assistant manager suicide
-
వరకట్న వేధింపులకు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ బలి
వరంగల్: అదనపు కట్నం వేధింపులకు ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ బలయ్యారు. ఆమె భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు అదనపు కట్నం కోసం వేధించడంతో మండలంలోని సూర్యతండాకు చెందిన వాంకుడోతు జ్యోతి(31) అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ పురుగుల మందు తాగి మృతి చెందింది. గీసుకొండ ఇన్స్పెక్టర్ సట్ట రాజు కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన జ్యోతికి గీసుకొండ మండలం సూర్యతండాకు చెందిన వాంకుడోతు స్వామితో 2017లో వివాహం జరిగింది. జ్యోతి తల్లిదండ్రులు స్వామికి రూ.15 లక్షల కట్నంతో పాటు ఇతర లాంఛనాలతో పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. స్వామి రైల్వేలో కమర్షియల్ ఇన్స్పెక్టర్గా, జ్యోతి వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరు నగరంలోని శంభునిపేటలో సొంత ఇల్లు కట్టుకుని కాపురం ఉంటున్నారు. ఇటీవల ఇద్దరు కుమారులను తీసుకుని సెలవులు, పండుగ కోసం సూర్యతండాకు వచ్చిపోతున్నారు. జ్యోతి సూర్యతండాకు వచ్చిన ప్రతీసారి ఆమె అత్తామామలు అంబాలి, రాములు, ఆడబిడ్డలు శారద, జ్యోతి, విజ్జి, సునిత అదనపు కట్నం కోసం వేధించేవారు. ఈనెల 2ను స్వామి, జ్యోతి తమ కుమారులను తీసుకుని సూర్యతండాకు రాగా.. జ్యోతిని ఆమె భర్త అత్తమామలు, ఆడబిడ్డలు, అదనపు కట్నం కోసం వేధించడంతో ఆమె గడ్డిమందు తాగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను వరంగల్ నగరంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక తహసీల్దార్ విశ్వనారాయణ శవ పంచనామా జరిపించగా మృతురాలి భర్త, అత్త, మామ, ఆడబిడ్డలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ సట్ల రాజు తెలిపారు. -
అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌజింగ్‌బోర్డు కాలనీలో ఉంటున్న ఏడీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సౌజన్య (42 ) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టంచింది. వన్‌టౌన్ సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం ద్వారకానగర్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న సాజన్య మధ్యాహ్నం లంచ్ సమయానికి ఇంటికి వచ్చింది. సాయంత్రం 4 గంటలకు ఆమె భర్త రమేశ్ ఫోన్ చేయడంతో ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో రమేశ్ బంధువులకు ఫోన్‌చేసి విషయం తెలుపగా వారు ఇంటికి వెళ్లి చూడడంతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే పోలీలులకు సమాచారం అందించడంతో పోలీసులు తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా మృతికిగల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంచిర్యాలో ఉంటున్న తల్లిదండ్రులు వచ్చిన తర్వాతే ఏదైనా విషయం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి,ఆర్ధికపరౖమైన సమస్యలు, కుటుంబ తగాదాలు ఏవైన ఉండొచ్చనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతురాలి భర్త రమేశ్ తలమడుగు మండలం జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తుండగా, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు ,చేసుకొని దర్యాపు చేపట్టినట్టు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. -
అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
పెదపాడు : అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పెదపాడుకు చెందిన లంకపల్లి శాంతిప్రియ(26) ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంది. స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం సమీపంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి అనారోగ్య సమస్యలే కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.