడిందంటే ఆయనెంత అఖండుడో అర్థం అవుతుంది. పదవీ విరమణ చేయబోతున్న జనరల్ జావేద్ బజ్వా తర్వాత సైన్యంలో అత్యంత సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ మునీరే. ఆ రకంగా ఆ పదవి మునీర్ కే దక్కాలి. కానీ బజ్వా కన్నా రెండు రోజుల ముందు... అంటే ఈ నెల 27తో ఆయన పదవీకాలం ముగియాలి. కానీ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఆర్మీ చట్టం కింద ‘దేశ భద్రత’ను కారణంగా చూపుతూ మునీర్‌ను సర్వీసులో కొనసాగించాలని నిర్ణయించింది. ఒకసారి ఆర్మీ చీఫ్ అయ్యాక ఆయన పదవీకాలం మూడేళ్లు పెరుగుతుంది. అప్పటికున్న ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగితే బజ్వా మాదిరే రెండోసారి పొడిగింపు తెచ్చుకుని మరో మూడేళ్లు ఆర్మీ చీఫ్‌గా కొనసాగవచ్చు. ఇలా జరిగే అవకాశం ఉండబట్టే ఇమ్రాన్ మునీర్‌కు మోకాలడ్డారు. సైన్యం కనుసన్నల్లో నడిచే గూఢచార సంస్థ ఐఎస్ఐకి డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన కాలంలో మునీర్ తన కుటుంబ ఆస్తుల కూపీ లాగటానికి ప్రయత్నించటమే ఇమ్రాన్ ఆగ్రహానికి కారణం. అప్పట్లో బజ్వాతో తన సంబంధాలు బాగుండటంతో మునీర్‌ను ఐఎస్ఐ నుంచి తప్పించగలిగారు. అలాంటి అధికారి ఆర్మీ చీఫ్ కావటం ఇమ్రాన్‌కు కోపం తెప్పించటంలో వింతేమీ లేదు. సాధారణంగా అయితే పొరుగు దేశం ఆంతరంగిక విషయాలు మనల్ని పెద్దగా ప్రభావితం చేయవు. కానీ పాకిస్తాన్ తీరు వేరు. సైన్యంలో ఉండే లుకలుకలూ, సైన్యానికి పౌర ప్రభుత్వంతో ఉండే విభేదాలూ తరచు భారత్‌కు సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ఎన్నికైన ప్రభుత్వం మన దేశంతో మంచి సంబంధాలు కలిగివుండాలని వాంఛిం చిన మరుక్షణం ఆ ప్రయత్నాన్ని వమ్ము చేయటానికి అక్కడి సైన్యం ఎత్తులు వేస్తుంది. ఎల్ఓసీలో అకారణంగా కాల్పులకు దిగుతుంది. దేశంలో భారత్ వ్యతిరేకత ప్రబలేలా చూడటమే ఈ ఎత్తుగడ వెనకున్న లక్ష్యం. దీనికితోడు ఇమ్రాన్‌పై బజ్వా కయ్యానికి కాలుదువ్విన పర్యవసానంగా అక్కడి సైన్యంలో ఇమ్రాన్ వ్యతిరేక, ఇమ్రాన్ అనుకూల వర్గాలు ఏర్పడ్డాయి. అంతకుముందు ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్‌ను చిక్కుల్లో పడేసి, ఇమ్రాన్‌కు అధికారం దక్కటానికి సైన్యం తెరవెనక ఎటువంటి పాత్ర పోషించిందో బహిరంగ రహస్యం. బజ్వా తన వ్యక్తిగత విభేదాలతో ఇమ్రాన్‌ను తొలగించటం వల్ల నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహ్‌బాజ్‌ను నెత్తికెక్కించుకోవాల్సి వచ్చిందని సైన్యంలో ఒక వర్గం మండిపడుతోంది. లండన్‌లో మకాం వేసిన నవాజ్ అక్కడినుంచే సలహాలిస్తూ సర్కారును నడిపిస్తున్నారు. బజ్వా మొదటినుంచీ భారత్ వ్యతిరేకి. నవాజ్ మనతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవా లని భావించినప్పుడు దాన్ని వమ్ము చేసిన ఘనుడు బజ్వాయే. ఆ పని కూడా ఇప్పుడు ఆర్మీ చీఫ్ కాబోతున్న మునీర్‌తోనే చేయించారు. పుల్వామాలో మన జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి మునీర్ ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్నప్పుడే చోటుచేసుకుంది. దానికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై మన దేశం దాడి చేసినప్పుడు మిగ్ యుద్ధ విమానం కూలి పైలెట్ అభినందన్ వర్ధమాన్ అక్కడి సైన్యానికి పట్టుబడ్డారు. ఆ సమయంలో ఆయనకు హాని జరక్కుండా చూడాలని జాతీయ భద్రతా సలహా దారు అజిత్ డోవల్ మాట్లాడింది కూడా మునీర్‌తోనే. అయితే ఆయన రావటంవల్ల మన దేశానికి మరిన్ని సమస్యలొస్తాయని చెప్పలేం. మొదట్లో భారత్ వ్యతిరేకిగా ఉన్న బజ్వా చివరికొచ్చే సరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడారు. అందుకు కారణం ఉగ్రవాదులకు సాయం అంది స్తున్న కారణంగా పాక్‌కు రావాల్సిన ఆర్థిక సాయం నిలిచిపోవటం. అది సరిచేసుకుని, అమెరికా మెప్పు పొంది ఎఫ్–16 యుద్ధ విమానాలు రాబట్టడంలో బజ్వా విజయం సాధించారు. అయితే పొరుగున అఫ్గాన్‌లో తాలిబన్ల హవా వచ్చాక తమ ప్రభ వెలిగిపోతుందనుకున్న పాక్ సైన్యం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటంతో అయోమయంలో పడింది. తాలిబన్లతో సరిహద్దు వివాదం తప్పటం లేదు. ఈ స్థితిలో మునీర్ రాకవల్ల మనకు కొత్తగా సమస్యలు రాకపోవచ్చు. ఏదేమైనా తగిన జాగ్రత్తలో ఉండటం తప్పనిసరి. -
‘బిగ్‌బాస్’ రన్నరప్‌పై దుండగుల దాడి..
హిందీ ‘బిగ్‌బాస్ సీజన్-13’ రన్నరప్, మోడల్ ఆసిమ్ రియాజ్ గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి వీధుల్లో సైక్లింగ్ చేస్తున్న సమయంలో కొంతమంది తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ విషయాన్ని ఆసిమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో తెలియజేశారు. దుండగుల దాడిలో తన భుజం, మోకాలు, చేతులకు గాయాలయ్యనట్లు ఆసిమ్ వెల్లడించారు. ‘నేను సైక్లింగ్ చేస్తున్నాను. అనూహ్యంగా బైక్‌పై వచ్చిన కొంత మంది కుర్రాళ్లు నన్ను వెనక నుంచి కొట్టారు’. అంటూ తన శరీరానికి తగిలిన గాయాలను చూపిస్తూ వీడియోలో తెలిపాడు. అయితే ప్రస్తుతం తను క్షేమంగా ఉన్నానని ఆసిమ్ వెల్లడించారు. (వేధింపులు ఎక్కువయ్యాయి: దిశ తండ్రి) ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆసిమ్ అభిమానులు అతడిపై జరిగిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసిమ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. #GetWellSoonAsim అనే హ్యష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది. మోడల్ అయిన ఆసిమ్ గతంలో కొన్ని సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. కాని బిగ్ బాస్ సీజన్ 13 వల్ల ఈయన క్రేజ్ అమాంతం పెరిగింది. Instagram story of @imrealasim 😢, He was attacked by some goons from behind while he was cycling,they were in bike.Nothing serious but he sustained some wounds .Wishing you speedy recovery Asim,please complain to police 🙏 #AsimRiaz @realhimanshi @Rac57Riaz pic.twitter.com/zMFl4dIPRH — Team AsiManshi (@TeamAsiManshiFC) August 5, 2020 -
అల్‌ఖైదా కీలకనేత ఆసిమ్ ఉమర్ హతం
-
నూర్, హసీమ్‌లు పాత్రధారులే!
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద అనుమానితుడు నజీర్ కేసు దర్యాప్తును సిట్ పోలీసులు వేగవంతం చేశారు. ఇటీవల చంచల్‌గూడ జైలు సమీపంలోని ఎంఎం జిరాక్స్ సెంటర్‌పై దాడి చేసిన నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు నజీర్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సిట్ పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండటంతో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2010లో బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడిన నసీర్‌కు బంగ్లాదేశ్‌కు చెందిన నూర్ ఉల్ హక్ అలియాస్ షేక్ నూర్, మయన్మార్‌కు చెందిన హసీమ్ అలియాస్ షేక్ అమీర్ అలియాస్ అన్వర్ సహాయం అందించినట్టు తెలిసింది. నూర్, హసీమ్ కొద్దికాలంగా మెదక్ జిల్లా జహీరాబాద్‌లో నివసిస్తున్నారు. నసీర్ జహీరాబాద్‌లో ఉండేందుకు వసతి కల్పించిన వీరు.. బాలాపూర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొహైల్ సహకారంతో యునాని ఆస్పత్రిలో వాచ్‌మన్‌గా అతనికి ఉద్యోగం ఇప్పించినట్టు సిట్ విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. నసీర్ ఇచ్చిన సమాచారం మేరకు నగర పోలీసులు ఢిల్లీ చేరుకున్నారు. అయితే అప్పటికే నూర్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతడిని ట్రాన్సిట్ వారంట్‌పై సిట్ పోలీసులు సోమవారం నగరానికి తీసుకొచ్చారు. మరోవైపు సోమవారం మధ్యాహ్నం లింగంపల్లి రైల్వేస్టేషన్లో హసీమ్‌ను ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. నూర్‌ది ప్రధాన పాత్రే.. హుజీతోపాటు ఇతర నిషేధిత ఉగ్రవాదులకు నూర్(62) సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నూర్ 2 దశాబ్దాలకుపైగా ఈ పని చేస్తున్నాడని, అనుమానం రాకుండా ఉండేందుకు నగరాలను మారుస్తుండేవాడని భావిస్తున్నారు. పానిపట్టు నుంచి ఈ ఏడాది మార్చిలో జహీరాబాద్‌కు వచ్చిన నసీర్‌కు.. నూర్, హసీమ్ ఆశ్రయం కల్పించారని, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కి వచ్చే సమయంలో రూ. 20 వేలు తీసుకుని నసీర్‌ను నూర్ భారత్‌కి చేర్చాడని, ఆ తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద అక్రమ రవాణా ముఠాల దందాలో నసీర్‌కు నూర్ దగ్గరైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా యువతకు ఉద్యోగాలిస్తామని ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తుండేవారని, మాల్దా చెక్‌పోస్టు కేంద్రంగా ఈ తతంగాన్ని నడిపించారని విచారణలో తేలింది. నూర్ ఏది చెబితే హసీమ్ అదే ఫాలో అవుతుండేవాడని, జహీరాబాద్ నుంచి నసీర్ చంచల్‌గూడకు మారే క్రమంలో అంతా హసీమే చూసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నసీర్ విచారణ మంగళవారంతో ముగియనుండగా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
నూర్, అసీమ్లు పాత్రధారులే..
సాక్షి, హైదరాబాద్ : ఉగ్రవాద అనుమానితుడు నజీర్ కేసు దర్యాప్తును సిట్ పోలీసులు వేగవంతం చేశారు. ఇటీవల చంచల్‌గూడ జైలు సమీపంలోని ఎంఎం జిరాక్స్ సెంటర్‌పై దాడి చేసి అరెస్టు చేసిన నజీర్‌తో పాటు మరో ఐదుగురి విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2010లో బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడిన నసీర్‌కు జహీరాబాద్ వాసులు నూర్, అసీమ్లు పూర్తి సహయసహకారాలు అందించినట్టు తెలిసింది. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఉండేందుకు వసతి కల్పించిన వీరు...బాలాపూర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొహైల్ సహాకారంతో యునాని ఆస్పత్రిలో వాచ్‌మన్‌గా నసీర్‌కు ఉద్యోగం ఇప్పించాడని విచారణలో తెలిపినట్టు తెలుస్తోంది. నసీర్ ఇచ్చిన పక్కా సమాచారం మేరకు నగర పోలీసులు ఢిల్లీ చేరుకుని నూర్, అసీమ్లని శనివారం అరెస్టు చేసి...స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చారు. నూర్‌ది ప్రధాన పాత్రే... హుజీతో పాటు ఇతర నిషేధిత ఉగ్రవాదులకు అన్ని విధాల నూర్ సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 54 ఏళ్లున్న నూర్ రెండు దశాబ్దాలకుపైగా ఈ పని చేస్తున్నాడని, అనుమానం రాకుండా ఉండేందుకు నగరాలను మారుస్తుండేవాడని భావిస్తున్నారు. పానిపట్టు నుంచి ఈ ఏడాది మార్చిలో మెదక్ జిల్లా జహీరాబాద్‌కు వచ్చిన నసీర్‌కు...నూర్, అసీమ్లు ఆశ్రయం కల్పించారు.బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కి వచ్చే సమయంలో నూర్...20వేల రూపాయాలను తీసుకుని నసీర్ని భారత్‌కి చేర్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద అక్రమ రవాణా ముఠాల దందా క్రమంలో నసీర్‌కు నూర్ మరింత దగ్గరైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబైలు కేంద్రంగా యువతకు ఉద్యోగాలిస్తామని మోసగించి ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తుండేవారు. మాల్దా చెక్‌పోస్టు కేంద్రంగా ఈ తతంగాన్ని నడిపించారని పోలీసుల విచారణలో తేలింది. నూర్‌కు సన్నిహితుడైన అసిమ్...అతడు ఏది చెబితే అదే ఫాలో అవుతుండేవాడు. జహీరాబాద్ నుంచి నసీర్...చంచల్‌గూడ మారే క్రమంలో అంతా తానై అసిమే చూసుకున్నాడని తెలుస్తోంది. గత ఆరేళ్ల నుంచి నూర్‌తో కలిసి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నసీర్ విచారణ మంగళవారంతో ముగియనుండగా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.