‘బిగ్‌బాస్’‌ రన్నరప్‌పై దుండగుల దాడి.. | Bigg Boss 13Asim Riaz Suffers Injuries after Being Attacked By Strangers | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ రన్నరప్‌పై దుండగుల దాడి..

Aug 6 2020 1:14 PM | Updated on Aug 6 2020 3:18 PM

Bigg Boss 13Asim Riaz Suffers Injuries after Being Attacked By Strangers - Sakshi

హిందీ ‘బిగ్‌బాస్‌ సీజన్‌-13’ రన్నరప్‌, మోడల్‌ ఆసిమ్‌ రియాజ్‌ గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి వీధుల్లో సైక్లింగ్‌ చేస్తున్న సమయంలో కొంతమంది తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ విషయాన్ని ఆసిమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో తెలియజేశారు. దుండగుల దాడిలో తన భుజం, మోకాలు, చేతులకు గాయాలయ్యనట్లు ఆసిమ్‌ వెల్లడించారు. ‘నేను సైక్లింగ్‌‌ చేస్తున్నాను. అనూహ్యంగా బైక్‌పై వచ్చిన కొంత మంది కుర్రాళ్లు నన్ను వెనక నుంచి కొట్టారు’. అంటూ తన శరీరానికి తగిలిన గాయాలను చూపిస్తూ వీడియోలో తెలిపాడు. అయితే ప్రస్తుతం తను క్షేమంగా ఉన్నానని ఆసిమ్‌ వెల్లడించారు. (వేధింపులు ఎక్కువయ్యాయి: దిశ తండ్రి)

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఆసిమ్‌ అభిమానులు అతడిపై జరిగిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసిమ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. #GetWellSoonAsim అనే హ్యష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మోడల్‌ అయిన ఆసిమ్‌ గతంలో కొన్ని సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. కాని బిగ్ బాస్ సీజన్ 13 వల్ల ఈయన క్రేజ్ అమాంతం పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement