
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌజింగ్‌బోర్డు కాలనీలో ఉంటున్న ఏడీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సౌజన్య (42 ) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టంచింది. వన్‌టౌన్ సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం ద్వారకానగర్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న సాజన్య మధ్యాహ్నం లంచ్ సమయానికి ఇంటికి వచ్చింది. సాయంత్రం 4 గంటలకు ఆమె భర్త రమేశ్ ఫోన్ చేయడంతో ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో రమేశ్ బంధువులకు ఫోన్‌చేసి విషయం తెలుపగా వారు ఇంటికి వెళ్లి చూడడంతో ఉరేసుకుని కనిపించింది.
వెంటనే పోలీలులకు సమాచారం అందించడంతో పోలీసులు తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా మృతికిగల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంచిర్యాలో ఉంటున్న తల్లిదండ్రులు వచ్చిన తర్వాతే ఏదైనా విషయం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి,ఆర్ధికపరౖమైన సమస్యలు, కుటుంబ తగాదాలు ఏవైన ఉండొచ్చనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతురాలి భర్త రమేశ్ తలమడుగు మండలం జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తుండగా, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు ,చేసుకొని దర్యాపు చేపట్టినట్టు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment